btech
-
ఫీజులు.. గుండెలు గుభిల్లు
విద్యార్థులు, తల్లిదండ్రుల డ్రీమ్ కోర్సు అయిన ఇంజనీరింగ్‌కు సంబంధించి దేశంలోనే ప్రఖ్యాత విద్యా సంస్థ ఐఐటీ బాంబేలో నాలుగేళ్ల బీటెక్‌కు 2008లో మొత్తం ట్యూషన్ ఫీజు రూ.1,08,000 ఉండగా ఇది 2024–25 నాటికి ఏకంగా రూ.8,00,000కు చేరింది. అలాగే మరో ప్రముఖ విద్యా సంస్థ ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో 2011–12లో బీటెక్‌కు రూ.1,42,000 ఫీజు ఉండగా 2023–24 నాటికి ఇది 5,02,800కు పెరిగింది. మొత్తం మీద ఐఐటీల్లో 15 ఏళ్లలో ఏడు రెట్లు, ఎన్ఐటీల్లో 12 ఏళ్లలో మూడున్నర రెట్లు ఫీజులు పెంచారు. అలాగే ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల్లలో 15 ఏళ్లలో 8 రెట్లు ఫీజులు పెరిగాయి. భారతదేశంలో పెరిగిపోతున్న విద్యా వ్యయంపై కెరీర్స్360 ఫౌండర్ చైర్మన్ మహేశ్వర్ పెరి అందిస్తున్న ప్రత్యేక వ్యాసం⇒ మన దేశంలో చదువు రోజురోజుకీ భారంగా మారుతోంది. ప్రాథమిక విద్య నుంచి మేనేజ్ మెంట్ చదువుల వరకు ప్రతి దశలోనూ విద్య సామాన్యుడికే కాదు, మధ్య తరగతికీ తలకు మించిన భారంగా పరిణమించింది. విద్యలో ప్రభుత్వ పాత్ర క్రమేణా తగ్గడం.. ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొచ్చి ఫీజులు పెంచుకుంటూ పోవడమే అందుకు ప్రధాన కారణం.⇒ గత 13 ఏళ్లలో ప్రభుత్వ బడుల సంఖ్యలో పెరుగుదల కేవలం 9 శాతం. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లు ఏకంగా 35% పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశంలోని మొత్తం కాలేజీల్లో 79 % ప్రైవేటువే. 14 ఏళ్ల కిందట దేశంలోని ప్రతి రెండు ప్రభుత్వ యూనివర్సిటీలకు ఒక ప్రైవేటు యూనివర్సిటీ ఉంటే నేడు ప్రైవేటు వర్సిటీల సంఖ్య ప్రభుత్వ వర్సిటీల సంఖ్యను అధిగమించేసింది. వీటన్నింటి ఫలితంగా చదువులపై పెట్టాల్సిన ఖర్చు గణనీయంగా పెరిగిపోయింది. ఇవన్నీ ఆందోళనకరమైన పరిణామాలు. ⇒ మన చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టి, పెద్ద పెద్ద విషయాలను పక్కనపెట్టేశామేమో అనిపిస్తోంది. ఈ సందర్భంగా మనమంతా కొన్ని అంశాలు ఆలోచించాలి. మన ప్రజల సుసంపన్నమైన అభివృద్ధికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నామా? నిపుణులైన మానవ వనరులను తయారుచేసుకోవడంలో మనం వెనకబడుతున్నామా? గత 15–20 ఏళ్లలో దేశంలో విద్యా రంగంలో చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే అవుననే అనిపిస్తుంది. ఐఐటీలను మించి స్కూల్ ఫీజులు.. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఫీజులు స్కూల్‌ను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉన్నాయి. హైదరాబాద్ లోని పటాన్చెరులో ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్ 2024–25 విద్యా సంవత్సరానికి రూ.12 లక్షల ఫీజు వసూలు చేస్తోంది. ఇది కాకుండా అడ్మిషన్ ఫీజు కింద మరో రూ.1.7 లక్షలు చెల్లించాల్సిందే. అలాగే శంషాబాద్‌లో ఉన్న మరో అకాడమీ ఏడాదికి రూ.9.5 లక్షల ఫీజు వసూలు చేస్తోంది. అలాగే మోకిలాలో ఉన్న ఇంకో ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడాదికి రూ.8.2 లక్షల ఫీజు ఉంది. వీటికి అదనంగా అడ్మిషన్ ఫీజు కింద మరింత ముట్టజెప్పాల్సిందే. భారీ ఫీజులతో తల్లిదండ్రుల్లో ఆందోళన ఆ కోర్సు, ఈ కోర్సు అనే తేడా లేకుండా ప్రతి కోర్సుకు ఫీజుల మోత మోగిపోతోంది. మనదేశంలో విద్యా వ్యయం ఏయేడాదికాయేడాది అంతకంతకూ పెరిగిపోతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను అత్యున్నత విద్యా సంస్థల్లో చదివించాలని కలలు కంటారు. తమ కంటే తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని ఆశిస్తారు.మంచి విద్యా సంస్థలో తమ పిల్లలు సీటు సాధించాలని.. ఆ తర్వాత కోర్సు పూర్తయ్యాక మంచి పే ప్యాకేజీతో ఉద్యోగం సాధించాలని ఆకాంక్షిస్తారు. అత్యుత్తమ విద్య, ఆ తర్వాత మంచి ఉద్యోగం సాధించాలంటే మేటి విద్యా సంస్థల్లో చదవకతప్పదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో అందరికంటే ముందుండాలన్నా, మంచి అవకాశాలు దక్కించుకోవాలన్నా నాణ్యమైన చదువులతోనే సాధ్యమని నమ్ముతున్నారు. అయితే పెరుగుతున్న ఫీజులు తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతున్నాయి. క్యాష్ చేసుకుంటున్న విద్యా సంస్థలు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆకాంక్షలను విద్యా సంస్థలు ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. ఫీజులను అమాంతం పెంచేస్తున్నాయి. నర్సరీ నుంచి మొదలుపెడితే పీజీలు, పీహెచ్‌డీల వరకు ఈ విద్యా వ్యయం ఏటా అంతకంతకూ గణనీయంగా పెరుగుతోంది. ధనవంతులకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా మధ్యతరగతి వర్గాలు, పేదలు అంతకంతకూ పెరిగిపోతున్న విద్యా వ్యయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏటా భారీగా పెరిగిపోతున్న ఫీజులను కట్టలేక నాణ్యమైన చదువులకు విద్యార్థులు దూరమవుతున్నారు. ఇలా అర్థంతరంగా చదువులు మానేసేవారి శాతం అంతకంతకూ పెరిగిపోతోంది. కొంతవరకు బ్యాంకులు విద్యా రుణాలు అందిస్తున్నా అవి అందరికీ దక్కడంలేదు. దీంతో డ్రాపవుట్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వరంగంలో తగ్గిపోయిన విద్యాసంస్థలుప్రపంచంలోనే అత్యధిక యువజనాభా భారతదేశంలోనే ఉంది. అయితే దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు ఏర్పాటు కావడం లేదు. ప్రైవేటు రంగంలోనే ఎక్కువ విద్యా సంస్థలు ఏర్పాటవుతున్నాయి. దీంతో ప్రైవేటు విద్యా సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తూ నడ్డి విరుస్తున్నాయి.ప్రభుత్వ రంగంలో ఎక్కువ విద్యా సంస్థలు ఏర్పాటయితే ప్రైవేటు సంస్థలతో పోలిస్తే ఫీజుల భారం తక్కువగా ఉంటుంది. అయితే అలా జరగకపోవడంతో పేదలు, మధ్యతరగతి వర్గాలు భారీ ఫీజులను చెల్లించలేక చదువులకు స్వస్తి చెబుతున్నాయి. దేశంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో గత 15 ఏళ్లలో వివిధ కోర్సుల ఫీజులు 300 శాతం పెరిగాయి. దేశంలో గత 20 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే దిమ్మతిరిగే విషయాలు వెల్లడయ్యాయి. భారీగా ఫీజుల భారం.. దేశంలో ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలు పెరిగిపోవడం.. ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు తగ్గిపోవడంతో విద్యార్థులపై భారీ ఎత్తున ఫీజుల భారం పడుతోంది. దీంతో విద్యకు సంబంధించిన ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతోంది. తాజా నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం.. 2014–2018 మధ్య ప్రాథమిక విద్యకు తల్లిదండ్రులు 30.7 శాతం వ్యయం చేశారు. అలాగే ప్రాథమికోన్నత తరగతులకు 27.5 శాతం ఖర్చు పెట్టారు. లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. కోవిడ్ తర్వాత తమ పిల్లల స్కూల్ ఫీజులు 30 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగాయని 42 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. తన కుమారుడి ఫీజు కింద నెలకు రూ.30,000 చెల్లిస్తున్నానంటూ హరియాణాలోని గురుగ్రామ్‌లో ఒక తండ్రి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో ఒక స్కూల్ ఒకేసారి 50 శాతం ఫీజు పెంచింది. 44 శాతం మంది చదువులకు దూరం నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం.. 23 శాతం మంది ఆర్థిక ఇబ్బందులతోనే చదువులు మానేశారు. 21 శాతం మంది తమ కుటుంబ పోషణ కోసం పనులకు వెళ్లడం వల్ల చదువులు మానేశామని చెప్పారు. అంటే దేశ యువతలో 44 శాతం మంది పెరిగిన ఫీజులు, కుటుంబ ఆరి్థక పరిస్థితులతో ఉన్నత చదువులు చదవలేకపోయారు. ఈ నేపథ్యంలో విద్య నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.ఎంబీబీఎస్.. ఫీజుల మోత మోగాల్సిందే..⇒ ప్రైవేటు స్టేట్ యూనివర్సిటీల్లో రూ.80 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు ⇒ డీమ్డ్ యూనివర్సిటీల్లో రూ.1.25 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు ⇒ ఎన్నారైలకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు -
దక్షిణాదికి మరిన్ని ఇంజనీరింగ్ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాలకు ఇంజనీరింగ్ సీట్లు పెరగనున్నాయి. అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తోంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ నుంచి వస్తున్న డిమాండ్‌ను ఏఐసీటీఈ పరిగణనలోకి తీసుకున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌పై విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో అక్కడ మేనేజ్మెంట్ కోర్సుల పెంపునకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే తెలంగాణవ్యాప్తంగా 10 వేల ఇంజనీరింగ్ సీట్లు పెరుగుతాయని రాష్ట్ర అధికారులు అంచనా వేస్తున్నారు. కంప్యూటర్ కోర్సుల్లోనే సీట్లు పెంచాలని ఇంజనీరింగ్ కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లలో సీట్లకు కోత పడొచ్చు.గత ఏడాది 7 వేల సీట్లు ఈ బ్రాంచ్‌లలో తగ్గాయి. వీటి స్థానంలో కంప్యూటర్ కోర్సుల్లో పెంచారు. దీంతోపాటు మరో 7 వేల వరకూ కంప్యూటర్ బ్రాంచ్‌ల్లో సీట్లు పెరిగాయి. మారుతున్న ట్రెండ్ కొన్నేళ్లుగా దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల మధ్య కోర్సుల ఎంపికలో తేడా కనిపిస్తోందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసీటీఈ గుర్తించాయి. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్), ఎంబీఏ, ఎంసీఏల్లో ఎక్కువగా చేరుతున్నారు. కానీ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్ తర్వాత ఎంఎస్‌కు విదేశాలకు వెళ్లేందుకు, లేదా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని విద్యార్థులు డిగ్రీ తర్వాత సివిల్స్, ఇతర పోటీ పరీక్షల వైపు దృష్టి పెడుతున్నారు. ఈ డిమాండ్‌ను బట్టే ఎక్కువ ఇంజనీరింగ్ సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. ► దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు అందుబాటులో ఉంటే, వీటిల్లో 6,74,697 (54 శాతం) సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ►ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ►ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించిన సీట్లు 3,39,405 దేశవ్యాప్తంగా ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. ►రానురాను బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దక్షిణాదిలోనే పెరగడానికి ఇదే కారణమని ఏఐసీటీఈ భావిస్తోంది. ►2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, కేవలం ఆరేళ్లలో అవి 5.3 శాతం పెరిగాయి. ఇప్పుడిది 7 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తున్నారు. నైపుణ్యంపై దృష్టి ఇంజనీరింగ్ విద్యలో కొత్త కోర్సులు వస్తున్నా, విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇంజనీరింగ్‌లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే ప్రాక్టికల్‌గా అవసరమైన నైపుణ్యం పొందేలా ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు. తరగతిగది కన్నా, నైపుణ్యం పొందే పారిశ్రామిక సంస్థల్లో పనిచేసేలా చేయాలని ఏఐసీటీఈ సూచిస్తోంది. టెక్నాలజీలో దక్షిణాది ముందంజ దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ చదవడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ట్రెండ్ రానురాను పెరుగుతోంది. తక్షణ ఉపాధితో పాటు, నైపుణ్యం పెంచే విధంగా ఇంజనీరింగ్‌లో వస్తున్న మార్పులూ ఇందుకు కారణమే. అందుకే తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ సీట్ల పెంపు అనివార్యమవుతోంది. గణితం నేపథ్యం విద్యార్థులూ ఉత్తరాది కన్నా, దక్షిణాదిలో ఎక్కువగా ఉంటున్నారు. ఇది కూడా బీటెక్ సీట్ల డిమాండ్‌కు కారణమవుతోంది. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్య మండలి చైర్మన్ -
చదువు పూర్తయిందా.. ఉద్యోగం కావాలా..? ఇదే బెస్ట్ ఛాయిస్..
ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే ఉద్యోగం సంపాదించాలని అనుకుంటారు. కానీ ఎంచుకున్న రంగంలో ఏ విభాగంలో డిమాండ్ ఉందో తెలుసుకోలేక నష్టపోతుంటారు. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏ విభాగంలో ఎక్కువ కొలువులు రానున్నాయో నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. చదువు అయిపోయాక ఉపాధి అవకాశాలు లభించాలంటే విద్యను అభ్యసిస్తున్నపుడే సృజనాత్మక ఆలోచనలు, కృత్రిమమేధ, డేటాసైన్స్ సబ్జెక్టులపై పట్టు సాధించాలని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ పట్టా తీసుకుంటుండగా... ఇందులో చాలా శాతం మంది ఉద్యోగాలు సాధించడం లేదు. సొంతంగా అంకుర సంస్థలను స్థాపించేందుకు కొద్దిమందే ముందుకొస్తున్నారు. కృత్రిమ మేధ, డేటా సైన్స్‌లో పరిశోధనలు.. విదేశాల్లో కృత్రిమ మేధ, డేటా సైన్స్, ఆటోమేషన్ అంశాలపై అధికంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో విభిన్నమైన ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ఓ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ కొద్ది నెలల కిందట కృత్రిమ మేధతో అనుసంధానమైన స్మార్ట్‌ఫ్రిజ్‌ను అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఐరోపా దేశాల్లో ఆవిష్కరించింది. ఇదీ చదవండి: 4వేలకు పైగా కార్లు వెనక్కి.. సమస్య ఏమిటంటే.. ఒక సాంకేతిక పరికరాన్ని ఫ్రిజ్‌లో అమర్చితే చాలు అందులోని కూరగాయలు ఏ రోజు వండుకోవాలో చెబుతుంది. పండ్లు, ఇతర సామగ్రి ఖాళీ అవుతున్నప్పుడు దానంటదే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంది. ఇలాంటి ఆలోచనలు, సాఫ్ట్వేర్లు ఇతర రంగాలకూ అవసరం. వీటితో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా చాలా మార్పులు రానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన అంశాలను విద్యను అభ్యసిస్తున్నపుడే నేర్చుకుంటే చదువు అయిపోయాక వెంటనే కొలువు దొరికే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. -
ఉన్నత విద్యకు ‘స్కిల్’ జత
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో నైపుణ్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను కాలేజీలు, యూనివర్సిటీలు అందుబాటులోకి తెచ్చేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంగీకారం తెలిపింది. తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావించింది. విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించినప్పటీకీ పెద్దగా నిధులు కేటాయించక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదన్నది భారత పారిశ్రామిక వేత్తల అభిప్రాయం. సీఐఐ, ఎఫ్ఐఐ, నాస్కామ్ వంటి సంస్థల అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక భాగస్వామ్యంతో ఈ కోర్సులను ముందుకు తీసుకెళ్ళాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కన్పిస్తోంది. తక్షణ అవసరం ఇదే..: దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే నైపుణ్యం (స్కిల్)తో బయటకు వస్తున్నారు. మిగతా వాళ్ళలో కొంతమంది స్కిల్ కోసం ప్రత్యేక కోర్సులు నేర్చుకుంటున్నారు. అయితే వాళ్లలో కోర్సు నేర్చుకునే నాటికే కొత్త నైపుణ్యాలు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో మళ్ళీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే తప్ప మంచి వేతనంతో ఉద్యోగం లభించే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే విశ్వవిద్యాలయాలకు యూజీసీ తక్షణ మార్పులను సూచించింది. నైపుణ్యాభివృద్ధి మండళ్లు స్వల్ప వ్యవధి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి అక్కర్లేదని కూడా తెలిపింది. కాకపోతే పారిశ్రామిక భాగస్వామ్యం తప్పనిసరి. అప్పుడే విద్యార్థి అనుభవ పూర్వకంగా నైపుణ్యం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి డిగ్రీ, బీటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు 3–6 నెలల వ్యవధిలో 27 రకాల నైపుణ్య కోర్సులను యూజీసీ సూచిస్తోంది. వీటికి 12 నుంచి 30 క్రెడిట్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమీక్ష జరిపింది. ఏయే కోర్సులు అందుబాటులోకి తేవచ్చు అనే విషయాన్ని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు వివరించారు. ఇవీ స్కిల్ కోర్సులు అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే కాలంలో మొత్తం 27 స్కిల్ కోర్సులను నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో ఏఐ అండ్ ఎంఎల్, రోబోటిక్స్, ఐవోటీ, ఇండ్రస్టియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీఆర్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, 5 జీ కనెక్టివిటీ, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, ఎల్రక్టానిక్స్ సిస్టమ్ డిజైన్, వీఎస్‌ఎస్‌ఐ డిజైన్స్, కంప్యూటర్ భాషలో ప్రాథమిక అవగాహన, మెకానికల్ టూలింగ్, మొబైల్ కమ్యూనికేషన్ లాంటి ప్రధానమైన కోర్సులున్నాయి. తెలంగాణలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల భాగస్వామ్యంతో ఐవోటీ, ఏఐఎంఎల్ సహా ఇతర కంప్యూటర్ కోర్సుల్లో స్వల్పకాలిక కోర్పులు నిర్వహించవచ్చని అధికారులు అంటున్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలసిస్ వంటి వాటికి విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్నారు. తొలి దశలో ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే ఈ దిశగా ముందుకు వెళ్ళే వీలుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని డీమ్డ్ వర్సిటీలు ఈ దిశగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. స్కిల్‌తో ఉద్యోగం సులభం డిగ్రీతో పాటు నైపుణ్యం ఉంటే ఉద్యోగం లభించడమే కాదు.. అందులో రాణించడం కూడా సులభం. కంపెనీలు ఇలాంటి అర్హతలే కోరుకుంటున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి ఏదైనా ఒక రంగంలో నైపుణ్యం అవసరం. ఈ దిశగా ప్రభుత్వం, వర్సిటీలు అడుగులు వేయడం అభినందనీయం. – శ్రీరాం వెంకటేష్ (ఉన్నత విద్య మండలి కార్యదర్శి) -
అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య
న్యూయార్క్: అమెరికాలో భారతీయ విద్యార్థి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. డ్రగ్స్‌కు బానిసైన ఒకడు ఆయన్ను సుత్తితో దారుణంగా కొట్టి ప్రాణాలు తీశాడు. హరియాణాకు చెందిన వివేక్ సైనీ బీటెక్ పూర్తి చేసుకుని రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఇటీవలే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంబీయే పూర్తి చేసిన అతడు..జార్జియా రాష్ట్రం లిథోనియా నగరంలో ఉంటూ ఓ స్టోర్‌లో పార్ట్–టైం క్లర్కుగా పనిచేస్తున్నాడు. అదే స్టోర్ వద్ద నిలువ నీడ లేని జులియన్ ఫాల్క్‌నర్ అనే డ్రగ్ అడిక్ట్ ఉంటున్నాడు. వివేక్ అతడికి రెండు రోజులుగా నీళ్లు, చిప్స్, కోక్ ఇస్తున్నాడు. చలి నుంచి కాపాడుకునేందుకు జాకెట్ సైతం అతడికి ఇచ్చాడు. ఈ నెల 16వ తేదీన ఫాల్క్‌నర్ ఇంటికి వెళ్తున్న వివేక్‌కు అడ్డుగా నిలిచాడు. అడ్డు తొలగకుంటే పోలీసులకు చెబుతా నంటూ హెచ్చరించాడు. అతడు లక్ష్యపెట్టక సుత్తితో వివేక్‌పై దాడికి దిగాడు. వివేక్ తలపై 50సార్లు సుత్తితో మోదాడు. సమాచారం అందుకుని పోలీసులు వచ్చే సరికి వివేక్ మృతదేహం వద్దే ఆ ఉన్మాది ఉండటం గమనార్హం. -
బీటెక్ చదివి.. యూట్యూబ్ చూసి దొంగతనం.. చివరికి
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): బీటెక్ చదివిన యువకులు ఉద్యోగం లభించక బైక్ చోరీలకు అలవాటుపడి చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన హనుమంతనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా బాలయ్యపల్లి మండలానికి చెందిన హేమాద్రి, పవన్‌లు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చారు. అయితే వారికి ఉద్యోగం దొరకలేదు. ఊర్లో మాత్రం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నామని చెప్పుకునేవారు. యూట్యూబ్‌లో చూసి బైక్‌లు చోరీ చేయడం ఎలాగో తెలుసుకున్న ఇద్దరూ ఖరీదైన బైక్‌లు, బుల్లెట్ బండ్లను చోరీ చేసి ఊర్లో దర్జా చూపేవారు. మరోవైపు బాధితులు హనుమంతనగర పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను వారి సొంతూరికి వెళ్లి అరెస్టుచేసి తీసుకొచ్చారు. చదవండి ఎమ్మెల్యేకు షాక్.. సంచలనం రేపుతున్న మహిళా కానిస్టేబుల్ వాట్సాప్ స్టేటస్ -
బీటెక్ పరీక్ష.. ఇదేం పని రా అయ్యా, నిజం తెలిసి ఇన్విజిలేటర్ మైండ్‌బ్లాక్!
తాడిపత్రి అర్బన్: ఒకరికి బదులుగా మరొకరిని పరీక్ష హాలులోకి పంపించారు. ఇందుకోసం విద్యార్థుల హాల్‌టికెట్లు, ఐడీ కార్డులను మార్ఫింగ్ చేశారు. ఇలా ఒకరు కాదు... ఇద్దరు కాదు.. ఏకంగా 16 మంది నకిలీ విద్యార్థులను పరీక్షకు పంపించారు. అయితే ఇన్విజిలేటర్ క్షుణంగా తనిఖీ చేయడంతో ఈ నకిలీ విద్యార్థుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జేఎన్టీయూ(ఏ) పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో గత నెల 25 నుంచి బీటెక్ మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాడిపత్రిలోని సీవీ రామన్ ఇంజినీరింగ్ కళాశాల (సీవీఆర్టీ)కు చెందిన 16 మంది విద్యార్థులకు తాడిపత్రి ఇంజినీరింగ్ కళాశాల(టెక్)లో పరీక్ష కేంద్రం కేటాయించారు. గురువారం ఉదయం పది గంటలకు డ్రాయింగ్, బీఈఈఈ పరీక్ష ప్రారంభం కాగా, ఇన్విజిలేటర్ విద్యార్థుల హాల్‌టికెట్లను పరిశీలించారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లుగా గుర్తించారు. మరింత క్షుణంగా తనిఖీ చేయగా, ఒకే కాలేజీకి చెందిన 16 మంది స్థానంలో వేరేవారు పరీక్ష రాస్తున్నట్లు గుర్తించి కళాశాల ప్రిన్సిపాల్ ఈవీ సుబ్బారెడ్డి, జేఎన్టీయూ(ఏ) అబ్జర్వర్‌కు సమాచారమిచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆయా విద్యార్థుల ఐడీ కార్డులు పరిశీలించగా, అవి కూడా నకిలీవని తేలింది. తమ విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేరని భావింన సీవీఆర్టీ కళాశాల యాజమాన్యం... అసలు విద్యార్థుల ఫొటోలతోపాటు ఐడీ కార్డులను మార్ఫింగ్ చేసి పరీక్షలు రాసేందుకు వేరేవారిని పంపినట్లు గుర్తించారు. అనంతరం నకిలీ విద్యార్థుల నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేసిన జేఎన్టీయూ(ఏ) అధికారులు రూల్–3 కింద చర్యలు కేసు నవెదు చేశారు. కాగా, గతంలోనూ సర్ సీవీ రామన్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం అనేక మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంజినీరింగ్ విద్యార్థులను డిగ్రీ చదువుతున్నట్లు చూపి ఫీజు రీయింబర్స్మెంట్ దందాకు పాల్పడింది. దీంతోపాటు నిబంధనల మేరకు ఇంటర్ కళాశాల ఏర్పాటు చేసేటప్పుడు ఇంటర్ బోర్డుకు సీవీ రామన్ యాజమాన్యం అందజేసిన పత్రాలు నకిలీవని బయటపడింది. కళాశాల యాజమాన్యం ఏకంగా ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ల కోసం ఓ బ్యాంకు మేనేజర్ సంతకం కూడా ఫోర్జరీ చేసినట్లు సమాచారం. చదవండి కానిస్టేబుల్ భార్య పైశాచికం.. ప్రియుడి మోజులో పడి, ఇంటికి పిలిచి.. -
తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ స్వీప్
సాక్షి, నెట్వర్క్: తెలంగాణలో బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టీకల్చర్, బీవీఎస్సీ, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఆ రాష్ట్ర ఎంసెట్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దుమ్ములేపారు. అటు ఇంజనీరింగ్ విభాగంలోనూ, ఇటు మెడికల్ అండ్ అగ్రికల్చర్ విభాగంలోనూ టాప్ ర్యాంకులు కొల్లగొట్టి సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో సనపల అనిరుధ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో బూరుగుపల్లి సత్యరాజ్ జశ్వంత్ తెలంగాణ స్థాయిలో ఫస్ట్ ర్యాంకులతో భళా అనిపించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2, 3, 5, 6, 8, 9, 10 ర్యాంకులు మన రాష్ట్ర విద్యార్థులకే దక్కాయి. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలోనూ 2, 4, 5, 7, 8 ర్యాంకులు ఎగరేసుకుపోయారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. కాగా ఇంజనీరింగ్ ర్యాంకర్లందరూ ఐఐటీల్లో చేరతామని, మెడికల్ విభాగం ర్యాంకర్లంతా వైద్య వృత్తిలో స్థిరపడతామని వెల్లడించారు. విజేతల అభిప్రాయాలు వైద్య రంగంలో ఉన్నతవిద్యనభ్యసిస్తా.. మాది చీరాల. నాన్న నాసిక సుధాకర్‌బాబు, అమ్మ శ్రీదేవి మగ్గం నేస్తారు. విజయవాడలోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్మిడియెట్ చదివాను. వైద్య రంగంలో ఉన్నత విద్యనభ్యసించడమే నా లక్ష్యం. – నాసిక వెంకటతేజ, సెకండ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కార్డియాలజిస్ట్ లేదా న్యూరాలజిస్టునవుతా.. మాది తెనాలి. నాకు ఇంటర్ బైపీసీలో 983 మార్కులు వచ్చాయి. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా ఆకాంక్ష. ఇప్పటికే నీట్ రాశాను. ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా స్థిరపడాలనేదే నా కోరిక. – దుర్గెంపూడి కార్తికేయరెడ్డి, నాలుగో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) వైద్య రంగంలో స్థిరపడతా.. మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. నాకు నీట్‌లోనూ మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉంది. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా కోరిక. – బోర వరుణ్ చక్రవర్తి, ఐదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) మంచి వైద్య కళాశాలలో మెడిసిన్ చేస్తా.. మాది నెల్లూరు. అమ్మానాన్న హారతి, శంకర్ వైద్యులుగా పనిచేస్తున్నారు. మంచి మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదవడమే నా లక్ష్యం. – హర్షల్సాయి, ఏడో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కష్టపడి చదివా.. మాది గుంటూరులోని ఏటీ అగ్రహారం. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. కష్టపడి చదవడంతో తెలంగాణ ఎంసెట్‌లో ఎనిమిదో ర్యాంక్ సాధించాను. – సాయి చిది్వలాస్రెడ్డి, 8వ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కంప్యూటర్స్ సైన్స్ చదువుతా.. మాది గుంటూరు. నాన్న శ్రీనివాసరెడ్డి రైతు. ఇంటర్ ఎంపీసీలో 971 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో సీటు సాధించడమే లక్ష్యం. – యక్కంటి ఫణి వెంకట మణిందర్‌రెడ్డి, సెకండ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించడమే లక్ష్యం మాది ఎన్టీఆర్ జిల్లా నందిగామ. ఇంటర్మిడియెట్ ఎంపీసీలో 983 మార్కులు సాధించాను. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఓపెన్ కేటగిరీలో 263వ ర్యాంక్ వచ్చింది. వచ్చే నెలలో జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. ఇందులో మంచి ర్యాంక్ సాధించడమే నా లక్ష్యం. – చల్లా ఉమేష్ వరుణ్, థర్డ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) సివిల్స్ సాధించి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఆలిండియాలో 97వ ర్యాంకు సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో చేరతా. తర్వాత సివిల్స్ రాసి ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. – పొన్నతోట ప్రమోద్ కుమార్‌రెడ్డి, ఐదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఐటీ బాంబేలో చేరతా.. మాది విశాఖపట్నం జిల్లా గాజువాక. నాన్న బిజినెస్‌లో ఉండగా అమ్మ ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. ఇంటర్ ఎంపీసీలో 987 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో ఆలిండియాలో 110వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. – మరడాన ధీరజ్ కుమార్, ఆరో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చదువుతా.. మాది శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి. నాన్న గణేష్ వ్యాపారి, అమ్మ జ్యోతి గృహిణి. జేఈఈ మెయిన్‌లో 729వ ర్యాంక్ సాధించాను. వచ్చే నెలలో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్‌లో చేరాలనేదే నా లక్ష్యం. – బోయిన సంజన, 8వ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) కంప్యూటర్ ఇంజనీర్‌నవుతా.. మాది నంద్యాల. ఇంటర్ ఎంపీసీలో 956 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంకు సాధించి మంచి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. కంప్యూటర్ ఇంజనీర్‌ను కావడమే లక్ష్యం. – ప్రిన్స్ బ్రన్హంరెడ్డి, తొమ్మిదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) అడ్వాన్స్‌లోనూ ర్యాంక్ సాధిస్తా.. మాది విజయనగరం జిల్లా గుర్ల. నాన్న అప్పలనాయుడు రైల్వే కానిస్టేబుల్, అమ్మ ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల జేఈఈ మెయిన్‌లో 99 శాతం పర్సంటైల్ సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో చేరతా. – మీసాల ప్రణతి శ్రీజ, పదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) -
టీచర్లుగా బీటెక్‌బాబులు వద్దా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీటెక్ చదివి టీచర్లు అవుదామనుకున్న వారి కలలు నెరవేరేలా లేవు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన పలువురు అభ్యర్థులు తాజాగా గురుకులాల్లో టీచర్ల కోసం దరఖాస్తు చేసుకుందామని ప్రయత్నించి విఫలమవుతున్నారు. కారణం.. ఓటీఆర్‌లో విద్యార్హతల వద్ద బీఎస్సీ, బీఏ, బీకామ్ వంటి డిగ్రీలు ఉంచిన వెబ్సైట్లో.. బీటెక్ అన్న కాలమ్ అసలు పొందుపరచనే లేదు. తాము ఎంతో కష్టపడి రెండేళ్ల బీఈడీ కోర్సు పూర్తి చేశామని, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్ష కూడా పాసయ్యామని, తీరా ఇపుడు తమకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించకపోవడం అన్యాయమంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019లో తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో టీచర్ పోస్టులకు తమను అనుమతించడం లేదంటూ కొందరు బీటెక్‌తోపాటు, బీఈడీ చేసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అపుడు కూడా ఇదే తరహాలో దరఖాస్తులో తమకు బీటెక్ కాలమ్ కనిపించ లేదని చెప్పారు. దీనికి ప్రభుత్వం సమాధానమిస్తూ.. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) 2010 మార్గదర్శకాల ప్రకారమే తాము నోటిఫికేషన్ జారీ చేశామని తేల్చిచెప్పింది. దీనిపై స్పందించిన హైకోర్టు ఎన్సీటీఈ–2014 మార్గదర్శకాల ప్రకారం.. బీటెక్‌తోపాటు బీఈడీ చేసినవారంతా టీజీటీ పోస్టులకు అర్హులేనని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖాధిపతులను ఆదేశించింది. మళ్లీ ఇప్పుడూ అదే సమస్య గతంలో ఇదే వ్యవహారంపై హైకోర్టు వరకూ వెళ్లిన నేపథ్యంలో ఈసారి టీచర్ పోస్టులకు సంబంధించి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనుకున్నారు. కానీ, తీరా దరఖాస్తు ఫారం ఓపెన్ చేసే సరికి తిరిగి అదే సమస్య పునరావృతమవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయమై పలువురు బీటెక్–బీఈడీ అభ్యర్థులు తొలుత గురుకుల కార్యాలయాలకు వరుసగా ఫోన్లు చేసినా.. ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. కొందరు అధికారులు అయితే.. బీటెక్ బీఈడీ వారికి అసలు అర్హతే లేదని, మీరు దరఖాస్తు చేసుకోవద్దని చెబుతున్నారని వారు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
బీటెక్ అమ్మాయి.. బుల్లెట్‌పై హైజీనిక్ పానీపూరి
ఈ మధ్య చదువులకు, చేసే పనికి సంబంధం ఉండటం లేదు. డిగ్రీలున్నా ఉద్యోగ అవకాశాలు లేక కొందరు చిరు వ్యాపారాలతో స్వయం ఉపాధి చూసుకుంటుంటే మరికొందరు మాత్రం డిగ్రీ చేసినా ప్రత్యేకమైన లక్ష్యంతో చిరువ్యాపారాల బాట పడుతున్నారు. 21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్.. బీటెక్ పానీపూరి వాలీగా ప్రసిద్ధి చెందారు. బుల్లెట్ బండికి ఏర్పాటు చేసుకున్న చిన్న బండిపై ఆమె పానీపూరీలను విక్రయిస్తున్నారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఆమె ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతోనే తాను ఈ వ్యాపారాన్ని ప్రారంభినట్లు తాప్సీ చెబుతున్నారు. (జీవితాంతం ఒంటరిగానే ఉంటా కానీ! హోలీ యాడ్‌పై దుమారం: అసలేమైంది?) ఇదీ చదవండి: టాప్ సీక్రెట్ చెప్పిన గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్... ఇది ఉంటే జాబ్ పక్కా! View this post on Instagram A post shared by Are you hungry (@are_you_hungry007) తాజాగా ఆమె బుల్లెట్ వాహనానికి పానీపూరి బండిని కట్టుకుని తీసుకెళ్తున్న వీడియోను ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. అంత చదువు చదువుకుని ఇలా పానీపూరీ అమ్ముకుంటున్నావేంటి అని చాలా మంది ప్రశ్నించారని, కొందరైతే భద్రంగా ఉండాలంటే ఇంటికి తిరిగి వెళ్లాలని సలహా ఇచ్చారని తాప్సీ చెప్పారు. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి దాదాపు మూడు లక్షల లైక్‌లు వచ్చాయి. ఆ యువతి స్ఫూర్తిని అభినందిస్తూ పలువురు కామెంట్లు పెట్టారు. -
బీటెక్‌లోకి అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లపాటు కరోనా కారణంగా పీయూసీలో తక్కువ జీపీఏ వచ్చినందున.. మానవతా దృక్పథంతో బీటెక్‌లోకి అనుమతించాలని బాసర ట్రిపుల్ ఐటీలో చదివిన పలువురు విద్యార్థులు విద్యా మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రిని కలిసి వేడుకున్నారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చా మని తమ పరిస్థితిని వివరించారు. టెన్త్‌లో అత్య« దిక మార్కులు వస్తేనే బాసర ట్రిపుల్ ఐటీలో సీటు వస్తుందని ప్రభుత్వానికీ తెలుసునని వారు స్పష్టం చేశారు. పీయూసీలో గ్రేడ్ తక్కువ రావడానికి రెండేళ్లుగా ఉన్న పరిస్థి తులే కారణమని గుర్తించకపోవడం సరికాదని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించారని, తమ కుటుంబాల్లో సెల్‌ఫోన్ కూడా కొనలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి స్మార్ట్ ఫోన్లు కొనిచ్చినా నెట్ బ్యాలెన్స్‌కు ఖర్చు పెట్టలేకపోయామని వారు తెలిపారు. నెట్వర్క్ సరిగ్గా పనిచేయని పల్లెల్లో ఉండటం వల్ల ఆన్లైన్ క్లాసులు సరిగా వినలేకపోయామనినిజామాబాద్‌కు చెందిన విద్యార్థిని ఎం.అంజలి వాపోయింది. విద్యార్థుల ఆవేదనపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫె సర్ ఆర్.లింబాద్రి స్పందిస్తూ వెంటనే విషయాన్ని బాసర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యా ర్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ఈ విషయమై బాసర ట్రిపుల్ ఐటీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకట రమణ స్పంది స్తూ, 6 జీపీఏ లేకుండా ఇంజనీరింగ్‌లోకి అనుమ తించకూడదనే నిబంధన ఉందని స్పష్టం చేశా రు. అయినప్పటికీ ఈ విషయాన్ని బోర్డ్ సమా వేశంలో చర్చిస్తామని, సానుకూల నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. -
ఎన్నో ఉద్యోగాలు వదులుకున్నాడు.. చివరికి అరకోటి ప్యాకేజీతో షాకిచ్చాడు!
ప్రస్తుత రోజుల్లో నాలుగంకెల ఉద్యోగం వస్తే చాలు ఈ పోటీ ప్రపంచంలో అలాంటి జాబ్ దొరకడం కూడా కష్టం అని కొందరు అనుకుంటారు. జీతం ఎంతైనా ఐ డోంట్ కేర్ మనల్ని కంపెనీలు సెలక్ట్ చేసుకోవడం కాదు మనమే కంపెనీలని ఎంచుకోవాలని కొందరు అనుకుంటారు .ఇలానే అనుకున్నాడు ఓ బీటెక్ విద్యార్థి. కాగ్నిజెంట్, అమెజాన్ లాంటి ప్రముఖ కంపెనీల్లో వచ్చిన ఉద్యోగాలను సైతం పక్కన పెట్టాడు. కొడితే కుంభస్థలాన్ని కొట్దాలిరా అనుకున్నాడో ఏమో మైక్రోసాఫ్ట్ లో 50 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ కొట్టి అందరి చేత ఆహా అనిపించాడు. అతడే మధుర్ రఖేజా. దుకాణదారుడి కొడుకు నుంచి మైక్రోసాఫ్ట్ ఉద్యోగిగా ఎదిగాడు ఓ దుకాణదారుడి కొడుకు తన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలల కన్నాడు. వాటి కోసం అంతే శ్రమించాడు. పట్టు వదలక క్యాంపస్ ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ లాంటి ప్రఖ్యాత కంపెనీలో రూ.50 లక్షల జాబ్ కొట్టి అనుకున్నది సాధించడమే గాక తన తల్లిదండ్రులను గర్వించేలా చేశాడు మధుర్ రఖేజా. అతను యూపీఈఎస్ (UPES) స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫర్మేటిక్స్లో స్పెషలైజేషన్‌తో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో (బీటెక్) పూర్తి చేశాడు. యూనివర్శిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (UPES) డెహ్రాడూన్‌లోని ఓ మల్టీడిసిప్లినరీ విశ్వవిద్యాలయం. టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టం తన పయనం గురించి మధుర్ మాట్లాడుతూ.. టెక్నాలజీ అంటే నాకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే ప్రజల జీవితాలను మార్చగల సామర్థ్యం దానికి ఉంది. అంతటి ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉంది కనుకే అలాంటి ప్రత్యేకమైన కోర్సును ఎంచుకున్నాను. అప్ స్ట్రీమ్ పెట్రోలియానికి సంబంధించి నాకు ఒకతను చెప్పాడు. కంప్యూటర్ సైన్స్‌లో ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫర్మేటిక్స్లో స్పెషలైజేషన్ ఉందని నాకు అప్పుడే తెలిసింది. అందుకే.. దాన్ని ఎంచుకున్నానని చెప్పాడు. వచ్చింది కాదు నచ్చింది చేయాలి మొదట తాను కొన్ని కంపెనీల జాబితాను తయారు చేసుకున్నాడు. అందులో మైక్రోసాఫ్ట్ కూడా ఉంది. మొదటగా ఇతరుల ఇంటర్వ్యూ అనుభవాలను చదవడంతో పాటు ఇంటర్య్వూకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఎంపిక ప్రక్రియకు సిద్ధమైనట్లు వివరించాడు. మైక్రోసాఫ్ట్‌తో పాటు, అమెజాన్, ఆప్టమ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌తో పాటు మరిన్ని వాటికి దరఖాస్తు చేసుకుని తాను తలపెట్టిన మహాయజం చివరికి మైక్రోసాఫ్ట్ ద్గగర ఆగిందని చెప్పుకొచ్చాడు. మధుర్ అనేక కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నారు. -
Woman combat pilot: ఫస్ట్ టైమ్ అభిలాష నెరవేరింది
చిన్నప్పుడు అభిలాషకు తండ్రి కథలు చెప్పేవాడు. అవి కాలక్షేప కథలు, కంచికి వెళ్లే కథలు కావు. మన వీరసైనికుల నిజమైన జీవిత కథలు. ఆ కథలు వింటూ పెరిగిన అభిలాష భారత సైన్యంలో పనిచేయాలని గట్టిగా అనుకుంది. తాజాగా ‘ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమన్ కంబాట్ ఏవియేటర్’గా చారిత్రక గుర్తింపు పొందింది కెప్టెన్ అభిలాష బరాక్. అభిలాష బరాక్కు మిలిటరీ అనే మాట కొత్త కాదు. నాన్న ఓమ్‌సింగ్ సైనిక అధికారి. దీంతో దేశంలోని రకరకాల కంటోన్మెంట్లలో పెరిగింది అభిలాష. సైనికుల వీరగాథలను తండ్రి స్ఫూర్తిదాయకంగా చెబుతుండేవాడు. ఆ ప్రభావం తన మీద పడింది. అలా మిలిటరీలో పనిచేయాలనే కలకు అంకురార్పణ జరిగింది. ఒకరోజు ఇండియన్ మిలిటరీ అకాడమీలో తన సోదరుడి పాసింగ్ ఔట్ పరేడ్‌కు హాజరైంది అభిలాష. ఆ వాతావరణం తనను ఎంత ఉత్తేజపరిచింది అంటే...పనిచేస్తే మిలిటరీలోనే పనిచేయాలన్నంతగా. ‘మిలిటరీ యూనిఫామ్’లో తనను తాను చూసుకొని మురిసిపోవాలనుకునేంతగా! ‘నా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసుకున్న రోజు అది’ అని గతాన్ని గుర్తు చేసుకుంది అభిలాష. దిల్లీ టెక్నాలజికల్ యూనివర్శిటీలో బీటెక్ పూర్తిచేసిన అభిలాష 2018లో ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాప్స్’లో చేరింది. దీనికి ముందు కొన్ని ప్రొఫెషనల్ మిలిటరీ కోర్స్‌లు పూర్తిచేసింది. ‘ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు ఇది. కంబాట్ ఏవియేషన్ కోర్స్ విజయవంతంగా పూర్తి చేసిన కెప్టెన్ అభిలాష ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమన్ కంబాట్ ఏవియేటర్...’ అని ఆర్మీ తన అధికార ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలియజేసింది. ప్రత్యేక విధులు నిర్వర్తించే దళంగా ప్రసిద్ధమైన ఏవియేషన్ కాప్స్‌కు ఉన్న ఘనచరిత్ర తక్కువేమీ కాదు. రుద్ర, చీతా, ధృవ...మొదలైన హెలికాప్టర్లను ఆపరేట్ చేయడంతో పాటు సియాచిన్‌లాంటి సున్నిత ప్రాంతాలలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంది. ‘రెట్టించిన అంకితభావంతో పనిచేయడానికి తాజా బాధ్యత ప్రేరణ ఇస్తుంది’ అంటుంది హరియాణాకు చెందిన 26 సంవత్సరాల అభిలాష ‘స్విఫ్ట్ అండ్ ష్యూర్’ అనేది మన సైన్యానికి సంబంధించిన లక్ష్య ప్రకటిత నినాదం. ఈ నినాదాన్ని వేగంగా అందుకున్న యువ సైనికులలో అభిలాష ఒకరు. ఆమెకు అభినందనలు. -
ఎంటెక్ చేశావా.. టీచింగ్ చేస్తావా?
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక విద్యలో మాస్టర్ డిగ్రీ (ఎంటెక్) పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ సహా దాని అనుబంధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ఉజ్వల భవిష్యత్ ఉండబోతోంది. రాష్ట్రంలో కొత్త వర్సిటీలు, సాంకేతిక కోర్సుల్లో సీట్లు పెరుగుతుండటం.. మరోవైపు కొన్నేళ్లుగా ఎంటెక్‌లో ప్రవేశాలు తగ్గుతుండటంతో ఇప్పటికే ఎంటెక్ చేసిన వారికి బోధన రంగంలో మున్ముందు డిమాండ్ పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంలో మరో రెండేళ్లలో వేతనాలు రెట్టింపయ్యే అవకాశముందని అంటున్నారు. కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న కొరత రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ సీట్లు గత మూడేళ్లుగా పెరుగుతున్నాయి. అదనపు సెక్షన్లు వస్తున్నాయి. దీనికి తోడు కొత్తగా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. ఇవి కూడా ఎక్కువగా మార్కెట్లో డిమాండ్ ఉండే కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఇవన్నీ ఎంటెక్ అభ్యర్థులకు కలిసి వస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరిగినా అధ్యాపకుల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ వర్సిటీల్లోనే దాదాపు 3 వేలకుపైగా ఖాళీలున్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. చాలా కాలేజీలు ఇతర రాష్ట్రాల నుంచి ఫ్యాకల్టీని ఆహ్వానిస్తున్నా వేతనాలు ఎక్కువగా ఇవ్వాల్సి వస్తోందని భావిస్తున్నాయి. స్థానికంగా ఎంటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు రూ. 50 వేల లోపే వేతనాలు ఇవ్వడానికి ప్రైవేటు కాలేజీలు సిద్ధపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల వాళ్లు రూ. లక్షకు పైగా డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లలో భారీగా అవసరం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీసీ) మార్గదర్శకాల ప్రకారం బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఇతర కంప్యూటర్ కోర్సులు బోధించేందుకు ప్రతి 20 మంది విద్యార్థులకు ఓ అధ్యాపకుడు ఉండాలి. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కిందే దాదాపు 80 వేలకు పైగా బీటెక్ సీట్లున్నాయి. ఇందులో 75 శాతం కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి కోర్సులున్నాయి. మిగతా కోర్సుల్లో (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) సీట్లు చాలా వరకు మిగులుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ కోర్సులకు బోధించడానికి 3 వేల మంది సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్లు అవసరం. ప్రస్తుతం 2 వేల మందే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో 60 మందితో సెక్షన్లు నిర్వహిస్తున్నారు. 2024–25 నాటికి పెరిగే సీట్లను బట్టి కనీసం 10 వేల మంది కంప్యూటర్ సైన్స్, కొత్త కోర్సులు బోధించే వాళ్లు కావాలి. కొత్త వర్సిటీలు వస్తే ఈ సంఖ్య మరింత పెరగనుంది. కొరత ఎందుకు? సాధారణంగా విద్యార్థులు బీటెక్ కంప్యూటర్ సైన్స్, కొత్త కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఉపాధి వైపే వెళ్తున్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లో కొంతమంది ఎంపికవుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్రారంభంలోనే రూ. 40 వేల నెలసరి వేతనం పొందే వీలుంది. దీంతో ఎంటెక్ చేయాలని విద్యార్థులు ఆలోచించట్లేదు. మరికొంత మంది విదేశాల్లో ఎంఎస్ కోసం వెళ్తున్నారు. ఫలితంగా ఏటా ఎంసెట్‌లో సీట్లు భారీగా మిగులుతున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో ఫ్యాకల్టీ ఎలా ఉందో.. గుర్తింపునిచ్చే వర్సిటీలూ పట్టించుకోవట్లేదు. నాణ్యమైన అధ్యాపకులు లేరని గుర్తించినా విధిలేక అఫిలియేషన్ ఇస్తున్నారు. దీంతో ప్రైవేటు కాలేజీలు అధ్యాపకులకు వేతనాలు అరకొరగా ఇస్తున్నాయనే ఆరోపణలున్నాయి. సాఫ్ట్‌వేర్‌తో సమానంగా వేతనం ఉంటే తప్ప బోధన వైపు మళ్లే అవకాశం కనిపించట్లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు కొరతను ఎలా అడ్డుకుంటారనేది ప్రశ్నార్థకమే. జీతాలు పెంచితే కొంత మార్పు రావొచ్చు ఓవైపు కంప్యూటర్ కోర్సులు పెరుగుతున్నాయి. మరోవైపు సంబంధిత విభాగాల్లో ఎంటెక్ చేసేవారి సంఖ్య తక్కువగా ఉంది. ఈ తేడాను పూడ్చాలి. బీటెక్‌తోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి. ఎంఎస్‌కు విదేశాలకు వెళ్తున్నారు. బోధించేందుకు వారు ఎందుకు ఇష్టపడట్లేదో తెలుసుకోవాలి. ఆకర్షణీయమైన వేతనాలు ఇస్తే కొంత మార్పు రావొచ్చు. – ప్రొఫెసర్ వి వెంకటరమణ (ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్) -
ఐదు జవాబులు రాస్తే సరి..
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ సాంకేతిక విద్య కోర్సుల్లోని విద్యార్థులకు యూనివర్సిటీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కనీస హాజరుశాతం నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే సులభతరమైన పరీక్షావిధానాన్ని ప్రకటించింది. గతానికి భిన్నంగా ఈ సారి కేవలం 8 ప్రశ్నలనే పరీక్షల్లో ఇస్తారు. ఇందులో ఐదింటికి సమాధానం రాస్తే సరిపోతుంది. బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మాడీ, ఫార్మాడీ (పీబీ) కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుందని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ డాక్టర్ మంజూర్ హుస్సేన్ బుధవారం ‘సాక్షి’ప్రతినిధికి తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల (నాలుగేళ్లకు కలిపి)మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. మిగతా యూనివర్సిటీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించనున్నట్టు ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. గతానికి ఇప్పటికీ తేడా ♦సాధారణంగా కాలేజీ పనిదినాల్లో 75 శాతం హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తారు. ఇందులో 10 శాతం మెడికల్ గ్రౌండ్లో మినహాయింపు ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ప్రత్యక్ష బోధన ఆలస్యమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ♦కరోనాకు ముందు ప్రశ్నపత్రం రెండు భాగాలుగా (పార్ట్–ఏ, పార్ట్–బీ) ఉండేది. పార్ట్–ఏ నుంచి మూడు మార్కుల ప్రశ్నలు ఐదు, రెండు మార్కులవి 5.. మొత్తం 25 మార్కులుంటాయి. పార్ట్–బీలో ఐదు మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. దీంతో రెండు పార్టుల్లో మొత్తం 75 మార్కులు, ఇంటర్నల్స్ 25 మార్కులకు పరీక్ష విధానం ఉండేది. ♦ఇప్పుడు ఒకే పార్ట్‌గా పరీక్ష ఉంటుంది. మొత్తం 8 ప్రశ్నలిస్తారు. ఇందులో ఐదింటికి జవాబులు రాస్తే సరిపోతుంది. ఒక్కో ప్రశ్నకు 15 మార్కులు.. మొత్తం 75 మార్కులుంటాయి. ఇంటర్నల్స్‌కు 25 మార్కులు ఉంటాయి. కనీస పాస్ మార్క్ 40 (ఇంటర్నల్స్‌తో కలిపి)గా నిర్ణయించారు. -
బిటెక్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త ! శామ్సంగ్ భారీ నియామకాలు
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శామ్సంగ్ వచ్చే ఏడాది భారత్‌లో 1,000 మందికిపైగా ఇంజనీర్లను చేర్చుకోనుంది. ఐఐటీలతోపాటు బిట్స్ పిలానీ, ఎన్ఐటీల వంటి ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటున్న అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నట్టు ప్రకటించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఐవోటీ, డీప్ లెర్నింగ్, నెట్వర్క్స్, ఇమేజ్ ప్రాసెసింగ్, క్లౌడ్, డేటా అనాలసిస్, ఆన్–డివైస్ ఏఐ, కెమెరా టెక్నాలజీ వంటి విభాగాల కోసం వీరిని నియమించుకోనున్నట్టు తెలిపింది. చదవండి: గూగుల్, యాపిల్‌ను తలదన్నేలా శామ్సంగ్ ప్లాన్ -
OU: 2016కు ముందు పీహెచ్డీ అడ్మిషన్లు రద్దు!
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): వచ్చే నెల చివరి నాటికి పీహెచ్డీ పరిశోధనలు పూర్తి చేయకుంటే 2016 కంటే ముందు ప్రవేశం పొందిన విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేయనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం పీహెచ్డీ నాలుగేళ్లలో పూర్తి చేయాలని, అలా పూర్తి చేయని విద్యార్థులకు రెండేళ్ల గడువు పొడిగిస్తామని అధికారులు తెలిపారు. మొత్తం ఆరేళ్లు దాటిన పీహెచ్డీ విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేస్తామని, ఇంత వరకు పూర్తి చేయని అభ్యర్థులు వెంటనే థీసిస్‌ను సమర్పించాలని అన్నారు. బయోమెట్రిక్ లేకుంటే జరిమానా సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ గుర్తింపు ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని యూనివర్సిటీ అధికారులు మరో సారి గుర్తుచేశారు. ఈ నిబంధన అనుసరించని కాలేజీకి రూ.20 వేలు జరిమానా విధిస్తామని, అవసరమైతే కాలేజీ గుర్తింపు కూడా రద్దు చేస్తామని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. హాజరు మొత్తం యూనివర్సిటీకి అనుసంధానమయ్యేలా ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 1 నుంచి బయోమెట్రిక్ హాజరును జేఎన్టీయూ హెచ్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. బీటెక్ మేనేజ్మెంట్ సీట్ల గడువు 20 వరకు పెంపు సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మాకాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి గడువు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 20వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కాలేజీలను ఆదేశించింది. వాస్తవానికి యాజమాన్య కోటా సీట్ల భర్తీని గతనెల 30వ తేదీలోగా పూర్తిచేయాల్సి ఉంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తగా వస్తున్న కంప్యూటర్ సైన్స్ సీట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. -
ప్రాంతీయ భాషల్లో బీటెక్ సాధ్యమేనా?
సాక్షి, అమరావతి: నూతన విద్యావిధానంలో పేర్కొన్న మేరకు ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేయాలని అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఇది అమలు కానుందని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా శనివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీటెక్ వంటి సాంకేతిక కోర్సులను స్థానిక భాషల్లో నిర్వహించడం ఎంతవరకు సాధ్యమన్నది చర్చ సాగుతోంది. ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సుల అమలు కష్టమని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. స్థానిక భాషల్లో సాంకేతిక పదజాలం ఏది? స్థానిక భాషల్లో బీటెక్ కోర్సులు అమలు చేయాలంటే ముఖ్యంగా ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన సాంకేతిక పదజాలం ప్రాంతీయ భాషల్లో లేదు. వాటిని ఏదోలా తర్జుమా చేసినా విద్యార్థులకు పదాలు అర్థమవడం కష్టమే. ప్రస్తుతం ఇంజనీరింగ్ సహా అనేక అంశాల పరిజ్ఞానం ఆంగ్లంలోనే లభ్యమవుతోంది. ఆ భాషలో నైపుణ్యమున్న వారికే ఆ పరిజ్ఙానం ఎక్కువగా పొందగలుగుతున్నారు.ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సులను నిర్వహించడం, అభ్యసించడం కష్టమే కాకుండా అలా చదువులు పూర్తిచేసిన వారికి ఉద్యోగావకాశాలు దొరకడం గగనంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు దక్కవు ప్రస్తుతం ప్రపంచంలో ఇంగ్లిషు మాధ్యమంలో విద్యనభ్యసించిన వారికే ప్రాధాన్యం దక్కుతోంది. తెలుగు వంటి స్థానిక భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులు నిర్వహించడం చాలా కష్టం. అందరూ ఎల్కేజీ నుంచే ఆంగ్ల మాధ్యమానికి మొగ్గుచూపుతున్న తరుణంలో తెలుగు మాధ్యమంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఎవరూ ముందుకు రారు. తెలుగులో ఇంజనీరింగ్ చేసేవారికి ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకురావు. – చొప్పా గంగిరెడ్డి, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు ఆప్షన్ మాత్రమే ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సులు అమలు చేయాలన్నది జాతీయ నూతన విద్యావిధానంలో పాలసీగా పెట్టినా అది ఆప్షన్ మాత్రమే. దేశంలోని 11 ప్రాంతీయ భాషల్లో కొన్ని ఎంపికచేసిన ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన పాఠ్యాంశాలను కూడా తర్జుమా చేయించారు. కాలేజీలు తమకు నచ్చితే అమలు చేయవచ్చు. వద్దనుకుంటే ప్రస్తుతం కొనసాగుతున్న ఆంగ్ల మాధ్యమంలోనే బీటెక్ కోర్సులను కొనసాగించవచ్చు. అది వారిష్టం. – సతీష్‌చంద్ర, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉన్నతవిద్యాశాఖ -
ఎవర్ గ్రీన్.. పెట్రోలియం ఇంజనీరింగ్!
ప్రపంచ వ్యాప్తంగా ఇంధన వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా పెట్రో ఉత్పత్తులకు తరగని డిమాండ్. ముడి చమురును భూమి నుంచి వెలికితీసి.. ఇంధనంగా మార్చే క్రమంలో ఎన్నో దశలు దాటాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించే వారే.. పెట్రోలియం ఇంజనీర్లు. భూమి లోపల ఉన్న పెట్రోలియం, సహజవాయువు నిక్షేపాలను గుర్తించి.. వెలికి తీయడానికి అవసరమైన నైపుణ్యాలను అందించే కోర్సు.. పెట్రోలియం ఇంజనీరింగ్! అవకాశాల పరంగా ఎవర్గ్రీన్ బ్రాంచ్‌గా నిలుస్తున్న పెట్రోలియం ఇంజనీరింగ్‌పై ప్రత్యేక కథనం.. పెట్రోలియం ఇంజనీరింగ్‌కు సంబంధించి యూజీ(అండర్ గ్రాడ్యుయేట్), పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేట్), పీహెచ్డీ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూజీ స్థాయిలో దేశంలోని పలు విద్యా సంస్థలు బీటెక్/ఎంటెక్ ప్రోగ్రామ్స్‌ను అం దిస్తున్నాయి. నాలుగేళ్ల బీటెక్ పెట్రోలియం ఇంజనీ రింగ్‌ని విజయవంతంగా పూర్తి చేసిన తరువాత.. రెండేళ్ల ఎంటెక్ కోర్సులో చేరే అవకాశం ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత పరిశోధనల దిశగా కొనసా గాలనుకుంటే.. పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు. పెట్రోలియం కోర్సులు పెట్రోలియం ఇంజనీరింగ్‌లో బీటెక్/ఎంటెక్‌తో పా టు పలు ఇన్స్టిట్యూట్స్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్+ ఎంటెక్ కోర్సునూ అందిస్తున్నాయి. మరికొన్ని కాలే జీలు పెట్రోలియం విభాగంలో ఎంఎస్ కోర్సుల్లో నూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అంతేకాకుండా మేనేజ్మెంట్ విద్యకు సంబంధించి ఎంబీఏ –పెట్రోలియం కోర్సు కూడా అందుబాటులో ఉంది. అర్హతలు ► బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి 10+2/ ఇంటర్మీడియెట్ ఎంపీసీ(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణత ఉండాలి. దాంతోపాటు సంబం ధిత ఎంట్రెన్స్ టెస్ట్‌లు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, యూపీఈఎస్‌ఈఏటీ (యూనివర్సి టీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, డెహ్రా డూన్) ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ► పీజీ స్థాయిలో ఎంటెక్‌లో చేరేందుకు బీఈ/ బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు గేట్(గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)లో ర్యాంకు సాధించాలి. ఇన్స్టిట్యూట్స్ ఎ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్(ఐఐటీ)–ధన్‌బాద్; యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్–డెహ్రాడూన్; పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ–గాంధీనగర్; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ– విశాఖపట్నం; మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–పుణె; రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ–యూపీ; ఐఐటీ–ఖరగ్‌పూర్ (పీజీ స్థాయి); ఐఐటీ –గౌహతి(పీజీ స్థాయి); జేఎన్టీయూ–కాకినాడ తదితర ఇన్స్టిట్యూట్స్ పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులు అందిస్తున్నాయి. జాబ్ ప్రొఫైల్స్ యూజీ, పీజీ స్థాయిలో పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు.. ఫీల్డ్ ఆపరే టర్, టెస్టింగ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, రీసెర్చ్ ఇంజనీర్, రిజ ర్వాయర్ ఇంజనీర్, డ్రిల్లింగ్ ఇంజనీర్, పైప్‌లైన్ ఇంజనీర్, సైంటిస్ట్ జియాలజిస్ట్, మినరాలజిస్ట్, వెల్ స్టిమ్యులేటింగ్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. కెరీర్ స్కోప్ పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులు చేసిన ప్రతిభా వంతులకు దేశవిదేశాల్లో డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా ప్రస్తుతం దేశంలో చమురు, సహజవా యు నిక్షేపాల అన్వేషణ విస్తృతంగా కొనసాగుతోంది. దాంతో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో అవకాశాలకు కొదవలేదు. ముఖ్యంగా హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్ జీసీ), ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్), గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రిలయన్స్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, అస్సాం పెట్రోలియం లిమిటెడ్ తదితర కంపెనీల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. వేతనాలు చమురు రంగం అభివృద్ధి పథంలోనే ఉంటుంది. కాబట్టి పెట్రోలియం ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి.. చక్కటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరు ఆకర్షణీయ వేతనాలు సైతం అందుకోవచ్చు. పెట్రో లియం ఇంజనీరింగ్ కోర్సు పూర్తికాగానే వార్షిక ప్రారంభ వేతనం రూ.5 లక్షల నుండి రూ.8 లక్షల వరకు దక్కుతోంది. గేట్ ర్యాంకు ద్వారా ఓఎన్జీసీ లాంటి కంపెనీల్లో అవకాశం అందుకుంటే.. రూ.పది లక్షలకు పైగానే వార్షిక వేతనం అందుతుంది. అనుభవం ఉన్నవారికి గల్ఫ్ దేశాలలో భారీ వేతనాలు లభిస్తున్నాయి. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ విభాగాల్లో పని చేసేవారికి వేతనాలతోపాటు ఇతర అలవెన్సులు సైతం ఇస్తున్నారు. క్యాంపస్‌లోనే ఆఫర్స్ పెట్రోలియం రంగంలో అవకాశాలు ఏటే టా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పెట్రోలియం ఇంజనీరింగ్ ప్రత్యేక విభాగంగా అభివృద్ధి చెందింది. ఈ కోర్సు పూర్తిచేసినవారు క్యాంపస్ లోనే భారీ వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. కాకినాడ, జేఎన్టీయూలో 2010లో ఈ విభాగం ప్రారంభించాక.. ఆరు బ్యాచ్‌ల విద్యార్థులు బయటకు వెళ్లారు. అందరూ కెరీర్లో బాగా సెటిల్ అయ్యారు. ఓఎన్జీసీ, రియలన్స్ గ్యాస్ ఇండస్ట్రీస్ దగ్గరలో ఉండటం వల్ల అక్కడి నిపుణులతో మా విద్యార్థులకు లైవ్ ప్రాజెక్టుల్లో శిక్షణ ఇస్తున్నాం. పెట్రోలియం కోర్సులు చేసిన వారికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. – ప్రొఫెసర్ బి.బాలకృష్ణ, జేఎన్టీయూ–కే ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ -
బీటెక్ ఫస్టియర్.. ఇలా చేస్తే నో ఫియర్!
బీటెక్ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టాం.. నాలుగేళ్ల తర్వాత మంచి మార్కులతో పట్టా పొందితే చాలు.. కొలువు ఖాయమనే అభిప్రాయంతో చాలామంది విద్యార్థులు ఉంటారు. వాస్తవానికి కోర్సు పూర్తయ్యాక కోరుకున్న ఉద్యోగం దక్కాలంటే.. మార్కులతోపాటు మరెన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా లేటెస్ట్ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి. ఇండస్ట్రీ 4.0 స్కిల్స్ సొంతం చేసుకోవాలి. ఎందుకంటే.. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఈ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకే ఆఫర్లు ఇచ్చేందుకు సంస్థలు ముందుకొస్తున్నాయి! ఈ నేపథ్యంలో.. బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు.. తమ నాలుగేళ్ల స్టడీని ఎలా ప్లాన్ చేసుకోవాలి.. నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు తదితర అంశాలపై విశ్లేషణ.. బీటెక్‌లో అకడమిక్‌గా మంచి మార్కులతోనే కొలువుల కల సాకారమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు తమ బ్రాంచ్‌కు అనుగుణంగా నూతన టెక్నాలజీలపై పట్టు సాధించాలి. ఇందుకోసం బీటెక్ మొదటి సంవత్సరం నుంచే కృషి చేయాలన్నది నిపుణుల సలహా. డిజిటల్ యుగం ప్రస్తుతం అంతటా డిజిటల్ టెక్నాలజీ రాజ్యమేలుతోంది. అన్ని రంగాల్లోని సంస్థలూ ఆధునిక సాంకేతికతల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నైపుణ్యాలున్న వారికే నియామకాల్లో పెద్దపీట వేస్తున్నాయి. కాబట్టి బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు.. సదరు తాజా నైపుణ్యాలు, టెక్నాలజీలపై పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలి. బీటెక్ మూడో సంవత్సరంలోకి వచ్చాక నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తే సఫలం కాలేరు. ఎందుకంటే.. ఆ సమయంలో ఓవైపు తృతీయ, చివరి సంవత్సరాల అకడమిక్ ఒత్తిడి.. మరోవైపు ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్ట్ వర్క్, ప్లేస్‌మెంట్స్ వంటివి ఉంటాయి. బ్రాంచ్ ఏదైనా బీటెక్‌లో ఏ బ్రాంచ్ విద్యార్థులైనా సరే.. తమ విభాగానికి సరితూగే ఇండస్ట్రీ పరిణామాలను నిత్యం తెలుసుకోవాలి. డిజిటల్ నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. కోర్ బ్రాంచ్‌లు మొదలు సాఫ్ట్వేర్ కొలువులకు మార్గం వేసే సీఎస్ఈ, ఐటీ విద్యార్థుల వరకూ.. ప్రతి ఒక్కరూ ఆ దిశగా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇండస్ట్రీ 4.0 స్కిల్స్ ► ప్రస్తుతం బీటెక్ విద్యార్థులు ఇండస్ట్రీ 4.0 స్కిల్స్గా పేర్కొంటున్న నైపుణ్యాలను నేర్చుకోవడం తప్పనిసరిగా మారింది. కారణం.. కంపెనీలు ఈ స్కిల్స్ ఉన్న వారికే ఆఫర్లు ఖరారు చేస్తుండటమే! మొత్తం విద్యార్థుల్లో ఇండస్రీ ్ట4.0 స్కిల్స్ ఉన్న వారి సంఖ్య 20 నుంచి 25 శాతం మధ్యలోనే ఉంటోంది. దీంతో అవకాశాలున్నా.. నైపుణ్యాలు లేక ఎంతోమంది నిరాశకు గురవుతున్నారు. కాబట్టి బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు.. భవిష్యత్ అవకాశాలు అందుకోవాలంటే.. ఇప్పటి నుంచి ఆయా నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టిపెట్టాలి. (ఎన్డీఏ, ఎన్ఏ 2021: ఇంటర్‌తోనే.. కొలువు + చదువు) ► ఇండస్ట్రీ 4.0 స్కిల్స్గా పేర్కొంటున్న.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, 3డి డిజైన్, ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ, వీఆర్/ఏఆర్ టెక్నాలజీలు..ఉద్యోగ సాధనలో కీలకంగా మారుతున్నాయి. బీటెక్ విద్యార్థులు తొలి రోజు నుంచే వీటిని నేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఇంజనీరింగ్‌లో చేరిన లక్ష్యానికి అనుగుణంగా కెరీర్‌ను ఉజ్వలంగా మలచుకునే అవకాశం లభిస్తుంది. కళాశాలల్లో మౌలిక సదుపాయాల కొరత కారణంగా చాలామంది విద్యార్థులు లేటెస్ట్ స్కిల్స్ నేర్చుకోలేకపోతున్నారు. అలాంటి విద్యార్థులు ఆన్లైన్ మార్గాల్లో సొంతంగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కోడింగ్.. ప్రోగ్రామింగ్ ప్రస్తుతం ఉద్యోగ సాధనంలో కీలకంగా నిలుస్తున్న నైపుణ్యాలు.. కోడింగ్, ప్రోగ్రామింగ్. వాస్తవానికి ఇంజనీరింగ్ కోర్సు స్వరూపంలోనే వీటికి అకడమిక్‌గా ప్రాధాన్యం ఉంది. కాని ప్రాక్టికల్ అప్రోచ్ తక్కువగా ఉండటంతో ఈ నైపుణ్యాలు ఆశించినంతగా లభించట్లేదు. ము ఖ్యంగా సీఎస్ఈ/ఐటీ బ్రాంచ్‌ల విద్యార్థులు కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను ప్రాక్టికల్ అప్రోచ్‌తో నేర్చుకునేందుకు సిద్ధమవ్వాలి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, పైథాన్, ఆర్, జావా, సీ, సీ++, పీహెచ్‌పీ, ఎస్‌క్యూఎల్ డేటాబేస్ వంటివి నేర్చుకోవడంపై దృష్టిపెట్టాలి. మూక్స్, ఆన్లైన్ వేదికలు, షార్ట్‌టర్మ్ కోర్సులు, యూట్యూబ్ వీడియోల ద్వారా అవగాహన పెంచుకోవచ్చు. ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, రెడ్ హ్యా ట్, ఐబీఎం, జెట్ కింగ్ వంటి సంస్థలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిద్వారా సంబంధిత నైపుణ్యాలు పొందొచ్చు. సర్క్యూట్ బ్రాంచ్‌ల విద్యార్థులు ► ఈసీఈ, ఈఈఈ వంటి సర్క్యూట్ బ్రాంచ్‌ల విద్యార్థులు కూడా లేటెస్ట్ డిజిటల్ స్కిల్స్ సొంతం చేసుకునే దిశగా ఇప్పటి నుంచే కృషి చేయాలి. ► ఈసీఈ విద్యార్థులు వీఎల్ఎస్ఐ, నానో టెక్నాలజీ విభాగాల్లో షార్ట్‌టర్మ్ సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా జాబ్ మార్కెట్లో ముందుండొచ్చు. వీరికి కలిసొచ్చే మరికొన్ని సర్టిఫికేషన్ కోర్సులు.. ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ; ఇండస్ట్రియల్ ఆటోమేషన్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్; రోబోటిక్స్. ► ఈఈఈ విద్యార్థులు.. ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పవర్ సిస్టమ్స్ అనాలిసిస్, సర్క్యూట్ అనాలిసిస్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ వంటివి నేర్చుకోవాలి. వీటితోపాటు ఎస్సీఏడీఏ (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్), డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. వీటిని ఇప్పుడు పలు మార్గాల్లో నేర్చుకునే అవకాశం ఉంది. రోబోటిక్ స్కిల్స్ మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులు.. రోబోటిక్ స్కిల్స్‌పై ప్రధానంగా దృష్టిపెట్టాలి. దీంతోపాటు ఈ బ్రాంచ్ విద్యార్థులు క్యాడ్, క్యామ్; ఆటోమేషన్, 2–డి, 3–డి డిజైన్ ప్రింటింగ్లపైనా అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుతం రోబో ఆధారిత కార్యకలాపాలు అన్ని సంస్థల్లోనూ సాగుతున్నాయి. అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు రోబోటిక్ స్కిల్ మేలు చేస్తుందని చెప్పొచ్చు. వీటిని సొంతంగా అభ్యసించేందుకు పలు ఆన్లైన్ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రాక్టికల్, అప్లికేషన్ అప్రోచ్ మొదటి సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకు ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఏ అంశాన్నైనా ప్రాక్టికల్ ఓరియెంటేషన్, అప్లికేషన్ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. అందుకోసం లేబొరేటరీల్లో ఆయా సబ్జెక్ట్ అంశాలకు సంబంధించి ప్రాక్టికల్స్ చేసేందుకు ఎక్కువ సమయం కేటాయించాలి. తద్వారా రియల్ టైం నైపుణ్యాలు సొంతమవుతాయి. ఇంటర్న్షిప్స్ బీటెక్ కోర్సులో చేరిన విద్యార్థులు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా రియల్ టైమ్ నైపుణ్యాలు పెంచుకునేందుకు.. కనీసం రెండు లేదా మూడు ఇంటర్న్షిప్స్ చేయాలి. ఈ మేరకు ఏఐసీటీఈ కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. కాబట్టి విద్యార్థులు ఆయా విభాగాల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు పొందేందుకు గల మార్గాలను అన్వేషించాలి. ఇందుకోసం క్యాంపస్‌లోని ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్, ఆయా సంస్థల్లో పని చేస్తున్న సీనియర్ల సహకారం తీసుకోవాలి. ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా తాజా పరిస్థితులపై అవగాహన వస్తుంది. ప్రాక్టికల్ నైపుణ్యాలు మెరుగుపరచుకోవచ్చు. ఇంటర్న్‌గా చూపిన ప్రతిభ ఆధారంగా సదరు సంస్థల్లోనే పూర్తిస్థాయి ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. సాఫ్ట్ స్కిల్స్ బీటెక్ విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా ప్రాధాన్యమివ్వాలి. ప్రస్తుతం సంస్థల్లో టీం వర్క్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిచేసే క్రమంలో బృందంలోని సహోద్యోగులతోపాటు వివిధ విభాగాల సీనియర్లతో మాట్లాడాల్సి ఉంటుంది. ఆ క్రమంలో సాఫ్ట్ స్కిల్స్ ఎంతో ఉపయోగపడతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, బిహేవియరల్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ వంటివి ప్రధాన సాఫ్ట్‌స్కిల్స్‌గా చెప్పొచ్చు. ఆన్లైన్ సదుపాయాలు విద్యార్థులు ఇండస్ట్రీ 4.0 స్కిల్స్,సాఫ్ట్‌స్కిల్స్ పెంచుకునేందకు ఆన్లైన్ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవచ్చు. మూక్స్, ఎన్పీటీఈఎల్,స్వయం వంటి పోర్టల్స్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రొఫెసర్ల లెక్చర్స్ వినే అవకాశం లభిస్తుంది. ఇలా..ఒకవైపు అకడమిక్ నాలెడ్జ్, మరోవైపు ఇండస్ట్రీకి అవసరమైన లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా.. మొదటి ఏడాది నుంచే ముందుకుసాగితే.. బీటెక్ విద్యార్థులు తమ కలల కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. బీటెక్ మొదటి సంవత్సరం.. ముఖ్యాంశాలు ► బ్రాంచ్ ఏదైనా ఉద్యోగ సాధనలో కీలకం ఇండస్ట్రీ 4.0 స్కిల్స్. ► ప్రాక్టికల్ అప్రోచ్,అప్లికేషన్ ఓరియెంటేషన్ ఉంటేనే జాబ్ ఆఫర్స్. ► డిజిటల్ స్కిల్స్‌తోపాటు సాఫ్ట్ స్కిల్స్‌కూ ప్రాధాన్యమిస్తున్న సంస్థలు. లేటెస్ట్ స్కిల్స్ ఉంటేనే ఇప్పుడు ఏ బ్రాంచ్ విద్యార్థులైనా.. లేటెస్ట్ స్కిల్స్ ఉంటేనే ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా మెరుగ్గా రాణించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే తమ బ్రాంచ్‌కు సరితూగే టెక్నాలజీస్‌పై అవగాహన పొందేందుకు కృషి చేయాలి. అకడమిక్స్‌లో లెర్నింగ్‌తోపాటు ప్రాక్టికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. – ప్రొఫెసర్ ఎన్.వి.రమణరావు, డైరెక్టర్, నిట్–వరంగల్. -
TS EDCET 2021: నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ కోర్సులు చదివిన వారు మాత్రమే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్) చేరే అవకాశం ఉండగా ఇకపై ఇతర సబ్జెక్టులు చదివిన వారికి బీఎడ్‌లో చేరే అవకాశం వచ్చింది. ఈ మేరకు బీఎడ్ ప్రవేశాల నిబంధనలను ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో 16 జారీ చేశారు. ఇప్పటివరకు డిగ్రీలో ఓరియంటల్ లాంగ్వేజెస్ చదువుకున్న వారికి బీఎడ్‌లో చేరే అవకాశం లేకపోగా ఇప్పుడు వారికి కొత్తగా అవకాశం దక్కింది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ (హోంసైన్స్), బీసీఏ, బీబీఎం, బీఏ (ఓరియంటల్ లాంగ్వేజెస్), బీబీఏ, బీటెక్ చేసిన వారు కూడా బీఎడ్ చదివే వీలు ఏర్పడింది. వారు ఆయా డిగ్రీల్లో 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఇవి చదివిన వారంతా అర్హులే.. ► బీఎడ్ ఫిజికల్ సైన్స్ చేయాలంటే.. బీఎస్సీ విద్యార్థులు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా సంబంధిత సబ్జెక్టును పార్ట్–2 గ్రూపులో చదివి ఉండాలి. బీటెక్ విద్యార్థులు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ; బీసీఏ విద్యార్థులు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ సబ్జెక్టులను ఇంటర్మీడియట్లో చదివి ఉంటే చాలు. ► బీఎడ్ బయోలాజికల్ సైన్స్‌లో చేరాలంటే బీఎస్సీ/బీఎస్సీ (హోంసైన్స్) చేసిన వారు బోటనీ, జువాలజీలో ఏదో ఒక సబ్జెక్టు డిగ్రీలో పార్ట్–2 గ్రూపులో చదివి ఉండాలి. బీసీఏ విద్యార్థులైతే ఇంటర్లో బయోలాజికల్ సైన్స్ చదివి ఉండాలి. ► బీఎడ్ సోషల్ సైన్సెస్ చేయాలంటే బీకాం/బీబీఎం/బీబీఏ/బీసీఏ అభ్యర్థులు ఇంటర్లో సోషల్ సైన్స్ చదివి ఉండాలి. ► ఓరియంటల్ లాంగ్వేజెస్‌లో బీఎడ్ చేయాలనుకునే వారు బీఏలో తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్/సంస్కృతంను ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. లిటరేచర్ అభ్యర్థులు (బీఏ–ఎల్) తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్/సంస్కృతం చదివి ఉంటే చాలు. బీఏ ఓరియెంటల్ లాంగ్వేజెస్ వారు తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్/సంస్కృతం చదివి ఉండాలి. ఎంఏ తెలుగు/ హిందీ/ మరాఠీ/ ఉర్దూ/ అరబిక్/ సంస్కృతం చేసిన వారు కూడా అర్హులే. చదవండి: 10 వేలకు పైగా ఉద్యోగాలు.. ఆశావహులకు తీపికబురు NMDC Recruitment 2021: ఎన్ఎండీసీలో 89 పోస్టులు -
Engineering Special: బీటెక్ తర్వాత.. కెరీర్ ఆప్షన్స్
ఇంటర్మీడియెట్(ఎంపీసీ) విద్యార్థుల కలల కోర్సు.. ఇంజనీరింగ్(బీటెక్/బీఈ). నేటి యువత క్రేజీ కెరీర్ ఇది. దేశవ్యాప్తంగా ఏటా లక్షల మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తయ్యాక ఏం చేయాలి?! అనే ప్రశ్న ఎదురవుతోంది. ఉద్యోగమా.. ఉన్నత విద్యా.. ఏ మార్గం ఎంచుకోవాలి.. వాస్తవానికి బీటెక్ ఉత్తీర్ణులైన విద్యార్థుల ముందు అనేక ఉన్నత విద్య, ఉద్యోగ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు భవిష్యత్ గురించి ఆందోళన చెందకుండా.. తమ కెరీర్ లక్ష్యాలకు ఏది అనుకూలమో అది ఎంచుకోవడం మేలు అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో.. బీటెక్ తర్వాత ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం.. బీటెక్ పూర్తయ్యాక ఇంజనీరింగ్ కోర్ విభాగంలోనే కొనసాగాలనుకుంటే.. ఎంటెక్‌లో చేరొచ్చు. లేదా మేనేజ్మెంట్ వైపు వెళ్లాలనుకుంటే.. ఎంబీఏలో అడుగుపెట్టొచ్చు. ఇటీవల కాలంలో ఎంబీఏను ఎంచుకునే ఇంజనీరింగ్ అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. మరికొందరు ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్‌యూ) ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంకొందరు సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమవుతున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ బీటెక్ కోర్సు పూర్తికాగానే ఉద్యోగంలో చేరాలనుకునే ఇంజనీరింగ్ విద్యార్థులకు వరం.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్. నిజానికి ప్లేస్‌మెంట్స్ డ్రైవ్స్ ద్వారా ఉద్యోగం పొందడం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు అందుబాటులో ఉన్న ఉత్తమ మార్గంగా చెప్పొచ్చు. ప్రముఖ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు.. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రతి ఏటా ప్లేస్‌మెంట్స్ డ్రైవ్స్ నిర్వహిస్తుంటాయి. ఈ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలో పాల్గొనాలనుకునే విద్యార్థులు అందుకోసం ముందుగానే కసరత్తు ప్రారంభించాలి. రిక్రూటర్లను ఆకట్టుకునేలా రెజ్యూమ్ని రూపొందించుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే బీటెక్ మొదటి ఏడాది నుంచే సబ్జెక్ట్‌ల్లో మంచి స్కోరు వచ్చేలా చూసుకోవాలి. అంతేకాకుండా కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌తోపాటు బీటెక్ ప్రాజెక్ట్ వర్క్‌పైనా పట్టు సాధించాలి. కాలేజీలో జరిగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్పంచుకోవడం మేలు చేస్తుంది. ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలో విజయం సాధించేందుకు సబ్జెక్టు నైపుణ్యాలతోపాటు, ప్రాక్టికల్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్, కంపెనీలు, మార్కెట్లు, తాజా టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి. ఉన్నత విద్య.. ఎంటెక్/ఎంబీఏ ► ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉన్నత చదువుల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. స్వదేశంలో ఎంటెక్ లేదా విదేశాల్లో ఎంఎస్ చేయాలని ప్రణాళికలు వేసుకుంటారు. దేశలోని టాప్ కాలేజీల్లో ఎంటెక్‌లో చేరేందుకు చక్కటి మార్గం.. ‘గేట్’(గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్). బీటెక్ సబ్జెక్టులపై సమగ్ర అవగాహన, బేసిక్ కాన్సెప్ట్లపై గట్టి పట్టు, ప్రశ్నల ప్రాక్టీస్ ద్వారా గేట్లో మంచి ర్యాంకు సాధించొచ్చు. ► గత కొన్నేళ్లుగా ఇంజనీరింగ్ అభ్యర్థులు మేనేజ్మెంట్ కోర్సులను ఎంచుకుంటున్నారు. బీటెక్+ఎంబీఏ.. గొప్ప కెరీర్ కాంబినేషన్‌గా గుర్తింపు పొందింది. వీరికి కార్పొరేట్ సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే చాలామంది విద్యార్థులు బీటెక్ తర్వాత ఎంబీఏలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. టాప్ బిజినెస్ స్కూల్స్ ఐఐఎం(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్)ల్లో పీజీ కోర్సుల్లో చేరాలంటే..క్యాట్(కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్)లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. క్యాట్‌తోపాటు మ్యాట్,సీమాట్, ఐసెట్, జీమ్యాట్ వంటి ఎంట్రెన్స్‌ల ద్వారా ఎంబీఏలో చేరేందుకు అవకాశం ఉంది. పీఎస్‌యూల్లో ఉద్యోగం బీటెక్ అభ్యర్థులకు మరో మంచి అవకాశం.. ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్‌యూ) ఉద్యోగం. వీరు గేట్లో టాప్ ర్యాంకు ద్వారా సదరు పీఎస్‌యూలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీహెచ్ఈఎల్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, నాల్కో, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ వంటి వాటిల్లో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగం దక్కించుకోవచ్చు. గేట్ స్కోరుతో సంబంధం లేకుండా.. డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఎన్ఎండీసీ, బార్క్, ఇస్రో వంటి ప్రముఖ సంస్థల్లో ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఉద్యోగాలు లభిస్తాయి. సివిల్స్, ఈఎస్ఈ పరిపాలన విభాగంలో చేరాలనుకునే బీటెక్ అభ్యర్థులకు చక్కటి మార్గం.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఇందుకోసం యూపీఎస్సీ ఏటా విడుదల చేసే నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. మూడంచెల సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించేందుకు సన్నద్ధమవ్వాలి. ఇది దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి. అలాగే ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం యూపీఎస్సీ విడుదల చేసే మరో ప్రతిష్టాత్మక నోటిపికేషన్..ఈఎస్ఈ(ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్). దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ ఏ స్థాయి పోస్టులు భర్తీ చేస్తారు. అలాగే యూపీఎస్సీ విడుదల చేసే మరో ఉన్నత నోటిఫికేషన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్)కు కూడా బీటెక్ అభ్యర్థులు పోటీ పడొచ్చు. దేశ సేవకు ‘డిఫెన్స్’ భారత సైన్యానికి అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక విభాగం ఉంది. దీంతో భారత సైన్యంలోని టెక్నికల్ వింగ్స్‌లో ఇంజనీర్లకు అవకాశాలు లభిస్తున్నాయి. టెక్నికల్ ఎంట్రీ లెవెల్‌తో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరొచ్చు. బీటెక్ తర్వాత యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్(యూఈఎస్), ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఏఎఫ్ క్యాట్), షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్ఈ) వంటి వాటి ద్వారా త్రివిధ దళాల్లో చేరొచ్చు. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(టీజీసీ)కు దరఖాస్తు చేసుకొని.. ఇండియన్ మిలటరీ అకాడమీలో చేరొచ్చు. రక్షణ దళాల్లో ఉద్యోగం అంటే.. అత్యంత గౌరవప్రదమైన కెరీర్స్‌లో ఒకటిగా చెప్పొచ్చు. ఇందులో చేరిన అభ్యర్థులకు మంచి వేతనం, ఉద్యోగ భద్రత, సౌకర్యాలతోపాటు దేశానికి సేవ చేస్తున్నామని సంతృప్తి సైతం లభిస్తుంది. ప్రైవేట్ రంగంలో కొలువు బీటెక్ ఉత్తీర్ణులకు ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలకు కొదవలేదు. నైపుణ్యాలుంటే.. ప్రభుత్వ రంగం కంటే ఎన్నో రెట్లు అధిక వేతనాలు కార్పొరేట్ కంపెనీల్లో లభిస్తున్నాయి. బీటెక్ గ్రాడ్యుయేట్లను ఇంజనీర్లుగానే కాకుండా.. పరిశోధకులుగా, కన్సల్టెంట్లుగా, సాఫ్ట్వేర్ డవలపర్లుగా నియమించుకుంటున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్, సివిల్/ఎలక్ట్రికల్ ఇంజనీర్, సిస్టమ్ అనలిస్ట్, ఐటీ కో ఆర్డినేటర్, అప్లికేషన్ డెవలపర్ వంటి జాబ్స్ ఐటీ రంగంలో దక్కించుకోవచ్చు. అలాగే క్వాలిటీ ఇంజనీర్, ప్రాసెస్ ఇంజనీర్, ఇండస్ట్రియల్ మేనేజర్, ప్లాంట్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ టెక్నీషియన్ వంటి కొలువులు సైతం తయారీ రంగంలో సొంతం చేసుకోవచ్చు. సీ, సీ++, జావా, ఎస్‌క్యూఎల్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, నెట్వర్కింగ్, ఐవోటీ, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, ఎంబెడెడ్ టెక్నాలజీ, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నైపుణ్యాలు పెంచుకుంటే వివిధ విభాగాల్లో కొలువులు లభించే అవకాశం ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇటీవల ఎక్కువ మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని, కొత్త ఆలోచనతో స్టార్టప్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. విద్యార్థులు ప్రారంభించిన పలు స్టార్టప్స్ విజయవంతం కావడం.. ఇంజనీరింగ్ అభ్యర్థులకు ప్రేరణగా నిలుస్తోంది. కాని సొంత వ్యాపారం అనే మార్గంలో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించేందుకు ఎంతో ఓపిక, సహనం అవసరం!! -
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. చెన్నై విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 2018లో పులివెందుల పూల అంగళ్ల వద్ద అల్లర్లు, ఘర్షణ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీటెక్ రవిపై వారెంట్ పెండింగ్‌లో ఉంది. రాళ్ల దాడి, హత్యాయత్నం కేసులో ఇన్నాళ్లూ అరెస్ట్ కాకుండా, బెయిల్ తీసుకోకుండా బీటెక్ రవి తప్పించుకు తిరుగుతున్నారు. గతంలో జరిగిన రాళ్ల దాడిలో ఎస్ఐ చిరంజీవికి గాయాలయ్యాయి. హత్యాయత్నం కింద బీటెక్ రవితో పాటు మరో 63 మందిపై కేసులు నమోదయ్యాయి. (చదవండి: ‘సుబ్బయ్యపై 14 కేసులు ఉన్నాయి’) ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. 2018లో జరిగిన అల్లర్ల కేసులో బీటెక్ రవిని అరెస్ట్ చేశామని తెలిపారు. గతంలో జరిగిన అల్లర్ల కేసులో పలువురికి బెయిల్ లభించిందని, నిందితుడిగా ఉన్న బీటెక్ రవిని అరెస్ట్ చేశామని ఎస్పీ వివరించారు. లింగాల మహిళ హత్య కేసుకు, అరెస్ట్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ స్పష్టం చేశారు.(చదవండి: పచ్చ దౌర్జన్యాలు) -
33 కేసులు.. 22 సార్లు జైలు..
సాక్షి, తిరుపతి: రాజకీయ నాయకులు, నిరుద్యోగులే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడు తోట బాలాజీనాయుడు మరోసారి పోలీసులకు చిక్కాడు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తికి ప్రధానమంత్రి గ్రామీణ యోజన కింద రూ.25 లక్షల రుణం ఇప్పిస్తామని చెప్పి రూ.2.5 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయించుకున్న కేసులో అతడిని ఆదివారం శ్రీకాళహస్తిలో పోలీసులు అరెస్టు చేశారు. వివిధ ప్రభుత్వ పథకాల పేరు చెప్పి ఇప్పటి వరకు 60 మంది ప్రజాప్రతినిధులను బురిడీ కొట్టించిన ఇతగాడిపై ఏపీ, తెలంగాణల్లోని పలు పోలీస్ స్టేషన్లలో 33 కేసులు నమోదు కాగా 22 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన బాలాజీనాయుడు కాకినాడలోని జేఎన్టీయూలో బీటెక్ పూర్తిచేశాడు. 2003లో ఎన్టీపీసీలో జూనియర్ ఇంజినీర్‌గా చేరి రామగుండం, పాల్వంచ, విశాఖపట్నం ప్రాంతాల్లో పనిచేశాడు. విశాఖలో పనిచేస్తుండగా 2008లో అప్పటి తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ఆనంద్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఆ కేసుతో ఉద్యోగం కోల్పోయి జైలుకెళ్లాడు. బుద్ధి మార్చుకోకుండా.. విశాఖ జైలు నుంచి బయటకు వచ్చిన బాలాజీనాయుడు వివిధ ప్రాంతాల ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యదర్శులకు ఫోన్లు చేసి ఎన్టీపీసీలో ఉద్యోగాలంటూ, వారి నియోజకవర్గం నుంచి యువతను సిఫార్సు చేయాలని ఎమ్మెల్యేలకు సూచించాడు. ఆ తరువాత డిపాజిట్ పేరుతో కొంత మొత్తం దండుకొని మోసం చేశాడు. విజయనగరం పోలీసులు 2009లో అరెస్టు చేసి జైలుకు పంపారు. నల్లగొండ జిల్లాలోనూ ఇదే తరహాలో మోసం చేయడంతో 2010లో యాదగిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరోగ్యశ్రీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రాజకీయ నేతల నుంచి రూ.1.5 లక్షలు వసూలు చేసి జైలుపాలయ్యాడు. పలువురు ప్రజా ప్రతినిధులకు ఫోన్ చేసి రుణాలిప్పిస్తామంటూ వారి పీఏల ద్వారా ఒక్కో అభ్యర్థికి రూ.1,060 వంతున రూ.3.50 లక్షలు రాబట్టాడు. బీజేపీ నేత రాంజగదీష్ ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు 2013 ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చాక అప్పటి ఎంపీలు వి.హనుమంతరావు, దేవేందర్‌గౌడ్, పాల్వాయి గోవర్ధన్‌లను బురిడీ కొట్టించాడు. 2015లో మల్కాజ్గిరి ఎమ్మెల్యేకు రూ.90 వేలు టోకరా వేసి మళ్లీ పోలీసులకు చిక్కాడు. విడుదలైన బాలాజీ పలు మోసాలు చేశాడు. అతడి మాటలు నమ్మి తెలంగాణ ఎమ్మెల్సీ ఆకుల లలిత రూ.10 లక్షలు బ్యాంకు ఖాతాలో వేయించారు. 2018లో సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ భర్తకు ఫోన్‌చేసి రూ.30 వేలు ఇస్తే రూ.2 కోట్ల కేంద్ర నిధుల పెండింగ్ ఫైల్ క్లియర్ చేయిస్తానని చెప్పారు. దీనిపై సూర్యాపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడంతో బాలాజీని అరెస్టు చేశారు. -
ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సులు
టెక్నాలజీ పరంగా విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఇది అది అనే తేడా లేకుండా.. అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే విద్యా రంగంలోనూ మార్పులు వస్తున్నాయి. దేశంలో ఇంజనీరింగ్ విద్యను పర్యవేక్షించే.. ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ).. బీటెక్ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. ఆ వివరాలు... ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల పరిశ్రమలు..మానవ వనరులను తగ్గించుకునేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను ఆయా రంగాల్లో ప్రవేశ పెడుతున్నాయి. ఇవే కాకుండా వ్యాపార అభివృద్ధి సులభతరం చేసుకునే విధంగా డేటాసైన్స్ వంటి టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తోంది. ఇలాంటి తరుణంలో ఆయా రంగాల్లో సరిపడ సంఖ్యలో సమర్థవం తమైన నిపుణులు ఉన్నారా.. అంటే లేరనే చెప్పాలి. ఈ కొరతను అధిగమించడానికి గత కొంతకాలంగా ఆన్లైన్ మార్గాల ద్వారా ఏఐ,డేటాసైన్స్ లాంటి కోర్సులో పలు అవసరాలకు అనుగుణంగా శిక్షణన అందిస్తున్నాయి. తాజాగా ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఇంజనీరింగ్ విద్యలో ఇలాంటి నూతన కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. తెలుగు రాష్టాల్లోనూ పలు కాలేజీల్లో బీటెక్ స్థాయిలో ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. డేటా సైన్స్ నైపుణ్యం కలిగిన డేటా సైంటిస్టులను తయారు చేయడానికి ఇంజనీరింగ్ విద్యలో డేటాసైన్స్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. రంగం ఏదైనా.. జరగబోయే పరిణామాలను ముందే అంచనా వేసి.. కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని అందించేదే.. డేటాసైన్స్. విద్య, వైద్యం, వ్యాపార, సామాజిక ఆర్థిక, రాజకీయం.. ఇలా రంగం ఏదైనా గతంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల సమాచారాన్ని తెలుసుకొని.. భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తే.. ఆయా రంగాల్లో విజయం సా«ధించడానికి వీలుంటుందో ఖచ్చితంగా అంచనా వేసి చెప్పే వారే.. డేటా సైంటిస్టులు. డేటా విశ్లేషణ: డేటాసైన్స్.. గణాంక సహిత సమాచారాన్ని విశ్లేషించడానికి ఉపయోగించే సాధనం. అల్గారిథం, మెషిన్‌లెర్నింగ్ సిద్ధాంతాలను ఉపయోగించి.. వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఏ సంవత్సరంలో ఎంత మొత్తంలో అమ్మకాలు జరిగా యి. ఆ సమయంలో డిమాండ్ –సప్లయ్ ఏ విధంగా ఉంది. ప్రస్తుతం అంత డిమాండ్ ఎందుకు లేదు. ఆయా వస్తువులపై వినియోగదారుల అభిప్రాయం ఏంటి? కొనుగోలు శక్తిలో వచ్చిన మార్పులు ఏంటి?!వంటివి అంచనా వేసి చెబుతారు. గతంలో ఉన్న డిమాండ్‌ను ప్రస్తుత డిమాండ్‌తో పోల్చి విశ్లేషించి..రానున్న కాలంలో ఎంత డిమాండ్ ఉండవచ్చు..ఆ సమయానికి వినియోగ దారులకు అందుబాటులో ఉంచాల్సిన ప్రొడక్ట్స్ సంఖ్యతో సహా కచ్చితమైన లెక్కలతో వివరిస్తారు డేటా నిపుణులు. కోర్సు స్వరూపం: డేటాసైన్స్ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లుగా ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు.. డేటావిజువలైజర్స్, డేటాసైన్స్ కన్సల్టెంట్, డేటా ఆర్కిటెక్చర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డేటా ఇంజనీరింగ్ సహా వివిధ రకాల ఉద్యోగాలు పొందవచ్చు. వేతనాలు: డేటాసైన్స్ వి«భాగంలో ఉద్యోగాలు దక్కించుకున్న వారికి వార్షిక వేతనం దాదాపు రూ.5లక్షల వరకు ఉంటుంది. నైపుణ్యాలు,అనుభవం ఆధారంగా వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వ/ప్రైవేట్, వ్యాపార సంస్థలు సహా ప్రతీ రంగంలో లావాదేవీలన్నీ ఇంటర్నెట్ ఆధారంగానే జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా లావాదేవీలు, సంబంధిత సమాచార భద్రత అనేది చాలా క్లిష్టంగా మారింది. ఇటువంటి విలువైన సమాచారాన్ని భద్రపరచడానికి రక్షణ కవచంగా వచ్చిందే..సైబర్ సెక్యూరిటీ. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్‌కు సంబంధించి సైబర్ సెక్యూరిటీ నాలుగేళ్ల కోర్సు. డేటా స్ట్రక్చర్, డిజిటల్ ప్రిన్సిపుల్స్, సిస్టమ్ డిజైన్, జావా ప్రోగ్రామింగ్, సిస్టమ్ సాఫ్ట్వేర్, అల్గారిథంలను రూపొందించడం వంటివి ఈ కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ సాఫ్ట్వేర్ డెవలపర్, క్రిప్టానలిస్ట్, సెక్యూరిటీ ఇంజనీర్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందే వీలుంటుంది. వేతనాలు : సంస్థను బట్టి సైబర్ సెక్యూరిటీ నిపుణులకు వార్షిక వేతనం రూ.8 లక్షల వరకు లభిస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంజనీరింగ్‌లో కొత్తగా ప్రవేశ పెట్టిన మరో కోర్సు.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ. సైబర్ నేరాలను ఆరిక ట్టడానికి ఆయా వ్యవస్థలపై పనిచేసే నిపుణులు ఎప్పటికప్పడు నూతన పరిజ్ఞానాన్ని అందుబా టులోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చిందే బ్లాక్‌చైన్ టెక్నాలజీ. ఆర్థికపరమైన లావాదేవీలల్లో పారదర్శకతను పెంచేవిధంగా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఆన్లైన్ ఆధారంగా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. రానున్న కాలంలో బ్లాక్ చైన్ టెక్నాలజీలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే: బ్లాక్‌చైన్ టెక్నాలజీ అనేది ఒక పట్టిష్టమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ. వ్యక్తులు, వ్యవస్థల మధ్య జరిగే ఆర్థిక సహ ఇతర కార్యకలాపాల సమాచారానికి కట్టుదిట్టమైన భద్రను కల్పించే రక్షణ కవచం ఇది. ఎంతటి సైబర్ హ్యాకర్లైనా దొంగలించేందుకు వీలులేకుం డా ఉండే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ ఇది. దీని ద్వారా ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సర్వర్లలో సమాచారం నిక్షిప్తం చేసి.. ఇతరులు దానిని దొంగిలించకుండా భద్రత కల్పిస్తారు. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్‌లో బ్లాక్‌చైన్ టెక్నాలజీ కోర్సు వ్యవధి నాలుగేళ్లుగా ఉంటుంది. కోర్సులో భాగంగా బ్లాక్చైన్టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ, బ్లాక్‌చైన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లపై లోతైన అవగాహన కల్పిస్తారు. అలాగే సాలిడిటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ క్లౌడ్ ప్లాట్‌ఫాం,ఎథెరియం,బిట్ కాయిన్ క్రిప్టోకరెన్సీల గురించి అవగాహన కలిగించే విధంగా కోర్సు ఉంటుంది. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బ్లాక్‌చైన్ డెవలపర్, బ్లాక్‌చైన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బ్లాక్‌చైన్ ఎస్ఐ పార్టనర్ డెవలప్మెంట్ మేనేజర్, బిట్‌కాయిన్ క్రిప్టోకరెన్సీ డెవలపర్, బ్లాక్‌చైన్ ప్రిన్సిçపల్ ప్రోగ్రామ్ మేనేజర్, బిజినెస్ అనలిటిక్స్ అసోసియేట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగాలు: ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఐబీఎం, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, వీసా వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. వేతనాలు: బ్లాక్‌చైన్ నిపుణులకు ప్రారంభంలో వార్షిక వేతనం రూ.5 లక్షల వరకు ఉంటుంది. అనుభవం, నైపుణ్యం ఆధారంగా ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక రంగంలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్. మానవ ఆలోచనలకు అనుగుణంగా కంప్యూటర్ ఆధారిత యంత్ర వ్యవస్థ పనిచేసేలా చేయడమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఇప్పుడు ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఏఐలో స్పీచ్ రికగ్నిషన్, విజువల్ పర్సెప్షన్, లాజిక్ అండ్ డెసిషన్, మల్టీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ లాంటి చాలా అంశాలుంటాయి. రోబోటిక్స్లోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం కీలకం. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఏఐ, మెషిన్ లెర్నింగ్) ఉంటుంది. ఈ కోర్సు లో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్ లాంగ్వేజ్‌లను నేర్పిస్తారు. జావా, ప్రొలాగ్, లిస్ప్, పైథాన్ వంటి కోర్సులు ఇందులో నేర్చుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్ : ఈ కోర్సును పూర్తిచేసిన అభ్య ర్థులకు డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, ప్రిన్సిపుల్ డేటాసైంటిస్ట్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్లుగా అవకాశాలు లభిస్తాయి. వేతనాలు : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగా లు పొందిన వారికి వార్షిక వేతనం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంగా మార్చేసిన ఘనత ఇంటర్నెట్కు దక్కుతుంది. సమాచార వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మ కతకు ముఖ్య కారణం ఇంటర్నెట్ అనడంలో సందేహం లేదు. దీని విస్తృతి మరింత పెరిగి.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) తెరపైకి వచ్చింది. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులో ఐఓటీ కూడా ఒకటి. ఐఓటీ అంటే: భవిష్యత్తులో ప్రపంచం మొత్తం ఒక స్మార్ట్ నగరం గా మారడానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఉపయోగపడు తుంది. మనుషుల జీవితాలను మరింత సుఖమయం చేయడా నికి ఇది తోడ్పడుతుంది. మనుçషుల మాదిరిగానే యంత్రాలు, యంత్ర పరికరాలు అన్ని ఇంటర్నెట్ ఆధారంగా అనుసంధా నంగా ఉండి.. ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి పనిచేయడాన్ని ఇంటర్నెట్ ఆఫ్ «థింగ్స్ అంటారు. అంటే.. మనుషులు తమలో తాము ఎలాగైతే ఒకరితో ఒకరు మాట్లాడుకొని పనులు చేస్తారో.. యంత్రాలు కూడా ఒక దానితో ఒకటి సమాచార మార్పిడి చేసుకొని పనిచేస్తాయి. ప్రతి వస్తువు ఇంటర్నెట్తో అనుసం« దానంగా ఉండి.. వివిధ రకాల కార్యకలాపాలను కచ్చితమైన సమయంలో సమర్థవంతంగా పూర్తిచేస్తాయి. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్ స్థాయిలో నాలుగేళ్ల బీటెక్ ఇన్ ఐఓటీ అండ్ అప్లికేషన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జాబ్ ప్రొఫైల్: ఇంజనీరింగ్‌లో ఐఓటీ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఐఓటీ ఇంజనీర్, ఐఓటీ యాప్ డెవలపర్, ఐఓటీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, సిటిజన్ ఐఓటీ సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఐఓటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లుగా విధులు నిర్వహిస్తారు. బిజినెస్ అనలిటిక్స్ ఒకప్పుడు వ్యాపార సంస్థల మధ్య పోటీ తక్కువగా ఉండేది. కొన్ని సంస్థల గుత్తాధిపత్యం కొనసాగేది. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో.. వ్యాపార సంస్థల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో ఆయా వ్యాపారాలను లాభాల బాటలో తీసుకేళ్లేందుకు అందరూ బిజినెస్ అనలిటిక్స్ సహాయం తీసుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం బడా కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకూ.. లక్షల్లో జీతాలు ఇచ్చి బిజినెస్ అనలిటిక్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి. దీంతో బిజినెస్ అనలిటిక్స్‌కు బాగా డిమాండ్ ఏర్పడింది. పని తీరు మదింపు: స్టాటిస్టికల్, క్వాంటిటేటివ్, టెక్నికల్ çపరిజ్ఞానాన్ని ఉపయోగించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని వివిధ రకాల పద్దతుల ద్వారా విశ్లేషించి.. ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థ పని తీరును మదించడమే బిజినెస్ అనలిటిక్స్. ఆయా సంస్థల వ్యాపారవృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించేందుకు బిజినెస్ అనలిటిక్స్ ఉపయోగపడుతుంది. కోర్సు స్వరూపం: ఈ కోర్సులో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలనకునే వారు బీటెక్ బిగ్ డేటా అనలిటిక్స్ కోర్సు చేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల ఈ కోర్సులో డేటా మైనింగ్, డేటా వేర్‌హౌసింగ్, డేటా విజువలైజేషన్ అధ్యయనం చేస్తారు. ఈ కోర్సు కూడా డేటా సైన్స్‌కు అనుబంధంగా ఉంటుంది. జాబ్ ప్రొఫైల్ : ఈ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులు బిజినెస్ అనలిటిక్స్‌గా కెరీర్‌ను ప్రారంభించవచ్చు. వేతనాలు: బిజినెస్ అనలిటిక్స్ నిపుణులకు నైపుణ్యాలను బట్టి వార్షిక వేతనం రూ.ఆరు లక్షల నుంచి రూ.పది లక్షల వరకూ లభిస్తుంది. బయో మెడికల్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీంగ్ ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్న కోర్సులో ఒకటి. ఆరోగ్య రంగానికి సాంకేతిక తోడ్పాటు అందించేందుకు ఈ విభాగం కృషి చేస్తోంది. బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రధానంగా రోగ నిర్ధారణకు సంబంధించి ఉపయోగించే పరికరాలను తయారు చేస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు రోగ నిర్ధారణ కోసం చేసే సిటీ స్కాన్, ఎంఆర్ఐలతో పాటు రోగా నిర్ధారణ పరిక్షల కోసం ఉపయోగించే ఇతర పరికరాలను తయారు చేసే వారే బయో మెడికల్ ఇంజనీర్లు. ఈ పరికరాలను తయారు చేయడానికి ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. బయాలజీ, ఇంజనీరింగ్.. ఈ రెండింటిపై అవగాహన ఉండాలి. అందుకే ఈ రెండింటిని కలిపి ఉమ్మడిగా బయో మెడికల్ ఇంజనీరింగ్ కోర్సును రూపొందించారు. కోర్సు స్వరూపం: బయాలజీ, మెడిసిన్లకు సాంకేతికతను అన్వయించి మెడికల్ ఎక్విప్ మెంట్‌ను తయారు చేసేదే.. బయోమె డికల్ ఇంజనీరింగ్. నాణ్యమైన పరికరాలను తక్కువ ధరల్లో తయారు చేసేందు కు కృషి చేస్తారు. ఇది రానున్న కాలంలో మంచి డిమాండ్ ఉన్న రంగంగా మారుతుందని నిపుణుల అంచనా. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బయోమెడికల్ టెక్నిషియన్, బయో మెడికల్ ఇంజనీర్, బయో కెమిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తారు. ఉద్యోగాలు: మెడికల్ కంపెనీలు, హాస్పిటల్స్, ఇన్స్ట్రుమెంట్ మ్యానుఫ్యా క్చరర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఇన్‌స్టాలెషన్ యూనిట్లల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వేతనాలు: ఈ రంగంలో ఉద్యోగాలు చేసే వారికి నెలకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు వేతనంగా లభిస్తుంది. అనుభవాన్ని బట్టి వేతనం పెరుగుతుంది.