ఆర్ట్స్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం ఎడ్యుకేషన్ : అనంత నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో 2017–18 విద్యా సంవత్సరం డిగ్రీ బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సులకు సంబంధించిన వివిధ గ్రూపుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు జూన్ 1 నుంచి స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. రంగస్వామి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు సర్టిఫికెట్లు, ఫొటోలతో హాజరుకావాలన్నారు.
కోర్సుల వివరాలు :
బీఏ : గణితం, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ (ఎంఈఎస్) తెలుగు, ఇంగ్లిష్ మీడియం. జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ (జే1ఏహెచ్) ఇంగ్లిష్ మీడియం. హిందీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ (హెచ్‌హెచ్‌పీ) తెలుగు మీడియం. కమ్యూనికేటివ్ ఇంగ్లిష్, అడ్వాన్స్ ఇంగ్లిష్, హిస్టరీ (ఎల్1సీ). ఎకనామిక్స్, పిలాసపీ, పొలిటికల్ సైన్స్ (ఈపీపీ) తెలుగు మీడియం, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ (ఈఎస్‌సీఏ), ఉర్దూ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ (ఉర్దూ మీడియం).
బీఎస్సీ : గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ) తెలుగు, ఇంగ్లిష్ మీడియం. జియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ (జీపీసీ) తెలుగు, ఇంగ్లిష్ మీడియం. జియాలజీ, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ (జీపీసీఎస్) ఇంగ్లిష్ మీడియం. కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ (సీపీజెడ్) తెలుగు, ఇంగ్లిష్ మీడియం. కెమిస్ట్రీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ (సీజెడ్‌బీసీ) ఇంగ్లిష్ మీడియం. మైక్రో బయాలజీ, బాటనీ, కెమిస్ట్రీ (ఎంబీసీ) ఇంగ్లిష్ మీడియం. బయోటెక్నాలజీ, బాటనీ, కెమిస్ట్రీ (బీబీసీ) ఇంగ్లిష్ మీడియం.
నూతనంగా ప్రవేశపెడుతున్న కోర్సులు :
బీఏ : ఆర్కాలజీ (ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఆర్కాలజీ)
బీఎస్సీ : అప్లయిడ్ స్టాటిస్టిక్స్ (గణితం, స్టాటిస్టిక్స్, అకౌంటెన్సీ). రెవెవబుల్ ఎనర్జీ సోర్సెస్ (గణితం, ఫిజిక్స్, రెవెవబుల్ ఎనర్జీ సోర్సెస్)
బీకాం : డిజిటల్ మార్కెటింగ్ (మార్కెటింగ్, ఈకామర్స్, డిజిటల్ మార్కెటింగ్).