
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
జనగామ (వరంగల్): ఏమైందో ఏమో గాని బీటెక్ ఫైనలియర్ చదువుతున్న ఓ విద్యార్ఙిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వరంగల్ జిల్లాలోని జనగామలో మంగళవారం రాత్రి జరిగింది. పోచంపల్లిలోని దేశ్ ముఖ్ విలేజ్ సెయింట్ మెరీస్ ఇంజనీరింగ్ కళశాలలో బాలనందిని ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతోంది.
శ్రీరామనవమి పండగ జరుపుకోవడానికి కొన్నిరోజుల కిందట ఇంటికి వచ్చింది. అయితే 20వ తేదీన కళాశాలకు తిరిగి వెళ్లనుంది. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు, మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.