
న్యూఢిల్లీ: దేశంలో ప్యాసింజర్ వాహనాల టోకు అమ్మకాలు ఈ ఏడాది ఆగస్టులో 2% తగ్గినట్లు వాహన తయారీదార్ల సమాఖ్య సియామ్ వెల్ల డించింది. మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం, కంపెనీలు డీలర్లకు తమ డిస్పాచ్‌లను తగ్గించ డం ఇందుకు కారణమని తెలిపింది. ఈ ఆగస్టులో కంపెనీల నుంచి డీలర్లకు 3,52,921 ప్యాసింజర్ వాహనాలు చేరాయి. గతేడాది (2023) ఆగస్టులో ఇవి 3,59,228గా నమోదయ్యాయి.
→ ద్వి చక్ర వాహన టోకు అమ్మకాలు 9% పెరిగి 15,66,594 యూనిట్ల నుంచి 17,11,662 యూనిట్లకు చేరాయి. స్కూటర్ల విక్రయాలు 6,06,250 యూనిట్ల నుంచి 5,49,290 యూనిట్లకు పెరిగాయి. మోటార్‌సైకిల్ డెలివరీలు 9,80,809 యూనిట్ల నుండి 8% పెరిగి 10,60,866 యూనిట్లకు చేరుకున్నాయి.
→ త్రి చక్ర వాహనాల అమ్మకాలు 64,944 యూనిట్ల నుంచి 69,962 యూనిట్లకు పెరిగాయి.
‘‘ఈ పండుగ సీజన్‌లో వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. కేంద్రం ఇటీవల ప్రకటించిన పీఎం ఈ–డ్రైవ్, పీఎం ఈ–బస్ సేవా పథకాలతో వాహన వినియోగం మరింత పుంజుకుంటుంది’’ అని సియామ్ డైరక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు.