జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూ అనంతపురంలోని పాలకభవనంలో బీటెక్ (బ్లెకింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్వీడన్), జేఎన్‌టీయూఏ సంయుక్తంగా అందిస్తున్న బీటెక్ కోర్సుల్లో ఆగస్టు 5న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ తెలిపారు. బీటెక్ సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్ బ్రాంచుల్లో చేరడానికి ఆసక్తి గల అభ్యర్థులు హాజరుకావాలన్నారు. ఫీజు తదితర పూర్తి వివరాలకు www.jntua.ac.inలో తెలుసుకోవచ్చన్నారు.