Career Counselling
-
ఫార్మసీ కోర్సులు.. కెరీర్ అవకాశాలు
దేశంలో ఫార్మారంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ ఔషధశాలగా భారత్ పేరొందుతోంది. నూతన ఆవిష్కరణలతో కొత్త ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తికి నెలవైన ఫార్మా రంగంలో అవకాశాలకు కొదవలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియెట్ తర్వాత ఫార్మసీ కోర్సులు అభ్యసించొచ్చు. రోగులకు మందులు అందించడం దగ్గర్నుంచి ఔషధాల పరిశోధన వరకూ.. అనేక ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ఫార్మసీకోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం... ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన అభ్యర్థుల కోసం ప్రధానంగా మూడు రకాల ఫార్మసీ కోర్సులున్నాయి. డి.ఫార్మసీ(డిప్లొమా ఇన్ ఫార్మసీ), బీఫార్మసీ(బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ), ఫార్మ్–డి(డాక్టర్ ఆఫ్ ఫార్మసీ). ఈ కోర్సులు పూర్తిచేసిన తర్వాత ఉన్నత విద్యావకాశాలనూ అందిపుచ్చుకోవచ్చు. డి.ఫార్మసీ ► ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ/బైపీసీలో సాధించిన మార్కుల ఆధారంగా డి.ఫార్మసీలో ప్రవేశం పొందొచ్చు. రాష్ట్ర సాంకేతిక శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది. ఈ కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. కోర్సు పూర్తయిన తర్వాత ప్రాక్టికల్ శిక్షణ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవచ్చు. ► ఉద్యోగావకాశాలు: డి–ఫార్మసీ అభ్యర్థులకు ప్రభుత్వ ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, విద్యా సంస్థలు, క్లినిక్‌లు, ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ మందుల దుకాణాలు, ఫార్మాస్యూటికల్ సంస్థలు, సేల్స్, మార్కెటింగ్, పరిశోధనా సంస్థలు, పరిశోధన ప్రయోగశాలల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ► ఉన్నత విద్య: డి.ఫార్మసీ తర్వాత రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈసెట్ పరీక్షలో అర్హత సాధించి.. లేటరల్ ఎంట్రీ ద్వారా బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరొచ్చు. ఫార్మ్–డి కోర్సులను కూడా అభ్యసించొచ్చు. బీఫార్మసీ ► ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ/బైపీసీ/డి.ఫార్మసీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ(బీఫార్మసీ)లో చేరొచ్చు. కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఫార్మసీ పూర్తి చేసినవారు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవచ్చు. ► ఉద్యోగావకాశాలు: బీఫార్మసీలో ఉత్తీర్ణులకు పలు ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో ఫార్మసిస్ట్‌లుగా చేరొచ్చు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు, మెడికల్ అండర్ రైటర్లుగా పనిచేయొచ్చు. సొంతంగా మందుల దుకాణాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఫార్మస్యూటికల్, బయోటెక్ కంపెనీల్లో రీసెర్చ్ సైంటిస్టు, రీసెర్చ్ అసోసియేట్, ప్రీ క్లినికల్ రీసెర్చ్‌లో.. స్టడీ డైరెక్టర్, క్యూసీ మేనేజర్, క్యూసీ ఆడిటర్, క్యూసీ అసోసియేట్ కొలువులు; ఫార్మా ఇండస్ట్రీలో.. ఫార్ములేషన్స్ ఆర్ అండ్ డీ, అనలిటికల్ ఆర్ అండ్ డీ, క్వాలిటీ కంట్రోల్స్, క్వాలిటీ అస్యూరెన్స్ విభాగాల్లో అవకాశాలు పొందొచ్చు. ఫార్మ్–డి ► ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ/బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులు ఫార్మ్–డి కోర్సులో చేరొచ్చు. కోర్సు కాలవ్యవధి ఆరేళ్లు. కోర్సులో థియరీతోపాటు ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. అయిదేళ్లు తరగతిగది బోధన, ప్రాక్టికల్స్‌తోపాటు.. చివరి ఏడాది పూర్తిగా ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఫార్మ్–డి కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవచ్చు. ► ఉద్యోగ అవకాశాలు: ఫార్మ్–డి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు క్లినికల్ ఫార్మసిస్టు, కమ్యూనిటీ ఫార్మసిస్టు, హాస్పిటల్ ఫార్మసిస్టుగా అవకాశాలు లభిస్తాయి. క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషనల్లో ఏడీఆర్ మానిటరింగ్, డ్రగ్ ఇంటరాక్షన్ మానిటరింగ్, టాక్సికాలజీ, థెరప్యూటిక్స్, బీఏబీఈ స్టడీస్, పేషెంట్ మానిటరింగ్, క్లినికల్ ప్రోటోకాల్ డెవలప్మెంట్, పేషెంట్ కేస్ స్టడీ, పేషెంట్ కౌన్సెలింగ్, క్లినికల్ ట్రయల్స్, డేటా మేనేజ్మెంట్ వంటి అవకాశాలు ఉంటాయి. విదేశాలలోనూ వీరికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు.. పరిశోధనలపై దృష్టిసారించాలనుకుంటే.. పీహెచ్డీ చేయొచ్చు. మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (ఎంఫార్మసీ) ► బీఫార్మసీ పూర్తిచేసిన అభ్యర్థులు రెండేళ్ల కాలవ్యవధి ఉన్న ఎంఫార్మసీ కోర్సులో చేరొచ్చు. ఎంఫార్మసీలో ఫార్మాస్యుటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మా కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఇండస్ట్రియల్ ఫార్మసీ, ఫార్మసీ ప్రాక్టీస్, క్వాలిటీ అస్యూరెన్స్ తదితర స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు. ► నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీ)నిర్వహించే గ్రాడ్యుయేట్ ఫార్మసీ అప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్) పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా దేశంలోని పలు యూనివర్సిటీలు ఎంఫార్మసీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అభ్యర్థులు జీప్యాట్ స్కోరుతో తాము చేరాలనుకుంటున్న యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్కు స్వయంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ► నైపర్ జేఈఈ రాసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) విద్యాసంస్థల్లో ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ► అంతర్జాతీయ అర్హత పరీక్షల ద్వారా విదేశాల్లో ఎంఎస్(ఫార్మాస్యూటికల్ సైన్సెస్)తో పాటు ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలో చేరే అవకాశముంది. ► బీఫార్మసీ తర్వాత మూడేళ్ల ఫార్మ్–డి(పోస్ట్ బ్యాచులరేట్)లో చేరవచ్చు. ఫార్మ్–డి(పోస్ట్ బ్యాచులరేట్)ను లేటరల్ ఎంట్రీగా పరిగణిస్తారు. బీఫార్మసీ తర్వాత ఫార్మ్–డిలో నేరుగా నాలుగో సంవత్సరంలో ప్రవేశం పొందొచ్చు. రాష్ట్ర స్థాయిలో పీజీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి ఎంఫార్మసీ కోర్సులో చేరొచ్చు. ఫార్మసీ–మేనేజ్మెంట్ కోర్సులు ► ఫార్మసీ రంగంలో మేనేజ్మెంట్ నిపుణుల అవసరం నెలకొంది. దాంతో నైపర్ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు ఎంబీఏ(ఫార్మ్) వంటి ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాయి. అలాగే ఎంటెక్(ఫార్మసీ), ఎంఎస్(ఫార్మ్) లాంటి వినూత్న కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. బీఫార్మసీ, ఎమ్మెస్సీ లైఫ్ సైన్సెస్ సంబంధిత కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు వీటిలో చేరొచ్చు. పీహెచ్డీ ► నైపర్లతోపాటు, పలు సెంట్రల్ యూనివర్సిటీలు, బిట్స్ తదితర ఇన్స్టిట్యూట్లు ఫార్మసీలో వివిధ స్పెషలైజేషన్స్‌తో పీహెచ్డీ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఉన్నత విద్యతో మరిన్ని అవకాశాలు కోవిడ్ పరిస్థితుల్లో ఫార్మా రంగం ప్రాధాన్యత మరింత పెరిగింది. ఫార్మసీలో ఉన్నత విద్య అభ్యసించిన వారికి అవకాశాలకు ఢోకా లేదు. భవిష్యత్తులో ఫార్మా రంగం విస్తరణ, కొత్త ప్రాజెక్టుల కారణంగా ఉపాధి మార్గాలు మరింత విస్తృతమవుతాయి. ఫార్మా కోర్సులు చదివిన వారు ఆస్పత్రుల్లో ఫార్మాసిస్టులు, అనలిటికల్, పరిశోధన, అభివృద్ధి, మెడికల్ రేటింగ్స్, డేటా అనాలిసిస్ విభాగాలతోపాటు పలు ప్రభుత్వ ఉద్యోగాలు సైతం సొంతం చేసుకోవచ్చు. పీహెచ్‌డీతోపాటు విదేశాల్లో పోస్ట్ డాక్టోరల్ కోర్సులు అభ్యసించి పరిశోధన దిశగా అడుగులు వేయొచ్చు. అధ్యాపక వృత్తిలోనూ స్థిరపడొచ్చు. – ఎన్.శంకరయ్య, అసోసియేట్ ప్రొఫెసర్, నైపర్ హైదరాబాద్. -
ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు
నేను ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్‌లో చేరాలనుకుంటున్నాను. అర్హతలు, కెరీర్ అవకాశాల గురించి వివరించండి? ప్రకృతిని ప్రేమించే వారికి, పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా బావించే వారికి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మంచి కెరీర్‌గా చెప్పొచ్చు. పర్యావరణానికి కలుగుతున్న నష్టాలను నివారించడం.. వ్యర్థాలను రీసైక్లింగ్ విధానాలతో శుద్ధి చేయడం.. నింగి, నేల, నీరు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వాలకు సిఫార్సులు చేయడం వంటి విధులను ఎన్విరాన్మెంట్ ఇంజనీర్లు నిర్వర్తించాల్సి ఉంటుంది. ► కోర్సులు: దేశంలోని చాలా విద్యాసంస్థలు యూజీ, పీజీ స్థాయిలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్నాయి. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలతోనే బీఈ/బీటెక్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరవచ్చు. ఐఐటీలు, ఎన్ఐటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్; పీజీ కోర్సులకు గేట్ వంటి పరీక్షల్లో అర్హత సాధించాలి. ఈ కోర్సుల్లో చేరినవారికి బయాలజీ, కెమిస్ట్రీ, సాయిల్ సైన్స్, ఇంజనీరింగ్ సూత్రాలు, అనువర్తనాలు వంటి వాటిపై అవగాహన లభిస్తుంది. ► అర్హతలు: ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాలనుకునే వారు ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ చదివి ఉండాలి. ► కోర్సులను అందించే పలు విద్యా సంస్థలు: ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్, బాంబే, ఐఐటీ ఖరగ్‌పూర్ తదితర ఐఐటీలు, పలు నిట్లు, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ తదితర విద్యాసంస్థలు. ► జాబ్ ప్రొఫైల్స్: హైడ్రాలజిస్ట్, ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, వైల్డ్‌లైఫ్ బయాలజిస్ట్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మేనేజ్మెంట్, ఎన్విరాన్ మెంటల్ లాయర్. ► కెరీర్: ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కోర్సులను పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ శాఖలు, ఎన్జీవోలు, నిర్మాణ సంస్థలు, పర్యావరణ ఆధారిత సంస్థలు వంటి వాటిలో అవకాశాలను పొందవచ్చు. ఇవే కాకుండా ఫెర్టిలైజర్ ప్లాంట్లు, మైన్స్, రిఫైనరీలు, టెక్స్టైల్ మిల్స్, అర్బన్ ప్లానింగ్, వాటర్ రిసోర్సెస్ అండ్ అగ్రికల్చర్, అటవీ శాఖల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అంతర్జాతీయంగా యునైటెడ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లయిమెట్ ఛేంజ్, ఎర్త్ సిస్టమ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వంటి వాటిలో అవకాశాలు అందుకోవచ్చు. ► వేతనాలు: పనిచేసే సంస్థ, అనుభవం, నైపుణ్యాల ఆధారంగా వేతనాలు లభిస్తాయి. ప్రారంభంలో రూ.30వేల నుంచి రూ.50 వేల వరకు వేతనంగా పొందవచ్చు. -
ఎవర్ గ్రీన్.. పెట్రోలియం ఇంజనీరింగ్!
ప్రపంచ వ్యాప్తంగా ఇంధన వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా పెట్రో ఉత్పత్తులకు తరగని డిమాండ్. ముడి చమురును భూమి నుంచి వెలికితీసి.. ఇంధనంగా మార్చే క్రమంలో ఎన్నో దశలు దాటాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించే వారే.. పెట్రోలియం ఇంజనీర్లు. భూమి లోపల ఉన్న పెట్రోలియం, సహజవాయువు నిక్షేపాలను గుర్తించి.. వెలికి తీయడానికి అవసరమైన నైపుణ్యాలను అందించే కోర్సు.. పెట్రోలియం ఇంజనీరింగ్! అవకాశాల పరంగా ఎవర్గ్రీన్ బ్రాంచ్‌గా నిలుస్తున్న పెట్రోలియం ఇంజనీరింగ్‌పై ప్రత్యేక కథనం.. పెట్రోలియం ఇంజనీరింగ్‌కు సంబంధించి యూజీ(అండర్ గ్రాడ్యుయేట్), పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేట్), పీహెచ్డీ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూజీ స్థాయిలో దేశంలోని పలు విద్యా సంస్థలు బీటెక్/ఎంటెక్ ప్రోగ్రామ్స్‌ను అం దిస్తున్నాయి. నాలుగేళ్ల బీటెక్ పెట్రోలియం ఇంజనీ రింగ్‌ని విజయవంతంగా పూర్తి చేసిన తరువాత.. రెండేళ్ల ఎంటెక్ కోర్సులో చేరే అవకాశం ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత పరిశోధనల దిశగా కొనసా గాలనుకుంటే.. పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు. పెట్రోలియం కోర్సులు పెట్రోలియం ఇంజనీరింగ్‌లో బీటెక్/ఎంటెక్‌తో పా టు పలు ఇన్స్టిట్యూట్స్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్+ ఎంటెక్ కోర్సునూ అందిస్తున్నాయి. మరికొన్ని కాలే జీలు పెట్రోలియం విభాగంలో ఎంఎస్ కోర్సుల్లో నూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అంతేకాకుండా మేనేజ్మెంట్ విద్యకు సంబంధించి ఎంబీఏ –పెట్రోలియం కోర్సు కూడా అందుబాటులో ఉంది. అర్హతలు ► బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి 10+2/ ఇంటర్మీడియెట్ ఎంపీసీ(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణత ఉండాలి. దాంతోపాటు సంబం ధిత ఎంట్రెన్స్ టెస్ట్‌లు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, యూపీఈఎస్‌ఈఏటీ (యూనివర్సి టీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, డెహ్రా డూన్) ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ► పీజీ స్థాయిలో ఎంటెక్‌లో చేరేందుకు బీఈ/ బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు గేట్(గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)లో ర్యాంకు సాధించాలి. ఇన్స్టిట్యూట్స్ ఎ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్(ఐఐటీ)–ధన్‌బాద్; యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్–డెహ్రాడూన్; పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ–గాంధీనగర్; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ– విశాఖపట్నం; మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–పుణె; రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ–యూపీ; ఐఐటీ–ఖరగ్‌పూర్ (పీజీ స్థాయి); ఐఐటీ –గౌహతి(పీజీ స్థాయి); జేఎన్టీయూ–కాకినాడ తదితర ఇన్స్టిట్యూట్స్ పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులు అందిస్తున్నాయి. జాబ్ ప్రొఫైల్స్ యూజీ, పీజీ స్థాయిలో పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు.. ఫీల్డ్ ఆపరే టర్, టెస్టింగ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, రీసెర్చ్ ఇంజనీర్, రిజ ర్వాయర్ ఇంజనీర్, డ్రిల్లింగ్ ఇంజనీర్, పైప్‌లైన్ ఇంజనీర్, సైంటిస్ట్ జియాలజిస్ట్, మినరాలజిస్ట్, వెల్ స్టిమ్యులేటింగ్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. కెరీర్ స్కోప్ పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులు చేసిన ప్రతిభా వంతులకు దేశవిదేశాల్లో డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా ప్రస్తుతం దేశంలో చమురు, సహజవా యు నిక్షేపాల అన్వేషణ విస్తృతంగా కొనసాగుతోంది. దాంతో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో అవకాశాలకు కొదవలేదు. ముఖ్యంగా హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్ జీసీ), ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్), గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రిలయన్స్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, అస్సాం పెట్రోలియం లిమిటెడ్ తదితర కంపెనీల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. వేతనాలు చమురు రంగం అభివృద్ధి పథంలోనే ఉంటుంది. కాబట్టి పెట్రోలియం ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి.. చక్కటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరు ఆకర్షణీయ వేతనాలు సైతం అందుకోవచ్చు. పెట్రో లియం ఇంజనీరింగ్ కోర్సు పూర్తికాగానే వార్షిక ప్రారంభ వేతనం రూ.5 లక్షల నుండి రూ.8 లక్షల వరకు దక్కుతోంది. గేట్ ర్యాంకు ద్వారా ఓఎన్జీసీ లాంటి కంపెనీల్లో అవకాశం అందుకుంటే.. రూ.పది లక్షలకు పైగానే వార్షిక వేతనం అందుతుంది. అనుభవం ఉన్నవారికి గల్ఫ్ దేశాలలో భారీ వేతనాలు లభిస్తున్నాయి. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ విభాగాల్లో పని చేసేవారికి వేతనాలతోపాటు ఇతర అలవెన్సులు సైతం ఇస్తున్నారు. క్యాంపస్‌లోనే ఆఫర్స్ పెట్రోలియం రంగంలో అవకాశాలు ఏటే టా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పెట్రోలియం ఇంజనీరింగ్ ప్రత్యేక విభాగంగా అభివృద్ధి చెందింది. ఈ కోర్సు పూర్తిచేసినవారు క్యాంపస్ లోనే భారీ వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. కాకినాడ, జేఎన్టీయూలో 2010లో ఈ విభాగం ప్రారంభించాక.. ఆరు బ్యాచ్‌ల విద్యార్థులు బయటకు వెళ్లారు. అందరూ కెరీర్లో బాగా సెటిల్ అయ్యారు. ఓఎన్జీసీ, రియలన్స్ గ్యాస్ ఇండస్ట్రీస్ దగ్గరలో ఉండటం వల్ల అక్కడి నిపుణులతో మా విద్యార్థులకు లైవ్ ప్రాజెక్టుల్లో శిక్షణ ఇస్తున్నాం. పెట్రోలియం కోర్సులు చేసిన వారికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. – ప్రొఫెసర్ బి.బాలకృష్ణ, జేఎన్టీయూ–కే ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ -
బీటెక్ ఫస్టియర్.. ఇలా చేస్తే నో ఫియర్!
బీటెక్ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టాం.. నాలుగేళ్ల తర్వాత మంచి మార్కులతో పట్టా పొందితే చాలు.. కొలువు ఖాయమనే అభిప్రాయంతో చాలామంది విద్యార్థులు ఉంటారు. వాస్తవానికి కోర్సు పూర్తయ్యాక కోరుకున్న ఉద్యోగం దక్కాలంటే.. మార్కులతోపాటు మరెన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా లేటెస్ట్ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి. ఇండస్ట్రీ 4.0 స్కిల్స్ సొంతం చేసుకోవాలి. ఎందుకంటే.. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఈ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకే ఆఫర్లు ఇచ్చేందుకు సంస్థలు ముందుకొస్తున్నాయి! ఈ నేపథ్యంలో.. బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు.. తమ నాలుగేళ్ల స్టడీని ఎలా ప్లాన్ చేసుకోవాలి.. నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు తదితర అంశాలపై విశ్లేషణ.. బీటెక్‌లో అకడమిక్‌గా మంచి మార్కులతోనే కొలువుల కల సాకారమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు తమ బ్రాంచ్‌కు అనుగుణంగా నూతన టెక్నాలజీలపై పట్టు సాధించాలి. ఇందుకోసం బీటెక్ మొదటి సంవత్సరం నుంచే కృషి చేయాలన్నది నిపుణుల సలహా. డిజిటల్ యుగం ప్రస్తుతం అంతటా డిజిటల్ టెక్నాలజీ రాజ్యమేలుతోంది. అన్ని రంగాల్లోని సంస్థలూ ఆధునిక సాంకేతికతల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నైపుణ్యాలున్న వారికే నియామకాల్లో పెద్దపీట వేస్తున్నాయి. కాబట్టి బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు.. సదరు తాజా నైపుణ్యాలు, టెక్నాలజీలపై పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలి. బీటెక్ మూడో సంవత్సరంలోకి వచ్చాక నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తే సఫలం కాలేరు. ఎందుకంటే.. ఆ సమయంలో ఓవైపు తృతీయ, చివరి సంవత్సరాల అకడమిక్ ఒత్తిడి.. మరోవైపు ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్ట్ వర్క్, ప్లేస్‌మెంట్స్ వంటివి ఉంటాయి. బ్రాంచ్ ఏదైనా బీటెక్‌లో ఏ బ్రాంచ్ విద్యార్థులైనా సరే.. తమ విభాగానికి సరితూగే ఇండస్ట్రీ పరిణామాలను నిత్యం తెలుసుకోవాలి. డిజిటల్ నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. కోర్ బ్రాంచ్‌లు మొదలు సాఫ్ట్వేర్ కొలువులకు మార్గం వేసే సీఎస్ఈ, ఐటీ విద్యార్థుల వరకూ.. ప్రతి ఒక్కరూ ఆ దిశగా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇండస్ట్రీ 4.0 స్కిల్స్ ► ప్రస్తుతం బీటెక్ విద్యార్థులు ఇండస్ట్రీ 4.0 స్కిల్స్గా పేర్కొంటున్న నైపుణ్యాలను నేర్చుకోవడం తప్పనిసరిగా మారింది. కారణం.. కంపెనీలు ఈ స్కిల్స్ ఉన్న వారికే ఆఫర్లు ఖరారు చేస్తుండటమే! మొత్తం విద్యార్థుల్లో ఇండస్రీ ్ట4.0 స్కిల్స్ ఉన్న వారి సంఖ్య 20 నుంచి 25 శాతం మధ్యలోనే ఉంటోంది. దీంతో అవకాశాలున్నా.. నైపుణ్యాలు లేక ఎంతోమంది నిరాశకు గురవుతున్నారు. కాబట్టి బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు.. భవిష్యత్ అవకాశాలు అందుకోవాలంటే.. ఇప్పటి నుంచి ఆయా నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టిపెట్టాలి. (ఎన్డీఏ, ఎన్ఏ 2021: ఇంటర్‌తోనే.. కొలువు + చదువు) ► ఇండస్ట్రీ 4.0 స్కిల్స్గా పేర్కొంటున్న.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, 3డి డిజైన్, ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ, వీఆర్/ఏఆర్ టెక్నాలజీలు..ఉద్యోగ సాధనలో కీలకంగా మారుతున్నాయి. బీటెక్ విద్యార్థులు తొలి రోజు నుంచే వీటిని నేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఇంజనీరింగ్‌లో చేరిన లక్ష్యానికి అనుగుణంగా కెరీర్‌ను ఉజ్వలంగా మలచుకునే అవకాశం లభిస్తుంది. కళాశాలల్లో మౌలిక సదుపాయాల కొరత కారణంగా చాలామంది విద్యార్థులు లేటెస్ట్ స్కిల్స్ నేర్చుకోలేకపోతున్నారు. అలాంటి విద్యార్థులు ఆన్లైన్ మార్గాల్లో సొంతంగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కోడింగ్.. ప్రోగ్రామింగ్ ప్రస్తుతం ఉద్యోగ సాధనంలో కీలకంగా నిలుస్తున్న నైపుణ్యాలు.. కోడింగ్, ప్రోగ్రామింగ్. వాస్తవానికి ఇంజనీరింగ్ కోర్సు స్వరూపంలోనే వీటికి అకడమిక్‌గా ప్రాధాన్యం ఉంది. కాని ప్రాక్టికల్ అప్రోచ్ తక్కువగా ఉండటంతో ఈ నైపుణ్యాలు ఆశించినంతగా లభించట్లేదు. ము ఖ్యంగా సీఎస్ఈ/ఐటీ బ్రాంచ్‌ల విద్యార్థులు కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను ప్రాక్టికల్ అప్రోచ్‌తో నేర్చుకునేందుకు సిద్ధమవ్వాలి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, పైథాన్, ఆర్, జావా, సీ, సీ++, పీహెచ్‌పీ, ఎస్‌క్యూఎల్ డేటాబేస్ వంటివి నేర్చుకోవడంపై దృష్టిపెట్టాలి. మూక్స్, ఆన్లైన్ వేదికలు, షార్ట్‌టర్మ్ కోర్సులు, యూట్యూబ్ వీడియోల ద్వారా అవగాహన పెంచుకోవచ్చు. ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, రెడ్ హ్యా ట్, ఐబీఎం, జెట్ కింగ్ వంటి సంస్థలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిద్వారా సంబంధిత నైపుణ్యాలు పొందొచ్చు. సర్క్యూట్ బ్రాంచ్‌ల విద్యార్థులు ► ఈసీఈ, ఈఈఈ వంటి సర్క్యూట్ బ్రాంచ్‌ల విద్యార్థులు కూడా లేటెస్ట్ డిజిటల్ స్కిల్స్ సొంతం చేసుకునే దిశగా ఇప్పటి నుంచే కృషి చేయాలి. ► ఈసీఈ విద్యార్థులు వీఎల్ఎస్ఐ, నానో టెక్నాలజీ విభాగాల్లో షార్ట్‌టర్మ్ సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా జాబ్ మార్కెట్లో ముందుండొచ్చు. వీరికి కలిసొచ్చే మరికొన్ని సర్టిఫికేషన్ కోర్సులు.. ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ; ఇండస్ట్రియల్ ఆటోమేషన్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్; రోబోటిక్స్. ► ఈఈఈ విద్యార్థులు.. ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పవర్ సిస్టమ్స్ అనాలిసిస్, సర్క్యూట్ అనాలిసిస్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ వంటివి నేర్చుకోవాలి. వీటితోపాటు ఎస్సీఏడీఏ (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్), డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. వీటిని ఇప్పుడు పలు మార్గాల్లో నేర్చుకునే అవకాశం ఉంది. రోబోటిక్ స్కిల్స్ మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులు.. రోబోటిక్ స్కిల్స్‌పై ప్రధానంగా దృష్టిపెట్టాలి. దీంతోపాటు ఈ బ్రాంచ్ విద్యార్థులు క్యాడ్, క్యామ్; ఆటోమేషన్, 2–డి, 3–డి డిజైన్ ప్రింటింగ్లపైనా అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుతం రోబో ఆధారిత కార్యకలాపాలు అన్ని సంస్థల్లోనూ సాగుతున్నాయి. అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు రోబోటిక్ స్కిల్ మేలు చేస్తుందని చెప్పొచ్చు. వీటిని సొంతంగా అభ్యసించేందుకు పలు ఆన్లైన్ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రాక్టికల్, అప్లికేషన్ అప్రోచ్ మొదటి సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకు ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఏ అంశాన్నైనా ప్రాక్టికల్ ఓరియెంటేషన్, అప్లికేషన్ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. అందుకోసం లేబొరేటరీల్లో ఆయా సబ్జెక్ట్ అంశాలకు సంబంధించి ప్రాక్టికల్స్ చేసేందుకు ఎక్కువ సమయం కేటాయించాలి. తద్వారా రియల్ టైం నైపుణ్యాలు సొంతమవుతాయి. ఇంటర్న్షిప్స్ బీటెక్ కోర్సులో చేరిన విద్యార్థులు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా రియల్ టైమ్ నైపుణ్యాలు పెంచుకునేందుకు.. కనీసం రెండు లేదా మూడు ఇంటర్న్షిప్స్ చేయాలి. ఈ మేరకు ఏఐసీటీఈ కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. కాబట్టి విద్యార్థులు ఆయా విభాగాల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు పొందేందుకు గల మార్గాలను అన్వేషించాలి. ఇందుకోసం క్యాంపస్‌లోని ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్, ఆయా సంస్థల్లో పని చేస్తున్న సీనియర్ల సహకారం తీసుకోవాలి. ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా తాజా పరిస్థితులపై అవగాహన వస్తుంది. ప్రాక్టికల్ నైపుణ్యాలు మెరుగుపరచుకోవచ్చు. ఇంటర్న్‌గా చూపిన ప్రతిభ ఆధారంగా సదరు సంస్థల్లోనే పూర్తిస్థాయి ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. సాఫ్ట్ స్కిల్స్ బీటెక్ విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా ప్రాధాన్యమివ్వాలి. ప్రస్తుతం సంస్థల్లో టీం వర్క్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిచేసే క్రమంలో బృందంలోని సహోద్యోగులతోపాటు వివిధ విభాగాల సీనియర్లతో మాట్లాడాల్సి ఉంటుంది. ఆ క్రమంలో సాఫ్ట్ స్కిల్స్ ఎంతో ఉపయోగపడతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, బిహేవియరల్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ వంటివి ప్రధాన సాఫ్ట్‌స్కిల్స్‌గా చెప్పొచ్చు. ఆన్లైన్ సదుపాయాలు విద్యార్థులు ఇండస్ట్రీ 4.0 స్కిల్స్,సాఫ్ట్‌స్కిల్స్ పెంచుకునేందకు ఆన్లైన్ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవచ్చు. మూక్స్, ఎన్పీటీఈఎల్,స్వయం వంటి పోర్టల్స్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రొఫెసర్ల లెక్చర్స్ వినే అవకాశం లభిస్తుంది. ఇలా..ఒకవైపు అకడమిక్ నాలెడ్జ్, మరోవైపు ఇండస్ట్రీకి అవసరమైన లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా.. మొదటి ఏడాది నుంచే ముందుకుసాగితే.. బీటెక్ విద్యార్థులు తమ కలల కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. బీటెక్ మొదటి సంవత్సరం.. ముఖ్యాంశాలు ► బ్రాంచ్ ఏదైనా ఉద్యోగ సాధనలో కీలకం ఇండస్ట్రీ 4.0 స్కిల్స్. ► ప్రాక్టికల్ అప్రోచ్,అప్లికేషన్ ఓరియెంటేషన్ ఉంటేనే జాబ్ ఆఫర్స్. ► డిజిటల్ స్కిల్స్‌తోపాటు సాఫ్ట్ స్కిల్స్‌కూ ప్రాధాన్యమిస్తున్న సంస్థలు. లేటెస్ట్ స్కిల్స్ ఉంటేనే ఇప్పుడు ఏ బ్రాంచ్ విద్యార్థులైనా.. లేటెస్ట్ స్కిల్స్ ఉంటేనే ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా మెరుగ్గా రాణించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే తమ బ్రాంచ్‌కు సరితూగే టెక్నాలజీస్‌పై అవగాహన పొందేందుకు కృషి చేయాలి. అకడమిక్స్‌లో లెర్నింగ్‌తోపాటు ప్రాక్టికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. – ప్రొఫెసర్ ఎన్.వి.రమణరావు, డైరెక్టర్, నిట్–వరంగల్. -
After 10th Class: టెన్త్.. టర్నింగ్ పాయింట్!
కరోనా కారణంగా గతేడాది పదోతరగతి పరీక్షలు లేకుండానే విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది కూడా పరీక్షలు వాయిదా పడుతున్నాయి. వాస్తవానికి విద్యార్థి జీవితంలో పదో తరగతి అనేది ఎంతో కీలకమైన దశ. అందుకే టెన్త్ను ‘టర్నింగ్ పాయింట్’ అంటారు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా.. విద్యార్థికి మ్యాథమెటిక్స్‌పై ఆసక్తి ఉందా.. సైన్స్‌లో మంచి మార్కులు వచ్చాయా.. అతని స్కిల్ సెట్ ఏంటి అనే దానిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒక అంచనాకు వస్తారు. అందుకు అనుగుణంగా ఏ కోర్సులో చేరాలో, ఏ కెరీర్ ఎంచుకోవాలో సలహా ఇస్తుంటారు. పదో తరగతి తర్వాత ఎంచుకునే కోర్సు/ ఇంటర్మీడియట్లో చేరే గ్రూప్.. భవిష్యత్ గమ్యాన్ని నిర్దేశిస్తుంది. ఈ నేపథ్యంలో.. పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న వివిధ కోర్సులు, కెరీర్ మార్గాలపై ప్రత్యేక కథనం.. ప్రతి విద్యార్థి భవిష్యత్‌లో గొప్ప స్థాయికి చేరుకోవాలని; ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటారు. కొందరు డాక్టర్, మరికొందరు ఇంజనీర్, ఇంకొందరు లాయర్.. కలెక్టర్, పోలీస్ ఆఫీసర్, టీచర్.. ఇలా ఎన్నో కలలు కంటారు. ఈ కలలు సాకారం అవ్వాలంటే.. లక్ష్య సాధనకు సరైన సమయంలో సరైన మార్గాన్ని ఎంచుకోవడం ముఖ్యం! ఆ టర్నింగ్ పాయింటే.. పదో తరగతి!! పదో తరగతి తర్వాత విద్యార్థుల ముందు ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ బీటెక్, ఐటీఐ కోర్సులు కనిపిస్తాయి. వీటిలో ఒక కోర్సు ఎక్కువ.. మరో కోర్సు తక్కువ కాదు. అన్నింటికీ చక్కటి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అయితే, విద్యార్థి తన భవిష్యత్ లక్ష్యం ఏమిటి.. ఏం సాధించాలనుకుంటున్నారో ఆలోచించుకొని.. దాన్ని బట్టి కోర్సును ఎంపిక చేసుకోవడం ఉత్తమం. నాలుగు గ్రూపులు ► పదో తరగతి తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకునే మార్గం.. ఇంటర్మీడియట్. వారివారి ఆసక్తులకు అనుగుణంగా గ్రూపులను ఎంచుకుంటారు. ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ/ఎంఈసీ, హెచ్ఈసీ గ్రూపులున్నాయి. ► ఎంపీసీ: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉండే ఈ గ్రూప్‌లో ఎక్కువగా ఇంజనీరింగ్ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు చేరుతుంటారు. వీరు జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, ఎంసెట్, బిట్‌శాట్ వంటి ఎంట్రన్స్‌లు రాసి ఐఐటీలు, ఎన్ఐటీలు, బిట్స్ వంటి ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్స్లో బీటెక్/బీఈలో ప్రవేశం పొందొచ్చు. ఇక ఏపీ/టీఎస్ ఎంసెట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్/బీఈ కోర్సుల్లో చేరవచ్చు. ► బైపీసీ: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉండే.. ఈ గ్రూప్ చదివినవారు ‘నీట్’ ఎంట్రన్స్‌తో ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో ఎంసెట్(మెడికల్ అండ్ అగ్రికల్చర్)లో ర్యాంక్ ఆధారంగా అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్,ఫార్మసీ, ఫిజియోథెరఫీ వంటి కోర్సుల్లో చేరవచ్చు. ► సీఈసీ/ఎంఈసీ: కామర్స్ అంటే ఇష్టపడేవారు; చార్టర్డ్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ, సీఎంఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకునే వారు ఈ గ్రూపులు ఎంచుకుంటారు. ఇందులో కామర్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులను అధ్యయనం చేస్తారు. ► హెచ్ఈసీ: టీచింగ్ రంగంలో ప్రవేశించాలనుకునేవారు, ఎల్ఎల్బీ వంటి కోర్సులు చేయాలనుకునేవారు, సివిల్స్, గ్రూప్స్ పరీక్షలు రాయాలనుకునే వారు ఇంటర్మీడియట్లో హెచ్ఈసీ గ్రూప్ ఎంచుకుంటారు. ఇంటర్లో ఈ నాలుగు గ్రూపులతోపాటు రెండేళ్లు, ఏడాదిన్నర కాలవ్యవధి గల పలు ఒకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకేషన ల్ కోర్సులు పదో తరగతి తర్వాత సంప్రదాయ ఇంటర్మీడియట్ కోర్సులే కాకుండా.. సత్వర ఉపాధికి అవకాశం కల్పించే ఒకేషనల్ కోర్సుల్లో కూడా చేరొచ్చు. ► అగ్రికల్చర్ విభాగం: క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, డెయిరీయింగ్, ఫిషరీస్, సెరికల్చర్ కోర్సులు. ► బిజినెస్ అండ్ కామర్స్ విభాగం: అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, మార్కెటింగ్ అండ్ సేల్స్‌మెన్‌షిప్, ఆఫీస్ అసిస్టెంట్‌షిప్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్. ► ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగం: ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్, రూరల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్, డీటీపీ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ. ► హోమ్‌సైన్స్ విభాగం: కమర్షియల్ గార్మెంట్ డిజైనింగ్ అండ్ మేకింగ్, ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్, హోటల్ ఆపరేషన్స్, ప్రి స్కూల్ టీచర్ ట్రైనింగ్. ► వీటితోపాటు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టిపర్పస్ హెల్త్ వర్కర్, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ► రెండేళ్ల ఒకేషనల్ కోర్సులు ఉత్తీర్ణులైన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా సంబంధిత పాలిటెక్నికల్ కోర్సు రెండో ఏడాదిలో ప్రవేశించే అవకాశం ఉంది. ఉపాధికి భరోసా–ఐటీఐ ► ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్(ఐటీఐ).. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో కోర్సులు అందిస్తున్నాయి. విద్యార్థి ఆసక్తిని బట్టి అందుబాటులో ఉన్న కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా» టూల్ అండ్ డై మేకర్ ఇంజనీరింగ్ » డ్రాట్స్‌మన్(మెకానికల్) ఇంజనీరింగ్ » డీజిల్ మెకానిక్ ఇంజనీరింగ్ » డ్రాట్స్‌మన్ (సివిల్) ఇంజనీరింగ్ » పంప్ ఆపరేటర్ » ఫిట్టర్ ఇంజనీరింగ్ » మోటార్ డ్రైవింగ్ కమ్ మెకానిక్ ఇంజనీరింగ్ » టర్నర్ ఇంజనీరింగ్ » మ్యానుఫ్యాక్చరర్ ఫుట్‌వేర్ ఇంజనీరింగ్ » రిఫ్రిజిరేటర్ ఇంజనీరింగ్ » మెషినిస్ట్ ఇంజనీరింగ్ » హెయిర్ అండ్ స్కిన్ కేర్ » ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్ » సర్వేయర్ ఇంజనీరింగ్ » షీట్ మెటల్ వర్కర్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశం పొందొచ్చు. పాలిటెక్నిక్ కోర్సులు ► పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న మరో చక్కటి కోర్సు.. పాలిటెక్నికల్. ఈ డిప్లొమా కోర్సులకు విద్యార్థుల్లో మంచి ఆదరణ ఉంది. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో మెరుగైన ఉపాధి పొందేందుకు ఈ కోర్సులు దోహదం చేస్తాయి. మూడేళ్లు, మూడున్నరేళ్ల పాలిటెక్నిక్ కోర్సులు పూర్తికాగానే కంపెనీల్లో సూపర్వైజర్ స్థాయి కొలువులు దక్కించుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్తో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ఆసక్తి ఉంటే.. ఈసెట్ ద్వారా బీటెక్/బీఈ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో చేరవచ్చు. ► పాలిసెట్‌తో ప్రవేశాలు: తెలుగు రాష్ట్రాల్లో టీఎస్ పాలిసెట్/ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. పదో తరగతి అర్హతతో పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఎంట్రన్స్‌లో సాధించిన ర్యాంక్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశం లభిస్తుంది. ► పాలిటెక్నిక్ కోర్సులివే: సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, డెయిరీ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, టెక్స్టైల్ కెమిస్ట్రీ, గ్లాస్ అండ్ సిరామిక్ ఇంజనీరింగ్, లెదర్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ఇంటీరియర్ డెకరేషన్ అండ్ డిజైన్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గార్మెంట్ టెక్నాలజీ, ప్లాస్టిక్ అండ్ మౌల్డ్ టెక్నాలజీ, హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సర్వీస్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటనెన్స్, డిప్లొమా ఇన్ హోమ్‌సైన్స్, డిప్లొమా ఇన్ ఫార్మసీ తదితర పాలిటెక్నిక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. -
ఇగ్నో నుంచి ఎంబీఏ చేయటం ఎలా?
ఇగ్నో నుంచి ఎంబీఏ చేయటం ఎలా? -శ్రీధర్, నిర్మల్. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో), స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ద్వారా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) కోర్సును అందిస్తుంది. కోర్సు కాల వ్యవధి: రెండున్నరేళ్లు. అర్హత: 50 శాతం మార్కులతో (రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు 45 శాతం) ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు మేనేజీరియల్/ సూపర్ వైజర్/సంబంధిత వృత్తిలో మూడేళ్ల అనుభవం. లేదా 50 శాతం మార్కులతోపాటు ప్రొఫెషనల్ డిగ్రీ (ఇంజినీరింగ్ /మెడిసిన్/సీఏ/ఐసీడబ్ల్యూఏఐ)/కంపెనీ సెక్రటరీషిప్/లా. జాతీయ స్థాయిలో నిర్వహించే ఓపెన్‌మ్యాట్ పరీక్ష ద్వారా ఎంబీఏ కోర్సులో ప్రవేశం క ల్పిస్తారు. సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు ఫిబ్రవరి, ఆగస్టులలో ఓపెన్మ్యాట్ను నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎంబీఏలో ఆఫర్ చేస్తున్న స్పెషలైజేషన్స్: హెచ్ఆర్ఎం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్షియల్ మార్కెట్స్. వివరాలకు: www.ignou.ac.in పలంటాలజీ కోర్సుకు సంబంధించిన వివరాలను తెలపండి? -బాలు, నిజామాబాద్. పలంటాలజీ అంటే శిలాజ అధ్యయన శాస్త్రం. దీనిలో చరిత్ర పూర్వకాల అధ్యయనంతోపాటు శిలాజాల అధ్యయనం వంటి అంశాలు ఈ శాస్త్రంలో ఉంటాయి. ఎలాంటి వాతావరణ మార్పులకు అనుగుణంగా భూమి పరిణామం చెందింది అనే విషయాలను గురించి వివరిస్తుంది. బయాలజీ, జియాలజీ, ఆర్కియాలజీల అంశాలను వివరించే మల్టీడిసిప్లినరీ కోర్సుగా పలంటాలజీని పేర్కొంటారు. ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు: ఉస్మానియా యూనివర్సిటీ -హైదరాబాద్ కోర్సు: అప్లయిడ్ జియాలజీ(పలంటాలజీ ఒక సబ్జెక్ట్‌గా) అర్హత: 40 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్‌లో బ్యాచిలర్ డిగ్రీ. ప్రవేశం: ఎంట్రన్స్ ఆధారంగా వివరాలకు: www.osmania.ac.in ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం కోర్సు: ఎంఎస్సీ జియాలజీ, ఎంఎస్సీ(టెక్-అప్లయిడ్ జియాలజీ, (పలంటాలజీ ఒక సబ్జెక్ట్‌గా) అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ ఉత్తీర్ణత. ప్రవేశం: ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా వివరాలకు: www.andhrauniversity.edu.in స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన కోర్సుల వివరాలను తెలపండి? నరేందర్, సికింద్రాబాద్. మానసిక, శారీరక వైకల్యాలతో బాధపడుతూ, సాధారణ పిల్లలతో సమానంగా పోటీ పడలేని చిన్నారులకు బోధించేందుకు అవసరమైన..బోధనా పద్ధతుల్లో శిక్షణనిచ్చేదే స్పెషల్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం ఈ విభాగంలో మెంటల్ రిటార్డేషన్, హియరింగ్, విజువల్, ఆటిజం, ఇంపెయిర్మెంట్, లెర్నింగ్ డిజబిలిటీ విభాగాల్లో డీఈడీ, బీఈడీ, ఎంఈడీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సుల కరిక్యులం రూపకల్పన, కళాశాలల గుర్తింపు, పర్యవేక్షణ బాధ్యతలను రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఈ కోర్సులను పూర్తి చేసిన వారు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టుల కింద నడిచే పాఠశాలలు, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని పాఠశాలల్లో టీచర్‌గా, వివిధ ఆస్పత్రులు, రిహాబిలిటేషన్ సెంటర్లలో ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా, రెగ్యులర్ ప్రీస్కూళ్లు, వివిధ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా సేవలందించవచ్చు. మన రాష్ట్రంలో.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ - సికింద్రాబాద్; స్వీకార్ రిహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యాండీక్యాప్డ్-సికింద్రాబాద్; ఆంధ్రా యూనివర్సిటీ -విశాఖపట్నం (www.andhrauniversity.edu.in); శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం- తిరుపతి (www.spmvv.ac.in); కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ - ఆంధ్ర మహిళా సభ-హైదరాబాద్ (www. andhramahilasabha.org.in) బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సును అందిస్తున్నాయి. ఠాగూర్ హరిప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ తదితర ఇన్స్టిట్యూట్లలో కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వివరాలకు: http://rehabcouncil.nic.in ఎంబీఏ (ఫార్మా మేనేజ్మెంట్) కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? -ప్రవీణ్, కరీంనగర్. ఫార్మసీ రంగానికి నూతన ఔషధాలను కనిపెట్టడంతోపాటు వాటిని మార్కెటింగ్ చేయడం కూడా సవాలుగా మారింది. దాంతో పలు ఫార్మా కంపెనీలు మార్కెటింగ్ సంబంధిత విభాగాలను పర్యవేక్షించడం కోసం వృత్తి నిపుణులను నియమించుకుంటున్నాయి. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పలు విద్యాసంస్థలు ఫార్మసీ రంగంలో మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సు చేయడం ద్వారా ఫార్మాస్యుటికల్, కెమికల్, బయోటెక్నాలజీ సంస్థలు, పరిశోధన, విద్యాసంస్థల్లో మేనేజిరియల్ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆఫర్ చేస్తున్న సంస్థలు: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పంజాబ్. వెబ్సైట్: www.niper.nic.in నర్సీమొంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ముంబై వెబ్సైట్: www.nmims. edu -
ఎంబీఏ పెట్రోలియం మేనేజ్మెంట్ కోర్సు...
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులు అందిస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి? - శ్రీధర్, నిర్మల్ విమానాలు, హెలికాప్టర్లు, అంతరిక్ష నౌకలు, క్షిపణులు మొదలైన వాటి తయారీ, నిర్వహణ గురించి తెలియజేసేదే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సు. ఇది విమాన రంగం, అంతరిక్ష పరిశోధనలు, రక్షణ వ్యవస్థకు వెన్నెముక. సంస్థల వివరాలు: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.jntuh.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తోంది. గేట్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పుణే.. ఎంటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తోంది. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.diat.ac.in అవకాశాలు: కోర్సు పూర్తయిన తర్వాత పౌర విమానయాన రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు ప్రభుత్వ విభాగాలు, పరిశోధన సంస్థలు, విద్యా సంస్థల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, భారత వైమానిక దళం, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్), నేషనల్ ఏరోనాటిక్స్ లేబొరేటరీలకు ప్రస్తుతం ఏరోస్పేస్ ఇంజనీర్ల అవసరం ఎంతో ఉంది. ఎయిర్‌హోస్టెస్ కావాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? కోర్సుల వివరాలు తెలియజేయండి? - శరత్, నిజామాబాద్. ఎయిర్‌హోస్టెస్ కెరీర్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఈ కెరీర్ సవాళ్లతో కూడుకున్నది. విమానంలో ప్రయాణించే వారికి అవసరమైన సేవలందించడమే ఎయిర్‌హోస్టెస్ విధి. ఎయిర్‌హోస్టెస్ కావాలంటే ప్రాథమికంగా కొన్ని అర్హతలు ఉండాలి. అభ్యర్థులకు ఎలాంటి దృష్టిలోపాలు ఉండకూడదు. ఇంగ్లిష్, హిందీ భాషలలో స్పష్టంగా మాట్లాడగలగాలి. విదేశీ భాషలు తెలిసుంటే అదనపు అర్హత అవుతుంది. ఎంపికకు అవసరమయ్యే అర్హతలు: అభ్యర్థి వయసు 18-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎత్తు 160 సెం.మీపైన ఉండాలి. 10+2 ఉత్తీర్ణత అవసరం. రాతపరీక్ష, ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరచాలి. కోర్సులు అందిస్తున్న సంస్థలు: ఫ్రాంక్ఫిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్‌హోస్టెస్, సికింద్రాబాద్. వెబ్సైట్: www.frankfinn.com కేతన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్. వెబ్సైట్: www.ketansinstitute.com ఏపీ టెక్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ అకాడమీ, హైదరాబాద్. వెబ్సైట్: www.aptechaviationacademy.com సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న కోర్సులేవి? - సతీష్, కరీంనగర్. కోల్‌కతాలోని సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్..కేంద్ర ప్రభుత్వ ప్రసార మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో పని చేస్తోంది. ఈ ఇన్స్టిట్యూట్ మూడేళ్ల పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ సినిమా కోర్సును అందిస్తోంది. స్పెషలైజేషన్స: డెరైక్షన్ అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, ప్రొడ్యూసింగ్ ఫర్ సినిమా అండ్ టీవీ, సౌండ్ రికార్డింగ్ అండ్ డిజైన్. ఈ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్. దేశ వ్యాప్త నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. రాత పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలోని మెంటల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంద రికీ కామన్‌గా ఉంటుంది. అభ్యర్థులు ఎంచుకున్న స్పెషలైజేషన్స ఆధారంగా రెండో విభాగంలో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్కులు ఉండవు. వెబ్సైట్: www.srfti.gov.in పెట్రోలియం, గ్యాస్, చమురు రంగాలకు సంబంధించి ఎంబీఏ మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్న సంస్థల వివరాలు తెలియజేయగలరు? - అనిత, మహబూబ్‌నగర్ ఎంబీఏ- పెట్రోలియం మేనేజ్మెంట్ కోర్సును అందిస్తున్న సంస్థలు భారతదేశంలో తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, రాయ్‌బరేలీ (ఉత్తరప్రదేశ్).. పెట్రోలియం అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్లో ఎంబీఏ కోర్సును అందిస్తోంది. అర్హత-ఎంపిక విధానం: ఏదైనా గుర్తింపు పొందిన సంస్థలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి. ప్రవేశపరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.rgipt.ac.in యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్).. ఆయిల్ అండ్ గ్యాస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ కోర్సును అందిస్తోంది. వెబ్సైట్: www.upesindia.org స్కూల్ ఆఫ్ పెట్రోలియం మేనేజ్మెంట్, గాంధీనగర్ (గుజరాత్).. చమురు, గ్యాస్ రంగానికి సంబంధించి ఎంబీఏ కోర్సును అందిస్తోంది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. క్యాట్ స్కోర్, జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభకు ప్రాధాన్యం. -
ఎన్ఐడీ ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలు..
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలు తెలపండి? - చరణ్, గద్వాల్. దేశంలోని ప్రముఖ డిజైనింగ్ స్కూళ్లలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) ఒకటి. ఈ సంస్థకు అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరులలో క్యాంపస్‌లు ఉన్నాయి. కోర్సుల వివరాలు: గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం ఇన్ డిజైనింగ్ (జీడీపీడీ). స్పెషలైజేషన్లు: ఇండస్ట్రియల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, టెక్స్టైల్స్ డిజైన్. అర్హత : ఇంటర్ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత. వ్యవధి: నాలుగేళ్లు ప్రవేశాలు: డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీఏటీ) ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం ఇన్ డిజైనింగ్ (పీజీడీపీడీ). ఈ కోర్సు అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు క్యాంపస్‌లలో ఉంది. స్పెషలైజేషన్లు: ప్రొడక్ట్ డిజైన్, ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్, సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్ ఫిల్మ్ డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్, టెక్స్టైల్స్ డిజైన్, ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఆటోమొబైల్, టాయ్ అండ్ గేమ్, ఫొటోగ్రఫీ, అపెరల్, లైఫ్ స్టైల్ యాక్సెసరీస్, న్యూమీడియా. అర్హత: ఎంపిక చేసుకున్న ప్రోగ్రాంను బట్టి ఆయా ప్రోగ్రాంలో నాలుగేళ్ల డిగ్రీ లేదా డిప్ల్లొమా (10+2+4) కోర్సు చేసి ఉండాలి. వ్యవధి: మూడేళ్లు ప్రవేశం: డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డీఏటీ) ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. డిజైనింగ్‌లో యూజీ కోర్సులను అహ్మదాబాద్ క్యాంపస్ మాత్రమే ఆఫర్ చేస్తుంది. వివరాలకు: www.nid.edu కెరీర్: డిజైనింగ్ కోర్సులు పూర్తిచేసిన తర్వాత ఎంచుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా వివిధ రంగాల్లో అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్, ఫ్యాషన్, ఆర్కిటెక్చర్, ఎంటర్టైన్మెంట్, ఇంటీరియర్ డిజైన్, అడ్వర్టైజింగ్, ఐటీ వంటి నిత్య నూతన వస్తువులను ఉత్పత్తి చేసే రంగంలో అవకాశాలను దక్కించుకోవచ్చు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ప్రవేశ ప్రక్రియ వివరాలను తెలపండి? -మధు, మెదక్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న ఆసియా ఆర్థిక వ్యవస్థను ఉన్నత శిఖరాల దిశగా నడిపించడానికి అవసరమైన, సమర్థవంతమైన బిజినెస్ లీడర్సను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ఏర్పాటైంది. ఈ ఇన్స్టిట్యూట్కు హైదరాబాద్, మొహాలీ (పంజాబ్)లలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఐఎస్బీ.. షార్ట్ టర్మ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (పీజీపీ) ఇన్ మేనేజ్మెంట్, డాక్టోరల్ డిగ్రీతో సమానమైన ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలోషిప్ వంటి కోర్సులను ఆఫర్ చేస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థుల కోసం ఐఎస్బీ యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తుంది. పీజీపీలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, స్ట్రాటజీ అండ్ లీడర్షిప్ వంటి ఎలక్టివ్స్ ఉన్నాయి. ప్రతి కోర్సుకు భిన్నమైన ప్రవేశార్హతలను ఐఎస్బీ నిర్దేశించింది. సాధారణంగా జీమ్యాట్ స్కోర్, మేనేజీరియల్ అనుభవం, నాయకత్వ లక్షణాలు వంటి అంశాలాధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. వివరాలకు: www.isb.edu రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆఫర్ చేసే పీహెచ్డీ కోర్సు వివరాలను తెలపండి? - శ్రీధర్, నిజామాబాద్. భారత ప్రభుత్వ అణు శక్తి విభాగం ఏర్పాటు చేసిన ప్రధాన పరిశోధన సంస్థల్లో రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ-ఇండోర్ ఒకటి. ఈ ఇన్స్టిట్యూట్ యాక్సిలేటర్స్, లేజర్స్ సంబంధిత అంశాల్లో పీహెచ్డీ కోర్సును అందిస్తుంది. ఈ కోర్సులో ఏడాది కోర్సు వర్క్, నాలుగేళ్ల రీసెర్చ్ వర్క్ ఉంటుంది. అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎంఎస్సీ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ లైఫ్ సెన్సైస్). సీఎస్ఐఆర్-యూజీసీ నెట్లో నిర్దేశిత అర్హత సాధించిన విద్యార్థులకు నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వివరాలకు: www.cat.ernet.in ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్ఎం)-ధన్‌బాద్ అందించే ఎంబీఏ కోర్సులో చేరేందుకు అర్హత, ప్రవేశ ప్రక్రియ విధానాన్ని తెలపండి? - శేఖర్, సంగారెడ్డి ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్ఎం)-ధన్‌బాద్, రెండేళ్ల ఎంబీఏ, మూడేళ్ల ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ కోర్సులను అందిస్తుంది. ఎంబీఏ (రెండేళ్ల కోర్సు): 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు కోర్సులో చేరేందుకు అర్హులు. ప్రవేశాలు: క్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (మూడేళ్ల కోర్సు): 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. పేరున్న ప్రభుత్వ, ప్రైవేటు, సెమీ గవర్నమెంట్ సంస్థల్లో ఎగ్జిక్యూటివ్/సూపర్వైజర్గా ఏడాది అనుభవం అవసరం. ప్రవేశం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వివరాలకు: www.ismdhanbad.ac.in -
ఎంఎస్సీ జియో ఫిజిక్స్ కెరీర్ అవకాశాలు..
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ను అందిస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి? - ప్రవీణ్, నల్లగొండ. స్టాటిస్టిక్స్.. న్యూమరికల్ డేటా సేకరణ, నిర్వహణ, విశ్లేషణకు సంబంధించినది. దీని అప్లికేషన్స్‌ను ఇన్సూరెన్స్, ఫైనాన్స్, మెడిసిన్, సైకాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ తదితర విభాగాల్లో ఉపయోగిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో స్టాటిస్టిక్స్ బాగా ఉపయోగపడుతుంది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కోల్‌కతా.. స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. అడ్వాన్స్డ్ ప్రాబబిలిటీ, యాక్చూరియల్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ తదితర స్పెషలైజేషన్లతో కోర్సు అందుబాటులో ఉంది. అకడమిక్ రికార్డ్‌తో పాటు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.isical.ac.in ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.. స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో గ్రాడ్యుయేషన్. ఎంట్రన్స్‌తో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.osmania.ac.in ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.andhrauniversity.edu.in శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి.. స్టాటిస్టిక్స్; అప్లైడ్ స్టాటిస్టిక్స్; స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులతో బీఏ లేదా బీఎస్సీ. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: svuniversity.ac.in కెరీర్: స్టాటిస్టిక్స్‌లో పీజీ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అవకాశాలుంటాయి. స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ అనలిస్ట్, స్టాటిస్టికల్ ఇన్స్పెక్టర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ తదితర అవకాశాలను అందుకోవచ్చు. ప్రైవేటు రంగంలో మార్కెటింగ్ సంస్థలు, మార్కెట్ రీసెర్చ్ కన్సల్టెన్సీలు, మార్కెటింగ్- ఆర్ అండ్ డీ విభాగాలు, విద్యాసంస్థల్లో ఉన్నత అవకాశాలు అందుబాటులో ఉంటాయి. బార్క్ అందిస్తున్న పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల వివరాలు తెలియజేయండి? - నాగార్జున, సూర్యాపేట. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్- ముంబై).. భారత్‌లో రేడియేషన్ రక్షణ, మౌలిక వసతులను పటిష్టం చేసేందుకు పరిశోధనలు చేపడుతోంది. రేడియేషన్ భద్రతకు సంబంధించి మానవ వనరులను అభివృద్ధి చేసేందుకు పలు కోర్సులను ఆఫర్ చేస్తోంది. రేడియేషన్, రేడియో ఐసోటోపుల వివిధ అనువర్తనాల నియంత్రణ అవసరాలను తీర్చేలా ఈ ప్రోగ్రామ్‌లకు రూపకల్పన చేశారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ కోర్సుల కరిక్యులంలో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. బార్క్.. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రేడియాలజికల్ ఫిజిక్స్‌ను అందిస్తోంది. అర్హత: ఎంఎస్సీ ఫిజిక్స్. ఈ కోర్సును ఏడాది కాల వ్యవధితో అందిస్తున్నారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్బీ).. ఆర్‌ఎస్‌వో లెవెల్-3 సర్టిఫికేషన్‌కు అర్హత సాధిస్తారు. వెబ్సైట్: barc.gov.in ఎంఎస్సీ జియో ఫిజిక్స్ కెరీర్ అవకాశాలను తెలపగలరు? - నీలిమ, రాజమండ్రి. జియో ఫిజిక్స్ అనేది ఎర్త్ సైన్స్‌లో ప్రత్యేక విభాగం. ఇది భూమి, భూ అంశాల స్వభావాన్ని వివరిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎర్త్‌సైన్స్, ఐఐటీ బాంబే.. ఎంఎస్సీ- అప్లైడ్ జియో ఫిజిక్స్‌లో ఎంఎస్సీని ఆఫర్ చేస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్/ఫిజిక్స్‌తో పాటు జియాలజీ, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సెన్సైస్‌లో ఒక సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేయాలి. జామ్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.iitb.ac.in ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. జియో ఫిజిక్స్‌లో ఎంఎస్సీ (టెక్) కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లతో బీఎస్సీ. వెబ్సైట్: www.andhrauniversity.edu.in ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్- ధన్‌బాద్.. మూడేళ్ల కాల వ్యవధితో టెక్ ఇన్ అప్లైడ్ జియో ఫిజిక్స్ ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.ismdhanbad.ac.in ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.. ఎంఎస్సీ జియో ఫిజిక్స్ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌తో బీఎస్సీ. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.osmania.ac.in కెరీర్: జియో ఫిజిక్స్ ప్రొఫెషనల్స్‌కు ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలలో ఉన్నత అవకాశాలుంటాయి. ఎన్జీఆర్ఐ, ఓఎన్జీసీ, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వంటివి జియో ఫిజిక్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి. విప్రో సాఫ్ట్వేర్ టెక్నాలజీ అకాడమీ (WiSTA) కోర్సుల వివరాలు తెలియజేయండి? - అనిత, గుంటూరు. విప్రో సాఫ్ట్వేర్ టెక్నాలజీ అకాడమీ (WiSTA).. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంఎస్ ప్రోగ్రామ్ చేసేందుకు వీలు కల్పిస్తోంది. ఈ ప్రోగ్రామ్ కాల వ్యవధి నాలుగేళ్లు. ఇది ఒకవైపు ఆర్జిస్తూ మరోవైపు చదువుకునేందుకు వీలుకల్పించే ప్రోగ్రామ్. కోర్సు పూర్తయిన తర్వాత విట్ యూనివర్సిటీ-వెల్లూరు నుంచి డిగ్రీ అందుతుంది. అర్హత: గ్రాడ్యుయేషన్ ప్రవేశాలు: ఎంట్రన్స్ టెస్ట్, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఇన్స్ట్రుమెంటేషన్లో ఎంటెక్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తున్న సంస్థలేవి? - దివాకర్, కర్నూలు. ఇన్స్ట్రుమెంటేషన్లో ఎంటెక్‌ను అందిస్తున్న సంస్థలు: ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం వెబ్సైట్: www.andhrauniversity.edu.in జేఎన్టీయూ, హైదరాబాద్. వెబ్సైట్: www.jntuh.ac.in శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి వెబ్సైట్: svuniversity.ac.in కెరీర్: ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, టెలి కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. -
నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల వివరాలు..
టి.మరళీధరన్ టీఎంఐ నెట్ వర్క్ ఎంఎస్సీ (అప్లైడ్ మ్యాథమెటిక్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థలు, కోర్సు పూర్తి చేసిన వారికి ఉండే అవకాశాల వివరాలు తెలియజేయగలరు? - భరత్, కామారెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.. ఎంఎస్సీ (అప్లైడ్ మ్యాథమెటిక్స్) కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: బీఎస్సీ (మ్యాథమెటిక్స్). ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.osmania.ac.in యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్.. మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్‌తో బీఎస్సీ. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.uohyd.ernet.in ఐఐటీ, రూర్కీ.. ఎంఎస్సీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కోర్సును అందిస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో బీఎస్సీ. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (జామ్)లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.iitr.ac.in, www.iitg.ac.in బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెస్రాలో ఎంఎస్సీ (అప్లైడ్ మ్యాథ్స్) అందుబాటులో ఉంది. అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీ లేదా తత్సమాన కోర్సును పూర్తిచేసుండాలి. పదో తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.bitmesra.ac.in కోర్సు పూర్తి చేసిన తర్వాత రీసెర్చ్, కంప్యుటేషన్, డేటా మైనింగ్, బయోఇన్ఫర్మాటిక్స్, ఫైనాన్స్, ఎకనామిక్స్ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. సీబీఐలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాన్ని సాధించాలంటే ఏం చేయాలి? - చరణ్, గద్వాల్. సీబీఐలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి ఎస్ఎస్సీ ఏటా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షను నిర్వహిస్తోంది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. అభ్యర్థి వయసు 25 ఏళ్లకు మించకూడదు. పరీక్ష మూడు దశల్లో ఉంటుంది. అవి: టైర్ 1 రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానం). టైర్ 2 మెయిన్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానం). టైర్ 3 పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్. కేంద్ర పోలీసు సంస్థలో (సీపీవోలు)లో ఎస్సై ఉద్యోగాన్ని ఎంపిక చేసుకునే అభ్యర్థులు టైర్ 1 పరీక్ష పూర్తయిన తర్వాత ఫిజికల్/మెడికల్ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెబ్సైట్: ssc.nic.in ఐఐటీ ఖరగ్‌పూర్ ఆఫర్ చేస్తున్న బ్యాచిలర్ ఆఫ్ లా కోర్సు వివరాలు తెలియజేయండి? - విజయ్, వరంగల్. రాజీవ్‌గాంధీ స్కూల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా, ఐఐటీ ఖరగ్‌పూర్.. ఇంటతలెక్చువల్ ప్రాపర్టీలో బ్యాచిలర్ ఆఫ్ లా కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇది మూడేళ్ల వ్యవధి గల కోర్సు. మూడు సెమిస్టర్లుంటాయి. ఈ కోర్సుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది. ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్/ ఎల్‌శాట్ ఇండియా/ఎల్‌శాట్ గ్లోబల్; జీడీ; పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్షలో ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ ఎబిలిటీ, బేసిక్ సైన్స్, లీగల్ ఆప్టిట్యూడ్ అండ్ ఎస్సేలపై ప్రశ్నలుంటాయి. వెబ్సైట్: www.rgsoipl.iitkgp.ernet.in నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలపగలరు? - శ్రీకాంత్, విశాఖపట్నం. కంప్యూటర్ నెట్వర్క్ ఇంజనీర్లకు ఆపరేటింగ్ సిస్టమ్స్, మైక్రోప్రాసెసర్స్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, కంప్యూటర్ నెట్వర్క్ రూపకల్పన, నిర్వహణ, ట్రబుల్ షూటింగ్ టెక్నిక్స్ వంటి వాటిపై అవగాహన ఉండాలి. జేఎన్టీయూ, హైదరాబాద్.. ఎంటెక్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కోర్సును ఆఫర్ చేస్తోంది. ప్రవేశాలు: ఎంట్రన్స్ టెస్ట్/ గేట్లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. ఎంటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ప్రవేశాలు: ఏయూ సెట్, గేట్లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.andhrauniversity.info కలశలింగం యూనివర్సిటీ, తమిళనాడు.. నెట్వర్క్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ అస్యురెన్స్ అండ్ సెక్యూరిటీలో ఎంటెక్‌ను అందిస్తోంది. అర్హత: బీఈ/బీటెక్ (ఈఈఈ)/ ఈసీఈ/ ఈఐ/ ఐసీ/ ఐటీ/ సీఎస్ఈ లేదా ఎలక్ట్రానిక్స్. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.kalasalingam.ac.in అమృత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, కోయంబత్తూర్.. కంప్యుటేషనల్ ఇంజనీరింగ్ అండ్ నెట్వర్కింగ్లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. అర్హత: బీఈ/ బీటెక్‌ను 60 శాతం మార్కులతో పూర్తిచేసుండాలి. లేదా మ్యాథమెటిక్స్/ ఫిజిక్స్/ కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్సీని కనీసం 70 శాతం మార్కులతో పూర్తిచేసుండాలి. వెబ్సైట్: www.amrita.edu మెకట్రానిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అందిస్తున్న సంస్థలేవి? - శ్రీకాంత్, గుంటూరు. మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ల మేళవింపు మెకట్రానిక్స్. మెకానికల్ వ్యవస్థలకు సంబంధించిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అంశాలను మెకట్రానిక్స్ వివరిస్తుంది. రోబోటిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మెకట్రానిక్స్ నిపుణుల అవసరం ఉంటుంది. కోర్సులను అందిస్తున్న సంస్థలు: విట్ యూనివర్సిటీ, వెల్లూరు.. మెకట్రానిక్స్‌లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.vit.ac.in అమిటీ యూనివర్సిటీ, నోయిడా.. మెకట్రానిక్స్‌లో ఎంటెక్‌ను అందిస్తోంది. వెబ్సైట్: www.amity.edu -
ఎంఆర్క్ కోర్సు వివరాలు తెలపండి...
టి. మురళీధరన్, టి.ఎం.ఐ. నెట్వర్క్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఎంఈ/ఎంటెక్‌ను ఆఫర్ చేస్తున్న సంస్థలేవి? - నరేందర్, నెల్లూరు. మెడిసిన్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఇన్స్ట్రుమెంటేషన్ అప్లికేషన్స్ అవసరమవుతాయి. కోర్సుల వివరాలు: జేఎన్టీయూ, హైదరాబాద్.. ఇన్స్ట్రుమెంటేషన్లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. అర్హత: ఈఈఈ/ఈసీఈ/ఈఐఈ/ ఐసీఈలో బీఈ/బీటెక్. గేట్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.jntuh.ac.in ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. ఇన్స్ట్రుమెంటేషన్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్‌ను అందిస్తోంది. అర్హత: ఈసీఈ/ఈఈఈ లేదా సంబంధిత సబ్జెక్టులో బీఈ/ బీటెక్. గేట్ లేదా పీజీఈ సెట్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.andhrauniversity.edu.in శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి.. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. అర్హత: ఈఈఈ/ ఈసీఈ/ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా కంట్రోల్ ఇంజనీరింగ్. వెబ్సైట్: www.svuniversity.ac.in కెరీర్: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ రంగాల్లో అవకాశాలుంటాయి. ఇండియన్ రైల్వేస్, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ద్వారా ఉన్నత ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. బి.ఫార్మసీ పూర్తిచేశాను. సాస్ (A) కోర్సును అందించే సంస్థల వివరాలు తెలియజేయండి? - సునీత, ఖమ్మం. క్లినికల్ పరీక్షలకు సంబంధించిన డేటాను విశ్లేషించేందుకు ఉపయోగపడే సాఫ్ట్వేర్.. సాస్ (అ). సాస్-క్లినికల్ అనేది సాస్‌లో ఒక మాడ్యూల్. ఇది క్లినికల్ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని వేగంగా విశ్లేషించేందుకు, నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది. కోర్సుల వివరాలు: బయో మెడ్ ఇన్ఫర్మాటిక్స్, మెడ్విన్ హాస్పిటల్స్, నాంపల్లి.. సాస్- బయోస్టిక్స్ అండ్ ప్రాజెక్టు ఇన్ క్లినికల్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. కోర్సు కాల వ్యవధి 45 రోజులు. అర్హత: ఎంబీబీఎస్, ఎండీ, బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఏఎంఎస్, బీపీటీ/ ఎంఎస్సీ (మైక్రోబయాలజీ)/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయో ఇన్ఫర్మాటిక్స్/ కెమిస్ట్రీ/ జెనెటిక్స్/ బోటనీ/ జువాలజీ/ లైఫ్ సెన్సైస్/ బయో మెడికల్ జెనెటిక్స్/ మాలిక్యులర్ బయోసెన్సైస్/ స్టాటిస్టిక్స్/ నర్సింగ్. లేదా బి.ఫార్మసీ/ ఎం.పార్మసీ/ బీటెక్ (బయోటెక్నాలజీ). ప్రవేశాలు: ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: http://biomedlifesciences.com శ్రీ టెక్నాలజీస్, అమీర్‌పేట్.. సాస్ క్లినికల్ కోర్సును అందిస్తోంది. కోర్సు కాల వ్యవధి 40 రోజులు. అర్హత: గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత. లైఫ్ సెన్సైస్ నేపథ్యం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం. వెబ్సైట్: www.sreetechnologies.com Bened Software Solution, అమీర్‌పేట్.. సాస్ క్లినికల్ కోర్సును అందిస్తోంది. కోర్సు కాల వ్యవధి 30 రోజులు. అర్హత: గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత. వెబ్సైట్: www.benedsoft.com కెరీర్: సాస్‌లో శిక్షణ తీసుకున్న వారికి ఫార్మాస్యూటికల్, బయో టెక్నాలజీ, క్లినికల్ ట్రయల్స్ కంపెనీల్లో అవకాశాలు లభిస్తాయి. మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలియజేయగలరు? -రవి కిషోర్, కర్నూలు నివాస భవంతులు, అపార్టుమెంట్లు, విల్లాలు, షాపింగ్‌మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు.. వంటి నిర్మాణాల రూపకల్పనకు సంబంధించిన అంశాలను ఆర్కిటెక్చర్.. శాస్త్రీయ కోణంలో వివరిస్తుంది. వివిధ సంస్థలు ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్, మాస్టర్స్, పరిశోధన స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్; ఇండస్ట్రియల్ డిజైన్; అర్బన్ డిజైన్; ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్; బిల్డింగ్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ స్పెషలైజేషన్లతో ఆర్కిటెక్చర్లో మాస్టర్స్ కోర్సు (ఎంఆర్క్) అందుబాటులో ఉంది. ఎంఆర్క్‌ను ఆఫర్ చేస్తున్న సంస్థలు: జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, హైదరాబాద్.. కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, కన్జర్వేషన్ ప్లానింగ్, ప్రాపర్టీ డెవలప్మెంట్లతో ఎంఆర్క్‌ను ఆఫర్ చేస్తోంది. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: http://jnafau.ac.in స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, న్యూఢిల్లీ.. ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్, అర్బన్ డిజైన్ స్పెషలైజేషన్లతో మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: బీఆర్క్/ బి.ప్లానింగ్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. జామియా మిలియా ఇస్లామియా, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఎకిస్టిక్స్, న్యూఢిల్లీ.. మెడికల్ ఆర్కిటెక్చర్, బిల్డింగ్ సర్వీసెస్ రిక్రియేషనల్ అండ్ ఆర్కిటెక్చర్ స్పెషలైజేషన్లతో ఎంఆర్క్‌ను అందిస్తోంది. అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.jmi.ac.in ఇఉ్కఖీ యూనివర్సిటీ, అహ్మదాబాద్.. థియరీ అండ్ డిజైన్ స్పెషలైజేషన్‌తో ఎంఆర్క్‌ను ఆఫర్ చేస్తోంది. డిజైన్ పోర్ట్‌ఫోలియో ఎవల్యూషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.cept.ac.in కెరీర్: ఎంఆర్క్‌ను పూర్తిచేసిన వారికి కన్స్ట్రక్షన్ సంస్థలు, ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీలు, పరిశోధన సంస్థల్లో అవకాశాలుంటాయి. ఫ్రీలాన్సర్ లేదా కన్సల్టెంట్‌గా, ఫ్యాకల్టీగా కూడా పనిచేయొచ్చు. -
ఎయిర్‌హోస్టెస్ శిక్షణ పొందాలంటే...
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలపగలరు? - రామస్వామి, ఖమ్మం. విమానాలు, హెలికాప్టర్లు, అంతరిక్ష నౌకలు, ఉపగ్రహాలు, రాకెట్లు, క్షిపణులు తదితరాల డిజైన్, నిర్మాణం, నిర్వహణలకు సంబంధించిందే ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఇది విమానయానం, అంతరిక్ష యాత్రలు, రక్షణ వ్యవస్థలకు వెన్నెముక వంటిది. కోర్సుల వివరాలు: జేఎన్టీయూ - హైదరాబాద్.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ను అందిస్తోంది. ఈ కోర్సులో ప్రవేశానికి సంబంధిత అంశంలో బీఈ/బీటెక్ పూర్తిచేసిన వారు అర్హులు. వెబ్సైట్: www.jntuh.ac.in. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), బెంగళూరు.. ఏరోస్పేస్లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్‌ను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.iisc.ernet.in. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పుణే.. ఎంటెక్-ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్:www.diat.ac.in కెరీర్ అవకాశాలు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి విమానయాన రంగం; వివిధ ప్రభుత్వ విభాగాలు; విద్య, పరిశోధన సంస్థల్లో ఉన్నత ఉద్యోగావకాశాలు ఉంటాయి. నేను ప్రస్తుతం బీటెక్- బయోటెక్నాలజీ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఉన్నత విద్యావకాశాల వివరాలు తెలపగలరు? - మంజు, వరంగల్. జేఎన్టీయూ, హైదరాబాద్.. బయోటెక్నాలజీలో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రవేశపరీక్ష లేదా గేట్లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. వెబ్సైట్: www.jntuh.ac.in. ఐఐటీ-హైదరాబాద్.. మెడికల్ బయోటెక్నాలజీలో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సులో ఇమ్యునాలజీ, జీన్ టెక్నాలజీ, ప్రొటీన్ టెక్నాలజీ, సెల్ టెక్నాలజీ, వైరాలజీ, బయోకెమిస్ట్రీ, మెడికల్ మైక్రోబయాలజీ, సెల్ సిగ్నలింగ్ వంటి అంశాలను బోధిస్తారు. వెబ్సైట్:http://biotech.iith.ac.in. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. ఎంటెక్- బయో ఇన్ఫర్మాటిక్స్‌ను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్:www.uohyd.ac.in. కెరీర్ అవకాశాలు: బయోటెక్నాలజీ, హార్టికల్చర్, అగ్రికల్చర్, కెమికల్స్, బయో ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్, హెల్త్ కేర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అవకాశాలుంటాయి. వివిధ ప్రభుత్వ విభాగాలు, పరిశోధన సంస్థలు, విద్యాసంస్థల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. ఎకనామిక్స్‌లో పీజీ కోర్సులను అందిస్తున్న సంస్థలేవి? - శ్రీ చరణ్, హైదరాబాద్. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి.. ఎంఏ ఎకనామిక్స్‌ను ఆఫర్ చేస్తోంది. అర్హత: బీఏ ఎకనామిక్స్. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.svuniversity.ac.in ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఎకనామిక్స్ ఒక సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు కోర్సులో ప్రవేశానికి అర్హులు. వెబ్సైట్: www.andhrauniversity.edu.in. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.. అప్లైడ్ ఎకనామిక్స్‌లో ఐదేళ్ల కాలవ్యవధితో ఇంటిగ్రేటెడ్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇందులో ప్రవేశానికి ప్లస్ 2 అర్హత ఉండాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్, ఐఐటీ-కాన్పూర్.. ఎకనామిక్స్‌లో ఐదేళ్ల కాలవ్యవధితో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.iitk.ac.in. నేను ఎయిర్‌హోస్టెస్ కావాలనుకుంటున్నాను. శిక్షణకు సంబంధించిన వివరాలు తెలపగలరు? - చందన, కాకినాడ. ఎయిర్‌హోస్టెస్ శిక్షణ పొందేందుకు అభ్యర్థి వయసు 18-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎత్తు కనీసం 160 సెం.మీ. ఉండాలి. తప్పనిసరిగా 10 ప్లస్ 2లో ఉత్తీర్ణత సాధించాలి. శిక్షణ కోర్సుల వివరాలు ఫ్రాంక్ఫిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్‌హోస్టెస్.. ఏడాది కాల వ్యవధితో ఎయిర్‌హోస్టెస్, హాస్పిటాలిటీ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సును ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.frankfinn.com కేతన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, దిల్సుఖ్నగర్.. ఆర్నెల్ల ఎయిర్‌హోస్టెస్ శిక్షణ ఇస్తోంది. వెబ్సైట్: www.ketansinstitute.com ఆప్టెక్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ, మాసబ్‌ట్యాంక్.. ఏడాది కాల వ్యవధితో ఎయిర్‌హోస్టెస్ శిక్షణ అందిస్తోంది. వెబ్సైట్: www.aptechaviationacademy.com సృజనకు చిరునామా ఐఐటీ రూర్కీ.. క్యాంపస్ సువిశాల ప్రాంగణం అందమైన భవిష్యత్తుకు సృజనాత్మక ఆలోచనలు సోపానాలు.. అలాంటి సృజనాత్మక ఆలోచనలు చేసేలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు విద్యార్థులకు మార్గనిర్దేశనం చేస్తున్నాయి. ఇంజనీరింగ్ విద్య, పరిశోధనలో అత్యున్నత సంస్థలుగా వెలుగొందుతూ సాంకేతిక ప్రపంచానికి సుశిక్షితులైన మానవ వనరులను అందిస్తున్నాయి. అలాంటి విద్యా సంస్థల్లో ఒకటైన ‘ఐఐటీ-రూర్కీ’ నుంచి ఎంటెక్ పూర్తిచేసిన దోర పవన్‌కుమార్ ‘భవిత’ పాఠకులకు అందిస్తున్న క్యాంపస్ కబుర్లు.. బ్రిటిష్ ప్రభుత్వం 1847లో రూర్కీలో ‘ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసింది. ఈ కళాశాలలో మొదట్లో సివిల్ ఇంజనీరింగ్ కోర్సు మాత్రమే ఉండేది. ఇది తర్వాత కాలంలో ‘థామ్సన్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్’గా, యూనివర్సిటీ ఆఫ్ రూర్కీగా సేవలందించి చివరకు 2001లో ఐఐటీ హోదాను పొందింది. ఉత్తరాఖండ్‌లోని ఐఐటీ-రూర్కీ క్యాంపస్ 400 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఇక్కడికి కొద్ది దూరం నడిచివెళ్తే గంగా నది అందాలు విద్యార్థులను పలకరిస్తాయి. సంస్థ ఏర్పాటైన తొలినాళ్లలో సివిల్ ఇంజనీరింగ్ తరగతులకు నెలవైన భవనమే ఇప్పటికీ ఠీవిగా నిలబడి ఐఐటీ క్యాంపస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రూర్కీకి సమీపంలో సిమ్లా, ముస్సోరి, రిషికేష్, హరిద్వార్ వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలున్నాయి. మా తరగతి.. మినీ భారత్: నేను చదువుకున్న ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్లాస్‌లో మొత్తం 53 మంది విద్యార్థులుఉండేవారు. వీరిలో ఆరుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. ఉదయం ఎనిమిది గంటలకు క్లాస్‌లు ప్రారంభమవుతాయి. తరగతి వాతావరణం సృజనాత్మక ఆలోచనల్ని ఆచరణలో పెట్టి కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించేదిగా ఉంటుంది. ఎంటెక్ ఫస్టియర్‌లో 12 సబ్జెక్టులతో రెండు సెమిస్టర్లుంటాయి. ఇక రెండో ఏడాది మొత్తం రీసెర్చ్ కేంద్రంగా సాగుతుంది. నచ్చిన అంశాలను కొన్నింటిని ఎంచుకోవడం, వాటిలో ఒకదాన్ని ప్రాజెక్టుగా తీసుకొని వర్క్ చేయాలి. చివరగా పరిశోధన పత్రాన్ని సమర్పించాలి. నేను ప్యారెలల్ కంప్యూటింగ్‌పై ప్రాజెక్టు చేశాను. ఫ్యాకల్టీలో చాలా వరకు అనుభవజ్ఞులు. విసుగనేది లేకుండా ఓ అంశానికి సంబంధించి ఎన్నిసార్లయినా చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. క్యాంపస్ సెంట్రల్ లైబ్రరీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నుంచి ఆధ్యాత్మికత వరకు అనేక అంశాలకు సంబంధించిన వేలాది పుస్తకాలున్నాయి. దీంతో పాటు ప్రతి విభాగానికీ ప్రత్యేకంగా లైబ్రరీలున్నాయి. మేమంతా ‘గంగా భవన్’ హాస్టల్లో ఉండేవాళ్లం. ఇక్కడ రోటీ వంటి నార్త్ ఇండియన్ ఆహారం ఉంటుంది. ఇలాంటి ఆహారంతో మొదట్లో ఇబ్బందిపడినా తర్వాత అలవాటైంది. హాస్టల్లో జిమ్‌తో పాటు బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్ ఆడుకోవడానికి ఏర్పాట్లున్నాయి. మెయిన్ క్యాంపస్‌లో చాలా పెద్ద స్విమ్మింగ్‌పూల్ కూడా ఉంది. ఇంకో విషయమేమిటంటే రూర్కీ ఎకో ఫ్రెండ్లీ సిటీ. విద్యార్థులు హాస్టళ్ల నుంచి క్లాస్‌లకు సైకిళ్లపైనే వెళ్తారు. ‘ఫెస్ట్‌లతో సందడే సందడి: విద్యార్థిని అన్నివిధాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కరిక్యులం ఉంటుంది. ఐఐటీ రూర్కీలో ఏడాదిలో ఒక కల్చరల్ ఫెస్ట్, మరొక టెక్నికల్ ఫెస్ట్‌లు జరుగుతాయి. నవంబర్‌లో కల్చరల్ ఫెస్ట్ (THOMSO), మార్చిలో టెక్నికల్ ఫెస్ట్ (COGNIZANCE) జరుగుతాయి. ఈ ఫెస్ట్‌లకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు హాజరవుతారు. ఫెస్ట్‌ల్లో రోబో వార్స్, 3డీ పెయింటింగ్ వంటి ఆసక్తికర కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థులు రూపొందించిన రోబో కార్ల రేసింగ్ మరొక ప్రధాన ఆకర్షణ. 2003 నుంచి టెక్నికల్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రముఖ శాస్త్రవేత్తలు, టెక్నాలజిస్టులు, పారిశ్రామికవేత్తల గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. రోబోటిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఏరో మోడలింగ్ తదితర అంశాలపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. రూర్కీ ఐఐటీలో ఏటా నిర్వహించే కల్చరల్ ఫెస్ట్ దేశంలో నిర్వహించే గొప్ప యూత్ ఫెస్టివల్స్‌లో ఒకటిగా చెప్పొచ్చు. విద్యార్థుల్లో దాగున్న సాంస్కృతిక ప్రతిభను వెలికితీసేందుకు కల్చరల్ ఫెస్ట్ వేదికగా నిలుస్తోంది. డ్యాన్స్, డ్రామా, మ్యూజిక్ ఈవెంట్లతో ఫెస్ట్ సందడిగా సాగుతుంది. కొలువుల కలలకు వేదికలు: ఏటా డిసెంబర్లో ప్లేస్మెంట్ హడావుడి మొదలవుతుంది. 15 రోజుల పాటు సాగే ప్లేస్మెంట్ సెషన్‌కు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, డీఆర్డీవో, శ్యాంసంగ్, యాహూ వంటి పెద్ద పెద్ద కంపెనీలు క్యాంపస్‌ను సందర్శిస్తాయి. ఈ 15 రోజుల్లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్లేస్మెంట్ ఆఫీస్ సందడిగా ఉంటుంది. నాకు శ్యాంసంగ్-ఇండియాలో మంచి ఆఫర్ వచ్చింది. -
జియాలజీ కోర్సును ఆఫర్ చేస్తున్న ఐఐటీ లేవి?
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ ఫిల్మ్ డెరైక్షన్ కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? -బాల సుందర్, విశాఖపట్నం. సినిమా/టెలివిజన్ కార్యక్రమాల నిర్మాణంలో అత్యంత క్లిష్టమైన, సృజనాత్మక ప్రక్రియ.. డెరైక్షన్. ఇందులో ప్రావీణ్యం, నైపుణ్యం సాధించడానికి ఎంతో శ్రమ, సహనం అవసరం. అందిస్తున్న సంస్థలు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-పుణే. కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ డెరైక్షన్, పీజీ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ డెరైక్షన్ (టెలివిజన్) అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ వెబ్సైట్: www.ftiindia.com సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్-కోల్‌కతా కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ డెరైక్షన్ అండ్ స్క్రీన్‌ప్లే అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ/తత్సమానం. ఇంటర్మీడియెట్/10+2 స్థాయిలో ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. వెబ్సైట్: www.srfti.gov.in మన రాష్ట్రంలోని రామానాయుడు ఫిల్మ్ స్కూల్-హైదరాబాద్ (వెబ్సైట్: www. ramanaidu filmschool.), అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ + మీడియా-హైదరాబాద్ (వెబ్సైట్: www.aisfm.edu. in)వంటి ప్రైవేట్ సంస్థలు కూడా డెరైక్షన్‌కు సంబంధించిన కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. పీజీ స్థాయిలో ఫుడ్ టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లను తెలపండి? - అమృత, కాకినాడ. ఫుడ్ టెక్నాలజీ పీజీ కోర్సు పూర్తి చేసిన వారికి ఫుడ్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో,డెయిరీ, ప్యాకేజింగ్, ఫిషరీస్, బయో టెక్నాలజీ, అగ్రికల్చర్ పరిశ్రమల్లో అవకాశాలు లభిస్తాయి. సొంతంగా బేకరీ, ప్యాకేజింగ్ యూనిట్, స్టోరేజ్ యూనిట్ లేదా కన్సల్టెన్సీ కూడా ప్రారంభించవచ్చు. అందిస్తున్న సంస్థలు: ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ-హైదరాబాద్. కోర్సు: ఎంఎస్సీ(ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) అర్హత: 50 శాతం మార్కులతో బీటెక్ (అగ్రికల్చర్ /డెయిరీ/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) బీవీఎస్సీ/బీఎస్సీ హోంసైన్స్/బీఎస్సీ అగ్రికల్చర్/బీహెచ్ఎస్సీ/హార్టికల్చర్/ సెరీ కల్చర్/ఫారెస్ట్రీ/బీఎఫ్ఎస్సీ. వివరాలకు: www.angrau.ac.in శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ -అనంత పూర్ కోర్సు: ఎంఎస్సీ హోంసైన్స్(ఫుడ్‌సైన్స్ అండ్ న్యూట్రిషియన్/ ఫుడ్ టెక్నాలజీ) వివరాలకు: http://sssihl.edu.in సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ -మైసూర్ కోర్సు: ఎంఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ) అర్హత: బీఎస్సీ (కెమిస్ట్రీ/బయో కెమిస్ట్రీ) లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్/ టెక్నాలజీలో ఉత్తీర్ణతతోపాటు ఇంటర్మీడియెట్, డిగ్రీలో మ్యాథ్స చదివి ఉండాలి. వివరాలకు: www.cftri.com ఎంఎస్సీ (జియాలజీ) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి? -వైష్ణవి, పాలకొల్లు. మన రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్ (వెబ్సైట్:www.osmania.ac.in), ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం (వెబ్సైట్:www.andhrauniversity.edu.in), శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి (వెబ్సైట్: www.svuniversity.in) ఎంఎస్సీ (జియాలజీ) కోర్సును ఆఫర్ చేస్తుంది. ఆయా యూనివర్సిటీలు నిర్వహించే రాత పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు సాధారణంగా ప్రతి ఏడాది ఏప్రిల్/మే నెలలో వెలువడుతాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు జియాలజీకి సంబంధించి.. ఎంఎస్సీ(అప్లైడ్ జియాలజీ), జాయింట్ ఎంఎస్సీ- పీహెచ్డీ ప్రోగ్రామ్ ఇన్ జియాలజీ, ఎంటెక్ (జియలాజికల్ టెక్నాలజీ), ఎంఎస్సీ- పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ అప్లైడ్ జియాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఐఐటీ-బాంబే (వెబ్సైట్: www.iitb.ac.in), ఐఐటీ- రూర్కీ (వెబ్సైట్: www.iitr.ac.in), ఐఐటీ-ఖరగ్‌పూర్ (వెబ్సైట్: www.iitkgp.ac.in)ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత: జియాలజీ ఒక సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ(మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీలలో ఏవేని రెండు సబ్జెక్ట్‌లు)తోపాటు 10+2 స్థాయిలో మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. ఇందుకోసం ఐఐటీ-జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (జామ్)కు హాజరు కావాలి. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ (వెబ్సైట్: www.du.ac.in), యూనివర్సిటీ ఆఫ్ పుణే (వెబ్సైట్: www.unipune.ernet.in) కూడా ఎంఎస్సీ (జియాలజీ) కోర్సును అందిస్తున్నాయి. బయోటెక్నాలజీకి సంబంధించిన కోర్సుల వివరాలను తెలపండి? -శ్రీహరి, కరీంనగర్. మన రాష్ట్రంలో బ్యాచిలర్స్ స్థారుులో బీఎస్సీ (బయోటెక్నాలజీ), బీటెక్ (బయోటెక్నాలజీ) కోర్సులు అందుబాటులో ఉన్నారుు. ఇంటర్మీడియెట్ (సెన్సైస్) ఉత్తీర్ణత సాధించిన వారు వీటికి అర్హులు. బీటెక్ సీట్లను మాత్రం ఎంసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. పీజీ విషయానికొస్తే.. ఎంఎస్సీ (బయోటెక్నాలజీ) కోర్సును రాష్ట్రంలోని అన్ని ప్రముఖ యూనివర్సిటీలు నిర్వహిస్తున్నారుు. ఆయా యూనివర్సిటీలు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్లాధారంగా ప్రవేశం ఉంటుంది. ఎంటెక్ (బయోటెక్నాలజీ)లో ప్రవేశానికి గేట్/పీజీఈసెట్ రాయాలి. ఐఐటీలు కూడా బీటెక్, ఎంటెక్ స్థాయిలో బయోటెక్నాలజీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.