‘ఐఐటీ-గువాహటి’లో విశాఖ విద్యార్థి ఆత్మహత్య
గువాహటి/కె.కోటపాడు(విశాఖ): అస్సాంలోని ఐఐటీ-గువాహటిలో బీటెక్ తుది సంవత్సరం చదువుతున్న కాకి పరమేశ్వరరావు(22) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన పరమేశ్వరరావు గురువారం మధ్యాహ్నం తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఐఐటీ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. మృత దేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం పోలీసులు గువాహటి వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. కాగా, ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, తనకు తక్కువ మార్కులు వచ్చిన నేపథ్యంలోనే పరమేశ్వరరావు ఆత్మహత్యకు ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నట్టు తెలిపారు.