Spot admissions
-
డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులకు మరో అవకాశం లభించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో ప్రత్యేక స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి డిగ్రీలో చేరేందుకు సంబంధించిన దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ నవంబర్ 15తో ముగిసింది. ఇప్పటివరకూ వివిధ కోర్సుల్లో దాదాపు 2.20 లక్షల మంది ప్రవేశాలు పొందారు. అయితే ఇప్పటివరకూ బీఫార్మసీ, న్యాయవాద వృత్తి కోర్సుల్లో ప్రవేశానికి ప్రయత్నించిన విద్యార్థులు, అక్కడా సీటు రాకపోవడంతో డిగ్రీలో చేరేందుకు సిద్ధపడ్డారు. కానీ, దోస్త్ అడ్మిషన్ల తేదీ ముగియడంతో విద్యార్థులు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రిని కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి దోస్త్ ప్రత్యేక స్పాట్ అడ్మిషన్ల తేదీని నిర్ణయించారు. దీంతో అనేకమంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరబోతోంది. దీనివల్ల మరో 15 వేల వరకూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు లింబాద్రి తెలిపారు. -
స్పాట్ అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు ప్రభుత్వం ఓకే చెప్పింది. మూడేళ్లుగా స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఇవ్వాలంటూ యాజమాన్యాలు చేస్తున్న విజ్ఞప్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 14 నుంచి స్పాట్ అడ్మిషన్లు చేపట్టుకోవచ్చని యాజమాన్యాలకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ప్రకటించారు. దోస్త్ కౌన్సెలింగ్ తర్వాత స్పాట్ ప్రవేశాలకు అవకాశం లేకపోవడంతో మిగిలిపోయే సీట్లలో యాజమాన్యాలు సొంతంగా ప్రవేశాలు చేపట్టే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం ఏటా మంత్రులను కలసి విజ్ఞప్తులు చేస్తూనే ఉంది. ఈ ఏడాది కూడా విద్యా శాఖ మంత్రిని, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను కలసి కలిసి విజ్ఞప్తులు చేసింది. దీంతో ఎట్టకేలకు స్పాట్ అడ్మిషన్లకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో దోస్త్ కౌన్సెలింగ్ తర్వాత మిగిలిపోయే సీట్లలో తాము కోరుకునే కాలేజీల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు వీలు ఏర్పడిందని డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి పరమేశ్ పేర్కొన్నారు ఆర్థిక స్థోమత కలిగిన విద్యార్థులకు దోస్త్ ద్వారా కోరుకున్న కాలేజీల్లో సీట్లు రావట్లేదని, స్పాట్ అడ్మిషన్ల ద్వారా అలాంటి వారికి కోరుకున్న చోట సీట్లు లభిస్తాయని వివరించారు. కాగా, రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కౌన్సెలింగ్ ద్వారా చేపట్టే ప్రవేశాలు పోగా మరో 1.76 లక్షల సీట్లు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో యాజమాన్యాల ఆధ్వర్యంలో ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను ఈ నెల 14 నుంచి 18 వరకు చేపట్టి పూర్తి చేయాలని లింబాద్రి వెల్లడించారు. ప్రవేశాలను పూర్తి చేసి, విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా కాలేజీల్లో చేరే విద్యార్థులు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని వివరించారు. నేడు స్పెషల్ రౌండ్ సీట్ల కేటాయింపు ఇప్పటి వరకు ఐదు దశల్లో చేపట్టిన డిగ్రీ కౌన్సెలింగ్ ద్వారా 1,74,239 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరారు. అయితే విద్యార్థుల నుంచి వచి్చన విజ్ఞప్తుల మేరకు దోస్త్ మరో విడత కౌన్సెలింగ్‌ను స్పెషల్ రౌండ్ పేరుతో ఈ నెల 9 నుంచి 13 వరకు నిర్వహించింది. ఇందులో 6,997 మంది విద్యార్థులు డిగ్రీ ప్రవేశాల కోసం కొత్తగా రిజి్రస్టేషన్ చేసుకున్నారు. వారితో పాటు గతంలో తమ మార్కులకు అనుగుణంగా సరిపడా వెబ్ ఆప్షన్లు ఇవ్వకపోవడంతో సీట్లు రాని వారు, సీట్లు వచి్చనా కాలేజీల్లో రిపోర్ట్ చేయని వారు కలిపి మొత్తం 16 వేల మంది విద్యార్థులు తాజాగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారికి ఈ నెల 14న సీట్లు కేటాయిస్తామని లింబాద్రి వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15, 16 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. ప్రైవేటు కాలేజీలతో పాటు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, దోస్త్ పరిధిలో లేకుండా సొంతంగా ప్రవేశాలు చేపట్టిన కాలేజీలన్నీ విద్యార్థుల సమగ్ర వివరాలను ఈనెల 18 లోగా అందజేయాలని వివరించారు. -
ఆర్ట్స్ కళాశాలలో పీజీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ఆర్ట్స్ కళాశాలలో 2017–18 విద్యా సంవత్సరానికి మిగిలిపోయిన పీజీ కోర్సు సీట్లకు ఈ నెల 21న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. రంగస్వామి తెలిపారు. ఎమ్మెస్సీ బాటనీలో 5, జువాలజీలో 3, మైక్రో బయాలజీలో 17, జువాలజీలో 22, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 8, ఫిజిక్స్‌లో 12, స్టాటిస్టిక్స్‌లో 7, ఎలక్ట్రానిక్స్‌లో 29, ఎంఏ ఇంగ్లీష్‌లో 23, తెలుగులో 10 సీట్లకు అడ్మిషన్లు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఎస్కేయూ నిర్ణయించిన ఫీజుతో సహ కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు, టీసీ, స్టడీ, కాండక్ట్ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు. స్కూసెట్ ర్యాంకు ఉన్నాలేకపోయినా పర్వాలేదని వివరించారు. -
ఆగస్టు 5న స్పాట్ అడ్మిషన్లు
జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురంలోని పాలకభవనంలో బీటెక్ (బ్లెకింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్వీడన్), జేఎన్టీయూఏ సంయుక్తంగా అందిస్తున్న బీటెక్ కోర్సుల్లో ఆగస్టు 5న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ తెలిపారు. బీటెక్ సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్ బ్రాంచుల్లో చేరడానికి ఆసక్తి గల అభ్యర్థులు హాజరుకావాలన్నారు. ఫీజు తదితర పూర్తి వివరాలకు www.jntua.ac.inలో తెలుసుకోవచ్చన్నారు. -
31వ తేదీ వరకూ చేరొచ్చు
♦ ఇంజనీరింగ్ ప్రవేశాల గడువు పొడిగించిన విద్యాశాఖ ♦ 30న జేఈఈ స్పెషల్ కౌన్సెలింగ్‌కు విద్యార్థులకు అవకాశం ♦ 3న ఇంటర్నల్ స్లైడింగ్.. 4న స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీల్లో చేరే గడువును ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు సాంకేతిక విద్యాశాఖ పొడిగించింది. ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌టీఐల్లో 6,510 సీట్ల భర్తీకి ఈ నెల 30న స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సెంట్రల్ సీట్ అలకేషన్ అథారిటీ (సీఎస్ఏబీ) ప్రకటించడం.. మరోవైపు ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్ పూర్తవడంతో ఈనెల 29లోగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చి కాలేజీల్లో చేరాలని సాంకేతిక విద్యా శాఖ పేర్కొనడంతో రాష్ట్ర విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. దీంతో జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు పొందే అవకాశాన్ని రాష్ట్ర విద్యార్థులు కోల్పోయే అంశంపై శుక్రవారం ‘చూడాలా.. చేరాలా..?’ శీర్షికన సాక్షి ప్రచురించిన కథనంపై సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ వాణిప్రసాద్ స్పందించారు. అధికారులతో సమావేశమై ప్రవేశాల గడువును ఈనెల 29 నుంచి 31కి పొడిగించాలని నిర్ణయించారు. ఆ ప్రకారం చివరి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థుల మొబైల్ నంబర్లకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం వెంటనే సమాచారాన్ని పంపింది. ఈ నెల 31 వరకు విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవచ్చని, కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు అందజేసి చేరొచ్చని పేర్కొంది. సీట్లను రద్దు చేసుకోవాలనుకునే వారు కూడా ఈనెల 31 మధ్యాహ్నం 2 గంటల వరకు సీట్లు రద్దు చేసుకోవచ్చని ప్రకటించింది. బ్రాంచీ మారితే.. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరిన బ్రాంచీల్లో కాకుండా ఇతర బ్రాంచీలకు మారాలనుకుంటే ఆగస్టు 3న నిర్వహించే ఇంటర్నల్ స్లైడింగ్‌లో పాల్గొనాలని, ఇందుకు కాలేజీల్లోనే సంప్రదించాలని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. క్యాంపు కార్యాలయం కేటాయించిన బ్రాంచీలో కాకుండా స్లైడింగ్ ద్వారా మరో బ్రాంచీకి మారితే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని సూచించారు. 4 నుంచి 9 వరకు స్పాట్ అడ్మిషన్లు కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీకి వచ్చే నెల 4న యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేసి 9లోగా పూర్తి చేయాలని శ్రీనివాస్ పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్లలో సీట్లు పొందిన విద్యార్థుల జాబితాలను వచ్చే నెల 11లోగా ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాలన్నారు. వాటికి సంబంధించిన హార్డ్ కాపీలు, డీడీలను 16లోగా ప్రవేశాల క్యాంపు కార్యాలయా నికి పంపించాలని సూచించారు. -
28న పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు
మడకశిర : పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 28న ఉదయం 10గంటలకు స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని ప్రిన్సిపల్ జి.కృష్ణమూర్తినాయుడు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్పాట్ అడ్మిషన్లలో పాల్గొనడానికి అర్హులన్నారు. ప్రధానంగా ఈఈఈ, డీటీటీ కోర్సులకు మాత్రమే స్పాట్ అడ్మిషన్లు ఉంటాయన్నారు. స్పాట్ అడ్మిషన్లో పాల్గొనే విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాలిటెక్నిక్ కళాశాలలో హాజరు కావాలన్నారు. -
ఆర్ట్స్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం ఎడ్యుకేషన్ : అనంత నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో 2017–18 విద్యా సంవత్సరం డిగ్రీ బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సులకు సంబంధించిన వివిధ గ్రూపుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు జూన్ 1 నుంచి స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. రంగస్వామి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు సర్టిఫికెట్లు, ఫొటోలతో హాజరుకావాలన్నారు. కోర్సుల వివరాలు : బీఏ : గణితం, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ (ఎంఈఎస్) తెలుగు, ఇంగ్లిష్ మీడియం. జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ (జే1ఏహెచ్) ఇంగ్లిష్ మీడియం. హిందీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ (హెచ్‌హెచ్‌పీ) తెలుగు మీడియం. కమ్యూనికేటివ్ ఇంగ్లిష్, అడ్వాన్స్ ఇంగ్లిష్, హిస్టరీ (ఎల్1సీ). ఎకనామిక్స్, పిలాసపీ, పొలిటికల్ సైన్స్ (ఈపీపీ) తెలుగు మీడియం, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ (ఈఎస్సీఏ), ఉర్దూ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ (ఉర్దూ మీడియం). బీఎస్సీ : గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ) తెలుగు, ఇంగ్లిష్ మీడియం. జియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ (జీపీసీ) తెలుగు, ఇంగ్లిష్ మీడియం. జియాలజీ, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ (జీపీసీఎస్) ఇంగ్లిష్ మీడియం. కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ (సీపీజెడ్) తెలుగు, ఇంగ్లిష్ మీడియం. కెమిస్ట్రీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ (సీజెడ్బీసీ) ఇంగ్లిష్ మీడియం. మైక్రో బయాలజీ, బాటనీ, కెమిస్ట్రీ (ఎంబీసీ) ఇంగ్లిష్ మీడియం. బయోటెక్నాలజీ, బాటనీ, కెమిస్ట్రీ (బీబీసీ) ఇంగ్లిష్ మీడియం. నూతనంగా ప్రవేశపెడుతున్న కోర్సులు : బీఏ : ఆర్కాలజీ (ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఆర్కాలజీ) బీఎస్సీ : అప్లయిడ్ స్టాటిస్టిక్స్ (గణితం, స్టాటిస్టిక్స్, అకౌంటెన్సీ). రెవెవబుల్ ఎనర్జీ సోర్సెస్ (గణితం, ఫిజిక్స్, రెవెవబుల్ ఎనర్జీ సోర్సెస్) బీకాం : డిజిటల్ మార్కెటింగ్ (మార్కెటింగ్, ఈకామర్స్, డిజిటల్ మార్కెటింగ్). -
వైవీయూలో ఎంబీఏ స్పాట్ అడ్మిషన్లు
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి గల అభ్యర్థులకు ఈనెల 29వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వైవీయూ ప్రవేశాల సంచాలకుడు ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, నిర్ణీతఫీజుతో డీఓఏ కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. ఎంబీఏ విద్యార్థులకు సంవత్సరానికి రూ.10వేలు, ఎంసీఏ విద్యార్థులకు రూ.12 వేలతో పాటు ప్రాసెసింగ్ ఫీజు రూ.500– చెల్లించి ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ఐసెట్–2016 రాసిన వారు, రాయని వారుకూడా ఈ ప్రవేశాలకు హాజరుకావచ్చని తెలిపారు. ఓసీ విద్యార్థులు డిగ్రీలో 50 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 45 శాతం మార్కులతో పాసై ఉండాలన్నారు. -
ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
► జారీ చేసిన సాంకేతిక విద్యా శాఖ ► 6న విద్యార్థులకు స్లైడింగ్‌కు అవకాశం ► 8న కాలేజీల వారీ నోటిఫికేషన్లు ► 13లోగా ప్రవేశాలు పూర్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో భర్తీ కాకుండా మిగిలిపోయిన 12,638 సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ సాంకేతిక విద్యా శాఖ స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్‌ను మంగళవారం జారీ చేసింది. కాలేజీలు, బ్రాంచీల వారీగా భర్తీ అయిన సీట్లు, ఖాళీల వివరాలను tseamcet.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు శాఖ వెల్లడించింది. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేని విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లలో సీట్లు ఇవ్వరని పేర్కొంది. ఇందులో సీట్లు పొందిన విద్యార్థులకు, కాలేజీలో ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా బ్రాంచీలు మార్పు చేసుకున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని స్పష్టం చేసింది. ఈ నెల 6న విద్యార్థులు స్లైడింగ్ ద్వారా బ్రాంచీలను మార్పు చేసుకోవచ్చంది. కాలేజీలు, బ్రాంచీల వారీగా మిగిలిపోయిన సీట్ల వివరాలతో యాజమాన్యాలు ఈ నెల 8న స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్లు జారీ చేయాలని, 13 లోగా ప్రవేశాలను పూర్తి చేయాలని సూచించింది. స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశాలు పొందిన విద్యార్థుల వివరాలను ఆన్లైన్ ద్వారా ఈ నెల 16 లోగా అప్లోడ్ చేయాలంది. హార్డ్ కాపీలు, డీడీలు, ఇతర సర్టిఫికెట్లను ఈ నెల 20 లోగా ప్రవేశాల కన్వీనర్‌కు యాజమాన్యాలు అందజేయాలని స్పష్టం చేసింది. ఎంసెట్‌లో అర్హత సాధించిన వారు రూ.1,000, అర్హత పొందనివారు రూ.1,500 ఫీజుగా చెల్లించాలి. నిబంధనలివీ..: కాలేజీల్లో మిగిలిన సీట్లను ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా ముందుగా భర్తీ చేయాలి. ఆ తరువాత ఎంసెట్‌లో అర్హత సాధించిన వారితో భర్తీ చేయాలి. గ్రూపు సబ్జెక్టుల్లో 44.5 శాతానికి పైగా మార్కులు వచ్చిన వారితో భర్తీ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే 39.5 శాతానికి పైగా మార్కులు వచ్చిన వారితో... అప్పటికీ సీట్లు మిగిలిపోతే ఇంటర్మీడియెట్‌లో నిర్ణీత మార్కులతో ఉత్తీర్ణులైన వారితో భర్తీ చేయాలి. తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారై, విద్యార్థుల పూర్తిగా ఇతర రాష్ట్రాల్లోనే చదివుంటే నాన్‌లోకల్ కేటగిరీలోనూ తెలంగాణలో ప్రవేశాలు కల్పించరు. వారిని చేర్చుకుంటే ర్యాటిఫికేషన్ చేయరు. అవసరమైన సర్టిఫికెట్లు...: ఒరిజినల్ టెన్త్ మార్కుల మెమో, ఇంటర్మీడియెట్ మార్కుల మెమో, స్టడీ సర్టిఫికెట్లు, ఎంసెట్ ర్యాంకు కార్డు (అర్హులైతే), కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), నివాస ధ్రువీకరణ పత్రం. -
4న వైఎస్సార్ ఇంజినీరింగ్ కాలేజిలో స్పాట్ అడ్మిషన్లు
ప్రొద్దుటూరు: స్థానిక వైఎస్సార్ ఇంజినీరింగ్‌కాలేజి ఆఫ్ యోగివేమన యూనివర్సిటీలో లేటరల్‌ఎంట్రి (ఈసెట్) సీట్లకు ఈనెల 4న ఉదయం 9 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.జయరామిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటరర్జీ అండ్ మెటీరియల్ టెక్నాలజీలో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అడ్మిషన్లకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజనల్ సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. స్పాట్ అడ్మిషన్లో సీటు పొందిన విద్యార్థులు వెంటనే రూ.10వేలు ట్యూషన్ ఫీజు, రూ.5,500 స్పెషల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్పాట్ అడ్మిషన్లో సీటు పొందిన అభ్యర్థులు ఫీజు రీయింబర్స్‌మెంటుకు అర్హులు కారని ఆయన వివరించారు. -
ఆగస్టు 2న స్పాట్ అడ్మిషన్లు
గురుకులంలో డిగ్రీ ప్రవేశాలకు ఆగస్టు 2న స్పాట్ అడ్మిషన్లు మొయినాబాద్: రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఆగస్టు 2న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ఏవీ.రంగారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2016-17 విద్యా సంవత్సరానికి వికారాబాద్, ఎల్బీ.నగర్, జగద్గిరిగుట్ట గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో బీఎస్సీ (ఎంపీసీ) ఎంజెడ్సీ, బీజెడ్సీ, బీకాం (జనరల్), బీకాం (కంప్యూటర్స్), బీఏ (హెచ్ఈపీ) కోస్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎస్సీ విద్యార్థినిలకు 278, ఎస్టీకి 4, బీసీకి 10, మైనార్టీలకు 12, హరిజన క్రిస్టియన్స్‌కు 11 సీట్లు కేటాయించామన్నారు. 2015, 2016 సంవత్సరాల్లో ఇంటర్ పాసైన అభ్యర్తులు, అడ్వాన్స్ సప్లమెంటరీలోనూ పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. గతంలో దరఖాస్తు చేసినవారు, చేయనివారు సైతం ఆగస్టు 2వ తేదీ ఉదయం 11 గంటలలోపు చిలుకూరులోని గురుకుల విద్యాలయంలో నిర్వహించే స్పాట్ అడ్మిషన్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు హైదరాబాద్‌కు చెందిన వారు సెల్: 98487 03737, రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు సెల్: 99892 69715 లలో సంప్రదించవ్చన్నారు. -
పాలిటెక్నిక్ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు
ఎచ్చెర్ల: ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగులు సీట్లు ప్రవేశాలకు సోమవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించారు. ఖాళీ ఉన్న బ్రాంచ్‌లలో విద్యార్థుల ఆసక్తి మేరకు ప్రవేశాలు కల్పించారు. శ్రీకాకుళం పురుషుల, టñ క్కలి పాలిటెక్నిక్ కళాశాలల్లో 82 సీట్లు ఖాళీలు ఉన్నాయి. వీటికి శ్రీకాకుళం పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహించగా 62 మంది హాజరయ్యారు. మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 40 ఖాళీలకు 32 మంది హాజరయ్యారు. ప్రవేశాలు ప్రక్రియను ప్రిన్సిపాళ్లు త్రినాథరావు, సంధ్యారాణి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి మురళీమోహన్‌లు పర్యవేక్షించారు. ప్ర వేశాలకోసం విద్యార్థులు నేరుగా కళాశాలను సంప్రదించ వచ్చని అధికారులు తెలిపారు. -
27న వైవీయూలో స్పాట్ అడ్మిషన్లు
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో మిగిలిన సీట్లకు ఈనెల 27న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వైవీయూ ప్రవేశాల సంచాలకుడు ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వైవీయూసెట్–2016లో ర్యాంకు వచ్చి సీటు రాని అభ్యర్థులు మరియు ప్రవేశ పరీక్ష రాయని అభ్యర్థులు కూడా స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావచ్చని తెలిపారు. హాజరయ్యే అభ్యర్థులు నిర్ణీత కోర్సు ఫీజు, ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు జతల జిరాక్స్ సర్టిఫికెట్లు వెంట తీసుకురావాలని సూచించారు. వివిధ కళాశాలల్లోని ఖాళీగా ఉన్న సీట్లకు సంబంధించిన వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వైవీయూడీఓఏ.ఇన్ అనే వెబ్సైట్లో సంప్రదించాలని కోరారు. -
స్పాట్ అడ్మిషన్లకు చివరి గడువు
నంగునూరు : పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరే విద్యార్థులు సోమవారం సాయంత్రం లోగా దరఖాస్తులు చేసుకోవాలని కౌన్సెలింగ్ ఇన్చార్జి విద్యాసాగర్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రాజగోపాల్‌పేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో చేరేం దుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కో–ఎడ్యుకేషన్‌తో పాటు మహిళా కళాశాలల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు ఈ నెల 20న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు వరిజినల్ సర్టిఫికెట్లతో పాటు అధార్‌కార్డు, ఫొటోలు అందజేయాలని సీటు లభించిన విద్యార్థులు అదే రోజు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. -
అనుమతి లేకున్నా స్పాట్ అడ్మిషన్లు!
కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలోని ఖాళీల భర్తీ ప్రకటనలు ఇచ్చి మరీ సీట్లు నింపుకుంటున్న ఇంజనీరింగ్ కళాశాలలు హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలో మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు అమ్మకానికి పెట్టాయి. స్పాట్ అడ్మిషన్ల పేరుతో సీట్లను భర్తీ చేస్తున్నాయి. నోటిఫికేషన్లు, ప్రకటనలు ఇచ్చి మరీ ఈ సీట్లను భర్తీ చేస్తుండడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నుంచి ఎలాంటి అనుమతి లేకపోయినా స్పాట్ అడ్మిషన్ల పేరుతో మిగులు సీట్ల భర్తీకి యాజమాన్యాలు చర్యలు చేపట్టాయి. అయితే ప్రముఖ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు మిగలకపోయినా, మేనేజ్మెంట్ కోటాలోని సీట్లను చాలా వరకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక మధ్యతరహా కాలేజీలు మాత్రం ఉన్నత విద్యా మండలి ఆమోదం లేకపోయినా ప్రకటనలు జారీచేసి మరీ సీట్లను భర్తీ చేస్తుండడంతో భవిష్యత్తులో వాటికి ర్యాటిఫికేషన్ ఎలా ఇస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆగస్టు 31తోనే ఆఖరు.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆగస్టు 31తోనే ప్రవేశాల ప్రక్రియ ముగిసిపోయింది. అప్పటివరకు కన్వీనర్ కోటాలోనే ఆంధ్రప్రదేశ్‌లో 57వేల సీట్లు, తెలంగాణలో 15వేల సీట్లు మిగిలిపోయాయి. రెండు రాష్ట్రాల్లో మేనే జ్మెంట్ కోటాలో మరో 80 సీట్లు ఉండిపోయాయి. అయితే ఆగస్టు 31 తరువాత ఎలాంటి ప్రవేశాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీని ఉన్నత విద్యామండలి నిలిపివేసింది. కౌన్సిల్ ఏర్పాటు చేసిన పోర్టల్ ద్వారా మేనే జ్మెంట్ కోటా సీట్లకోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 30 వేల మందికి యాజమాన్యాలు సీట్లను కేటాయించేలా ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మిన్నకుండిపోయింది. అయితే యాజమాన్యాలు మాత్రం ప్రకటనలు జారీచేసి మరీ ఆ సీట్ల భర్తీకి గతంలోనే చర్యలు చేపట్టాయి. తాజాగా మేనేజ్మెంట్ కోట్లా, కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ పేరుతో ప్రకటనలు జారీ చేసి భర్తీ చేసుకుంటున్నాయి. అయితే ఆగస్టు 31 తర్వాత చేపట్టిన, చేపడుతున్న ఈ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ర్యాటిఫికేషన్ ఎలా ఇస్తుందన్నదీ ప్రశ్నార్థంగా మారింది.