మొదటి ఎంబీయే మహిళా సర్పంచ్‌,లక్షల ప్యాకేజిని వదిలి.. | MBA turned sarpanch brings winds of change in Raj village | Sakshi
Sakshi News home page

మొదటి ఎంబీయే మహిళా సర్పంచ్‌,లక్షల ప్యాకేజిని వదిలి..

Published Wed, Dec 13 2023 12:13 AM | Last Updated on Wed, Dec 13 2023 10:46 AM

MBA turned sarpanch brings winds of change in Raj village - Sakshi

ఛావీ రాజావత్‌ రాజస్థాన్‌లోని సోడా గ్రామంలో పుట్టి పెరిగింది. పట్నంలో ఉన్నత చదువులు చదివి, కళ్లు చెదిరే ప్యాకేజీతో కార్పొరేట్‌ ఉద్యోగంలో చేరింది. కానీ, చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి గ్రామానికి వెళ్లింది. సర్పంచ్‌గా ఎన్నికల్లో నిలబడి గెలిచింది. పదేళ్లపాటు సర్పంచ్‌గా పనిచేసింది. మొదటి ఎంబీయే మహిళా సర్పంచ్‌గా వార్తల్లో నిలిచి, యుఎన్‌లో ప్రసంగం చేసింది. గ్రామాన్ని మోడల్‌ గ్రామంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు గ్రామాభివృద్ధికి కృషి చేస్తూనే, హోటల్‌ వ్యాపారం చేస్తోంది. ఆసక్తి గలవారికి గుర్రపు స్వారీలో శిక్షణ ఇస్తోంది.  

‘‘2010లో తొలిసారి సర్పంచ్‌ అయినప్పుడు గ్రామ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. గ్రామం తీవ్ర కరువుతో అల్లాడిపొంయింది. సాగునీరు లేదు. 13–14 సంవత్సరాలుగా రుతుపవనాలు లేవు. భూగర్భ జలాలను వాడుకోలేకపొంయేవారు. 3–4 గంటలకు మించి విద్యుత్‌ సరఫరా లేదు. రోడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది. ఈ సవాళ్లతో సోడా పంచాయితీ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టాను. మొదటి టర్మ్‌లో కొన్ని పనులు పూర్తయ్యాయి. 

మా ఊరు తనవైపు లాగింది..
మా తాత బ్రిగేడియర్‌ రఘుబీర్‌సింగ్‌ 1990 వరకు సర్పంచ్‌గా చేశారు. నాకు మా ఊరు అంటే ఎప్పుడూ ఇష్టమే. బెంగుళూరులోని రిషి వ్యాలీ స్కూల్, జైపూర్‌లోని మాయో కాలేజీ గర్ల్స్‌ స్కూల్‌లో చదువుకున్నాను. వేసవి సెలవులు వచ్చినప్పుడల్లా మా ఊరిలోనే ఉండేదాన్ని. ఢిల్లీలోని మహిళా శ్రీరామ్‌ కాలేజీ నుండి డిగ్రీ తీసుకున్నాక, పూణెలోని బాలాజా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మోడ్రన్‌ మేనేజ్‌మెంట్‌ నుండి ఎంబీయే పూర్తి చేశాను. ఏడేళ్లపాటు కార్పొరేట్‌ సెక్టార్‌లో వర్క్‌ చేశాను. లక్షల రూపాయల జీతం. కానీ, మా ఊరు వైపు నన్ను తన వైపు లాగింది. 

మహిళకు రిజర్వ్‌ అని.. 
2010లో మా గ్రామ పంచాయితీ మహిళలకు రిజర్వ్‌ చేయబడింది. అప్పుడు మా ఊరి పెద్దలు నన్ను ఎన్నికల్లో నిలబడమని అడిగారు. ఆ సమయంలో సర్పంచ్‌ని అవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. గ్రామస్తులు మా అమ్మనాన్నలను అడిగారు. ‘ఏం చేయాలనుకున్నా తన ఇష్టం, మా బలవంతం ఉండదు’ అని చెప్పారు. నాకు అప్పటి వరకు గ్రామ సభలు ఎలా జరుగుతాయి, పంచాయితీలకు నిధులు ఎలా వస్తాయో తెలియదు. ఆ విషయాలను గ్రామస్తులే చెప్పారు. ఆ విధంగా పంచాయితీ ఎన్నికల్లో నిలబడి, గెలిచాను. మా ఇంట్లో మా తాత తర్వాత నేను సర్పంచ్‌ని అయ్యాను. 

వర్షపు నీటి సంరక్షణ
ముందుగా ఊరి భవితవ్యాన్ని ఒంటరిగా మార్చలేమని, ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని అందరికీ స్పష్టంగా చెప్పాను. నేను వ్యూహంతో పనిచేయడం ప్రారంభించాను. ప్రభుత్వం, ప్రైవేట్‌ రంగం, గ్రామాలను అనుసంధానించడం, కరువును ఎదుర్కోవడం నేను ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లు. గ్రామంలోని నీటివనరులన్నీ పూడికతో నిండిపొంయాయి. సుమారు 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న నీటి వనరుల్లో పూడిక మట్టిని తొలగించేందుకు లక్షల రూపాయలు 
సేకరించి, ఖర్చు చేశాం. 

మహిళలు ముందు
గ్రామపంచాయితీ నా కుటుంబం లాంటిది. నేను మీటింగులు పెట్టడం మొదలుపెట్టగానే ఏయేప్రాజెక్టుల్లో ఎలా పనిచేస్తున్నానో చెప్పేదాన్ని. ఈప్రాజెక్టుల గురించి వారు ఏమనుకుంటున్నారో అందరి అభిప్రాయాలు తెలుసుకునేదాన్ని. అలాగే, ఎంత డబ్బు ఖర్చు అవుతుందో కూడా వివరించేదాన్ని. పనులు సజావుగా అయ్యేలా అధికారులను కలిసి ఆరా తీయమని గ్రామస్తులకు  చెప్పేదాన్ని.

మహిళల బృందం డిజైనర్‌ ల్యాంప్‌లు, కొవ్వొత్తులు, మసాలా దినుసులు వంటి ఉత్పత్తులు తయారు చేయడం మొదలుపెట్టారు. ఇవి మంచి ధరకు అమ్ముడు పొంవడం మొదలయ్యింది. దీంతో మహిళల జీవితం మెరుగుపడింది. రెండేళ్లలో 950 ఇళ్లకు గాను 800 మరుగుదొడ్లు నిర్మించాం. 24 గంటలూ కరెంట్‌ అందుబాటులోకి వచ్చింది. 

రోడ్లప్రాధాన్యత
నా ఎజెండాలో రోడ్లప్రాధాన్యత స్పష్టంగా ఉంచాను. ముందు ప్రైవేట్‌ బస్సుల సహాయం తీసుకున్నాను. బాలికల కోసం పాఠశాల, మహిళల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశాను. మూతపడిన బి.ఎడ్‌ కాలేజీని స్వాధీనం చేసుకొని దానిని బాలికల చదువుకోసం కేటాయించాను. ఓ ప్రైవేట్‌ కంపెనీ 200 టేబుళ్లు, బెంచీలను అందజేసి మా వెన్ను తట్టింది.  

అందరికీ బ్యాంకు ఖాతా..
సర్పంచ్‌ అయిన ఐదేళ్లలోనే రోడ్లు, డ్రైన్లు, అందరికీ బ్యాంకు ఖాతా తెరిపించాను. ఎప్పుడూ ఫీల్డ్‌ వర్క్‌లోనే ఉండేదాన్ని. బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల, చదువుప్రాముఖ్యతను వివరించేదాన్ని.. నా స్వభావం అందరినీ కలుపుకొని ఉంటుంది. ఐక్యరాజ్యసమితి 11వ ఇన్ఫో పావర్టీ వరల్డ్‌ కాన్ఫరెన్స్‌ను నిర్వహించినప్పుడు మొదటిసారి భారతదేశం నుండి ఒక మహిళా సర్పంచ్‌గా దేశం తరపునప్రాతినిధ్యం వహించాను.

ఇది నాకు గర్వంగా అనిపించింది. అక్కడ వారందరి మదిలో సర్పంచ్‌ అంటే తలపై ముసుగు వేసుకుని ఉన్న గ్రామస్థురాలు అనుకున్నారు. కానీ, నన్ను కార్పొరేట్‌ లుక్‌లో చూసి అందరూ ఆశ్చర్యపొంయారు. సోడా విలేజ్‌ అభివృద్ధికి డబ్బు కంటే వ్యక్తులు, అందరి సమష్టి కృషి అవసరం అని ఫోరమ్‌లో చెప్పాను. 

రెండుసార్లు సర్పంచ్‌గా నా విధులను నిర్వర్తించాను. తర్వాతి వారికి అవకాశాలు ఇవ్వాలని నేను మళ్లీ పొంటీ చేయలేదు. ఇప్పుడు హోటల్‌ని నిర్వహిస్తున్నాను. గుర్రపు స్వారీ వచ్చు కాబట్టి, ఆసక్తి గలవారికి శిక్షణ ఇస్తున్నాను’ అని వివరిస్తుంది ఈ యంగ్‌ లీడర్‌. 
  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement