![Samsung Going To Appoint B Tech Graduates In India - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/27/Samsung-Graduates.jpg.webp?itok=na8-ZGFh)
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శామ్‌సంగ్ వచ్చే ఏడాది భారత్‌లో 1,000 మందికిపైగా ఇంజనీర్లను చేర్చుకోనుంది. ఐఐటీలతోపాటు బిట్స్ పిలానీ, ఎన్‌ఐటీల వంటి ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటున్న అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నట్టు ప్రకటించింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఐవోటీ, డీప్ లెర్నింగ్, నెట్‌వర్క్స్, ఇమేజ్ ప్రాసెసింగ్, క్లౌడ్, డేటా అనాలసిస్, ఆన్–డివైస్ ఏఐ, కెమెరా టెక్నాలజీ వంటి విభాగాల కోసం వీరిని నియమించుకోనున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment