వైవీయూలో ఎంబీఏ స్పాట్‌ అడ్మిషన్లు | mba spot admissoin will be start in yvu | Sakshi
Sakshi News home page

వైవీయూలో ఎంబీఏ స్పాట్‌ అడ్మిషన్లు

Published Wed, Aug 24 2016 8:03 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

వైవీయూలో ఎంబీఏ స్పాట్‌ అడ్మిషన్లు

వైవీయూలో ఎంబీఏ స్పాట్‌ అడ్మిషన్లు

వైవీయూ :

యోగివేమన విశ్వవిద్యాలయంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి గల అభ్యర్థులకు ఈనెల 29వ తేదీన స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వైవీయూ ప్రవేశాల సంచాలకుడు ఆచార్య ఎస్‌. రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్స్, రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలు, నిర్ణీతఫీజుతో డీఓఏ కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. ఎంబీఏ విద్యార్థులకు సంవత్సరానికి రూ.10వేలు, ఎంసీఏ విద్యార్థులకు రూ.12 వేలతో పాటు ప్రాసెసింగ్‌ ఫీజు రూ.500– చెల్లించి ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ఐసెట్‌–2016 రాసిన వారు, రాయని వారుకూడా ఈ ప్రవేశాలకు హాజరుకావచ్చని తెలిపారు. ఓసీ విద్యార్థులు డిగ్రీలో 50 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 45 శాతం మార్కులతో పాసై ఉండాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement