![Groom Thrashed Rs 10 Lakh Dowry Demand Ghaziabad Goes Video Viral - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/18/sdfh.jpg.webp?itok=DnuQ36_Z)
లక్నో: వరకట్న వేధింపులు అనేవి పురాతన కాలం నుంచి ఆడపిల్లలను, వారి తల్లిదండ్రులను పట్టి పీడిస్తున్న సమస్య. ఇవే వేధింపులు ఎక్కువగా మారి హత్యలు, ఆత్మహత్యలకు దారితీసిన ఘటనలు కూడా బోలెడు ఉన్నాయి. తాజాగా ఓ వరుడు అదనపు కట్నం కావాలని అడిగినందుకు పెళ్లి మండపలోనే వధువు తరపు బంధువులు చితకబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. ముందు చెప్పిన దానికంటే వరుడి తండ్రి కట్నంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని వధువు తల్లిదండ్రులను డిమాండ్ చేశాడు. అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే పెళ్లిని రద్దు చేస్తానని బెదిరించాడు. అయితే వధువు కుటుంబీకులు ఇప్పటికే రూ.3 లక్షల నగదు, రూ.లక్ష విలువైన డైమండ్ రింగ్ ఇచ్చారు. అయితే అది సరిపోదని తాము అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ వరుడు తండ్రి పట్టుబట్టారు.
పెండ్లి సజావుగా జరగాలని వధువు తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వరుడితోపాటు అతని కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన పెండ్లి కుమార్తె కుటుంబ సభ్యులు పెండ్లి కొడుకుపై దాడి చేశారు. అందరు చూస్తుండగానే ఆ వరుడిని చితకబాదారు. ఇదంతా కొందరు వీడియోలో చిత్రీకరించగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లి వరుడి కుటుంబం కేసు నమోదైంది.
చదవండి: Vicky Kaushal: పెళ్లైన పది రోజులకే.. ఏంది భయ్యా? విక్కీ కౌశల్‌కు నెటిజన్ల ప్రశ్నలు
Comments
Please login to add a commentAdd a comment