ఫిబ్రవరి 2023 ముగియడంతో దాదాపు అన్ని కంపెనీలు తమ అమ్మకాల గణాంకాలను వెల్లడించాయి. గత నెలలో దేశీయ మార్కెట్లో వాహనాల అమ్మకాలు కొంత పురోగతి చెందినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. మంచి అమ్మకాలు పొందిన టాప్ 5 టూవీలర్ బ్రాండ్స్ లో హీరో మోటోకార్ప్ మొదటి స్థానంలో చేరింది.
గత నెలలో హీరో మోటోకార్ప్ మొత్తం 382317 యూనిట్లను విక్రయించి 2022 ఫిబ్రవరి కంటే 15.34 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇదే నెల గతేడాది కంపెనీ అమ్మకాలు 3,31,462 యూనిట్లు. ఎగుమతుల విషయంలో మాత్రం -54.68 శాతం తగ్గుదలను నమోదు చేసింది. కంపెనీ మొత్తం అమ్మకాలు 3,94,460 యూనిట్లు (ఎగుమతులు + దేశీయ అమ్మకాలు).
హోండా మోటార్‌సైకిల్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. కంపెనీ దేశీయ అమ్మకాలు 2,27,064 యూనిట్లు కాగా, ఎగుమతులు 20,111 యూనిట్లు. 2023 ఫిబ్రవరిలో మొత్తం అమ్మకాలు 2,47,175 యూనిట్లు. దేశీయ అమ్మకాల్లో కంపెనీ -20.25 శాతం, ఎగుమతుల్లో -25.36 శాతం, మొత్తం అమ్మకాల పరంగా -20.93 శాతం తగ్గుదలను నమోదు చేసింది.
టీవీఎస్ మోటార్ విషయానికి వస్తే 2023 ఫిబ్రవరిలో 2,21,402 యూనిట్లను దేశీయ మార్కెట్లో 27.83 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎగుమతుల పరంగా 45,624 యూనిట్లను విక్రయించి 2022 ఫిబ్రవరి కంటే -51.68 శాతం తగ్గుదలను నమోదు చేసింది. మొత్తం అమ్మకాల పరంగా -0.22 శాతం తగ్గుదలతో 2,67,026 యూనిట్ల వద్ద ఆగిపోయింది.
2023 ఫిబ్రవరిలో బజాజ్ ఆటో మొత్తం అమ్మకాలు దేశీయ అమ్మకాలు + ఎగుమతులు 2,35,356 యూనిట్లతో 2022 ఫిబ్రవరి కంటే -15.74 శాతం అతగ్గుదలను నమోదు చేసింది. ఎగుమతులు 1,15,021 యూనిట్లు కాగా, దేశీయ అమ్మకాలు 1,20,335 యూనిట్ల వద్ద ఉన్నాయి. దేశీయ అమ్మకాల్లో కంపెనీ పురోగతిని కనపరిచినప్పటికీ, ఎగుమతుల్లో -37.08 శాతం తగ్గుదలను నమోదు చేసింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాల విషయానికి వస్తే, మొత్తం అమ్మకాలు 71,544 యూనిట్లు (ఎగుమతులు + దేశీయ అమ్మకాలు) కాగా, కేవలం దేశీయ అమ్మకాలు 64,436 యూనిట్లు, ఎగుమతులు 7,108 యూనిట్లు. కంపెనీ ఎగుమతుల్లో 1.18 శాతం వృద్ధిని, దేశీయ అమ్మకాల్లో 23.59 శాతం వృద్ధిని కనపరిచింది.
Comments
Please login to add a commentAdd a comment