టి. మురళీధరన్
టి.ఎం.ఐ. నెట్‌వర్క్
ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులు అందిస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి?
- శ్రీధర్, నిర్మల్
విమానాలు, హెలికాప్టర్లు, అంతరిక్ష నౌకలు, క్షిపణులు మొదలైన వాటి తయారీ, నిర్వహణ గురించి తెలియజేసేదే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సు. ఇది విమాన రంగం, అంతరిక్ష పరిశోధనలు, రక్షణ వ్యవస్థకు వెన్నెముక.
సంస్థల వివరాలు:
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.jntuh.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తోంది. గేట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, పుణే.. ఎంటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తోంది. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.diat.ac.in
అవకాశాలు:
కోర్సు పూర్తయిన తర్వాత పౌర విమానయాన రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు ప్రభుత్వ విభాగాలు, పరిశోధన సంస్థలు, విద్యా సంస్థల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, భారత వైమానిక దళం, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్), నేషనల్ ఏరోనాటిక్స్ లేబొరేటరీలకు ప్రస్తుతం ఏరోస్పేస్ ఇంజనీర్ల అవసరం ఎంతో ఉంది.
ఎయిర్‌హోస్టెస్ కావాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? కోర్సుల వివరాలు తెలియజేయండి?
- శరత్, నిజామాబాద్.
ఎయిర్‌హోస్టెస్ కెరీర్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఈ కెరీర్ సవాళ్లతో కూడుకున్నది. విమానంలో ప్రయాణించే వారికి అవసరమైన సేవలందించడమే ఎయిర్‌హోస్టెస్ విధి. ఎయిర్‌హోస్టెస్ కావాలంటే ప్రాథమికంగా కొన్ని అర్హతలు ఉండాలి. అభ్యర్థులకు ఎలాంటి దృష్టిలోపాలు ఉండకూడదు. ఇంగ్లిష్, హిందీ భాషలలో స్పష్టంగా మాట్లాడగలగాలి. విదేశీ భాషలు తెలిసుంటే అదనపు అర్హత అవుతుంది.
ఎంపికకు అవసరమయ్యే అర్హతలు: అభ్యర్థి వయసు 18-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎత్తు 160 సెం.మీపైన ఉండాలి. 10+2 ఉత్తీర్ణత అవసరం. రాతపరీక్ష, ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరచాలి.
కోర్సులు అందిస్తున్న సంస్థలు:
ఫ్రాంక్‌ఫిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్‌హోస్టెస్, సికింద్రాబాద్.
వెబ్‌సైట్: www.frankfinn.com
కేతన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్.
వెబ్‌సైట్: www.ketansinstitute.com
ఏపీ టెక్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ అకాడమీ, హైదరాబాద్.
వెబ్‌సైట్: www.aptechaviationacademy.com
సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ అందిస్తున్న కోర్సులేవి?
- సతీష్, కరీంనగర్.
కోల్‌కతాలోని సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్..కేంద్ర ప్రభుత్వ ప్రసార మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో పని చేస్తోంది. ఈ ఇన్‌స్టిట్యూట్ మూడేళ్ల పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ సినిమా కోర్సును అందిస్తోంది. స్పెషలైజేషన్‌స: డెరైక్షన్ అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, ప్రొడ్యూసింగ్ ఫర్ సినిమా అండ్ టీవీ, సౌండ్ రికార్డింగ్ అండ్ డిజైన్. ఈ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్. దేశ వ్యాప్త నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. రాత పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలోని మెంటల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంద రికీ కామన్‌గా ఉంటుంది. అభ్యర్థులు ఎంచుకున్న స్పెషలైజేషన్‌స ఆధారంగా రెండో విభాగంలో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్కులు ఉండవు.
వెబ్‌సైట్: www.srfti.gov.in
పెట్రోలియం, గ్యాస్, చమురు రంగాలకు సంబంధించి ఎంబీఏ మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్న సంస్థల వివరాలు తెలియజేయగలరు?
- అనిత, మహబూబ్‌నగర్
ఎంబీఏ- పెట్రోలియం మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్న సంస్థలు భారతదేశంలో తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు.
రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, రాయ్‌బరేలీ (ఉత్తరప్రదేశ్).. పెట్రోలియం అండ్ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ కోర్సును అందిస్తోంది.
అర్హత-ఎంపిక విధానం: ఏదైనా గుర్తింపు పొందిన సంస్థలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి. ప్రవేశపరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: www.rgipt.ac.in
యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్).. ఆయిల్ అండ్ గ్యాస్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ కోర్సును అందిస్తోంది.
వెబ్‌సైట్: www.upesindia.org
స్కూల్ ఆఫ్ పెట్రోలియం మేనేజ్‌మెంట్, గాంధీనగర్ (గుజరాత్).. చమురు, గ్యాస్ రంగానికి సంబంధించి ఎంబీఏ కోర్సును అందిస్తోంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. క్యాట్ స్కోర్, జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభకు ప్రాధాన్యం.
ఎంబీఏ పెట్రోలియం మేనేజ్‌మెంట్ కోర్సు...
Published Thu, Feb 6 2014 2:43 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement