12 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ | 12 EAMCET counseling | Sakshi
Sakshi News home page

12 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

Published Wed, Jun 10 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM

12 నుంచి  ఎంసెట్ కౌన్సెలింగ్

12 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

ఈ నెల 20 వరకు సర్టిఫికెట్ల పరిశీలన
జిల్లాలో నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల ఏర్పాటు
అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలి
{పాసెసింగ్ ఫీజును పెంచిన ప్రభుత్వం  

 
గుంటూరు ఎడ్యుకేషన్ : ఎంసెట్ ఆధారిత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఈనెల 12న ప్రారంభం కానుంది. ఎంసెట్‌లో ర్యాంకులు పొంది రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్‌లో ప్రవేశానికి ఎదురుచూస్తున్న విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు అవసరమైన ధ్రువపత్రాలను  సిద్ధం చేసు కోవాలి. గుంటూరు నగరం గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఈనెల 20వ తేదీ వరకు ర్యాంకుల వారీగా విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. పరిశీలన పూర్తయిన విద్యార్థులకు కళాశాలల ఎంపిక కోసం ఈనెల 14 నుంచి 21వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకునేందుకు వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో చెల్లించాల్సిన ప్రాసెసింగ్ ఫీజును ప్రభుత్వం పెంపుదల చేసింది. గతంలో ఓసీ, బీసీ విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ. 600 మొత్తాన్ని రూ. 900కు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 300 నుంచి రూ. 450కు పెంచింది. ఎస్టీ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని పాలిటెక్నిక్ కళాశాలలో హాజరుకావాలి. ఇతర వివరాలకు జ్ట్టిఞట://్చఞ్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి.జీ సందర్శించాలి.

సర్టిఫికెట్ల పరిశీలనకు వెంట తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాలు..
 ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్ టికెట్, 10వ తరగతి, ఇంటర్మీడియెట్ మార్కుల జాబితా, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, నివాస, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాల్సి ఉంది. ఆయా ధ్రువపత్రాల ఒరిజినల్స్‌తో పాటు రెండు జిరాాక్స్ కాపీ సెట్లను తీసు కెళ్లాలి. పరిశీలన అనంతరం జిరాక్స్ సర్టిఫికెట్లను సమర్పించాలి. అంగ వైకల్యం, క్యాప్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, ఆంగ్లో ఇండియన్ విభాగాలకు చెందిన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు విజయ వాడ బెంజి సర్కిల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హాజరవ్వాలి.

 ర్యాంకులవారీగా సర్టిఫికెట్ల పరిశీలన జరిగే తేదీలు ....
 - గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో...

 ఈనెల 12న ఒకటో ర్యాంకు నుంచి 3,700 ర్యాంకు వరకు,13న 15,001 ర్యాంకు నుంచి 18,800 వరకు,14న 30,001 నుంచి 33,700 వరకు, 15న 45,001 ర్యాంకు నుంచి 48,800 వరకు,16న 60,001 ర్యాంకు నుంచి 63,700 వరకు,17న 75,001 ర్యాంకు నుంచి 78,800 వరకు,18న 90,001 ర్యాంకు నుంచి 93,700 వరకు, 19న 1,05,001 నుంచి 1,08,800 వరకు, 20న 1,20,001 ర్యాంకు నుంచి 1,22,500 వరకు హాజరుకావాలి.
 
నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో...
ఈనెల 12న 3,701 ర్యాంకు నుంచి 7,500 ర్యాంకు వరకు,13న 18,801 ర్యాంకు నుంచి 22,500 వరకు,14న 33,701 నుంచి 37,500 వరకు, 15న 48,801 ర్యాంకు నుంచి 52,500 వరకు, 16న 63,701 ర్యాంకు నుంచి 67,500 వరకు, 17న 78,801 ర్యాంకు నుంచి 82,500 వరకు, 18న 93,701 ర్యాంకు నుంచి 97,500 వరకు,19న 1,08,801 నుంచి 1,12,500 వరకు, 20న 1,22,501 ర్యాంకు నుంచి 1,25,000 వరకు హాజరుకావాలి.

 సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో...
 ఈనెల 12న 7,501 ర్యాంకు నుంచి 11,200 ర్యాంకు వరకు,13న 22,501 ర్యాంకు నుంచి 26,300 వరకు,14న 37,501 నుంచి 41,200 వరకు,15న 52,501 ర్యాంకు నుంచి 56,300 వరకు,16న 67,501 ర్యాంకు నుంచి 71,200 వరకు,17న 82,501 ర్యాంకు నుంచి 86,300 వరకు,18న 97,501 ర్యాంకు నుంచి 1,01,200 వరకు,19న 1,12,501 నుంచి 1,16,300 వరకు, 20న 1,25,001 ర్యాంకు నుంచి 1,27,500 వరకు హాజరుకావాలి.

ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో...
ఈనెల 12న 11,201 ర్యాంకు నుంచి 15,000 ర్యాంకు వరకు,13న 26,301 ర్యాంకు నుంచి 30,000 వరకు,14న 41,201 నుంచి 45,000 వరకు,15న 56,301 ర్యాంకు నుంచి 60,000 వరకు,16న 71,201 ర్యాంకు నుంచి 75,000 వరకు,17న 86,301 ర్యాంకు నుంచి 90,000 వరకు,18న 1,01,201 ర్యాంకు నుంచి 1,05,000 వరకు,19న 1,16,301 నుంచి 1,20,000 వరకు, 20న 1,27,501 నుంచి ఆపై చివరి ర్యాంకు వరకు హాజరుకావాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement