గోదావరి పుష్కరాలకు దేశవ్యాప్తంగా తరలిరానున్న భక్తుల కోసం ఆర్టీసీ రాష్ర్టవ్యాప్తంగా 620 బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
గోదావరి పుష్కరాలకు దేశవ్యాప్తంగా తరలిరానున్న భక్తుల కోసం ఆర్టీసీ రాష్ర్టవ్యాప్తంగా 620 బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అలాగే 100 సిటీ బస్సులను కూడా ఏర్పాటు చేయనుంది. వీటికి అవసరమైన తాత్కాలిక బస్టాండ్‌లు, ఏడు మార్గాలను గుర్తించింది. ఈ మేరకు నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారుల ముందుంచారు. భక్తుల రాకపోకలు సులభతరంగా ఉండేలా నగరంలో మూడు తాత్కాలిక బస్టాండ్‌లను గుర్తించినట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. లూథరగిరి, ప్రభుత్వ అటానమస్ కళాశాల (ఆర్ట్స్ కాలేజ్), ప్రధాన రైల్వేస్టేషన్‌ను ఆనుకుని ఉన్న గూడ్స్‌గేట్ ఏరియాలను గుర్తించారు. - రాజమండ్రి సిటీ
నగరంలో బస్సులు తిరిగే మార్గాలు ఇవే...లాలాచెరువు-లూథరగిరి మార్గంలో వయా ప్రభుత్వ అటానమస్ కళాశాల, గోకవరం బస్టాండ్, లాలాచెరువు మీదుగా 15 బస్సులు రాకపోకలు సాగిస్తాయి.సాయినగర్-లూథరగిరి మార్గంలో వయా ఆర్టీసీ బస్ కాంప్లెక్స్, ఆజాద్ చౌక్, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా 15 బస్సులు రాకపోకలు సాగిస్తాయి.
సాయినగర్-వేమగిరి మార్గంలో వయా ఆర్టీసీ కాంప్లెక్స్ కోటిపల్లి బస్టాండ్ ,రైల్వే స్టేషన్ , సాయినగర్ 15 బస్సులు రాకపోకలు సాగిస్తాయి.గోకవరం బస్టాండ్ - గోకవరం బస్టాండ్ వయా ప్రభుత్వ అటానమస్ కళాశాల (ఆర్ట్స్ కాలేజ్), లాలాచెరువు, మోరంపూడి జంక్షన్, వేమగిరి, ధవళేశ్వరం, రైల్వే స్టేషన్, కోటిపల్లి బస్టాండ్, తాడితోట, ఆజాద్ చౌక్, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ ప్రాంతాల్లో 15 బస్సులు రాకపోకలు సాగిస్తాయి.లాలాచెరువు- లాలాచెరువు వయా మోరంపూడి జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, తాడితోట, ఆజాద్ చౌక్,దేవీచౌక్, లాలాచెరువు ప్రాంతాల్లో 15 బస్సులు నడపనున్నారు.
లాలాచెరువు - లాలాచెరువు వయా ఆనాల వెంకట అప్పారావు రోడ్, రామాలయం జంక్షన్, గోరక్షణపేట, ఆజాద్ చౌక్, దేవీచౌక్, గోకవరం బస్టాండ్, లాలాచెరువు ప్రాంతాల్లో 15 బస్సులు నడపనున్నారు.గోకవరం బస్టాండ్-రాజానగరం వయా కంబాలచెరువు, ఆర్ట్స్ కాలేజ్, లాలాచెరువు,దివాన్‌చెరువు రాజాగరం ప్రాంతాల్లో పది బస్సులను నడపనున్నారు. పుష్కరాల భక్తులకు అన్నివిధాలా సౌకర్యంగా ఉండేందుకు అవసర మైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామ ఆర్‌ఎం ఆర్‌వీఎస్ నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు 620 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఆయన పేర్కొన్నారు.