Woman power
-
యూత్ పల్స్... ఫ్యూచర్ రెడీ
ఫ్యూచర్ రెడీయువతులకు సంబంధించి ‘ఏఐ’ని ఉ΄ాధి కోణంలో మాత్రమే చూడనక్కర్లేదు. ఆత్మవిశ్వాసం నుంచి ఆర్థిక స్వావలంబన వరకు ఎన్నో అంశాలలో ‘ఏఐ’ యువతరం నేస్తం అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(జెన్ఏఐ) ద్వారా గ్లాస్ సీలింగ్‌ను ఛేదించే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ కోర్సులలో చేరడానికి మహిళలు ఆసక్తి చూపుతున్నారు’ అంటున్నారు ఆన్లైన్ లెర్నింగ్ పాట్‌ఫామ్ ‘కోర్సెరా’స్ట్రాటజిక్ అడ్వైజర్ శ్రావణ్ గోలి. యువతులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడానికి సవిట్ (సౌత్ ఏషియా ఉమెన్ ఇన్ టెక్) జెనరేటివ్ ఏఐ లెర్నింగ్ ఛాలెంజ్‌ను ప్రకటించింది. సుమారు అయిదు లక్షల మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో శిక్షణ ఇవ్వాలనేది ‘సవిట్’ లక్ష్యంగా పెట్టుకొంది.‘కెరీర్ పరంగా సరికొత్త అవకాశాలకు, ఆర్థిక స్వావలంబనకు, ఉద్యోగాలలో లింగ అంతరాన్ని పూడ్చడానికి, ఏఐ రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది’ అంటుంది సవిట్.టెక్నాలజీ సెక్టార్లో కెరీర్ కోసం కలలు కంటున్న యువతులకు అవసరమైన సదు΄ాయాలు ఏర్పాటు చేయడంతో ΄ాటు సాంకేతిక శిక్షణ ఇవ్వనుంది సవిట్. నెట్వర్కింగ్, మెంటార్షిప్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్కిల్ గ్రోత్, రిక్రూట్మెంట్కు సంబంధించి మహిళలకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించబోతుంది. టెక్ మహీంద్రాలో ఏఐ ్ర΄ాజెక్ట్లకు సంబంధించి మహిళలు గణనీయమైన సంఖ్యలో నాయకత్వ స్థానంలో ఉన్నారు. టార్గెట్ రిక్రూట్మెంట్, మెంటార్షిప్ ప్రోగ్రామ్స్, కెరీర్ రిక్రూట్మెంట్ కార్యక్రమాల ద్వారా భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలలో మహిళల సంఖ్యను గణనీయంగా పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.గ్రామీణ భారతంలో కూడా యువతులను ఆర్థిక స్వావలంబన దిశగా నడిపిస్తోంది ఏఐ. దీనికి ఉదాహరణ... బిహార్‌లోని ‘ఐ–సాక్ష్యం’ అనే సంస్థ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి రూపోందించిన ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ల ద్వారా గ్రామీణ ప్రాంతం యువతులను ఛేంజ్‌మేకర్స్‌గా మారుస్తోంది ఐ–సాక్ష్యం. లైఫ్ స్కిల్స్, డిజిటల్, ఫైనాల్సియల్ లిటరసీ... మొదలైన వాటికి సంబంధించి ‘ఐ–సాక్ష్యం’ శిక్షణ ఇస్తోంది.‘కోడ్ విత్ ఔట్ బ్యారియర్స్’ ప్రోగ్రామ్ క్రింద 75,000 మహిళలకు ఏఐలో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది మైక్రోసాఫ్ట్. టెక్సాక్ష్యం, సైబర్శిక్షణ, మైక్రోసాఫ్ట్ డైవర్శిటీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ (ఎండీఎస్పీ)... మొదలైన కార్యక్రమాల ద్వారా నిరుపేద యువతులకు సాంకేతికరంగంలో ఉద్యోగావకాశాలు కల్పించడానికి అవసరమైన శిక్షణ ఇస్తోంది మైక్రోసాఫ్ట్. -
మార్పు దిశగా బజ్ ఉమెన్
కర్నాటకకు చెందిన ‘బజ్ ఉమెన్’ అనే స్వచ్ఛంద సంస్థ గ్రామీణ ప్రాంత మహిళలను దృష్టిలో పెట్టుకొని ఇంటింటికి వెళ్లి ఫైనాన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లీడర్షిప్ లాంటి అంశాలలో శిక్షణ ఇస్తోంది. అలా బజ్ ఉమెన్ గ్రామీణ ప్రాంతల ప్రజలలో చైతన్యాన్ని తీసుకువచ్చింది. సురక్షితం కాని మాంసం తినడం వల్ల అనారోగ్యానికి గురైంది కర్నాటకలోని కడారిపుర గ్రామానికి చెందిన కాంతలక్ష్మి. ఇలాంటి మహిళల కోసం ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం గురించి అవగాహన కలిగించడంలో విజయం సాధించింది బజ్ ఉమెన్ స్వచ్ఛంద సంస్థ.‘బజ్ గ్రీన్ ప్రోగ్రాం’ ద్వారా దేశీ పాల్ట్రీ నుంచి ఆర్గానిక్ ఫామింగ్ వరకు ఎన్నో విషయాలు తెలుసుకోగలిగారు గ్రామీణ్ర ప్రాంత మహిళలు.‘బజ్ గ్రీన్ ప్రోగ్రాం’ ద్వారా తాను తెలుసుకున్న విషయాలను ఆచరణలోకి తీసుకువచ్చింది కాంతలక్ష్మి. యాభై వేలు అప్పు చేసి ఫామ్ మొదలుపెట్టింది. ఆ తరువాత బంగాళదుంప, మునగకాయలు, ఉల్లిపాయలు, బీన్స్... వంటి వాటితో కిచెన్ గార్డెన్ కూడా మొదలుపెట్టింది. సొంతంగా కూరగాయలు పండించడం ద్వారా కాంతలక్ష్మి డబ్బును ఆదా చేస్తోంది.΄పాల్ట్రీ ఉత్పత్తులను అమ్మడం ద్వారా మరికొంత ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ‘యాక్టివ్ క్లైమేట్ ఛేంజ్ ఏజెంట్’గా కూడా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన కాంతలక్ష్మి తన ఇంటి చుట్టుపక్కల ప్రదేశాలలో మామిడితో సహా రకరకాల మొక్కలు నాటింది. నీటిని రీసైక్లింగ్ చేసే పద్ధతుల గురించి కూడా నేర్చుకుంది.‘బజ్ గ్రీన్’ ద్వారా తాను నేర్చుకున్న విషయాలను తనలాంటి మహిళలకు చెబుతూ వారిని చైతన్యవంతులను చేస్తోంది కాంతలక్ష్మి.‘బజ్ ఉమెన్’ ద్వారా పర్యావరణం నుంచి నీటి పోదుపు వరకు ఎన్నో విషయాలు తెలుసుకున్న ఆరు లక్షలమంది మహిళలలో కాంతలక్ష్మి ఒకరు. ‘లింగ వివక్షతను అధిగమించడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపోందించడానికి. పేదరికం నుంచి బయట పడడానికి, వాతావరణ మార్పుల గురించి తెలుసుకోవడానికి గ్రామీణ ప్రాంత మహిళలకు మా సంస్థ సహాయపడుతుంది. సాధికారత దిశగా అడుగులు వేసే శక్తి వారిలో ఉంది’ అంటుంది ‘బజ్ ఉమెన్’ వ్యవస్థాపకులలో ఒకరైన ఉతార నారాయణ్.కాస్ట్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసిన ఉతార నారాయణ్ ‘జనగ్రహ’ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేసింది. ఎన్నో కార్యక్రమాల్లో భాగం అయింది. ఆ అనుభవం జ్ఞానం ‘బజ్ ఉమెన్’ను ముందుకు నడిపించడానికి ఉపయోగపడింది.ఆడపిల్లలు, మగపిల్లలను సమానంగా చూసే కుటుంబ వాతావరణంలో పెరిగింది నారాయణ్. అయితే చుట్టుపక్కల మాత్రం ఆడపిల్లల పట్ల చాలా వివక్ష కనిపించేది. ఆర్థికంగా భర్త మీద ఆధారపడే మహిళలే ఎక్కువగా కనిపించేవారు. ఈ నేపథ్యంలో గ్రామీణ మహిళలను చైతన్యవంతం చేసే కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది.‘బజ్ ఉమెన్’ సంస్థ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో గ్రామాలకు వెళ్లి, ఎంతోమంది మహిళలతో మాట్లాడింది ఉతార నారాయణ్. ఆ అనుభవాలు సంస్థను మరింత ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతున్నాయి. -
నేను సాధించగలను అనే పట్టుదల ఉన్న వారికి ఏ ఫీల్డ్ అయినా ఒకటే
ఫీల్డ్ మారడం అనేది మంచి నీళ్లు తాగినంత సులభం కాదు.కాస్త అటూ ఇటూ అయితే మూడు చెరువుల నీళ్లు తాగాల్సి ఉంటుంది.‘నేను సాధించగలను’ అనే పట్టుదల ఉన్న వారికి మాత్రం ఏ ఫీల్డ్ అయినా ఒకటే. అలాంటి ప్రతిభావంతులలో తేజ ఒకరు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా పనిచేసిన తేజ ఐటీ రంగంలోకి అడుగుపెట్టి టెక్ లీడర్‌గా మంచి పేరు సంపాదించింది. కర్ణాటకలోని బెల్గాంలో పెరిగిన తేజ మనకమె డాక్టర్ అయిన తండ్రి నుంచి విజ్ఞానప్రపంచానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకునేది. డిఐవై (డూ ఇట్ యువర్ సెల్ఫ్) పాజెక్ట్స్ చేసేది. కర్ణాటక యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సు చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలిసారిగా నాన్–మెడికల్ ఏరియాలలో మహిళల కోసం ద్వారాలు తెరుస్తున్న సమయం అది. తన సీనియర్స్ ఎయిర్ ఫోర్స్‌లో చేరిపోయారు. వారిని యూనిఫామ్‌లో చూడడం తేజాకు ఎగ్టయిటింగ్గా అనిపించింది. వారి స్ఫూర్తితోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోకి వచ్చింది. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజీలోప్రాథమిక శిక్షణ తరువాత మౌంట్ అబూలో పాస్టింగ్ ఇచ్చారు. మౌంట్ అబూ స్టేషన్‌లోని ఉద్యోగులలో ఇద్దరు మాత్రమే మహిళలు. అందులో తాను ఒకరు. మహిళల కోసం ప్రత్యేక వాష్ రూమ్స్ ఉండేవి కావు. ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నా ఎప్పుడూ నిరాశపడేది కాదు తేజ,మౌంట్ అబూ తరువాత నాసిక్, బెంగళూరులలో కూడా పనిచేసింది. మన దేశాన్ని ఐటీ బూమ్ తాకిన సమయం అది.ఐటీ ఫీల్డ్‌లో ఉన్న సోదరుడు తేజాతో ఆ రంగానికి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకునేవాడు. దీంతో ఐటీ రంగంపై తనకు ఆసక్తి పెరిగింది. అలా ఎయిర్ ఫోర్స్‌ను వదిలి ఐటీ రంగంలోకి అడుగు పెట్టింది. టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)లో డెవలపర్‌గా చేరింది. ఫ్రెషర్‌గా ఐటీ రంగంలో కెరీర్ మొదలు పెట్టిన తేజ అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకుంది. ఆ తరువాత టెక్నాలజీస్‌లో పనిచేసింది. 2005లో డెల్ టెక్నాలజీలో మేనేజర్‌గా చేరింది. ఒక్కోమెట్టు ఎక్కుతూ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (ఐటీ) స్థాయికి చేరింది. జెండర్ స్టీరియో టైప్స్‌ను బ్రేక్ చేస్తూ డెల్ ఐటీ–ఇండియాలో కీలక స్థానంలో చేరిన తొలి మహిళగా గుర్తింపు ΄పోందింది.డెల్ ఫౌండేషన్‌లో సేల్స్ అండ్ మార్కెటింగ్, సప్లై చైన్, డేటా సైన్స్... మొదలైన విభాగాల్లో పట్టు సాధించింది. సీఎస్ఆర్ యాక్టివిటీస్‌పై బాగా ఆసక్తి చూపేది. ‘టెక్నాలజీ సహాయంతో ఎన్నో మంచిపనులు చేయవచ్చు’ అంటున్న తేజ రకరకాల స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. కోవిడ్ మహమ్మారి సమయంలో బుద్ద ఫౌండేషన్‌తో కలిసి వలస కార్మికులకు పునరావాసం కల్పించింది.‘ప్రతి మహిళకు ఒక రోల్‌మోడల్, మెంటర్ ఉండాలి. అప్పుడే ఎన్నో విజయాలు సాధించగలరు’ అంటున్న తేజ డెల్లో ‘మెంటర్ సర్కిల్ కాన్సెప్ట్’ను అమలు చేసింది. ప్రతి సర్కిల్లో కొందరు మహిళలు ఉంటారు. వారికో మెంటర్ ఉంటారు. ఈ సర్కిల్లో తమ సమస్యలను చర్చించుకోవచ్చు, సలహాలు తీసుకోవచ్చు. ఒకరికొకరు సహాయంగా నిలవచ్చు. ‘ఇంజినీరింగ్ కాలేజీలో క్లాసులో నలుగురు అమ్మాయిలు మాత్రమే ఉండేవాళ్లం. ఇప్పటి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా కుటుంబంలో నేను ఫస్ట్ ఉమెన్ ఇంజనీర్ని. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు. ఒక ముక్కలో చెపాలంటే సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఇది ఆహ్వానించదగిన మార్పు. నేను నేర్చుకున్న విషయాల ద్వారా ఇతరులకు ఏ రకంగా సహాయం చేయగలను అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంటాను. టైమ్ మేనేజ్మెంట్కు సంబంధించి ఎన్నో సమావేశాలు నిర్వహించాను’ అంటుంది తేజ. -
మీరు ఆర్థిక అక్షరాస్యులేనా?!
‘భారతీయ స్త్రీలు ఆర్థికంగా అక్షరాస్యులు కాకపోవడానికిప్రధాన కారణం పితృస్వామ్యమే’ అంటోంది గ్లోబల్ సర్వే స్టాండర్ట్ అండ్ పూర్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఆర్ధిక భద్రత, ఆర్థిక అక్షరాస్యత స్త్రీకి ఎంత అవసరమో తెలుసుకుంటే ఆమె పురోభివృద్ధిలో మరిన్ని మంచిమార్పులు చోటుచేసుకుంటాయన్నది అక్షర సత్యం. సం΄ాదనలో నేటితరం మహిళలూ తమ సత్తాను చూపుతున్నారు. వృత్తి, ఉద్యోగాల్లో కీలక ΄ాత్ర ΄ోషిస్తున్నారు. అక్షరాస్యతలోనూ ముందడుగు వేస్తున్నారు. అయితే, ఆర్థిక అక్షరాస్యతలో మాత్రం మహిళ వెనకంజలోనే ఉందని గ్లోబల్ ఫైనాన్షియల్ లిటరసీ బారోమీటర్ సర్వే స్పష్టం చేస్తోంది. 28 దేశాలలో నిర్వహించిన ఈ సర్వేలో (స్తీ–పురుషులు ఇద్దరినీ కలిపి) భారతదేశం 23వ స్థానంలో ఉంది. కేవలం 35 శాతం మంది మాత్రమే ఆర్థిక అక్షరాస్యులుగా ఉంటే, 65 శాతం మందికి ఆర్థిక అవగాహన తక్కువ. ఇందులోనూ మహిళలు మరింతగా వెనకబడి ఉన్నారు అని తెలియజేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ వందకోట్ల కంటే ఎక్కువ మంది మహిళలు సొంత బ్యాంకు ఖాతా కూడా లేనివారున్నారు. భావోద్వేగాలతో ఆట తరచూ భర్తలు తమ భార్యలతో ‘నేను సం΄ాదిస్తున్నాను కాబట్టి నువ్వు సం΄ాదించాల్సిన అవసరం ఏముంది? ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేసినట్టే అవుతుంది’ అనే ఎమోషనల్ స్ట్రాటజీలతో మహిళలు ఇరుక్కుంటున్నారు. దీంతో మహిళలు క్రమంగా ఒంటరిగా, నిస్సహాయంగా మారుతుంటారు. దురదృష్టం ఏమిటంటే ‘ప్రేమ’ అనే పేరుతో జరిగే ఆర్థిక దుర్వినియోగాన్ని మహిళలు గుర్తించలేక΄ోతున్నారు. ఆర్థిక భద్రత లేక΄ోవడంతో స్త్రీలు తమకి నప్పని సంబంధాలలోనూ సర్దుబాటు చేసుకుంటూ జీవించాల్సి వస్తుంది. చెడు సంబంధాలలోకి వెళుతుంటారు. డబ్బును ΄÷దుపు చేసి పెట్టుబడులు పెట్టడానికి బదులు, ఆమె కుటుంబం కోసం తనను తాను త్యాగం చేసుకుంటుంది. చివరకు అదే కుటుంబంలోని వ్యక్తులు లేదా పిల్లలు స్త్రీల మీద ఆర్థిక ఒత్తిడిని తీసుకువస్తున్నారు. మహిళల ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా గృహహింసను తగ్గించవచ్చని ‘రైట్స్ ఆఫ్ ఈక్వాలిటీ’ అనే సంస్థ ‘ది ఎకనామిక్ అబ్యూజ్ అండ్ ది ఇం΄ార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరీ ఆఫ్ ఉమెన్’ నివేదికలో పేర్కొంది. నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలి కుటుంబం ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో సాధారణంగా మహిళలు ఉండరు. లక్ష్మి ఒక సాధారణ గృహిణి. ఇప్పటికీ బ్యాంకు ఖాతా తెరవడానికి, కేవైసీ చేయడానికి భర్తతో కలిసే బ్యాంకుకు వెళుతుంది. ఆర్థికవిషయాలు అంటే ఆమెకు ఒక విధమైన భయం. సొంతంగా ఎప్పుడూ ప్రయత్నం కూడా చేయదు. ఇలాంటి గృహలక్ష్ములు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. ఉమ ఉద్యోగం చేస్తుంది. కానీ, ఆమె ఏటీఎం కార్డ్ భర్త వద్ద ఉంటుంది. ΄ాస్వర్డ్ లాంటివి ఆమె స్వయంగా రూ΄÷ందించదు. అవన్నీ ఆమె భర్త చేస్తాడు. ఉద్యోగం చేస్తున్నా కూడా ఆర్థిక అక్షరాస్యత, ఆర్థికస్వేచ్ఛ లేని ఇలాంటి మహిళలు కోట్లాదిమంది ఉన్నారు. షాపింగ్‌లో సమస్య లేదు ‘ఆర్థిక అక్షరాస్యత అంటే బ్యాంకుకు వెళ్లడం, అకౌంట్ ఓపెన్ చేయడం, చిన్న చిన్న లావాదేవీలు చేయడం అనుకోవాలా?!’ అనే ప్రశ్న ఉదయించకమానదు. అయితే, ‘ఇండియన్ ఉమెన్ అండ్ ఫైనాన్షియల్ ఫిట్నెస్’ రచయిత సునీల్ గాంధీ మాట్లాడుతూ ‘చాలామంది మహిళలకు మొబైల్ యాప్‌లో షాపింగ్ చేయడం, క్యాబ్ బుక్ చేసుకోవడంలో ఎటువంటి సమస్య ఉండటం లేదు. అయితే, తమ సొంత బ్యాంకు ఖాతాను నిర్వహించడంలో లేదా ఆన్లైన్ లావాదేవీలు, పెట్టుబడుల పట్ల మాత్రం చాలా అసౌకర్యంగా ఉంటున్నారని చెబుతున్నారు. ‘ఆమె బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉండాలి. ఎందుకంటే, డబ్బు లావాదేవీలు, వడ్డీలు, చక్రవడ్డీల ఉచ్చులో చిక్కుకోకూడదు అని పురుషులు భావిస్తారు. ఆమె కూడా ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టడానికి, ఈఎమ్ఐ కట్టడానికి, ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపదు. వ్యక్తిగత ఫైనాన్స్, జ్ఞానం, నైపుణ్యాలు, వంటి ఆర్థిక సమాచారం ఉన్నవారు తమ డబ్బుకు సంబంధించి సొంతంగా నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఉన్నవారు ఆర్థికంగా అక్షరాస్యులు’ అని సునీల్ గాంధీ వివరిస్తున్నారు. మహిళలను నియంత్రించే ఆయుధం ఉద్దేశపూర్వకంగానే మహిళలకు ‘ఆర్థిక స్వేచ్ఛ’ ఇవ్వడం లేదు. కుటుంబంలోని మగవారే దీనిని అడ్డు కుంటున్నారు. భారతీయ స్త్రీలు ఇంటిని చూసుకుంటారు. పురుషులు సం΄ాదిస్తారు. దీంతో ‘తమకు ఏం అవసరమో పురుషులే చూసుకుంటారు’ అనే ఆలోచన స్త్రీలను ఆర్థిక స్వేచ్ఛకు దూరం చేస్తుంది. చేతిలో డబ్బు, దానిని ఖర్చు చేసే హక్కు పురుషులకు ఉండటం మహిళలను నియంత్రించే ఆయుధంగా మారింది. – గీతికా చంద్ర,‘ఫైనాన్స్ బేసిక్స్ ఫర్ ఉమెన్’ రచయిత్రి కొట్టకుండా వేధింపులు ‘నేను సం΄ాదిస్తున్నాను, నా సం΄ాదనతో ఇల్లు నడుస్తోంది. నేను సం΄ాదించక΄ోతే కుటుంబం దిక్కు లేనిది అవుతుంది. నేను సం΄ాదిస్తున్నాను కాబట్టి నా ఇష్టం మేరకు అన్నీ నడవాలి’ ఈ తరహా ఆలోచన పురుషుల్లో పెరిగి మహిళలపై వేధింపులకు కారణమవుతోంది. 95 శాతం గృహహింస కేసుల్లో డబ్బు ప్రధాన΄పాత్ర పోషిస్తోంది. చాలామంది మహిళలు ఈ విధమైన ఆర్థిక వేధింపులకు గురవుతున్నారు. – సీమీ వినాయక్, సైకాలజిస్ట్ అవగాహనకు మార్గాలు.. ఆర్థికంగా అక్షరాస్యత ఉన్న మహిళలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, వేటికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత దుర్వినియోగం అవుతుంది అనే విషయాల పట్ల అవగాహన ఉండాలి. అంతేకాదు, ఏ పథకాల్లో డబ్బు ఉంచడం ప్రయోజనకరం... వంటి అంశాలపై దృష్టి పెట్టడం వల్ల మార్కెట్లో ఆర్థిక కదలిక ఏమిటో తెలుస్తుంది. ఫిక్స్డ్ డి΄ాజిట్స్, స్కీమ్‌లు, నాన్–డీమ్యాట్ ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ΄ాలసీ గురించి అవగాహన పెంచుకోవాలి. మహిళలు తమ భర్త ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారో తప్పక తెలుసుకోవాలి. ఏయే రుణాలు తీసుకుంటున్నారు, వాటి కాలపరిమితి ఎంత, వడ్డీ ఎంత అనేది తెలుసుకోవాలి. ప్రస్తుతం చాలా లావాదేవీలు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలు ఆన్లైన్ లావాదేవీల మొత్తం ప్రక్రియను తెలుసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, బ్యాంకులు, ఫిక్స్డ్ డి΄ాజిట్లు, ΄ోస్టాఫీస్, జీవిత బీమాలో పెట్టుబడి పెట్టినట్లయితే ఎప్పుడూ కంబైన్డ్‌గా చేయడం మంచిది. నామినీలో మీ పేరు ఉందో లేదో చెక్ చేయాలి. మీ సొంత బ్యాంకు ఖాతా వివరాలను ఎల్లప్పుడూ అప్డేట్లో ఉంచండి. -
Shruti Malhotra: ‘ఏదైనా చేయాలి.. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’..
