టి. మురళీధరన్
టి.ఎం.ఐ. నెట్‌వర్క్
ఫిల్మ్ డెరైక్షన్ కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? -బాల సుందర్, విశాఖపట్నం.
సినిమా/టెలివిజన్ కార్యక్రమాల నిర్మాణంలో అత్యంత క్లిష్టమైన, సృజనాత్మక ప్రక్రియ.. డెరైక్షన్. ఇందులో ప్రావీణ్యం, నైపుణ్యం సాధించడానికి ఎంతో శ్రమ, సహనం అవసరం.
అందిస్తున్న సంస్థలు
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-పుణే.
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ డెరైక్షన్, పీజీ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ డెరైక్షన్ (టెలివిజన్)
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ
వెబ్‌సైట్: www.ftiindia.com
సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్-కోల్‌కతా
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ డెరైక్షన్ అండ్ స్క్రీన్‌ప్లే
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ/తత్సమానం. ఇంటర్మీడియెట్/10+2 స్థాయిలో ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.
వెబ్‌సైట్: www.srfti.gov.in
మన రాష్ట్రంలోని రామానాయుడు ఫిల్మ్ స్కూల్-హైదరాబాద్ (వెబ్‌సైట్: www. ramanaidu filmschool.), అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ + మీడియా-హైదరాబాద్ (వెబ్‌సైట్: www.aisfm.edu. in)వంటి ప్రైవేట్ సంస్థలు కూడా డెరైక్షన్‌కు సంబంధించిన కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
పీజీ స్థాయిలో ఫుడ్ టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లను తెలపండి?
- అమృత, కాకినాడ.
ఫుడ్ టెక్నాలజీ పీజీ కోర్సు పూర్తి చేసిన వారికి ఫుడ్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో,డెయిరీ, ప్యాకేజింగ్, ఫిషరీస్, బయో టెక్నాలజీ, అగ్రికల్చర్ పరిశ్రమల్లో అవకాశాలు లభిస్తాయి. సొంతంగా బేకరీ, ప్యాకేజింగ్ యూనిట్, స్టోరేజ్ యూనిట్ లేదా కన్సల్టెన్సీ కూడా ప్రారంభించవచ్చు.
అందిస్తున్న సంస్థలు:
ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ-హైదరాబాద్.
కోర్సు: ఎంఎస్సీ(ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)
అర్హత: 50 శాతం మార్కులతో బీటెక్ (అగ్రికల్చర్ /డెయిరీ/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) బీవీఎస్‌సీ/బీఎస్సీ హోంసైన్స్/బీఎస్సీ అగ్రికల్చర్/బీహెచ్‌ఎస్సీ/హార్టికల్చర్/ సెరీ కల్చర్/ఫారెస్ట్రీ/బీఎఫ్‌ఎస్సీ.
వివరాలకు: www.angrau.ac.in
శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ -అనంత పూర్
కోర్సు: ఎంఎస్సీ హోంసైన్స్(ఫుడ్‌సైన్స్ అండ్ న్యూట్రిషియన్/ ఫుడ్ టెక్నాలజీ)
వివరాలకు: http://sssihl.edu.in
సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ -మైసూర్
కోర్సు: ఎంఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ)
అర్హత: బీఎస్సీ (కెమిస్ట్రీ/బయో కెమిస్ట్రీ) లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్/ టెక్నాలజీలో ఉత్తీర్ణతతోపాటు ఇంటర్మీడియెట్, డిగ్రీలో మ్యాథ్‌స చదివి ఉండాలి.
వివరాలకు: www.cftri.com
ఎంఎస్సీ (జియాలజీ) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?
-వైష్ణవి, పాలకొల్లు.
మన రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్ (వెబ్‌సైట్:www.osmania.ac.in), ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం (వెబ్‌సైట్:www.andhrauniversity.edu.in), శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి (వెబ్‌సైట్: www.svuniversity.in) ఎంఎస్సీ (జియాలజీ) కోర్సును ఆఫర్ చేస్తుంది. ఆయా యూనివర్సిటీలు నిర్వహించే రాత పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు సాధారణంగా ప్రతి ఏడాది ఏప్రిల్/మే నెలలో వెలువడుతాయి.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు జియాలజీకి సంబంధించి.. ఎంఎస్సీ(అప్లైడ్ జియాలజీ), జాయింట్ ఎంఎస్సీ- పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ఇన్ జియాలజీ, ఎంటెక్ (జియలాజికల్ టెక్నాలజీ), ఎంఎస్సీ- పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ అప్లైడ్ జియాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఐఐటీ-బాంబే (వెబ్‌సైట్: www.iitb.ac.in), ఐఐటీ- రూర్కీ (వెబ్‌సైట్: www.iitr.ac.in), ఐఐటీ-ఖరగ్‌పూర్ (వెబ్‌సైట్: www.iitkgp.ac.in)ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత: జియాలజీ ఒక సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ(మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీలలో ఏవేని రెండు సబ్జెక్ట్‌లు)తోపాటు 10+2 స్థాయిలో మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. ఇందుకోసం ఐఐటీ-జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (జామ్)కు హాజరు కావాలి.
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ (వెబ్‌సైట్: www.du.ac.in), యూనివర్సిటీ ఆఫ్ పుణే (వెబ్‌సైట్: www.unipune.ernet.in) కూడా ఎంఎస్సీ (జియాలజీ) కోర్సును అందిస్తున్నాయి.
బయోటెక్నాలజీకి సంబంధించిన కోర్సుల వివరాలను తెలపండి?
-శ్రీహరి, కరీంనగర్.
మన రాష్ట్రంలో బ్యాచిలర్స్ స్థారుులో బీఎస్సీ (బయోటెక్నాలజీ), బీటెక్ (బయోటెక్నాలజీ) కోర్సులు అందుబాటులో ఉన్నారుు. ఇంటర్మీడియెట్ (సెన్సైస్) ఉత్తీర్ణత సాధించిన వారు వీటికి అర్హులు. బీటెక్ సీట్లను మాత్రం ఎంసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. పీజీ విషయానికొస్తే.. ఎంఎస్సీ (బయోటెక్నాలజీ) కోర్సును రాష్ట్రంలోని అన్ని ప్రముఖ యూనివర్సిటీలు నిర్వహిస్తున్నారుు. ఆయా యూనివర్సిటీలు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌లాధారంగా ప్రవేశం ఉంటుంది. ఎంటెక్ (బయోటెక్నాలజీ)లో ప్రవేశానికి గేట్/పీజీఈసెట్ రాయాలి. ఐఐటీలు కూడా బీటెక్, ఎంటెక్ స్థాయిలో బయోటెక్నాలజీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.