semester
-
బీటెక్ పరీక్ష.. ఇదేం పని రా అయ్యా, నిజం తెలిసి ఇన్విజిలేటర్ మైండ్‌బ్లాక్!
తాడిపత్రి అర్బన్: ఒకరికి బదులుగా మరొకరిని పరీక్ష హాలులోకి పంపించారు. ఇందుకోసం విద్యార్థుల హాల్‌టికెట్లు, ఐడీ కార్డులను మార్ఫింగ్ చేశారు. ఇలా ఒకరు కాదు... ఇద్దరు కాదు.. ఏకంగా 16 మంది నకిలీ విద్యార్థులను పరీక్షకు పంపించారు. అయితే ఇన్విజిలేటర్ క్షుణంగా తనిఖీ చేయడంతో ఈ నకిలీ విద్యార్థుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జేఎన్టీయూ(ఏ) పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో గత నెల 25 నుంచి బీటెక్ మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాడిపత్రిలోని సీవీ రామన్ ఇంజినీరింగ్ కళాశాల (సీవీఆర్టీ)కు చెందిన 16 మంది విద్యార్థులకు తాడిపత్రి ఇంజినీరింగ్ కళాశాల(టెక్)లో పరీక్ష కేంద్రం కేటాయించారు. గురువారం ఉదయం పది గంటలకు డ్రాయింగ్, బీఈఈఈ పరీక్ష ప్రారంభం కాగా, ఇన్విజిలేటర్ విద్యార్థుల హాల్‌టికెట్లను పరిశీలించారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లుగా గుర్తించారు. మరింత క్షుణంగా తనిఖీ చేయగా, ఒకే కాలేజీకి చెందిన 16 మంది స్థానంలో వేరేవారు పరీక్ష రాస్తున్నట్లు గుర్తించి కళాశాల ప్రిన్సిపాల్ ఈవీ సుబ్బారెడ్డి, జేఎన్టీయూ(ఏ) అబ్జర్వర్‌కు సమాచారమిచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆయా విద్యార్థుల ఐడీ కార్డులు పరిశీలించగా, అవి కూడా నకిలీవని తేలింది. తమ విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేరని భావింన సీవీఆర్టీ కళాశాల యాజమాన్యం... అసలు విద్యార్థుల ఫొటోలతోపాటు ఐడీ కార్డులను మార్ఫింగ్ చేసి పరీక్షలు రాసేందుకు వేరేవారిని పంపినట్లు గుర్తించారు. అనంతరం నకిలీ విద్యార్థుల నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేసిన జేఎన్టీయూ(ఏ) అధికారులు రూల్–3 కింద చర్యలు కేసు నవెదు చేశారు. కాగా, గతంలోనూ సర్ సీవీ రామన్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం అనేక మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంజినీరింగ్ విద్యార్థులను డిగ్రీ చదువుతున్నట్లు చూపి ఫీజు రీయింబర్స్మెంట్ దందాకు పాల్పడింది. దీంతోపాటు నిబంధనల మేరకు ఇంటర్ కళాశాల ఏర్పాటు చేసేటప్పుడు ఇంటర్ బోర్డుకు సీవీ రామన్ యాజమాన్యం అందజేసిన పత్రాలు నకిలీవని బయటపడింది. కళాశాల యాజమాన్యం ఏకంగా ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ల కోసం ఓ బ్యాంకు మేనేజర్ సంతకం కూడా ఫోర్జరీ చేసినట్లు సమాచారం. చదవండి కానిస్టేబుల్ భార్య పైశాచికం.. ప్రియుడి మోజులో పడి, ఇంటికి పిలిచి.. -
పరీక్షలెప్పుడో?
► అగమ్యగోచరంలో బీఈడీ విద్యార్థులు ► ప్రథమ సంవత్సర పరీక్షలు జరగని వైనం ► నిర్లక్ష్యంగా వీఎస్‌యూ అధికారులు జిల్లాలో బీఈడీ విద్యార్థుల పరిస్థితి అగయగోచరంగా మారింది. ప్రథమ సంవత్సరం ముగిసి రెండో సంవత్సరంలో అడుగు పెట్టినా నేటికీ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పరీక్షల తేదీని నేటికీ ప్రకటించకపోవడంపై విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ అధికారులపై విద్యార్థులు మండిపడుతున్నారు. నెల్లూరు: జిల్లాలో ఒక ప్రభుత్వ, 20 ప్రైవేటు బీఈడీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో సుమారు రెండు వేల మందికి పైగా బీఈడీ కోర్సు చదువుతున్నారు. 2015–16 విద్యా సంవత్సరం నుంచి బీఈడీని రెండేళ్లు కోర్సుగా ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సర విద్యార్థులకు గత ఏడాది సెప్టెంబరు 8వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 1, 2 సెమిస్టర్లు, రెండో సంవత్సరానికి సంబంధించి 3, 4 సెమిస్టర్లు పరీక్షలు పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సర విద్యార్థులకు తొలి సెమిస్టర్ పరీక్షలు డిసెంబరు చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో జరగాల్సి ఉంది. రెండో సెమిస్టర్ పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహిస్తారు. అయితే ప్రథమ సంవత్సర విద్యార్థులకు 1వ సెమిస్టర్ పరీక్ష ఇంత వరకు జరగలేదు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 3వ సెమిస్టర్ డిసెంబర్లో నిర్వహించారు, 4వ సెమిస్టర్ ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది. వారికి టీచింగ్ ప్రాక్టికల్స్ పరీక్షలను గురువారం నుంచి నిర్వహించనున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షలు జరపకపోవడంతో బీఈడీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు సెమిస్టర్ పరీక్షలు వెంట, వెంటనే జరిపితే ఏ విధంగా రాయాలని ప్రశ్నిస్తున్నారు. పట్టించుకోని అధికారులు బీఈడీ పరీక్షలను విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు ఈ ³రీక్షలపై వీఎస్‌యూ అధికారులు ఎలాంటి దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో మిగిలిన యూనివర్సిటీల పరిధిలోని బీఈడీ కళాశాలల్లో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. జిల్లాలో వీఎస్‌యూ అధికారులు ఇప్పటికి ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై ముండిపడుతున్నారు. ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అకడమిక్ పూర్తియినా నేటికీ పాఠ్య పుస్తకాలు అందలేదు. ఈ విషయంలో బీఈడీ కళాశాలల యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబించిందనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా పరీక్షలు నిర్వహించాలని బీఈడీ కళాశాల విద్యార్థులు కోరుతున్నారు. ఆలస్యమైన మాట వాస్తవమే బీఈడీ పరీక్షలు కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. కొత్తగా బీఈడీ కోర్సును రెండేళ్లు చేశారు. దీంతో ఆలస్యమైంది. ఏప్రిల్ 12వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యార్థులు ఆందోళన చెందాలి్సన అవసరం లేదు. మొదటి, 3వ సెమిస్టర్ పరీక్షలను నిర్వహిస్తాం. – చంద్రయ్య, ఇన్చార్జి రిజిస్ట్రార్, వీఎస్‌యూ -
పీజీ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల
ఎంజీయూ (నల్లగొండ రూరల్) : మహాత్మగాంధీ యూనివర్సిటీ పరిధిలోని పీజీ 2, 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను బుధవారం యూనివర్సిటీలో పరీక్షల నియంత్రణ అధికారి ఆకుల రవి విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో చూసుకోవాలని విద్యార్థులకు సూ చించారు. ఫలితాలను కళాశాల నో టీస్ బోర్డులో ఉంచామని తెలిపారు. -
‘బిజినెస్’లో రెండేళ్ల సరికొత్త కోర్సు
