ఎంఆర్క్ కోర్సు వివరాలు తెలపండి... | Career Counselling-Ask the expert | Sakshi
Sakshi News home page

ఎంఆర్క్ కోర్సు వివరాలు తెలపండి...

Published Thu, Dec 5 2013 4:28 PM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

Career Counselling-Ask the expert

టి. మురళీధరన్, టి.ఎం.ఐ. నెట్‌వర్క్

 

ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఎంఈ/ఎంటెక్‌ను ఆఫర్ చేస్తున్న సంస్థలేవి?

- నరేందర్, నెల్లూరు.

 మెడిసిన్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఇన్‌స్ట్రుమెంటేషన్ అప్లికేషన్స్ అవసరమవుతాయి.

 కోర్సుల వివరాలు:

 జేఎన్‌టీయూ, హైదరాబాద్.. ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. అర్హత: ఈఈఈ/ఈసీఈ/ఈఐఈ/ ఐసీఈలో బీఈ/బీటెక్. గేట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

 వెబ్‌సైట్: www.jntuh.ac.in

 

 ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. ఇన్‌స్ట్రుమెంటేషన్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్‌ను అందిస్తోంది.

 అర్హత: ఈసీఈ/ఈఈఈ లేదా సంబంధిత సబ్జెక్టులో బీఈ/ బీటెక్. గేట్ లేదా పీజీఈ సెట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

 శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి.. ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది.

 అర్హత: ఈఈఈ/ ఈసీఈ/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా కంట్రోల్ ఇంజనీరింగ్.

 వెబ్‌సైట్: www.svuniversity.ac.in

 కెరీర్: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ రంగాల్లో అవకాశాలుంటాయి. ఇండియన్ రైల్వేస్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ద్వారా ఉన్నత ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.

 

 బి.ఫార్మసీ పూర్తిచేశాను. సాస్ (A) కోర్సును అందించే సంస్థల వివరాలు తెలియజేయండి?

 - సునీత, ఖమ్మం.

 క్లినికల్ పరీక్షలకు సంబంధించిన డేటాను విశ్లేషించేందుకు ఉపయోగపడే సాఫ్ట్‌వేర్.. సాస్ (అ). సాస్-క్లినికల్ అనేది సాస్‌లో ఒక మాడ్యూల్. ఇది క్లినికల్ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని వేగంగా విశ్లేషించేందుకు, నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది.

 

 కోర్సుల వివరాలు:

 బయో మెడ్ ఇన్ఫర్మాటిక్స్, మెడ్విన్ హాస్పిటల్స్, నాంపల్లి.. సాస్- బయోస్టిక్స్ అండ్ ప్రాజెక్టు ఇన్ క్లినికల్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. కోర్సు కాల వ్యవధి 45 రోజులు.

 అర్హత: ఎంబీబీఎస్, ఎండీ, బీడీఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఏఎంఎస్, బీపీటీ/ ఎంఎస్సీ (మైక్రోబయాలజీ)/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయో ఇన్ఫర్మాటిక్స్/ కెమిస్ట్రీ/ జెనెటిక్స్/ బోటనీ/ జువాలజీ/ లైఫ్ సెన్సైస్/ బయో మెడికల్ జెనెటిక్స్/ మాలిక్యులర్ బయోసెన్సైస్/ స్టాటిస్టిక్స్/ నర్సింగ్. లేదా బి.ఫార్మసీ/ ఎం.పార్మసీ/ బీటెక్ (బయోటెక్నాలజీ).

 ప్రవేశాలు: ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

 వెబ్‌సైట్: http://biomedlifesciences.com

 శ్రీ టెక్నాలజీస్, అమీర్‌పేట్.. సాస్ క్లినికల్ కోర్సును అందిస్తోంది. కోర్సు కాల వ్యవధి 40 రోజులు.

 అర్హత: గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత. లైఫ్ సెన్సైస్ నేపథ్యం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం.

 వెబ్‌సైట్: www.sreetechnologies.com

 Bened Software Solution, అమీర్‌పేట్.. సాస్ క్లినికల్ కోర్సును అందిస్తోంది. కోర్సు కాల వ్యవధి 30 రోజులు.

 అర్హత: గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత.

 వెబ్‌సైట్: www.benedsoft.com

 కెరీర్: సాస్‌లో శిక్షణ తీసుకున్న వారికి ఫార్మాస్యూటికల్, బయో టెక్నాలజీ, క్లినికల్ ట్రయల్స్ కంపెనీల్లో అవకాశాలు లభిస్తాయి.

 

 

 మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలియజేయగలరు?

 -రవి కిషోర్, కర్నూలు

 నివాస భవంతులు, అపార్టుమెంట్లు, విల్లాలు, షాపింగ్‌మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు.. వంటి నిర్మాణాల రూపకల్పనకు సంబంధించిన అంశాలను ఆర్కిటెక్చర్.. శాస్త్రీయ కోణంలో వివరిస్తుంది. వివిధ సంస్థలు ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్, మాస్టర్స్, పరిశోధన స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్; ఇండస్ట్రియల్ డిజైన్; అర్బన్ డిజైన్; ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్; బిల్డింగ్ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్లతో ఆర్కిటెక్చర్‌లో మాస్టర్స్ కోర్సు (ఎంఆర్క్) అందుబాటులో ఉంది.

 

 ఎంఆర్క్‌ను ఆఫర్ చేస్తున్న సంస్థలు:

 జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, హైదరాబాద్.. కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్, కన్జర్వేషన్ ప్లానింగ్, ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌లతో ఎంఆర్క్‌ను ఆఫర్ చేస్తోంది. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

 వెబ్‌సైట్: http://jnafau.ac.in

 స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, న్యూఢిల్లీ.. ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్, అర్బన్ డిజైన్ స్పెషలైజేషన్లతో మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సును ఆఫర్ చేస్తోంది.

 అర్హత: బీఆర్క్/ బి.ప్లానింగ్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

 జామియా మిలియా ఇస్లామియా, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఎకిస్టిక్స్, న్యూఢిల్లీ.. మెడికల్ ఆర్కిటెక్చర్, బిల్డింగ్ సర్వీసెస్ రిక్రియేషనల్ అండ్ ఆర్కిటెక్చర్ స్పెషలైజేషన్లతో ఎంఆర్క్‌ను అందిస్తోంది. అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

 వెబ్‌సైట్: www.jmi.ac.in

 ఇఉ్కఖీ యూనివర్సిటీ, అహ్మదాబాద్.. థియరీ అండ్ డిజైన్ స్పెషలైజేషన్‌తో ఎంఆర్క్‌ను ఆఫర్ చేస్తోంది. డిజైన్ పోర్ట్‌ఫోలియో ఎవల్యూషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

 వెబ్‌సైట్: www.cept.ac.in

 కెరీర్: ఎంఆర్క్‌ను పూర్తిచేసిన వారికి కన్‌స్ట్రక్షన్ సంస్థలు, ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీలు, పరిశోధన సంస్థల్లో అవకాశాలుంటాయి. ఫ్రీలాన్సర్ లేదా కన్సల్టెంట్‌గా, ఫ్యాకల్టీగా కూడా పనిచేయొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement