వైరల్‌: రూ.5 గొడవ.. చాయ్‌వాలాని చితకబాదేసిన యువతి.. అడ్డొచ్చిన వారిని.. | Girl Beat Up Tea Shopkeeper In Shivpuri Madhya Pradesh Goes Viral | Sakshi
Sakshi News home page

Viral Video: రూ.5 గొడవ.. చాయ్‌వాలాని చితకబాదేసిన యువతి.. అడ్డొచ్చిన వారిని..

Published Thu, Dec 9 2021 9:14 PM | Last Updated on Thu, Dec 9 2021 9:50 PM

Girl Beat Up Tea Shopkeeper In Shivpuri Madhya Pradesh Goes Viral - Sakshi

భోపాల్‌:  మనకిష్టమైన వాళ్లని ఎవరు ఏమన్నా ఒప్పుకోలేము. అలాంటిది ఏకంగా కొట్టాడని తెలిస్తే తట్టుకోగలమా. అలా కొట్టిన వాళ్ల బ్యాండ్‌ మోగించేంతవరకు మన మనసు మన దగ్గర ఉండదు. సరిగ్గా ఇలానే ఓ యవతి తన తండ్రిని అకారణంగా కొట్టిన టీ యజమానిపై శివంగిలా విరుచుకుపడి చితకబాదేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..  శివపురిలోని దినారా పట్టణంలో నివసిస్తున్న తేజ్ సింగ్ పరిహార్ హైవే సమీపంలోని ఓ దుకాణంలో టీ తాగాడు.

టీ తాగిన తర్వాత అతను రూ.5 చెల్లించినప్పటికీ  టీ షాపు యజమాని బురా ఇవ్వలేదని చెప్పాడు. ఆ తర్వాత వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తేజ్ సింగ్‌ను బురా కొట్టాడు. ఈ బాధతో తేజ్ సింగ్ ఇంటికి చేరుకోగా, అతని కుమార్తెకు జరిగిన విషయం తెలిసింది. ఆ అమ్మాయి తన తండ్రిని కొట్టిన విషయం తెలియడంతో కోపంతో ఊగిపోయి కర్రతో దుకాణానికి చేరుకుంది. అక్కడికి చేరుకోగానే టీ షాపు యజమానిని చితకబాదేసింది. అయితే దుకాణం సమీపంలోని ప్రజలు గుమిగూడి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ యువతి వారిని కూడా లెక్క చేయలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువతి చేసిన పనికి మెచ్చకుంటూ కామెంట్లు పెడుతున్నారు.


చదవండి: Groom On Bahubali Throne: పెళ్లిలో బళ్లాలదేవ సింహాసనంపై ఊరేగిన వరుడు.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement