కీసర: మండల కేంద్రంలోని అశ్విత ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు చెందిన 43 సెల్‌ఫోన్లు శుక్రవారం చోరీ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో పాటు భోగారం గ్రామంలోని హోళీమేరీ ఇంజినీరింగ్ క ళాశాలకు చెందిన విద్యార్థులకు రెగ్యులర్ పరీక్షలు రాసేందుకు కీసరలోని అశ్విత ఇంజినీరింగ్ కళాశాలలో సెంటర్ పడింది.
దీంతో శుక్రవారం రెండు కళాశాలలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాసేందుకు అశ్విత కాలేజీకి వచ్చారు. 43 మంది విద్యార్థులు తమ సెల్‌ఫోన్లను రెండు స్కూటీల డిక్కీలో పెట్టి పరీక్షలు రా సేందుకు వెళ్లారు. విద్యార్థులు తిరిగి వచ్చేసరికి 43 సెల్‌ఫోన్లు చోరీ అయ్యాయి. దీంతో వారు కీసర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బీటెక్ విద్యార్థుల 43 సెల్‌ఫోన్లు చోరీ
Published Sat, Jun 20 2015 3:18 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement