యు«ద్ధ క్రీడలతో ఆత్మరక్షణ
అనంతపురం సప్తగిరి సర్కిల్ : తైక్వాండో లాంటి యుద్ధ క్రీడలు ఆత్మరక్షణకు ఎంతగానో తోడ్పడతాయని జేసీ-2 ఖాజామోహిద్దీన్ అన్నారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో ఆదివారం జిల్లా స్థాయి తైక్వాండో పోటీలను ఆయన ప్రారంభించారు. శరీరాన్ని పటిష్టంగా ఉంచుకోవడానికి ఇలాంటి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. బాలికలు ఇలాంటి రక్షణ క్రీడలు నేర్చుకోవడం చాలా అవసరమన్నారు. డీఎస్‌డీఓ బాషామోహిద్దీన్ మాట్లాడుతూ జిల్లాలో తైక్వాండో చాలా అభివృ«ద్ధి చెందుతోందన్నారు. 2016 సంవత్సరానికి సబ్-జూనియర్, క్యాడెట్ విభాగంలో రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షుడు గురుస్వామి మాట్లాడుతూ తైక్వాండో పోటీలు సోమవారం కూడా ఉంటాయన్నారు. మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ వెంకటేశులు, కోచ్ రామాంజినేయులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
విజేతలు
సబ్ జూనియర్ విభాగంలో బాలుర అండర్-11 పోటీల్లో 18 కేజీల విభాగంలో లిఖిత్, గుణసతీష్, ప్రశాంత్ వరుసగా బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. 21 కేజీల విభాగంలో గౌతంకృష్ణ, లక్షిత్, సాయితేజ, భువన్‌సాయి.., 23 కేజీల విభాగంలో రవికిషోర్, మహిత్ జీవన్, జ్ఞానేశ్వర్‌రెడ్డి, రాజ్‌కిరణ్‌రెడ్డి.., 25 కేజీల విభాగంలో కార్తీక్, మాలిక్‌బాషా, పవన్, సాయిఫణిరాం.., 27 కేజీల విభాగంలో సోహర్‌బాబా, విజయ్, సబర్‌బాషా, జై విష్ణు వరుసగా బంగారు, వెండి, కాంస్య(చివరి ఇద్దరు) పతకాలు సాధించారు. అలాగే 29 కేజీల విభాగంలో ధృవణ్, నరేంద్ర, కౌషిక్, నిఖిత్‌రెడ్డి.., 32 కేజీల విభాగంలో మణికంఠ, ప్రేమణ్‌కర్, వర్ధన్‌రెడ్డి, అలెన్ మ్యాథ్యూస్.., 35 కేజీల విభాగంలో ఆనంద్, లోకేష్‌కుమార్, సందీప్, ప్రేమ్‌సాయి.., 38 కేజీల విభాగంలో సోమసుందర్, అఖిల్, వంశీకుమార్, పుష్కర్ వరుసగా బంగారు, వెండి, కాంస్య(చివరి ఇద్దరు) పతకాలు సాధించారు.