ప్రస్తుత రోజుల్లో నాలుగంకెల ఉద్యోగం వస్తే చాలు ఈ పోటీ ప్రపంచంలో అలాంటి జాబ్ దొరకడం కూడా కష్టం అని కొందరు అనుకుంటారు. జీతం ఎంతైనా ఐ డోంట్ కేర్ మనల్ని కంపెనీలు సెలక్ట్ చేసుకోవడం కాదు మనమే కంపెనీలని ఎంచుకోవాలని కొందరు అనుకుంటారు .ఇలానే అనుకున్నాడు ఓ బీటెక్ విద్యార్థి. కాగ్నిజెంట్, అమెజాన్ లాంటి ప్రముఖ కంపెనీల్లో వచ్చిన ఉద్యోగాలను సైతం పక్కన పెట్టాడు. కొడితే కుంభస్థలాన్ని కొట్దాలిరా అనుకున్నాడో ఏమో మైక్రోసాఫ్ట్ లో 50 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ కొట్టి అందరి చేత ఆహా అనిపించాడు. అతడే మధుర్ రఖేజా.
దుకాణదారుడి కొడుకు నుంచి మైక్రోసాఫ్ట్ ఉద్యోగిగా ఎదిగాడు
ఓ దుకాణదారుడి కొడుకు తన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలల కన్నాడు. వాటి కోసం అంతే శ్రమించాడు. పట్టు వదలక క్యాంపస్ ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ లాంటి ప్రఖ్యాత కంపెనీలో రూ.50 లక్షల జాబ్ కొట్టి అనుకున్నది సాధించడమే గాక తన తల్లిదండ్రులను గర్వించేలా చేశాడు మధుర్ రఖేజా. అతను యూపీఈఎస్ (UPES) స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫర్మేటిక్స్‌లో స్పెషలైజేషన్‌తో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో (బీటెక్) పూర్తి చేశాడు. యూనివర్శిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (UPES) డెహ్రాడూన్‌లోని ఓ మల్టీడిసిప్లినరీ విశ్వవిద్యాలయం.
టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టం
తన పయనం గురించి మధుర్ మాట్లాడుతూ.. టెక్నాలజీ అంటే నాకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే ప్రజల జీవితాలను మార్చగల సామర్థ్యం దానికి ఉంది. అంతటి ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉంది కనుకే అలాంటి ప్రత్యేకమైన కోర్సును ఎంచుకున్నాను. అప్ స్ట్రీమ్ పెట్రోలియానికి సంబంధించి నాకు ఒకతను చెప్పాడు. కంప్యూటర్ సైన్స్‌లో ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫర్మేటిక్స్‌లో స్పెషలైజేషన్ ఉందని నాకు అప్పుడే తెలిసింది. అందుకే.. దాన్ని ఎంచుకున్నానని చెప్పాడు.
వచ్చింది కాదు నచ్చింది చేయాలి
మొదట తాను కొన్ని కంపెనీల జాబితాను తయారు చేసుకున్నాడు. అందులో మైక్రోసాఫ్ట్ కూడా ఉంది. మొదటగా ఇతరుల ఇంటర్వ్యూ అనుభవాలను చదవడంతో పాటు ఇంటర్య్వూకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఎంపిక ప్రక్రియకు సిద్ధమైనట్లు వివరించాడు. మైక్రోసాఫ్ట్‌తో పాటు, అమెజాన్, ఆప్టమ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌తో పాటు మరిన్ని వాటికి దరఖాస్తు చేసుకుని తాను తలపెట్టిన మహాయజం చివరికి మైక్రోసాఫ్ట్ ద్గగర ఆగిందని చెప్పుకొచ్చాడు. మధుర్ అనేక కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment