shop keepers
-
భారత సంతతి వ్యాపారి కాల్చివేత
వాషింగ్టన్: దోపిడీకి యత్నించిన దుండగుడు భారతసంతతికి చెందిన దుకాణదారును కాల్చిచంపాడు. ఈ ఘటన అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం రొవాన్ కౌంటీలో చోటుచేసుకుంది. మైనాంక్ పటేల్(36) టొబాకో హౌస్ స్టోర్ పేరుతో దుకాణం నడుపుతున్నారు. మంగళవారం ఉదయం షాట్గన్తో దుకాణంలోకి ప్రవేశించిన శ్వేతజాతీయుడైన బాలుడు మైనాంక్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ∙బాలుడిని కొద్ది గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నో ఉద్యోగాలు వదులుకున్నాడు.. చివరికి అరకోటి ప్యాకేజీతో షాకిచ్చాడు!
ప్రస్తుత రోజుల్లో నాలుగంకెల ఉద్యోగం వస్తే చాలు ఈ పోటీ ప్రపంచంలో అలాంటి జాబ్ దొరకడం కూడా కష్టం అని కొందరు అనుకుంటారు. జీతం ఎంతైనా ఐ డోంట్ కేర్ మనల్ని కంపెనీలు సెలక్ట్ చేసుకోవడం కాదు మనమే కంపెనీలని ఎంచుకోవాలని కొందరు అనుకుంటారు .ఇలానే అనుకున్నాడు ఓ బీటెక్ విద్యార్థి. కాగ్నిజెంట్, అమెజాన్ లాంటి ప్రముఖ కంపెనీల్లో వచ్చిన ఉద్యోగాలను సైతం పక్కన పెట్టాడు. కొడితే కుంభస్థలాన్ని కొట్దాలిరా అనుకున్నాడో ఏమో మైక్రోసాఫ్ట్ లో 50 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ కొట్టి అందరి చేత ఆహా అనిపించాడు. అతడే మధుర్ రఖేజా. దుకాణదారుడి కొడుకు నుంచి మైక్రోసాఫ్ట్ ఉద్యోగిగా ఎదిగాడు ఓ దుకాణదారుడి కొడుకు తన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలల కన్నాడు. వాటి కోసం అంతే శ్రమించాడు. పట్టు వదలక క్యాంపస్ ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ లాంటి ప్రఖ్యాత కంపెనీలో రూ.50 లక్షల జాబ్ కొట్టి అనుకున్నది సాధించడమే గాక తన తల్లిదండ్రులను గర్వించేలా చేశాడు మధుర్ రఖేజా. అతను యూపీఈఎస్ (UPES) స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫర్మేటిక్స్లో స్పెషలైజేషన్‌తో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో (బీటెక్) పూర్తి చేశాడు. యూనివర్శిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (UPES) డెహ్రాడూన్‌లోని ఓ మల్టీడిసిప్లినరీ విశ్వవిద్యాలయం. టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టం తన పయనం గురించి మధుర్ మాట్లాడుతూ.. టెక్నాలజీ అంటే నాకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే ప్రజల జీవితాలను మార్చగల సామర్థ్యం దానికి ఉంది. అంతటి ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉంది కనుకే అలాంటి ప్రత్యేకమైన కోర్సును ఎంచుకున్నాను. అప్ స్ట్రీమ్ పెట్రోలియానికి సంబంధించి నాకు ఒకతను చెప్పాడు. కంప్యూటర్ సైన్స్‌లో ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫర్మేటిక్స్లో స్పెషలైజేషన్ ఉందని నాకు అప్పుడే తెలిసింది. అందుకే.. దాన్ని ఎంచుకున్నానని చెప్పాడు. వచ్చింది కాదు నచ్చింది చేయాలి మొదట తాను కొన్ని కంపెనీల జాబితాను తయారు చేసుకున్నాడు. అందులో మైక్రోసాఫ్ట్ కూడా ఉంది. మొదటగా ఇతరుల ఇంటర్వ్యూ అనుభవాలను చదవడంతో పాటు ఇంటర్య్వూకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఎంపిక ప్రక్రియకు సిద్ధమైనట్లు వివరించాడు. మైక్రోసాఫ్ట్‌తో పాటు, అమెజాన్, ఆప్టమ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌తో పాటు మరిన్ని వాటికి దరఖాస్తు చేసుకుని తాను తలపెట్టిన మహాయజం చివరికి మైక్రోసాఫ్ట్ ద్గగర ఆగిందని చెప్పుకొచ్చాడు. మధుర్ అనేక కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నారు. -
నూపుర్ శర్మ ఫొటో షేర్ చేసినందుకు షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగానే
Udaipur Gruesome Murder: జైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బహిష్కృత బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మకు మద్దతుగా పోస్టులు పెట్టిన కన్హయ్య లాల్ అనే టైలర్ హత్యకు గురయ్యాడు. టైలర్ తన దుకాణంలో పనిలో ఉండగా లోనికి ప్రవేశించిన ఇద్దరు దుండగులు బుధవారం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగానే తల్వార్లతో దాడి చేసి హతమార్చారు. అంతేకాకుండా ప్రధాని మోదీ, నూపుర్ శర్మ ప్రాణాలు కూడా తీస్తామంటూ కత్తులు చూపిస్తూ సెల్ఫీ వీడియో ద్వారా బెదిరించారు. టైలర్ హత్యోదంతంతో ఉదయ్‌పూర్‌లోని మల్డాస్ ప్రాంతంలో ఉద్రిక్తలు చెలరేగాయి. స్థానికులు దుకాణాలను మూసేశారు. హత్య ఘటనను నిరసిస్తూ వందలాది మంది రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలిపారు. ఈఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్పందించారు. టైలర్ హత్యకు గురికావడం అత్యంత బాధాకరమన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఉదయ్‌పూర్‌లో పోలీసులు మోహరించారు. 24 గంటలపాటు నగరంలో ఇంటర్నెట్ సేవలను నిలుపుదల చేశారు. నూపుర్ శర్మకు మద్దతుగా టైలర్ ఎనిమిదేళ్ల కొడుకు గతంతో ఆమె ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు తెలిసింది. మరోవైపు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పారిపోతున్న నిందితులను రాజ్‌సమంద్ జిల్లాలోని భీం ప్రాంతంలో పట్టుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. చదవండి👇 వారం గడిచినా అదే ఉద్రిక్తత.. షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు ముంబై వస్తే? ఉపాధ్యాయుడి హత్య: భార్యే హంతకురాలు.. వివాహేతర సంబంధంతో.. -
పేమెంట్ అయినట్టు మెసేజ్ వస్తుంది.. చెక్ చేసుకోకుండానే ఓకే చెప్తే అంతే!
‘ఇటీవల వనస్థలిపురంలో ఓ మొబైల్ షాప్‌లోకి ఇద్దరు యువకులు వచ్చారు. ఒకట్రెండు ఉత్పత్తులను కొనుగోలు చేయగా.. రూ.2,800 బిల్లు అయింది. స్పూఫింగ్ పేటీఎం యాప్ నుంచి షాప్ వివరాలను నమోదు చేయగానే యజమానికి బిల్లు చెల్లించినట్లు సందేశం వచ్చింది. దీంతో యజమాని తన ఖాతాలో చెక్ చేసుకోకుండానే ఓకే అనడంతో ఆ ఇద్దరు కస్టమర్లు అక్కణ్నుంచి వెళ్లిపోయారు. తాపీగా బ్యాంక్ ఖాతాలో చూసుకుంటే బిల్లు జమ కాలేదు. మెసేజ్ వచ్చింది కదా నగదు క్రెడిట్ కాకపోవటమేంటని బ్యాంకులో ఆరా తీస్తే.. అది నకిలీ మెసేజ్ అని తేల్చేశారు. దీంతో యజమాని పోలీసులను ఆశ్రయించాడు.. ఇలా ఒకరిద్దరు కాదు నగరంలో రోజుకు పదుల సంఖ్యలోనే రిటైల్ యజమానులకు స్పూఫింగ్ పేమెంట్ యాప్‌లతో టోపీ పెడుతున్నారు కొందరు వినియోగదారులు’ సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి నగదు లభ్యత తగ్గడంతో చాలా మంది డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గుచూపుతున్నారు. కరోనా మహమ్మారితో ఈ వినియోగం మరింత పెరిగింది. చిన్న కిరాణా షాపులు, కూరగాయల బండ్ల మీదా పీటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ అప్లికేషన్లు కనిపిస్తున్నాయి. యాప్ పేమెంట్ వినియోగం విరివిగా అందుబాటులోకి రావటంతో మోసగాళ్లు వీటినీ అవకాశంగా మలుచుకుంటున్నారు. కస్టమర్ కేర్ నంబర్లు, వెబ్సైట్లు, ఈ– మెయిల్ ఐడీలతో పాటూ ఈ– వ్యాలెట్లు కూడా స్పూఫింగ్ చేస్తున్నారు. చదవండి: కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్ ఎలా చేస్తారంటే.. ►స్పూఫింగ్ యాప్‌లను మొబైల్ అప్లికేషన్ ఫ్లాట్‌ఫామ్‌ల నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. షాపింగ్ చేశాక కొనుగోలుదారుల మొబైల్లోని స్పూఫింగ్ ఈ– వ్యాలెట్‌లో షాప్ పేరు, ఫోన్ నంబర్, అమౌంట్ వంటి వివరాలను నమోదు చేసి ఎంటర్ చేస్తారు. దీంతో షాప్ యజమాని ఫోన్ నంబర్‌కు పేమెంట్ పూర్తయినట్లు నకిలీ నోటిఫికేషన్ వెళుతుంది. వాస్తవానికి యజమాని బ్యాంక్ ఖాతాలో మాత్రం నగదు జమ కాదు. ► బ్యాంక్ అకౌంట్‌ను ఓపెన్ చేసి డబ్బు జమ అయిందో లేదో యజమాని చూసుకునే సమయం ఉండదు. ఎందుకంటే వేరే కస్టమర్లు ఉండటంతో బిజీగా ఉండిపోతారు. తీరా ఖాళీ సమయంలో అకౌంట్లో చూసుకుంటే ఆ నోటిఫికేషన్ తాలుకు పేమెంట్ జమై ఉండదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకుంటాడు. ఒకవేళ షాప్ యజమాని చూసుకున్నా.. డేటా, సాంకేతిక సమస్య వల్ల ఖాతాలో అప్డేట్ కావడంలో ఆలస్యం అవుతుందని ఈ కేటుగాళ్లు యజమానిని ఒప్పిస్తున్నారు. చదవండి: దేశమంతటా మన పథకాలే సౌండ్ బాక్స్‌తో పరిష్కారం.. నకిలీ లావాదేవీలకు సౌండ్ బాక్స్‌తో చెక్ పెట్టొచ్చని పేటీఎం నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా పేటీఎంకు 2.3 కోట్ల మంది వర్తకులు పార్ట్నర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. పేమెంట్ జరిగిందా లేదా అని తక్షణమే తెలుసుకునేందుకు సౌండ్ బాక్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్, వాలెట్, డెటిట్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ యాప్‌లు ఏ మాధ్యమం ద్వారా అయినా సరే పేమెంట్ చేయగానే, ఖాతాలో నగదు జమ కాగానే లావాదేవీల వివరాలు సౌండ్ బాక్స్‌లో వాయిస్ రూపేణా వినిపిస్తాయి. దుకాణా యజమానులు ప్రతి లావాదేవీ వివరాలు ప్రతిరోజూ లేదా వారానికోసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేమెంట్ పూర్తయ్యాక బ్యాంక్ ఖాతాలో అమౌంట్ జమయ్యేందుకు ఎంత సమయం పట్టిందనే వివరాలనూ తెలుసుకోవచ్చు. -
వైరల్: రూ.5 గొడవ.. చాయ్‌వాలాని చితకబాదేసిన యువతి.. అడ్డొచ్చిన వారిని..
భోపాల్: మనకిష్టమైన వాళ్లని ఎవరు ఏమన్నా ఒప్పుకోలేము. అలాంటిది ఏకంగా కొట్టాడని తెలిస్తే తట్టుకోగలమా. అలా కొట్టిన వాళ్ల బ్యాండ్ మోగించేంతవరకు మన మనసు మన దగ్గర ఉండదు. సరిగ్గా ఇలానే ఓ యవతి తన తండ్రిని అకారణంగా కొట్టిన టీ యజమానిపై శివంగిలా విరుచుకుపడి చితకబాదేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. శివపురిలోని దినారా పట్టణంలో నివసిస్తున్న తేజ్ సింగ్ పరిహార్ హైవే సమీపంలోని ఓ దుకాణంలో టీ తాగాడు. టీ తాగిన తర్వాత అతను రూ.5 చెల్లించినప్పటికీ టీ షాపు యజమాని బురా ఇవ్వలేదని చెప్పాడు. ఆ తర్వాత వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తేజ్ సింగ్‌ను బురా కొట్టాడు. ఈ బాధతో తేజ్ సింగ్ ఇంటికి చేరుకోగా, అతని కుమార్తెకు జరిగిన విషయం తెలిసింది. ఆ అమ్మాయి తన తండ్రిని కొట్టిన విషయం తెలియడంతో కోపంతో ఊగిపోయి కర్రతో దుకాణానికి చేరుకుంది. అక్కడికి చేరుకోగానే టీ షాపు యజమానిని చితకబాదేసింది. అయితే దుకాణం సమీపంలోని ప్రజలు గుమిగూడి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ యువతి వారిని కూడా లెక్క చేయలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువతి చేసిన పనికి మెచ్చకుంటూ కామెంట్లు పెడుతున్నారు. Madhya Pradesh: A shopkeeper beat up an elderly person for Rs 5 of tea. After which the daughter of the victim reached the shop and beat up the shopkeeper in Dinara town, Shivpuri. The video of the incident is going viral on social media. pic.twitter.com/BN359YiU15— Free Press Journal (@fpjindia) December 9, 2021 చదవండి: Groom On Bahubali Throne: పెళ్లిలో బళ్లాలదేవ సింహాసనంపై ఊరేగిన వరుడు.. వీడియో వైరల్ -
దారుణం: సిగరెట్లు తీసుకుని వెళ్తుండగా డబ్బులు అడిగినందుకు..
భోపాల్: తీసుకున్న సిగరెట్లకు డబ్బులు చెల్లించాలని అడిగినందుకు షాప్ నిర్వహకుడిని నలుగురు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. షాడోల్ జిల్లాలోని డియోలాండ్‌లో పట్టణంలో శనివారం రాత్రి నలుగురు వ్యక్తులు (మోను ఖాన్, పంకజ్ సింగ్, విరాట్ సింగ్, సందీప్ సింగ్) అరుణ్ సోనీ అనే వ్యక్తి దుకాణంలోకి వెళ్లి సిగరెట్లు అడిగి తీసుకున్నారు. చదవండి: ఘోరం: ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్‌పై.. కజిన్ అత్యాచారం అనంతరం డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్తుండగా.. తీసుకున్న సిగరెట్లకు డబ్బులు చెల్లించాలని యాజమాని అడిగాడు. దీంతో షాప్ నిర్వహకుడితోపాటు తన ఇద్దరు కుమారులపై దాడి చేశారు. తీవ్రంగా గాయాలపాలైన సోనీని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. చదవండి: గొడవ ఆపాలని ప్రయత్నించిన పోలీసు ముఖంపై.. -
వైరల్: 10, 20 ఉండనివ్వండి.. దొంగను బతిమాలిన షాప్ ఓనర్
దొంగతనం అంటే చేతికి అందినంత దోచుకొని పరారవ్వడం. ఎవరూలేని సమయంలో ఇంట్లో, షాప్‌లోకి చొరబడి ఎత్తుకెళ్లడం, లేదా యాజమానిని బెదిరించి దొరికినంత సొమ్ముతో ఊడాయించడమే దొంగొడి పని. అయితే పాకిస్తాన్‌లోని ఓ సూపర్ మార్కెట్లో జరిగిన దొంగతనం మాత్రం నెటజన్ల చేత తెగ నవ్వులు పూయిస్తోంది. షాప్‌లోకి కస్టమర్లా చొరబడిన ఓ దొంగ అక్కడి సొమ్మును కాజేయాలని ఫథకం పన్నాడు. మొదట అల్మారాలోని కొన్ని వస్తువులను తీసుకొని తనతో వచ్చిన వేరే వ్యక్తికి అప్పగించి, ఆ వస్తువులను కారులో పెట్టమని కోరాడు. ఇది చూసిన యాజమాని భయంతో దొంగ అడగకముందే తన నగదు కౌంటర్లో ఉన్న డబ్బులన్నీ ఓ సంచిలో పెట్టడం ప్రారంభించాడు. మొత్తం నగదంతా సంచిలో పెట్టి దొంగ కోసం సిద్ధం చేశాడు. వెంటనే దొంగ పెద్ద నోట్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించడంతో, భయపడిన ఓనర్.. తను ఇంకా తగినంత అమ్మకం చేయలేదని ఒప్పిగ్గా బదులిచ్చాడు. అంతేగాక క్యాష్ కౌంటర్లో 10, 20 ఉంచి వెళ్లండి అని దొంగనే బతిమాలాడు. దీనికి దొంగ సైతం హా సరే అని రిప్లై ఇచ్చాడు. ఇంత జరిగాక కూడా చివరికి ‘మరోసారి మా షాప్‌లోకి రాకండి ప్లీజ్’ అంటూ దొంగను కోరాడు. దీనికి దొంగ కూడా అంగీకారం తెలిపాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను మనోజ్ మెహతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది. ఇక ‘ఇంత ప్రేమతో కూడిన దొంగతనం ఎక్కడ జరుగుతుంది. పాపం.. షాప్ ఓనర్ చాలా దయగల మనిషి’ అంటూ నెటిజన్లు ఫన్నీ కాకమెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by @notmanoj Inke yaha chori itne pyar se hoti hai? 🤣🤣 — Saket Gokhale Fan Club (@FanSaket) May 25, 2021 Chori bhi tameez se kar raha hai. This is just sad. Shopkeeper must be a very kind hearted man. — Undercover Economist🌱 (@eco_comics) May 25, 2021 -
దుకాణదారుల నిర్లక్ష్యం..ఇకపై సహించం : కిరణ్ బేడి
పుదుచ్చేరి : కరోనా నిబంధనలు ఉల్లంఘించే దుకాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి బుధవారం హెచ్చరించారు. ఒక దుకాణదారుడు నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఆ ప్రాంతం మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టివేసినట్లే అవుతుందన్నారు. అంతేకాకుండా షాపు యజమాని కుటుంబంతో సహా ఎంతోమంది జోవనోపాదిపై ఈ ప్రభావం పడుతుందన్నారు. కాబట్టి ప్రభుత్వ నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఒకరిద్దరు దుకాణాదారుల నిర్లక్ష్యంతో వందల మందికి కరోనా సోకే అవకాశం ఉందని, దుకాణాదారులందరూ తమ ప్రాంగణాల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోలన్నారు. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరిస్తున్నా భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంలో మాత్రం విఫలమవుతున్నారని పేర్కొన్నారు. (అంబేడ్కర్ ఇంటిపై దాడి ) మార్కెట్ అసోసియేషన్లు, మున్సిపాలిటీ కమిషనర్లు కరోనా నివారణ చర్యల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని కిరణ్ బేడీ కోరారు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ నిర్వహిస్తూ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలన్నారు. పుదుచ్చేరి వ్యాప్తంగా రోజుకి 70 కిపైగా కేసులు నమోదవుతున్నందున ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇందులో ప్రజల సహకారం ఉండాలని ఈ సందర్భంగా కోరారు. ఇక గడిచిన 24 గంటల్లో పుదుచ్చేరిలో 112 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. (‘ఆర్థిక సంక్షోభం తీవ్రతరం’ ) -
వింత ఆచారం : షాపులకు ఓనర్లు ఉండరు
ఐజ్వాల్ : సాధారణంగా కిరాణషాపు నుంచి మొదలుకొని ఏ షాపుకైనా సరే యజమానులు కచ్చితంగా ఉంటారు. వారి ఆధ్వర్యంలోనే షాపు మొత్తం నడుస్తుంటుంది. కాని మిజోరాం రాజధాని ఐజ్వాల్ దగ్గరలో ఉన్న కొన్ని షాపులు మాత్రం యజమానులు లేకుండానే నడుస్తున్నాయి. అక్కడ నివసించే స్థానికులు ఒక ప్రత్యేక సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.' న్ఘా లౌ డావర్ సంస్కృతి'గా పిలవబడే సంప్రదాయం ప్రకారం అక్కడ ఉండే దుకాణాలన్ని యజమానులు లేకుండానే నడుస్తుంటాయి.(ధార్వాడ పేడాపై కరోనా నీడ) ఇదంతా ఎందుకంటే చేస్తున్నారంటే.. ఈ ప్రాంతంలో నిజాయితీలో కూడిన మనుషులు నివసిస్తారట. ఎవరు ఎవరిని మోసం చేయరట. వారికి నచ్చినవి కొనుక్కొని ఆ షాపులోనే ఏర్పాటు చేసిన మనీ డిపాజిట్ బాక్సులో డబ్బులు వేసి వెళ్లిపోతారట. ముఖ్యంగా ఇక్కడి షాపులన్ని నమ్మకం పైనే పనిచేస్తాయట. ఇంత ఆధునిక కాలంలో కూడా ఇలాంటి సంప్రదాయాలు పాటించే మనుషులు ఉన్నారా అని ఆశ్చర్యమనిపిస్తే వెంటనే మిజోరాం వచ్చేయండి అంటున్నారు మై హోమ్ ఇండియా ఎన్జీవో సంస్థ. ఎందుకంటే ట్విటర్లో ఈ విషయాన్ని ఆ ఎన్జీవో సంస్థనే షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ' ఒక భారతీయునిగా గర్వపడుతున్నా'.. ' ఐ లవ్ దిస్ పీపుల్ వెరీ మచ్'..' ఇదంతా నమ్మకంపైనై ఆధారపడి ఉంటుంది' అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
రిటైల్ ట్రేడర్స్, షాప్ కీపర్స్‌కు బీమా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్ ప్రసంగంలో తన వాగ్ధాటితో ఆకట్టుకుంటున్నారు. సంస్కృతం, ఉర్దూ కొటేషన్లతో.. బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. కార్య పురుష కరే న లక్ష్యం సంపదయతె’, ‘యకీన్ హో తో కోహి రస్తా నిఖల్‌తా హై, హవా కీ ఉత్ భి లే కర్ చిరాగ్ జల్తా హై’ అని చాణక్య, ఉర్దూ సూక్తులను ఉటంకించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ సర్కార్ అభివృద్ధి కార్యక్రమాలపై అనర్గళంగా ప్రస్తావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ 1 ట్రిలియన్ డా లర్ల స్థాయికి చేరడానికి 55 ఏళ్లు పడితే.. కేవలం అయిదేళ్లలో తమ ప్రభుత్వం మరో 1 ట్రిలియన్ల డాలర్లను పెంచుకున్నామని, అలాగే 2020 ఆర్థిక సంవత్సరానికి 3 ట్రిలయన్లకు చేరతామన్నామని స్పష్టం చేశారు. అంతేకాదు 5 ట్రలియన్ డాలర్ల స్థాయికి చేరడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని సాధింస్తామనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్రజలు అందించిన అఖండ విజయడంతో మరింత ఎత్తుకు ఎదుగనున్నామని, ఎన్నో అద్భుతాలు సంభవించనున్నాయని చెప్పుకొచ్చారు. నవభారత నిర్మాణానికి ప్రధాన నరేంద్రమోదీ నేతృత్వంలోని సర్కార్ కట్టుబడి ఉందని చెప్పారు. రిటైల్ ట్రేడర్స్, షాప్ కీపర్స్లకు బీమా సౌకర్యం కల్పిస్తామని, కేవలం బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు ఉన్న తక్కువ ఆదాయం ఉన్న వారికి ఈ బీమా సౌకర్యాన్ని అందిస్తామన్నారు. అలాగే జాతీయ హౌసింగ్ రెంటల్ విధానాన్ని ప్రకటించారు . ప్రభుత్వ రంగ సంస్థల భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు. 2022నాటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ పథకం కింద అందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. అర్హులైన వారికి 1.95కోట్ల ఇళ్లను ఇస్తామన్నారు. టాయిలెట్, విద్యుత్ లాంటి కనీస సౌకర్యాలతో వీటిని నిర్మిస్తామని , కేవలం 114 రోజుల్లో ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. బడ్జెట్ ప్రసంగం ఇంకా కొనసాగుతోంది. -
మహా దూకుడు
వరంగల్ అర్బన్ : ఆస్తి, నీటి పన్ను వసూళ్లపై గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. పేద, మధ్య తరగతి అనే తేడా లేకుం డా అధికారులు, సిబ్బంది బకాయిదారుల ఆస్తులను జప్తు చేస్తూ, షాపులు, నల్లాలు సీజ్ చేస్తున్నారు. బకాయిలు చెల్లించకుండా మొండికేస్తున్న వారికి రెడ్ నోటీస్లతోపాటు వారెంట్లు జారీ చేస్తున్నారు. ఏళ్ల తరబడి పన్ను కట్టని వారికి లీగల్ నోటీసులు పంపించడానికి సన్నద్ధమవుతున్నారు. వారం రోజులుగా పోలీసుల సహకరంతో ప్రత్యేకంగా 13 బృందాలు రంగంలోకి దిగాయి. జీపులకు మైకులకు ఏర్పాటు చేసి పన్నులు చెల్లించాలని విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో పన్ను బకాయిదారులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యంగా మేల్కొన్న రెవెన్యూ సిబ్బంది వరంగల్ మహానగర పాలక సంస్థకు పన్నులే ప్రధాన వనరు. ఆదాయ పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న యంత్రాంగం వసూళ్లపై శ్రద్ధ చూపడం లేదు. ఈ ఏడాది ఎలాగైనా వందశాతం పన్ను వసూలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇంత కాలం చూసీచూడనట్లుగా వ్యవహరించిన పన్నుల విభాగం అధికారులు, సిబ్బంది ఇటీవల కాలంలో వేగం పెంచారు. ఫస్ట్ ఆఫ్‌లో పన్ను వసూళ్ల టార్గెట్‌లో బల్దియా విఫలం చెందింది. పదకొండు నెలల పాటు మీనిమేషాలు లెక్కిస్తూ వస్తున్న గ్రేటర్ రెవెన్యూ సిబ్బంది ఆర్థిక సంవత్సరానికి మార్చి నెల చివరిది కావడంతో స్పీడ్ పెంచారు. మొండిబకాయిదారులను డివిజన్ల వారీగా విభజించి వారం రోజులుగా తిరుగుతున్నారు. ‘ఆన్లైన్’లో టాప్ బకాయిదారుల పేర్ల ప్రదర్శన ఆస్తి, నీటి పన్నుల బడా బకాయిదారుల పేర్లను ఆన్లైన్లో ప్రదర్శిస్తున్నాయి. ఆయా డివిజన్లలో ప్లెక్సీలపై వారి పేర్లను ప్రదర్శించిన అధికార యంత్రాంగం మరో అడుగు ముందుకేసింది. టాప్–100 బడాబకాయిదారుల పేర్లను జీడబ్ల్యూఎంసీ వెబ్సైల్లో పెంటారు. 27 రోజులు.. రూ.30కోట్లు గ్రేటర్ పరిధిలో 18,106 ఆస్తులున్నాయి. పాత బకాయిలు రూ.5.56 కోట్లు ఉండగా 2018–19 ఆర్థిక సంవత్సరం కొత్త పన్ను రూ.56.10 కోట్లతో కలిపి రూ.61.66 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు పాత, కొత్త బకాయిలు రూ.45 కోట్లు వసూలు చేశారు. రూ.16.66 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇకపోతే నల్లా కనెక్షన్లు 1,05,041 ఉన్నాయి. వీటి పాత బకాయిలు రూ.9.70కోట్లు ఉండగా కొత్త బకాయిలు రూ.15.72 కోట్లు కలిపి మొత్తం ఈ ఏడాది రూ.25.42కోట్లకు చేరింది. పాత, కొత్త బకాయిలు కలిపి రూ.10.88 కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.13.34 కోటుŠల్ వసూలు చేయాల్సి ఉంది. మరో 24 రోజులైతే ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆస్తి, నీటి పన్నులు రూ.30కోట్లు వసూలు చేసి లక్ష్యం సాధించాలని అధికారులు భావిస్తున్నారు. వసూళ్లల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని, వందశాతం పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించాలని సూచిస్తున్నారు. అధికారులు సైతం ప్రత్యేక బృందాలుగా 13 ఏరియాల వారీగా ఆర్ఐలు, బిల్ కలెక్టర్లకు టార్గెట్లు నిర్ణయించి పన్నులు వసూలు చేయాలని రోజు వారీగా వాకీటాకీల ద్వారా సూచనలు చేస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్ఓలు, ఆర్ఐ, బిల్ కలెక్టర్, కారోబార్, లైన్మెన్లు, 28 మంది పోలీస్ సిబ్బంది సహకారంతో పన్నులు వసూలు చేస్తున్నారు. ఆస్తి, నీటి పన్నుల వసూళ్లకు ప్రత్యేకంగా జీపులతో బల్దియా రెవెన్యూ సిబ్బంది ఆస్తులు జప్తు, సీజ్ మొండి బకాయిదారుల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ పన్నులు వసూలు చేయాలనే లక్ష్యంతో మహా నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది వివిధ రకాల చర్యలకు పాల్పడుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. బకాయి చెల్లించని వారి ఇళ్ల తలుపులు, ఇతర వస్తువులు జప్తు చేస్తున్నారు. నల్లా కనెక్షన్లను సీజ్ చేస్తున్నారు. పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించండి పన్నులు చెల్లించి కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచి నగర అభివృద్ధికి సహకరించాలి. పన్ను వసూళ్లను పూర్తి చేసేందుకు కార్యచరణ సిద్ధమైంది. పాత బకాయిలు, ప్రస్తుత పన్నులు చెల్లించాలి. వసూళ్ల కోసం వచ్చే కార్పొరేషన్ సిబ్బందికి అన్ని విధాలుగా సహకారం అందించాలి. – శాంతికుమార్, టాక్సేషన్ ఆఫీసర్ -
బేరం కుదిరింది
జమ్మలమడుగు: ఎందుకు మాపై దాడులు చేస్తారు.. మమ్మల్ని ఇబ్బంది పెడితే మీకేమొస్తుంది.. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళదాం.. దుకాణానికి రూ. 10 వేలు చొప్పున ప్రతి నెలా అందజేస్తాం.. ఇకపై మా దుకాణాల జోలికి రాకండి.. ఒకవేళ వచ్చినా చూసీ చూడనట్లు వెళ్లండి... జమ్మలమడుగుకు చెందిన పురుగుమందుల దుకాణ యజమానులు అధికారులకు చేసిన విన్నపాలు ఇవి. జమ్మలమడుగులోనిదాడులు చేసి నకిలీ క్రిమిసంహారకమందులు, ఎరువులను సీజ్ చేశారు. దీంతో అధికారులను మంచి చేసుకోవాలని పురుగుమందుల దుకాణ యజమానులు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా గండికోటలో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయ ఏడీ ఇన్నయ్యరెడ్డి, ఏఈ, ఏఈవోలు విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పురుగుమందుల దుకాణ యజమానులు మందు బాటిళ్లతో పాటు తమ డిమాండ్లను అధికారుల ఎదుట పెట్టారు. తనిఖీలు చేసినప్పుడు సరకుల రిజిస్టర్లు సక్రమంగా లేకపోయినా చూసీ చూడనట్లు వెళ్లండి .. ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్మకాలు చేస్తున్నట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పట్టించుకోకండి.. ఇందుకు ప్రతి దుకాణానికి నెలకు రూ. 10 వేలు చొప్పున ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు అధికారులు కూడా తలూపినట్లు సమాచారం.