wgl
-
టీఆర్ఎస్లో ప్రొటోకాల్ రగడ
వర్ధన్నపేట: అధికార పార్టీలో ప్రొటోకాల్ వివాదం చెలరేగింది. శంకుస్థాపన కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యేపై ఎంపీ, ఎమ్మెల్సీ గుర్రుగా ఉన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ మండలం మామునూరులో పశు వైద్య కళాశాల భవన నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. దీనిని నిరసిస్తూ సభా ప్రాంగణానికి వస్తే అక్కce ఫ్లెక్సీలో ఎంపీ పసునూరు దయాకర్ పేరు, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డిల పేర్లు కూడా పెట్టలేదు. దీంతో కినుక వహించిన వారిద్దరూ సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. -
ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
యండమూరి వీరేంద్రనాథ్ హన్మకొండ కల్చరల్ : సమాజంలోని ప్రజలు లక్ష్యసాధన కోసం అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ రచయిత, డైరెక్టర్, నంది అవార్డు గ్రహీత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేం ద్రనాథ్ అన్నారు. హన్మకొండ అంబేద్కర్‌భవన్‌లో శనివారం సాయంత్రం మేథా లాంగ్వేజ్ థియేటర్ ప్రారంభోత్సవంలో ఆయన పా ల్గొని మాట్లాడారు. మన విద్యార్థుల్లో జ్ఞానం ఎక్కువగా ఉన్నప్పటికీ ధైర్యం తక్కువ అని, ఇలాంటి వారు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి లాంగ్వేజ్ థియేటర్ ఉపయోగపడుతుందన్నారు. చిరంజీవి ఎంతో కష్టపడి పైకొచ్చారని ఆయన జీవితం విద్యార్థులకు ఆదర్శమవుతుందని ‘నేనే నా ఆయుధం’ పుస్తకం రాసినట్లు తెలిపారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మన మనస్సులో ఉన్న భావాన్ని మాట, ఆలోచన తడబాటు లేకుండా క్లుప్తంగా వివరంగా చెప్పగలగడమేనన్నారు. ఇంటర్మీడియట్ అంటే ఇన్ ది మిడిల్ అని అర్థం.. ఈ వయసులో జాగ్రత్తగా ఉండాలి.. ఈ రోజు నవ్వుతూ ఉండాలి.. రేపు కూడా నవ్వగలమనే విశ్వాçÜం ఉండాలన్నారు. మేథా లాంగ్వేజ్ థి యేటర్ డైరెక్టర్ డాక్టర్ చిరంజీవి మాట్లాడుతూ తాను ఎన్నో కష్టాలు పడ్డానని, వీరేంద్రనాథ్ ను కలిసిన తర్వాతనే తన జీవితంలో మార్పు వచ్చిందన్నారు. అనంతరం చిరంజీవి, అతడి సోదరులు వీరేంద్రనాథ్‌ను శాలువాతో సత్కరించి స్వర్ణకంకణధారణ చేశారు. కేయూ ఆం గ్లశాఖ ఆచార్యులు దామోదర్‌రావు, సాంబ య్య, సుధాకర్, సైకాలజిస్ట్ బరుపాటి గోపి, లాంగ్వేజ్ థియేటర్ సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు క్రికెట్ పోటీలు ప్రారంభం
వరంగల్ స్పోర్ట్స్ : మాజీ రాష్ట్రపతి డా క్టర్ అబ్దుల్ కలాం స్మారక క్రికెట్ పోటీలను బుధవారం నుంచి ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్నట్లు వరంగల్ క్రికెట్ అకాడమీ కార్యదర్శి మార్నేని ఉదయభానురావు తెలిపారు. ఈ మేరకు వరంగల్ లోని అకాడమీ కార్యాలయంలో సోమవారం టోర్నమెంటు బ్యానర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాప్ మాజీ డైరక్టర్ రాజనాల శ్రీహరి హాజరై మాట్లాడుతు గ్రామీణ క్రీడాకారుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు పోటీలను నిర్వహిస్తున్న అకాడమీ బాధ్యులను అభినందించారు. ఉదయభానురావు మాట్లాడుతు అండర్–16 పాఠ శాల స్థాయి క్రీడాకారులకు నిర్వహించే పోటీలు ఈ నెల 30 వరకు కొనసాగుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మెుత్తం 40 జట్లు హాజరుకానున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే పోటీల్లో ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ ఇస్తామని తెలిపారు. అకాడమీ అధ్యక్షురాలు టి.అనిత, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు మంద వినోద్‌కుమార్, సీనియర్ క్రికెట్ క్రీడాకారులు విజయ్‌కుమార్, వేణు, వేణుగోపాల్, వేణుమాధవ్, అకాడమీ సహాయ కార్యదర్శి ప్రభాకర్, భాస్కర్‌రావు, శ్రీనివాసరెడ్డి, కుమార్, సారంగపాణి పాల్గొన్నారు.