నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల వివరాలు.. | Ask the expert: Career Counselling | Sakshi
Sakshi News home page

నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల వివరాలు..

Published Thu, Jan 9 2014 3:06 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Ask the expert: Career Counselling

టి.మరళీధరన్

టీఎంఐ నెట్ వర్క్

ఎంఎస్సీ (అప్లైడ్ మ్యాథమెటిక్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థలు, కోర్సు పూర్తి చేసిన వారికి ఉండే అవకాశాల వివరాలు తెలియజేయగలరు?
 - భరత్, కామారెడ్డి.
 ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.. ఎంఎస్సీ (అప్లైడ్ మ్యాథమెటిక్స్) కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: బీఎస్సీ (మ్యాథమెటిక్స్). ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.osmania.ac.in
 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్.. మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్‌తో బీఎస్సీ. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.     వెబ్‌సైట్: www.uohyd.ernet.in
 ఐఐటీ, రూర్కీ.. ఎంఎస్సీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కోర్సును అందిస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో బీఎస్సీ. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (జామ్)లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.iitr.ac.in, www.iitg.ac.in
 బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెస్రాలో ఎంఎస్సీ (అప్లైడ్ మ్యాథ్స్) అందుబాటులో ఉంది. అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీ లేదా తత్సమాన కోర్సును పూర్తిచేసుండాలి. పదో తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.bitmesra.ac.in
 కోర్సు పూర్తి చేసిన తర్వాత రీసెర్చ్, కంప్యుటేషన్, డేటా మైనింగ్, బయోఇన్ఫర్మాటిక్స్, ఫైనాన్స్, ఎకనామిక్స్ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.


 
 
 సీబీఐలో సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాన్ని సాధించాలంటే ఏం చేయాలి?
 - చరణ్, గద్వాల్.
 సీబీఐలో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి ఎస్‌ఎస్‌సీ ఏటా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షను నిర్వహిస్తోంది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. అభ్యర్థి వయసు 25 ఏళ్లకు మించకూడదు.
 పరీక్ష మూడు దశల్లో ఉంటుంది. అవి: టైర్ 1 రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానం). టైర్ 2 మెయిన్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానం). టైర్ 3 పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్.
 కేంద్ర పోలీసు సంస్థలో (సీపీవోలు)లో ఎస్సై ఉద్యోగాన్ని ఎంపిక చేసుకునే అభ్యర్థులు టైర్ 1 పరీక్ష పూర్తయిన తర్వాత ఫిజికల్/మెడికల్ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.    
 వెబ్‌సైట్: ssc.nic.in


 
 ఐఐటీ ఖరగ్‌పూర్ ఆఫర్ చేస్తున్న బ్యాచిలర్ ఆఫ్ లా కోర్సు వివరాలు తెలియజేయండి?  

- విజయ్, వరంగల్.
 రాజీవ్‌గాంధీ స్కూల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా, ఐఐటీ ఖరగ్‌పూర్.. ఇంటతలెక్చువల్ ప్రాపర్టీలో బ్యాచిలర్ ఆఫ్ లా కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇది మూడేళ్ల వ్యవధి గల కోర్సు. మూడు సెమిస్టర్లుంటాయి. ఈ కోర్సుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది.
 ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్/ ఎల్‌శాట్ ఇండియా/ఎల్‌శాట్ గ్లోబల్; జీడీ; పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్షలో ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ ఎబిలిటీ, బేసిక్ సైన్స్, లీగల్ ఆప్టిట్యూడ్ అండ్ ఎస్సేలపై ప్రశ్నలుంటాయి.
 వెబ్‌సైట్: www.rgsoipl.iitkgp.ernet.in


 
 నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలపగలరు?
 - శ్రీకాంత్, విశాఖపట్నం.
 కంప్యూటర్ నెట్‌వర్క్ ఇంజనీర్లకు ఆపరేటింగ్ సిస్టమ్స్, మైక్రోప్రాసెసర్స్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, కంప్యూటర్ నెట్‌వర్క్ రూపకల్పన, నిర్వహణ, ట్రబుల్ షూటింగ్ టెక్నిక్స్ వంటి వాటిపై అవగాహన ఉండాలి.
 జేఎన్‌టీయూ, హైదరాబాద్.. ఎంటెక్ కంప్యూటర్ నెట్‌వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కోర్సును ఆఫర్ చేస్తోంది.
 ప్రవేశాలు: ఎంట్రన్స్ టెస్ట్/ గేట్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
 ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. ఎంటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ నెట్‌వర్క్స్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
 ప్రవేశాలు: ఏయూ సెట్, గేట్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.andhrauniversity.info
 కలశలింగం యూనివర్సిటీ, తమిళనాడు.. నెట్‌వర్క్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ అస్యురెన్స్ అండ్ సెక్యూరిటీలో ఎంటెక్‌ను అందిస్తోంది.
 అర్హత: బీఈ/బీటెక్ (ఈఈఈ)/ ఈసీఈ/ ఈఐ/ ఐసీ/ ఐటీ/ సీఎస్‌ఈ లేదా ఎలక్ట్రానిక్స్. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.kalasalingam.ac.in
 అమృత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, కోయంబత్తూర్.. కంప్యుటేషనల్ ఇంజనీరింగ్ అండ్ నెట్‌వర్కింగ్‌లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. అర్హత: బీఈ/ బీటెక్‌ను 60 శాతం మార్కులతో పూర్తిచేసుండాలి. లేదా మ్యాథమెటిక్స్/ ఫిజిక్స్/ కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్సీని కనీసం 70 శాతం మార్కులతో పూర్తిచేసుండాలి.
 వెబ్‌సైట్: www.amrita.edu
 
 మెకట్రానిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అందిస్తున్న సంస్థలేవి?
 - శ్రీకాంత్, గుంటూరు.
 మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌ల మేళవింపు మెకట్రానిక్స్. మెకానికల్ వ్యవస్థలకు సంబంధించిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అంశాలను మెకట్రానిక్స్ వివరిస్తుంది.
 రోబోటిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మెకట్రానిక్స్ నిపుణుల అవసరం ఉంటుంది.
 కోర్సులను అందిస్తున్న సంస్థలు:
 విట్ యూనివర్సిటీ, వెల్లూరు.. మెకట్రానిక్స్‌లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది.    
 వెబ్‌సైట్: www.vit.ac.in
 అమిటీ యూనివర్సిటీ, నోయిడా.. మెకట్రానిక్స్‌లో ఎంటెక్‌ను అందిస్తోంది.
 వెబ్‌సైట్: www.amity.edu

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement