![Mizoram Has Shops Without Shopkeepers To Teach Humanity Became Viral - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/20/Shop.jpg.webp?itok=6pSORS9p)
ఐజ్వాల్ : సాధారణంగా కిరాణషాపు నుంచి మొదలుకొని ఏ షాపుకైనా సరే యజమానులు కచ్చితంగా ఉంటారు. వారి ఆధ్వర్యంలోనే షాపు మొత్తం నడుస్తుంటుంది. కాని మిజోరాం రాజధాని ఐజ్వాల్ దగ్గరలో ఉన్న కొన్ని షాపులు మాత్రం యజమానులు లేకుండానే నడుస్తున్నాయి. అక్కడ నివసించే స్థానికులు ఒక ప్రత్యేక సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.' న్ఘా లౌ డావర్ సంస్కృతి'గా పిలవబడే సంప్రదాయం ప్రకారం అక్కడ ఉండే దుకాణాలన్ని యజమానులు లేకుండానే నడుస్తుంటాయి.(ధార్వాడ పేడాపై కరోనా నీడ)
ఇదంతా ఎందుకంటే చేస్తున్నారంటే.. ఈ ప్రాంతంలో నిజాయితీలో కూడిన మనుషులు నివసిస్తారట. ఎవరు ఎవరిని మోసం చేయరట. వారికి నచ్చినవి కొనుక్కొని ఆ షాపులోనే ఏర్పాటు చేసిన మనీ డిపాజిట్ బాక్సులో డబ్బులు వేసి వెళ్లిపోతారట. ముఖ్యంగా ఇక్కడి షాపులన్ని నమ్మకం పైనే పనిచేస్తాయట. ఇంత ఆధునిక కాలంలో కూడా ఇలాంటి సంప్రదాయాలు పాటించే మనుషులు ఉన్నారా అని ఆశ్చర్యమనిపిస్తే వెంటనే మిజోరాం వచ్చేయండి అంటున్నారు మై హోమ్ ఇండియా ఎన్‌జీవో సంస్థ. ఎందుకంటే ట్విటర్‌లో ఈ విషయాన్ని ఆ ఎన్‌జీవో సంస్థనే షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ' ఒక భారతీయునిగా గర్వపడుతున్నా'.. ' ఐ లవ్ దిస్ పీపుల్ వెరీ మచ్'..' ఇదంతా నమ్మకంపైనై ఆధారపడి ఉంటుంది' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment