దొరికిన దొంగ.. పట్టించుకోని పోలీసులు.. చివరికి గ్రామస్తులు ఏం చేసారంటే! | Karnataka: Police Ask Farmers To Bring Thief On Their Own To Station | Sakshi
Sakshi News home page

దొరికిన దొంగ.. పట్టించుకోని పోలీసులు.. చివరికి గ్రామస్తులు ఏం చేసారంటే!

Published Fri, Jun 24 2022 6:04 PM | Last Updated on Fri, Jun 24 2022 6:13 PM

Karnataka: Police Ask Farmers To Bring Thief On Their Own To Station - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

దొడ్డబళ్లాపురం(బెంగళూరు): తామే దొంగను పట్టుకుని అరెస్టు చేసుకోండని సమాచారమిచ్చినా దేవనహళ్లి తాలూకా విశ్వనాథపుర, విజయపుర పోలీసులు స్పందించలేదని ప్రజలు ఆరోపించారు. దేవనహళ్లి తాలూకా ఎంబ్రళ్లి గ్రామంలో అర్ధరాత్రి పొలాల్లో జొరబడ్డ ఒక దొంగ కరెంటు వైర్లను చోరీ చేస్తుండగా రైతులు పట్టుకుని దేహశుద్ధి చేశారు.

పోలీసులకు ఫోన్‌ చేసి దొంగను పట్టుకుపోవాలని కోరగా విజయపుర, విశ్వనాథపుర పోలీస్‌స్టేషన్‌ల పోలీసులు ఆ గ్రామం తమ పరిధిలోకి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. తామే దొంగను బైక్‌పై తీసికెళ్లి పోలీసులకు అప్పగించామని తెలిపారు.

చదవండి: ఎలుక తెచ్చిన తంటా.. ఐదు లక్షల పరిహారం..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement