
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ అమ్మకాల పరంగా గణనీయమైన పురోగతిని కనపరుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 10,09,900 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఈ సేల్స్ 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11 శాతం ఎక్కువ. మార్చి 2025లో మాత్రమే సంస్థ అమ్మకాలు 34 శాతం పెరిగి 1,01,021 యూనిట్లకు చేరుకున్నాయి.
బ్రాండ్ అమ్మకాల గురించి ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ & రాయల్ ఎన్‌ఫీల్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి గోవిందరాజన్ మాట్లాడుతూ.. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో 10 లక్షల సేల్స్ మైలురాయి దాటడం గొప్ప విషయం. సంస్థ అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం కొత్త ఉత్పత్తుల పరిచయం అని అన్నారు. క్లాసిక్ 350 బైకుకుగొప్ప స్పందన లభించిందని ఆయన అన్నారు.
క్లాసిక్ 350, బుల్లెట్ 350 లతో పాటు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 మోడల్స్ అత్యధికంగా అమ్ముడైన మోడళ్లుగా నిలిచాయి. హంటర్ 350 బైక్ ఐదు లక్షల అమ్మకాలను, సూపర్ మీటియర్ 650 బైక్ 50000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కాగా కంపెనీ ఇటీవల క్లాసిక్ 650 బైక్ లాంచ్ చేసింది.