
ప్రతీకాత్మక చిత్రం
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): బీటెక్ చదివిన యువకులు ఉద్యోగం లభించక బైక్ చోరీలకు అలవాటుపడి చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన హనుమంతనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా బాలయ్యపల్లి మండలానికి చెందిన హేమాద్రి, పవన్‌లు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చారు. అయితే వారికి ఉద్యోగం దొరకలేదు.
ఊర్లో మాత్రం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నామని చెప్పుకునేవారు. యూట్యూబ్‌లో చూసి బైక్‌లు చోరీ చేయడం ఎలాగో తెలుసుకున్న ఇద్దరూ ఖరీదైన బైక్‌లు, బుల్లెట్ బండ్లను చోరీ చేసి ఊర్లో దర్జా చూపేవారు. మరోవైపు బాధితులు హనుమంతనగర పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను వారి సొంతూరికి వెళ్లి అరెస్టుచేసి తీసుకొచ్చారు.
చదవండి ఎమ్మెల్యేకు షాక్.. సంచలనం రేపుతున్న మహిళా కానిస్టేబుల్ వాట్సాప్ స్టేటస్
Comments
Please login to add a commentAdd a comment