ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచ వ్యాప్తంగా ఇంధన వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా పెట్రో ఉత్పత్తులకు తరగని డిమాండ్. ముడి చమురును భూమి నుంచి వెలికితీసి.. ఇంధనంగా మార్చే క్రమంలో ఎన్నో దశలు దాటాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించే వారే.. పెట్రోలియం ఇంజనీర్లు. భూమి లోపల ఉన్న పెట్రోలియం, సహజవాయువు నిక్షేపాలను గుర్తించి.. వెలికి తీయడానికి అవసరమైన నైపుణ్యాలను అందించే కోర్సు.. పెట్రోలియం ఇంజనీరింగ్! అవకాశాల పరంగా ఎవర్‌గ్రీన్ బ్రాంచ్‌గా నిలుస్తున్న పెట్రోలియం ఇంజనీరింగ్‌పై ప్రత్యేక కథనం..
పెట్రోలియం ఇంజనీరింగ్‌కు సంబంధించి యూజీ(అండర్ గ్రాడ్యుయేట్), పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేట్), పీహెచ్‌డీ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూజీ స్థాయిలో దేశంలోని పలు విద్యా సంస్థలు బీటెక్/ఎంటెక్ ప్రోగ్రామ్స్‌ను అం దిస్తున్నాయి. నాలుగేళ్ల బీటెక్ పెట్రోలియం ఇంజనీ రింగ్‌ని విజయవంతంగా పూర్తి చేసిన తరువాత.. రెండేళ్ల ఎంటెక్ కోర్సులో చేరే అవకాశం ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత పరిశోధనల దిశగా కొనసా గాలనుకుంటే.. పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు.
పెట్రోలియం కోర్సులు
పెట్రోలియం ఇంజనీరింగ్‌లో బీటెక్/ఎంటెక్‌తో పా టు పలు ఇన్‌స్టిట్యూట్స్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్+ ఎంటెక్ కోర్సునూ అందిస్తున్నాయి. మరికొన్ని కాలే జీలు పెట్రోలియం విభాగంలో ఎంఎస్ కోర్సుల్లో నూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అంతేకాకుండా మేనేజ్‌మెంట్ విద్యకు సంబంధించి ఎంబీఏ –పెట్రోలియం కోర్సు కూడా అందుబాటులో ఉంది.
అర్హతలు
► బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి 10+2/ ఇంటర్మీడియెట్ ఎంపీసీ(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణత ఉండాలి. దాంతోపాటు సంబం ధిత ఎంట్రెన్స్ టెస్ట్‌లు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, యూపీఈఎస్‌ఈఏటీ (యూనివర్సి టీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, డెహ్రా డూన్) ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
► పీజీ స్థాయిలో ఎంటెక్‌లో చేరేందుకు బీఈ/ బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు గేట్(గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)లో ర్యాంకు సాధించాలి.
ఇన్‌స్టిట్యూట్స్
ఎ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్(ఐఐటీ)–ధన్‌బాద్; యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్–డెహ్రాడూన్; పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ–గాంధీనగర్; ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ– విశాఖపట్నం; మహారాష్ట్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–పుణె; రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ–యూపీ; ఐఐటీ–ఖరగ్‌పూర్ (పీజీ స్థాయి); ఐఐటీ –గౌహతి(పీజీ స్థాయి); జేఎన్‌టీయూ–కాకినాడ తదితర ఇన్‌స్టిట్యూట్స్ పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులు అందిస్తున్నాయి.
జాబ్ ప్రొఫైల్స్
యూజీ, పీజీ స్థాయిలో పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు.. ఫీల్డ్ ఆపరే టర్, టెస్టింగ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, రీసెర్చ్ ఇంజనీర్, రిజ ర్వాయర్ ఇంజనీర్, డ్రిల్లింగ్ ఇంజనీర్, పైప్‌లైన్ ఇంజనీర్, సైంటిస్ట్ జియాలజిస్ట్, మినరాలజిస్ట్, వెల్ స్టిమ్యులేటింగ్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు దక్కించుకోవచ్చు.
కెరీర్ స్కోప్
పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులు చేసిన ప్రతిభా వంతులకు దేశవిదేశాల్లో డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా ప్రస్తుతం దేశంలో చమురు, సహజవా యు నిక్షేపాల అన్వేషణ విస్తృతంగా కొనసాగుతోంది. దాంతో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో అవకాశాలకు కొదవలేదు. ముఖ్యంగా హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్ జీసీ), ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్), గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రిలయన్స్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, అస్సాం పెట్రోలియం లిమిటెడ్ తదితర కంపెనీల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.
వేతనాలు
చమురు రంగం అభివృద్ధి పథంలోనే ఉంటుంది. కాబట్టి పెట్రోలియం ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి.. చక్కటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరు ఆకర్షణీయ వేతనాలు సైతం అందుకోవచ్చు. పెట్రో లియం ఇంజనీరింగ్ కోర్సు పూర్తికాగానే వార్షిక ప్రారంభ వేతనం రూ.5 లక్షల నుండి రూ.8 లక్షల వరకు దక్కుతోంది. గేట్ ర్యాంకు ద్వారా ఓఎన్‌జీసీ లాంటి కంపెనీల్లో అవకాశం అందుకుంటే.. రూ.పది లక్షలకు పైగానే వార్షిక వేతనం అందుతుంది. అనుభవం ఉన్నవారికి గల్ఫ్ దేశాలలో భారీ వేతనాలు లభిస్తున్నాయి. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ విభాగాల్లో పని చేసేవారికి వేతనాలతోపాటు ఇతర అలవెన్సులు సైతం ఇస్తున్నారు.
క్యాంపస్‌లోనే ఆఫర్స్
పెట్రోలియం రంగంలో అవకాశాలు ఏటే టా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పెట్రోలియం ఇంజనీరింగ్ ప్రత్యేక విభాగంగా అభివృద్ధి చెందింది. ఈ కోర్సు పూర్తిచేసినవారు క్యాంపస్ లోనే భారీ వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. కాకినాడ, జేఎన్‌టీయూలో 2010లో ఈ విభాగం ప్రారంభించాక.. ఆరు బ్యాచ్‌ల విద్యార్థులు బయటకు వెళ్లారు. అందరూ కెరీర్‌లో బాగా సెటిల్ అయ్యారు. ఓఎన్‌జీసీ, రియలన్స్ గ్యాస్ ఇండస్ట్రీస్ దగ్గరలో ఉండటం వల్ల అక్కడి నిపుణులతో మా విద్యార్థులకు లైవ్ ప్రాజెక్టుల్లో శిక్షణ ఇస్తున్నాం. పెట్రోలియం కోర్సులు చేసిన వారికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది.
– ప్రొఫెసర్ బి.బాలకృష్ణ, జేఎన్‌టీయూ–కే ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్
Comments
Please login to add a commentAdd a comment