గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: శు.సప్తమి సా.6.54 వరకు, తదుపరి అష్టమిు, నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.8.02 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: ఉ.6.33 నుండి 8.03 వరకు, దుర్ముహూర్తం: ప.12.27 నుండి 1.13 వరకు, తదుపరి ప.2.41 నుండి 3.25 వరకు, అమృతఘడియలు: ప.3.30 నుండి 5.02 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.36, సూర్యాస్తమయం: 5.35.
మేషం...ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. శ్రమాధికం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.
వృషభం....నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహార విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
మిథునం...శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కర్కాటకం...రుణదాతల ఒత్తిడులు. పనులలో ఆటంకాలు. బంధువుల నుంచి విమర్శలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు.
సింహం....రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. బంధువులతో వివాదాలు. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
కన్య....దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
తుల....కొత్త పనులు చేపడతారు. ఇంటిలో ఆనందంగా గడుపుతారు. ధన, వస్తులాభాలు. సంఘంలో గౌరవం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత..
వృశ్చికం...మిత్రులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. దైవదర్శనాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
ధనుస్సు....కుటుంబంలో చికాకులు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు.
మకరం....పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో విజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి.
కుంభం.....వ్యయప్రయాసలు. పనులలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి..
మీనం....కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment