ఆర్ట్స్ కళాశాల తొలి గ్రాడ్యుయేషన్ డే
Published Tue, Feb 14 2017 11:02 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
ఆర్ట్స్ కళాశాల తొలి గ్రాడ్యుయేష¯ŒS డే త్వరలో జరగనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెంది 164 ఏⶠ్ల చరిత్రగల కళాశాల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది ప్రముఖులను తయారుచేసిందని, ఈ కళాశాలలో మరికొద్ది రోజుల్లో ఈ దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.డేవిడ్‌కుమార్‌స్వామి మంగళవారం తెలిపారు. ఆదికవి నన్నయ వర్సిటీ నుంచి మొదటి, రెండో బ్యాచ్‌గా డిగ్రీ పట్టా పొందే విద్యార్థులకు పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు. అలాగే 2012–13 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొంది 2015లో డిగ్రీ పూర్తిచేసిన వారు, 2013–14లో డిగ్రీ ప్రవేశం పొంది 2016లో డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు దీనికి దరఖాస్తుచేసుకోవాలన్నారు. దరఖాస్తులను డబ్లు్యడబ్లు్యడబ్లు్య.జీసీఆర్‌జేవై.ఏసీ.ఇ¯ŒS అనే వెబ్‌సైట్ నుంచి డౌ¯ŒSలోడ్ చేసుకోవాలన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను ఈ నెల 22వ తేదీలోగా అందజేయాలన్నారు.
Advertisement
Advertisement