జనగామ : ఉరివేసుకుని ఓ బీటెక్ ఫైనలి యర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని 20వ వార్డు పరిధిలోని పోలీస్టేషన్ ఎదురుగా మంగళవారం రాత్రి జరిగింది. తల్లి కృపానందిని కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన బైరు అర్జున్, కృపానందినికి కూతురు బాలనందిని(22), కుమారుడు మహేష్ ఉన్నారు. తండ్రి అర్జు న్ ఆరేళ్ల క్రితం మృతిచెందడంతో కుటుంబ భారం తల్లిపై పడింది. బాలనందిని హైదరాబాద్‌లోని విజయవాడ హైవేలోగల పోచంపల్లి శివారు దేశ్‌ముఖ్ గ్రామంలోని సెయింట్ మెరీస్ ఇం జనీరింగ్ కళాశాలలో ఈసీఈ ఫైనలియర్ చదువుతుండగా, కుమారుడు మహేష్ పాలీటెక్నిక్ చదువుతున్నాడు. శ్రీరామనవ మి పండుగ కోసం బాలనందిని 15 రోజుల క్రితం ఇంటికి వచ్చింది.
20వ తేదీ కళాశాలకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. తల్లి పని ముగించుకుని ఇంటికి రాగా కూతురు ఎంతకూ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిచింది. స్థానికులు వచ్చి కిటికీ లోంచి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సంతోషం రవీందర్ అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకునే కష్టాలు నందినికి లేవని స్థానికులు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. కళాశాలలో ఎవరైనా బెదిరించా రా.. లేక మరేదైనా కారణం ఉందా అనే అనుమానాలను స్థానికు లు వ్యక్తం చేశారు. మృతురాలి తల్లి కృపానందిని నుంచి ఎస్సై వాంగ్మూలం తీసుకున్నారు.
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
Published Wed, Apr 20 2016 1:31 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement