నేడు క్రికెట్‌ పోటీలు ప్రారంభం | Today is the beginning of the cricket matches | Sakshi
Sakshi News home page

నేడు క్రికెట్‌ పోటీలు ప్రారంభం

Published Wed, Jul 27 2016 1:34 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

Today is the beginning of the cricket matches

వరంగల్‌ స్పోర్ట్స్‌ : మాజీ రాష్ట్రపతి డా క్టర్‌ అబ్దుల్‌ కలాం స్మారక క్రికెట్‌ పోటీలను బుధవారం నుంచి ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్నట్లు వరంగల్‌ క్రికెట్‌ అకాడమీ కార్యదర్శి మార్నేని ఉదయభానురావు తెలిపారు. ఈ మేరకు వరంగల్‌ లోని అకాడమీ కార్యాలయంలో సోమవారం టోర్నమెంటు బ్యానర్‌ను ఆవిష్కరించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాప్‌ మాజీ డైరక్టర్‌ రాజనాల శ్రీహరి హాజరై మాట్లాడుతు గ్రామీణ క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు పోటీలను నిర్వహిస్తున్న అకాడమీ బాధ్యులను అభినందించారు.  ఉదయభానురావు మాట్లాడుతు అండర్‌–16 పాఠ శాల స్థాయి క్రీడాకారులకు నిర్వహించే పోటీలు ఈ నెల 30 వరకు కొనసాగుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మెుత్తం 40 జట్లు హాజరుకానున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే పోటీల్లో ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ ఇస్తామని తెలిపారు.  అకాడమీ అధ్యక్షురాలు టి.అనిత, మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు మంద వినోద్‌కుమార్, సీనియర్‌ క్రికెట్‌ క్రీడాకారులు విజయ్‌కుమార్,  వేణు, వేణుగోపాల్, వేణుమాధవ్, అకాడమీ సహాయ కార్యదర్శి ప్రభాకర్, భాస్కర్‌రావు, శ్రీనివాసరెడ్డి, కుమార్, సారంగపాణి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement