ప్రతీకాత్మక చిత్రం
తాడిపత్రి అర్బన్: ఒకరికి బదులుగా మరొకరిని పరీక్ష హాలులోకి పంపించారు. ఇందుకోసం విద్యార్థుల హాల్‌టికెట్లు, ఐడీ కార్డులను మార్ఫింగ్ చేశారు. ఇలా ఒకరు కాదు... ఇద్దరు కాదు.. ఏకంగా 16 మంది నకిలీ విద్యార్థులను పరీక్షకు పంపించారు. అయితే ఇన్విజిలేటర్ క్షుణంగా తనిఖీ చేయడంతో ఈ నకిలీ విద్యార్థుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జేఎన్‌టీయూ(ఏ) పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో గత నెల 25 నుంచి బీటెక్ మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తాడిపత్రిలోని సీవీ రామన్ ఇంజినీరింగ్ కళాశాల (సీవీఆర్టీ)కు చెందిన 16 మంది విద్యార్థులకు తాడిపత్రి ఇంజినీరింగ్ కళాశాల(టెక్)లో పరీక్ష కేంద్రం కేటాయించారు. గురువారం ఉదయం పది గంటలకు డ్రాయింగ్, బీఈఈఈ పరీక్ష ప్రారంభం కాగా, ఇన్విజిలేటర్ విద్యార్థుల హాల్‌టికెట్లను పరిశీలించారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లుగా గుర్తించారు. మరింత క్షుణంగా తనిఖీ చేయగా, ఒకే కాలేజీకి చెందిన 16 మంది స్థానంలో వేరేవారు పరీక్ష రాస్తున్నట్లు గుర్తించి కళాశాల ప్రిన్సిపాల్ ఈవీ సుబ్బారెడ్డి, జేఎన్‌టీయూ(ఏ) అబ్జర్వర్‌కు సమాచారమిచ్చారు.
వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆయా విద్యార్థుల ఐడీ కార్డులు పరిశీలించగా, అవి కూడా నకిలీవని తేలింది. తమ విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేరని భావింన సీవీఆర్టీ కళాశాల యాజమాన్యం... అసలు విద్యార్థుల ఫొటోలతోపాటు ఐడీ కార్డులను మార్ఫింగ్ చేసి పరీక్షలు రాసేందుకు వేరేవారిని పంపినట్లు గుర్తించారు. అనంతరం నకిలీ విద్యార్థుల నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేసిన జేఎన్‌టీయూ(ఏ) అధికారులు రూల్–3 కింద చర్యలు కేసు నవెదు చేశారు. కాగా, గతంలోనూ సర్ సీవీ రామన్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం అనేక మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇంజినీరింగ్ విద్యార్థులను డిగ్రీ చదువుతున్నట్లు చూపి ఫీజు రీయింబర్స్‌మెంట్ దందాకు పాల్పడింది. దీంతోపాటు నిబంధనల మేరకు ఇంటర్ కళాశాల ఏర్పాటు చేసేటప్పుడు ఇంటర్ బోర్డుకు సీవీ రామన్ యాజమాన్యం అందజేసిన పత్రాలు నకిలీవని బయటపడింది. కళాశాల యాజమాన్యం ఏకంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్ల కోసం ఓ బ్యాంకు మేనేజర్ సంతకం కూడా ఫోర్జరీ చేసినట్లు సమాచారం.
చదవండి కానిస్టేబుల్ భార్య పైశాచికం.. ప్రియుడి మోజులో పడి, ఇంటికి పిలిచి..
Comments
Please login to add a commentAdd a comment