వైరల్‌: అవునండీ... ఇది బిర్యానీ టీ | Neha Deepak Sha shared the recipe of biryani chai on her social media viral | Sakshi
Sakshi News home page

Neha Deepak Sha: అవునండీ... ఇది బిర్యానీ టీ

Published Sun, Jan 28 2024 12:08 AM | Last Updated on Sun, Jan 28 2024 6:43 AM

Neha Deepak Sha shared the recipe of biryani chai on her social media viral - Sakshi

వేడి వేడిగా బిర్యానీ తింటే ఎంత మజా? ఆ తరువాత వేడి వేడిగా టీ తాగుతుంటే ఎంత మజా! ఆ మజాను ఈ మజాను మిక్స్‌ చేసి ‘బిర్యానీ టీ’ తయారుచేసింది ‘మాస్టర్‌ చెఫ్‌ 4’ విజేత నేహాదీపక్‌షా. టీ ఆకులు, దాల్చిన చెక్క, సోంపు, నల్లమిరియాలు, యాల కులు... మొదలైన వాటితో నేహా తయారు చేసిన ఈ ‘బిర్యానీ టీ’  చవులూరిస్తూ నెట్టింట వైరల్‌ అవుతుంది.

వీడియో వైరల్‌ కావడం మాట ఎలా ఉన్నా నెటిజనులు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ‘ఆహో ఓహో!’ అని పొగడ్తల దండకం అందుకుంటే, మరి కొందరు ‘బిర్యానీ టీ అంటే ఏమిటో కాదు వేడి వేడి బిర్యానీని వేడి వేడి టీలో కలపడం’ అని జోక్‌ చేస్తున్నారు. ఐస్‌క్రీమ్‌ రోల్‌ మేకర్‌ కూలింగ్‌ పాన్‌ను ఉపయోగించి ఒక చెఫ్‌ తయారుచేసిన ‘స్క్రీమ్‌టీ’కూడా ఈమధ్య నెట్‌లోకంలో హల్‌చల్‌ చేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement