Royal Enfield 650 Twins Anniversary Edition: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్లకు ఉండే క్రేజే వేరు. కొద్దిరోజుల క్రితం రాయల్ ఎన్‌ఫీల్డ్ 120 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు ఫ్లాగ్‌షిప్ ఎడిషన్ 650 సీసీ బైక్లను లాంచ్ చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 బైక్లను కొనుగోలుదారులకు డిసెంబర్ 6న ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో అమ్మకానికి రాగా..బుల్లెట్ బైక్ లవర్స్ లిమిటెడ్ ఎడిషన్ బైక్లపై ఎగబడ్డారు. యానివర్సరీ ఎడిషన్ 120 బైక్లను భారత్‌లో కేవలం 120 సెకన్లలో విక్రయించి సరికొత్త రికార్డును నమోదుచేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
120 యూనిట్లు మాత్రమే..!
రాయల్ ఎన్‌ఫీల్డ్ 120 వార్షికోత్సవం సందర్భంగా భారత్‌లో కేవలం 120 యూనిట్లను మాత్రమే కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 480 యూనిట్లను మాత్రమే తయారు చేయనుంది. ఒక్కో ప్రాంతానికి 60 కాంటినెంటల్ GT 650 బైక్స్, 60 ఇంటర్‌సెప్టర్ 650 బైక్లను కంపెనీ సప్లై చేసింది. దీంతో భారత్‌లో 120 యూనిట్ల లిమిటెడ్ ఎడిషన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 బైక్స్ కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చాయి.
అదిరిపోయే ఫీచర్స్..!
120 వార్షికోత్సవ ఎడిషన్ ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 బైక్లను యూకే, భారత్‌కు చెందిన బృందాలు రూపొందించాయి. బ్లాక్ క్రోమ్ ట్యాంక్‌ను ఈ రెండు బైక్స్ కల్గి ఉన్నాయి. ఇంజిన్, సైలెన్సర్ ఇతర భాగాలు పూర్తిగా బ్లాక్ కలర్‌తో రానున్నాయి. ఫ్లైస్క్రీన్, ఇంజన్ గార్డ్, హీల్ గార్డ్, టూరింగ్ , బార్ ఎండ్ మిర్రర్స్ వంటి అనేక రకాల ఉపకరణాలు కూడా వస్తాయి.
ప్రత్యేక ఆకర్షణగా 120 ఇయర్స్ బ్యాడ్జ్..!
ఈ బైక్లకు 120 ఇయర్స్ డై-కాస్ట్ బ్రాస్ ట్యాంక్ బ్యాడ్జ్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వీటిని భారత్‌కు చెందిన సిర్పి సెంథిల్ కళాకారులు బ్రాస్ బ్యాడ్జ్‌లను చేతితో తయారుచేశారు.
చదవండి: Bounce Infinity E1 vs Ola S1: ఈ రెండింటిలో ఏది బెటర్..?
Comments
Please login to add a commentAdd a comment