కోల్‌కతా: దేశంలోని మూడు ప్రఖ్యాత విద్యాసంస్థలు ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐఎం కోల్‌కతా, ఐఎస్ఐ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్) కోల్‌కతా సంయుక్తంగా బిజినెస్ ఎనాలిటిక్స్లో కొత్త కోర్సు అందించనున్నాయి. ఈ ఏడాది నుంచే మొదలు కానున్న ఈ కొత్త కోర్సు(పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ ఎనాలిటిక్స్-పీజీడీబీఏ) కాల వ్యవధి రెండేళ్లపాటు ఉంటుందని ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ సుదీష్ణ సర్కార్ తెలిపారు. కోర్సులో భాగంగా మ్యాథమెటికల్ ఫౌండేషన్, స్టాటిస్టికల్, మెషీన్ లర్నింగ్ అంశాలపై ఐఎస్ఐలో మొదటి సెమిస్టర్ ఉంటుంది. రెండో సెమిస్టర్ ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహిస్తుంది. ఇక మూడో సెమిస్టర్ కోల్‌కతా ఐఐఎంలో ఉంటుంది. నాలుగో సెమిస్టర్ కింద ఆరు నెలలపాటు ఏదైనా ప్రముఖ కంపెనీలో ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో బిజినెస్ ఎనాలిటిక్స్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సర్కార్ పేర్కొన్నారు. 2018 నాటికి ఈ మార్కెట్ విలువ 2.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నాస్కామ్ అంచనా వేసింది. -
విద్యార్థులకు వరం
వైవీయూ, న్యూస్‌లైన్ : కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యావిధానంలో సైతం అధునాతన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితం కాకుండా తాను చదివే చదువుతో పాటు నచ్చిన సబ్జెక్టుల్లో సైతం ప్రావీణ్యం పొందుతూ డిగ్రీ విద్యను పూర్తిచేసే అవకాశాన్ని ఉన్నతవిద్యాశాఖ విద్యార్థులకు అందిస్తోంది. ప్రయోగాత్మకంగా రాష్ర్టవ్యాప్తంగా తొలిసారి చాయిస్‌బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) పేరుతో నచ్చిన విద్యను అందిపుచ్చుకునేందుకు అటానమస్ హోదా కలిగిన 10 కళాశాలలను ఎంపికచేశారు. రాయలసీమ నుంచి కర్నూలు సిల్వర్జూబ్లి కళాశాలతో పాటు కడపకు చెందిన ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల)కు ఈ అరుదైన అవకాశం దక్కింది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) అంటే.. డిగ్రీ విద్యార్థులు చదువుతున్న సబ్జెక్టుతో పాటు ఇతర అంశాలపైనా అవగాహన పొందేందుకు రూపొందిస్తున్న పాఠ్యప్రణాళికా విధానమే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. ఈ సిస్టమ్‌ను 2014-15 విద్యాసంవత్సరం నుంచి స్వయంప్రతిపత్తి కలిగిన కళాశాలలో తొలిసారిగా అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి కళాశాలల అధ్యాపకుల నుంచి సూచనలు సలహాలు స్వీకరించిన ఉన్నత విద్యాశాఖ ఈ యేడాది నుంచి అమలుచేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ విధానం ప్రకారం కాలేజ్ స్టడీస్ బోర్డు ఆధ్వర్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యప్రణాళికలు రూపొందించి అమలు చేయనున్నారు. ప్రతి విభాగానికి అనుబంధంగా మరో రెండు ఏవైనా పరీక్షపత్రాలను విద్యార్థి చాయిస్ విధానంలో ఎన్నుకోవచ్చు. ఓ విద్యార్థి బీఎస్సీ చదువున్నట్లయితే ఆ విద్యార్థి సాప్ట్వేర్ కానీ పర్యాటకం, జెమాలజీ, జర్నలిజం ఇలా ప్రత్యేకతలు కలిగిన 18 అంశాల్లోని ఏవైనా సబ్జెక్టును ఎన్నుకోవచ్చు. అలాగే ఒక గ్రూపునకు సంబంధించిన విద్యార్థులు మరో గ్రూపుకు చెందిన సబ్జెక్టులను సైతం ఐచ్చికంగా ఎన్నుకునే అవకాశం కల్పిస్తారు. ఈ పరీక్షా విధానంలో సైతం గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. అవుట్ స్టాండింగ్ గ్రేడ్, ఏ గ్రేడ్, బీ గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్, ఇ గ్రేడ్, నాట్ క్వాలిఫైడ్ గ్రేడిం గ్ (ఎఫ్ గ్రేడ్) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. సెమిస్టర్ స్థానంలో మాడ్యూల్స్.. ఈ యేడాది ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందే విద్యార్థి తొలిసంవత్సరం క్రెడిట్ 1, క్రెడిట్ 2తో ప్రథమ సంవత్సరం పూర్తయిన తర్వాత సెకండియర్ చివరలో సర్టిఫికెట్ కోర్సు లేదా విద్యార్థి ఐచ్ఛిక సబ్జెక్టు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. చదువుతున్న సిలబస్‌కు అవసరాన్ని బట్టి అదనంగా చేర్చడం లేదా తొలగించడం తదితర ప్రక్రియలతో కూడిన విధానం విద్యార్థికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతం.. జిల్లాలో అటానమస్ పొందిన కళాశాల కావడంతో సీబీసీఎస్‌ను ఆర్ట్స్ కళాశాలలో అమలు చేస్తున్నాం. ఈ విధానం ద్వారా విద్యార్థి స్వేచ్ఛగా తనకు ఇష్టమైన సబ్జెక్టును చదువుకుంటూ ఇతర సబ్జెక్టులపైనా అవగాహన పొందవచ్చు. ఈ యేడాది ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ విధానం అమలుపరచనున్నాం. - డాక్టర్ రవికుమార్, ఇన్చార్జి ప్రిన్సిపాల్, ప్రభుత్వ పురుషుల కళాశాల, కడప