![Madhya Pradesh: Told To Pay For Cigarettes, 4 Beat Shopkeeper To Death - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/16/cigarette.jpg.webp?itok=Y4VeYRl8)
ప్రతీకాత్మక చిత్రం
భోపాల్: తీసుకున్న సిగరెట్లకు డబ్బులు చెల్లించాలని అడిగినందుకు షాప్ నిర్వహకుడిని నలుగురు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. షాడోల్ జిల్లాలోని డియోలాండ్‌లో పట్టణంలో శనివారం రాత్రి నలుగురు వ్యక్తులు (మోను ఖాన్, పంకజ్ సింగ్, విరాట్ సింగ్, సందీప్ సింగ్) అరుణ్ సోనీ అనే వ్యక్తి దుకాణంలోకి వెళ్లి సిగరెట్లు అడిగి తీసుకున్నారు.
చదవండి: ఘోరం: ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్‌పై.. కజిన్ అత్యాచారం
అనంతరం డబ్బులు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్తుండగా.. తీసుకున్న సిగరెట్లకు డబ్బులు చెల్లించాలని యాజమాని అడిగాడు. దీంతో షాప్ నిర్వహకుడితోపాటు తన ఇద్దరు కుమారులపై దాడి చేశారు. తీవ్రంగా గాయాలపాలైన సోనీని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
చదవండి: గొడవ ఆపాలని ప్రయత్నించిన పోలీసు ముఖంపై..
Comments
Please login to add a commentAdd a comment