కల ఉన్న చోట కష్టం ఉంటుంది. ‘మరింత కష్టపడతాను’ అంటూ ముందుకువెళ్లాలి. లక్ష్యం ఉన్న చోట సవాలు ఎదురొస్తుంది. సరిౖయెన జవాబు చెప్పి ఆ సవాలును వెనక్కి పంపించాలి. ఇందుకు నిలువెత్తు ఉదాహరణ శృతి మల్హోత్రా. జార్ఖండ్‌లోని రాంచికి చెందిన శృతి ఎన్నో చిన్న బ్రాండ్లను పెద్ద సక్సెస్ చేసింది. సక్సెస్‌కు సరిౖయెన అడ్రస్‌గా పేరు తెచ్చుకుంది. శృతి మల్హోత్రా బాల్యంలోకి వెళితే.. ప్రతిరోజు రాత్రి నలుగురు అక్కాచెల్లెళ్లు వార్తలు వినడానికి రేడియో ముందు కూర్చునేవారు. కొత్త విషయాలు, ఆసక్తికరమైన విషయాలను రూల్ నోట్ ΄్యాడ్లో రాసుకునేవారు. మరుసటి రోజు తండ్రితో వాటి గురించి చర్చించేవారు. తండ్రి వాటి గురించి మరిన్ని కొత్త విషయాలు వివరంగా చెప్పేవాడు. శృతి తండ్రి పిల్లలకు తరచుగా చెప్పే మాట.. ‘స్వతంత్రంగా ఉండండి’ ‘పెద్ద కలలు కనడానికి వెనకాడ వద్దు’ ‘ఈ ప్రపంచంలో మీకు అత్యున్నత స్నేహితుడు.. విద్య’ తండ్రి మాటలు అక్షరాలా ఆచరించడం వల్లే పదిమందీ మెచ్చుకునే స్థాయికి ఎదిగింది శృతి మల్హోత్రా. మిషనరీ స్కూల్ నుంచి దిల్లీ యూనివర్శిటీలో చదువుకోవడం వరకు ‘స్వతంత్రంగా ఉండడం’ అనే లక్షణాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. దీనివల్ల ఆమె చాలామందికి‘రెబెల్’గా కనిపించేది. ‘ఏదైనా చేయాలి. అది ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి’ అనే లక్ష్యాన్ని కాలేజీ రోజుల్లోనే నిర్దేశించుకుంది మల్హోత్రా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువు పూర్తయిన తరువాత ఫ్యాషన్ కంపెనీ ‘బెనెటన్’తో ప్రొఫెషనల్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. నైకీ, ప్లానెట్ స్పోర్ట్స్‌లో కూడా అద్బుతమైన ఇన్నింగ్స్‌ను ప్రదర్శించింది. స్థూలంగా చెప్పాలంటే ఫ్యాషన్, లైఫ్ స్టైల్ జైనింగ్లలో ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంది. 2007లో ఎథికల్ బ్యూటీబ్రాండ్ ‘ది బాడీ షాప్’లో చేరింది. ఇది తన ప్రయాణ గతిని మార్చేసింది. రిటైల్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్లలో అడుగుడుగునా పురుషాధిక్యత కనిపించే కాలంలో మహిళలు అడుగు వేసి నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ‘వేరే వారి కంటే ఒక మెట్టుకింద ఉండడానికి నేను ఎప్పుడూ ఇష్టపడలేదు. సవాలుగా తీసుకున్నాను. రెట్టింపు కష్టపడ్డాను’ అంటుంది మల్హోత్రా. ఆ కాలంలో బ్యూటీప్రొడక్ట్స్కు సంబంధించిన రిటైల్ బిజినెస్ ఫార్మసీ, డిపార్ట్మెంటల్ స్టోర్లలో మాత్రమే కనిపించేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జీరో నుంచి ప్రయాణంప్రొరంభించాను’ అంటుంది మల్హోత్రా. ‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు?’ అనే సన్నాయి నొక్కుల నుంచి ‘ఈ రంగంలో పెద్ద పేరున్న మహిళ’ అనే ప్రశంస వరకు శృతి మల్హోత్రా ఎంతో ప్రయాణం చేసింది. ఎన్నో పాఠాలు నేర్చింది. ఎందరికో గుణపాఠాలు చెప్పింది. ‘క్వెస్ట్ రిటైల్’ గ్రూప్ సీయీవోగా ఎంతో పేరు తెచ్చుకుంది. ‘శృతి మల్హోత్రా సీయీవో మాత్రమే కాదు ఎన్నో బ్రాండ్స్‌ను విజయవంతం చేసిన డ్రైవింగ్ ఫోర్స్’ అంటాడు ఫ్యాషన్ కంపెనీ లకొస్టే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీయీవో రాజేష్ జైన్. తన సక్సెస్‌కు కారణం తల్లిదండ్రులు అని చెబుతుంది మల్హోత్రా. చదువు చెప్పించడం నుంచి కలల సాధనలో వెన్నుదన్నుగా నిలవడం వరకు వారి పాత్ర ఎంతో ఉందని చెబుతోంది. ‘వృత్తి జీవితంలో ఎంతోమంది మేల్ కొలీగ్స్‌తో పనిచేశాను. ఎప్పుడూ ఎవరితోటీ సమస్య రాలేదు. పురుషులతో సమానంగా స్త్రీలకు అవకాశం లేకపోవడమే అసలు సమస్య. మహిళలకు సమానావకాశాలు కల్పించడం విషయంలో ఎన్నోసార్లు పోరాడాను’ అంటుంది మల్హోత్రా. ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ముఖ్యం కాదు. మీరు ఎక్కడికి వెళుతున్నారన్నది ముఖ్యం’అనేది శృతి మల్హోత్రాకు ఇష్టమైన మాట. ఇవి చదవండి: Sagubadi: మార్కెట్‌ను బట్టి సేద్యం! ఆపై నేరుగా ప్రజలకే అమ్మకం.. -
WPL 2024: అలుపెరుగక దూసుకుపోయిన.. సూపర్ 'స్మృతి' మందాన
సాంగ్లీ.. మహారాష్ట్రలో ఒక చిన్న పట్టణం.. శ్రవణ్ అనే కుర్రాడు క్రికెట్ నెట్స్‌లో తీవ్రంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. రాష్ట్ర జట్టులోకి ఎంపికయ్యేందుకు ఆ అబ్బాయి తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు. అతని చెల్లెలు తన తండ్రితో కలిసి అక్కడే అన్న ఆటను చూస్తోంది. అప్పటి వరకు క్రికెట్ అంటే ఏమిటో కూడా ఆ అమ్మాయికి తెలీదు. అయితే అప్పటికే కొన్నిసార్లు అన్న పేరు, అతను సాధించిన స్కోర్లతో న్యూస్పేపర్లలో వచ్చింది. ఇంటికి వెళ్లిన తర్వాత కూతురి ఆసక్తి చూసిన నాన్న ‘నువ్వు కూడా ఆడతావా’ అని అడిగాడు. ఆ వెంటనే అమ్మాయి నా పేరు కూడా పేపర్లో వస్తుందా అని నాన్నను అడిగేసింది. వెంటనే కల్పించుకున్న తల్లి.. ‘పదో తరగతి పరీక్షల్లో 96 శాతం వస్తే నీ పేరు కచ్చితంగా వస్తుంది’ అని సర్దిచెప్పింది. కానీ ఆ అమ్మాయి మనసులో మాత్రం ఒక మాట ఉండిపోయింది. పదో తరగతి పరీక్షా ఫలితాల కంటే క్రికెట్ ద్వారా పేరు తెచ్చుకోవడమే బాగుంటుందనిపించింది. అంతే.. తన మనసులో మాట చెప్పగానే తండ్రి అభ్యంతరం చెప్పలేదు. నాన్న అండగా ఉంటే తిరుగేముంది.. ఆ అమ్మాయి తర్వాతి రోజుల్లో అన్నీ పక్కన పెట్టి పూర్తిగా క్రికెట్ పైనే దృష్టి పెట్టింది. 16 ఏళ్ల వయసు తిరిగే సరికే భారత సీనియర్ జట్టులో చోటు సంపాదించి తానేంటో రుజువు చేసుకుంది. అండర్–19 స్థాయి తర్వాత అన్న ఆటకు గుడ్‌బై చెప్పిన ఉద్యోగ వేటలో పడిపోగా.. చెల్లెలు మాత్రం కుటుంబం ప్రోత్సాహంతో దూసుకుపోయింది. ఆ ప్లేయరే భారత ఓపెనర్ స్మృతి మంధానా. ప్రస్తుతం మన మహిళల టీమ్‌లో టాప్ బ్యాటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మృతి తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్‌లో కెప్టెన్ హోదాలో బెంగళూరు టీమ్‌ను విజేతగా నిలిపి తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించింది. స్మృతి విజయప్రస్థానంలో కీలకమైన అంశం ఆమెకు కుటుంబసభ్యుల నుంచి లభించిన ప్రోత్సాహం. వస్త్రవ్యాపారి అయిన తండ్రి మొదటి రోజు నుంచే క్రికెట్లో ప్రోత్సహించగా, ఒక టీనేజ్ అమ్మాయి అవసరాలను దగ్గరి నుంచి చూసుకుంటూ తల్లి అన్ని రకాలుగా వెంట నిలిచింది. ఇక క్రికెట్ మానేసి బ్యాంక్ ఉద్యోగంలో చేరిన అన్న శ్రవణ్ ఆమెకు మార్గదర్శిగా వ్యవహరించడమే కాకుండా స్మృతి ప్రాక్టీస్‌లో అన్ని సమయాల్లో తానే వెంట ఉంటూ ఆమెకు నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ తన వంతు సహకారం అందించాడు. సరిగ్గా చెప్పాలంటే ఒక్కసారి కెరీర్‌ను ఎంచుకున్న తర్వాత ఏ దశలోనూ ఆమె ప్రయాణానికి అడ్డంకులు రాలేదు. మధ్యలో ఒక్కసారి మాత్రం అన్నలాగే ఆటను మానేసి తనకిష్టమైన సైన్స్ చదువుకుందామనే ఆలోచన వచ్చినా, అప్పటికే ఆమె ఎదుగుతున్న తీరు ఆ ఆలోచనకు ఫుల్స్టాప్ పెట్టేశాయి. ఎందుకంటే 11 ఏళ్ల వయసుకే మహారాష్ట్ర అండర్–19 టీమ్‌లో చోటు దక్కించుకున్న స్మృతికి మున్ముందు దూసుకుపోవడమే మిగిలింది. నాలుగేళ్ల తర్వాత మహారాష్ట్ర సీనియర్ టీమ్‌లో అవకాశం లభించింది. తొలి మ్యాచ్‌లోనే సౌరాష్ట్రపై 155 పరుగులు బాది ఆమె వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర జట్టుకు వరుస విజయాలు అందించిన తర్వాత మహిళల టీమ్‌ల కోసం ప్రత్యేకంగా బీసీసీఐ నిర్వహించిన చాలెంజర్ టోర్నీలో టాప్‌స్కోరర్‌గా సత్తా చాటడంతో స్మృతి ఆట పదును ఏమిటో అందరికీ తెలిసింది. అంచెలంచెలుగా దూసుకుపోయి.. భారత టి–20 జట్టు తరఫున తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన స్మృతి మరో ఐదు రోజులకే వన్డేల్లోనూ అరంగేట్రం చేసింది. అంతర్జాతీయ వేదికపై ఆడటానికి కొద్ది రోజుల ముందే భారత దేశవాళీ వన్డేలో డబుల్ సెంచరీ (224) బాదిన స్మృతి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచింది. ఒక్కసారి టీమిండియాలోకి వచ్చిన తర్వాత ఆమె ఏ దశలోనూ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఓపెనర్‌గా జట్టు వరుస విజయాల్లో ఆమె కీలక పాత్ర పోషించింది. వరుసగా నాలుగేళ్ల పాటు వన్డేలు, టి–20ల్లో రెగ్యులర్ మెంబర్‌గా తనకు పోటీ లేకుండా జట్టులో స్మృతి కొనసాగింది. 2014లో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో భారత్ నుంచి ఏకంగా ఎనిమిది మంది అరంగేట్రం చేయగా, వారిలో స్మృతి కూడా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో జట్టు విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఇదే జోరులో విదేశీ లీగ్ టీమ్‌లను కూడా ఆకర్షించడంతో ఆస్ట్రేలియా విమెన్ బిగ్‌బాష్ లీగ్‌లో తొలిసారి ఆడే అవకాశం దక్కింది. అయితే అనూహ్యంగా అది స్మృతికి కొంత సమస్యగా కూడా మారింది. కాలికి తీవ్ర గాయం కారణంగా టోర్నీనుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో పాటు భారత జట్టుకు కూడా ఐదేళ్లు దూరం కావాల్సి వచ్చింది. కొత్తగా బరిలోకి దిగి.. ఇంగ్లండ్ వేదికగా 2017 జూన్‌లో వన్డే వరల్డ్ కప్.. భారత్, ఆతిథ్య ఇంగ్లండ్ మధ్య లీగ్ మ్యాచ్. ఓపెనర్‌గా బరిలోకి దిగిన స్మృతి 72 బంతుల్లోనే 90 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా భారత్‌ను గెలిపించింది. అయితే ఆట కంటే ఆమె మరో రకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. నాలుగేళ్ల కెరీర్ తర్వాత తొలిసారి స్మృతి కంటి అద్దాలు లేకుండా మైదానంలోకి దిగింది. అప్పటి వరకు ఆమెను గ్రౌండ్లో కంటి అద్దాలతోనే అందరూ చూశారు. గాయం కారణంగా వచ్చిన విరామంలో ఆమె తన శస్త్ర చికిత్సతో తన లుక్‌ను కూడా మార్చుకుంది. ఈ సమయం తన కెరీర్లో కొత్త మార్పుకు సూచికగా భావించానని, ఇకపై కొత్త స్మృతిని చూస్తారని ఆమె స్వయంగా చెప్పుకుంది. నిజంగానే కెరీర్ పరంగా కూడా స్మృతికి సంబంధించి అదో మరో మలుపు. తర్వాతి మ్యాచ్‌లోనే వెస్టిండీస్‌పై సెంచరీ కూడా సాధించి వరల్డ్ కప్‌లో ఆమె తన జోరు కొనసాగించింది. వరల్డ్ కప్ తర్వాత వెంటనే జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలోనూ శతకంతో చెలరేగింది. ఏడాది తిరిగే లోపే న్యూజిలాండ్ వేదికగా మరో సెంచరీ కొట్టేసింది. ఈ రెండేళ్ల కాలం ఆమె కెరీర్లో అత్యద్భుతంగా సాగింది. రికార్డులే రికార్డులు.. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘకాలం పాటు భారత మహిళల క్రికెట్‌ను మిథాలీ రాజ్ శాసించింది. మన జట్టుకు సంబంధించి అన్ని ఘనతలనూ ఆమెనే సాధించింది. అయితే తర్వాతి తరంలో స్మృతి అలాంటి ఫామ్‌ను చూపించింది. పైగా వన్డేలతో పాటు ఈతరం ప్రతినిధిగా టి–20 క్రికెట్లో కూడా స్మృతి తన స్థాయిని చూపించింది. క్రికెట్‌కు సంబంధించి నాలుగు విదేశీ పర్యటనలను కఠినమైనవిగా భావిస్తారు. ‘సేన’ అంటూ పిలుచుకునే (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఇందులో ఉన్నాయి. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఈ నాలుగు దేశాల్లోనూ వన్డేల్లో సెంచరీ చేసిన అత్యంత అరుదైన రికార్డు స్మృతి పేరిట ఉంది. అంతర్జాతీయ టి–20ల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (24 బంతుల్లో) ఆమెనే సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో రజతం, ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో ఆమె సభ్యురాలు. అద్భుతమైన ఆటతో విదేశీ లీగ్‌లను కూడా ఆకట్టుకున్న స్మృతి బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్, సదరన్ బ్రేవ్, వెస్టర్న్ స్టార్మ్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించింది. అయితే బీసీసీఐ నిర్వహించే విమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో బెంగళూరు టీమ్‌ను విజేతగా నిలపడం ఆమె స్థాయిని మరింత పెంచింది. పురుషుల విభాగంలో ఐపీఎల్లో 16 సీజన్లు ఆడినా బెంగళూరుకు ఇప్పటి వరకు ట్రోఫీ దక్కలేదు. కానీ రెండో ప్రయత్నంలోనే మహిళల టీమ్ దానిని సాధించడంలో అటు ప్లేయర్‌గా, ఇటు కెప్టెన్‌గా స్మృతికే ఘనత దక్కుతుంది. గత ఏడాది తొలి సీజన్లో 2 మ్యాచ్‌లే గెలిచి నాలుగో స్థానానికి పరిమితమైన టీమ్‌ను ఈ సారి విజేతగా మలచడం అసాధారణం. మున్ముందు భారత మహిళల క్రికెట్‌కు చుక్కానిలా ముందుండి నడిపించగల సామర్థ్యం స్మృతికి ఉందనేది వాస్తవం. 2018లో అంతర్జాతీయ క్రికెట్ మండలి వార్షిక అవార్డుల్లో అత్యుత్తమ మహిళా క్రికెటర్ అవార్డును స్మృతి సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వం ఆమె ఆటకు అర్జున పురస్కారంతో గౌరవించింది. దీనికి తోడు బ్రాండింగ్ ప్రపంచంలో కూడా ఆమె ఇప్పుడు పెద్ద సెన్సేషన్. సహజంగానే ఆటకు అందం తోడవడంతో పలు కంపెనీలు స్మృతితో ఒప్పందాలు చేసుకున్నాయి. గల్ఫ్ ఆయిల్, హావెల్స్, పవర్ షూస్, హెర్బలైఫ్, రెడ్‌బుల్, ఈక్విటాస్, హీరో, బూస్ట్, హ్యుందాయ్ మోటార్స్, మాస్టర్‌కార్డ్, గార్నియర్, పీఎన్బీ మెట్‌లైఫ్ తదితర సంస్థల కోసం స్మృతి పని చేసింది. — మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: విమాన సిబ్బందిని చీరకట్టుకునేలా చేసింది, నేర్పించింది ఆమె! -
పర్యావరణ దీపికలు.. 'మనం నడవాల్సిన బాట ఇది!'
‘ఆట, పాట గురించే కాదు మనం నడిచే బాట గురించి కూడా ఆలోచించాలి’ అంటున్నారు ఈ యువ మహిళలు. మనం ప్రయాణించే మార్గం ఏది అనేదే భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది. బంగారు భవిష్యత్ కోసం పర్యావరణ స్పృహతో ‘మనం నడవాల్సిన బాట ఇది’ అంటూ మార్గనిర్దేశ ఉద్యమ కార్యచరణలో భాగం అవుతున్నారు యువ మహిళలు. ‘అరుణోదయం ఊరుకోదు కిరణాలను సారించనిదే.. ప్రసరించే నీరు ఊరుకోదు పల్లం అంతుముట్టనిదే.. ప్రతిఘటించే మనసు ఊరుకోదు ప్రశ్నలను ఎక్కుపెట్టనిదే..’ అంటుంది ‘విశ్వంభర’ కావ్యం. ప్రశ్నలు ఎక్కుపెట్టి పర్యావరణ సంరక్షణ కోసం నడుం కట్టిన యువ మహిళల గురించి.. 'గర్విత గుల్హటి' నీరే ప్రాణాధారం.. బెంగళూరుకు చెందిన గర్విత గుల్హటి ఇంజనీరింగ్ చేసింది. ‘వై వేస్ట్?’ స్వచ్ఛంద సంస్థ కో–ఫౌండర్‌గా నీటి సంరక్షణకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. రెస్టారెంట్లలో నీటి వృథాను ఆరికట్టడంలో కీలక పాత్ర పోషించింది. బడి, కళాశాల, ప్రభుత్వ కార్యాలయాల్లో ‘నీటి సంరక్షణ’కు సంబంధించి ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ‘వై వేస్ట్?’ సంస్థ దేశవ్యాప్తంగా 20 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘వై వేస్ట్?’ కోసం పనిచేస్తున్న తొలి దినాల్లో ‘సమయం వృథా చేయవద్దు. చదువు మీద దృష్టి పెట్టు’ ‘పర్యావరణ కార్యక్రమాల కోసం పనిచేయడానికి ఇది సరిౖయెన సమయం కాదు’ అని గర్వితతో అనేవారు కొందరు. వారి మాటలను పట్టించుకోకుండా ‘మన కోసం ΄్లానెట్ వేచి చూడదు కదా. మరి ఆలస్యం చేయడం ఎందుకు?’ అని ఆగకుండా ముందుకు వెళ్లింది. ‘వై వేస్ట్?’ ప్రారంభించడానికి కారణం గర్విత మాటల్లోనే..‘మహారాష్ట్ర, బెంగళూరులో కరువు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యల గురించి చదివి బాధపడ్డాను. తాగు నీటి కోసం మహిళలు ఎండలో మైళ్ల దూరం నడవడం చూశాను. మన దేశంలో కోట్లాది మంది పిల్లలకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేదు. దీని వల్ల ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. ఇలాంటి ఎన్నో కారణాలను దృష్టిలో పెట్టుకొని వై వేస్ట్ ఆవిర్భవించింది’ పద్దెనిమిది సంవత్సరాల వయసులో గర్విత గుల్హటి ‘గ్లోబల్ చేంజ్‌మేకర్’ టైటిల్‌కు ఎంపికైంది. 'రిధిమ పాండే' నిగ్గదీసి అడిగే నిప్పు స్వరం! ఉత్తరాఖండ్‌కు చెందిన రిధిమ పాండే చిన్న వయసులోనే క్లైమెట్ యాక్టివిస్ట్‌గా పెద్ద పేరు తెచ్చుకుంది. పర్యావరణ కార్యకర్తలైన తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి పొందింది. ప్రకృతి విధ్వంసం, వాతావరణ మార్పులపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ 2019లో రిధిమ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పర్యావరణ సంబంధిత కేసులను స్వీకరించడానికి 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఏర్పాటు చేశారు. ‘ఎన్జీటీ’ రిధిమ కేసును స్వీకరించినప్పటికీ ఈ కేసు ‘ఎన్విరాన్మెంట్ పాక్ట్ అసెస్మెంట్’ పరిధిలోకి వస్తుందని కొట్టివేసింది. వాతావరణ సంక్షోభంపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ, అర్జెంటీనా దేశాలపై ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసిన 14 మంది యువ ఉద్యమకారులలో రిధిమ ఒకరు. ఏకైక భారతీయురాలు కూడా.వాతావరణ సంక్షోభంపై రిధిమ గత కొన్ని ఏళ్లుగాఎన్నో వ్యాసాలు రాసింది. ఎన్నో దేశాలలో ఎన్నో ప్రసంగాలు చేసింది. వాతావరణ యువ ఉద్యమకారుల ప్రతి జాబితాలో చోటు సంపాదించింది. ‘చిల్డ్రన్ వర్సెస్ క్లైమెట్ చేంజ్’ పేరుతో పుస్తకం రాసింది. 'వర్ష రైక్వార్' ప్రతి ఊరుకు పర్యావరణ స్వరం! ‘గతంలో అద్భుతమైన పంట దిగుబడులు వచ్చేవి. క్రమక్రమంగా ఏటేటా పంట దిగుబడి క్షిణిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించే క్రమంలో పర్యావరణ అంశాలపై ఆసక్తి పెరిగింది’ అంటుంది మధ్యప్రదేశ్‌కు చెందిన వర్షా రైక్వార్. గతంలో చుట్టు పక్కల ఎన్నో వనాలు కనిపించేవి. అవి ఎందుకు అదృశ్యమయ్యాయి? అని స్థానికులను అడిగితే ‘విధిరాత. అంతే! మనం ఏం చేయలేం’ అని విధిపై భారాన్ని మోపారు. ఈ నేపథ్యంలో సామాన్య మహిళలకు ‘వాతావరణ మార్పులు–కారణాలు–మన కార్యచరణ’ గురించి తెలియజేయడానికి రేడియో జాకీగా ప్రస్థానంప్రారంభించింది వర్ష. పర్యావరణ రంగంలో కృషి చేస్తున్న చేంజ్మేకర్ల అసాధారణ కథలను ఎఫ్ఎం 90.4 రేడియో బుందెల్‌ఖండ్ ద్వారా వెలుగులో తీసుకువచ్చి పదిమందికి తెలిసేలా చేసింది. వాతావరణ మార్పులపై అవగాహనను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లిన వర్ష ‘యునైటెడ్ నేషన్స్ యంగ్ క్లైమెట్ లీడర్–2021’గా ఎంపికైంది. 'హీనా సైఫి' వాయు కాలుష్యంపై వార్.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరuŠ‡లో ఎంబీఏ చదువుతున్న హీనా సైఫి ‘క్లైమెట్ చేంజ్ ఛాంపియన్’గా గుర్తింపు పొందింది. ఉమెన్ క్లైమెట్ కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) వేదికలో పాలుపంచుకున్న 16 మంది ఉమెన్ ఛాంపియన్స్‌లో హీన ఒకరు. ఐక్యరాజ్య సమితి ‘వుయ్ ది చేంజ్’ క్యాంపెయిన్‌లో కూడా హీన భాగం అయింది. ఎనిమిదవ తరగతి పూర్తయిన తరువాత ‘ఇక చదివింది చాలు’ అన్నారు తల్లిదండ్రులు. అయితే హీన పట్టుదల ముందు వారి నిర్ణయం ఓడిపోయింది. పర్యావరణ సమస్యలపై అవగాహన లేకపోవడానికి చదువుకోకపోవడం ఒక కారణం అని గ్రహించిన హీన, పిల్లలు ఎవరైనా స్కూల్ మానేస్తే వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడేది. పిల్లలు తిరిగి స్కూలుకు వచ్చేలా చేసేది. అంతేకాదు...స్థానిక స్వచ్ఛంద సంస్థలో చేరి వాతావరణ మార్పులపై జరిగిన ఎన్నో సమావేశాలు, వర్క్‌షాప్‌లకు హాజరైయ్యేది. ‘క్లైమెట్ ఎజెండా’పై లక్నోలో జరిగిన సమావేశానికి హాజరై వాయు కాలుష్యం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్....మొదలైన ఎన్నో విషయాల గురించి తెలుసుకుంది. తాను తెలుసుకున్న విషయాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేది. ‘సూరజ్ సే సమృద్ధి’ పేరుతో సౌరశక్తి ఉపయోగాల గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. బడులలో పర్యావరణ అంశాలకు సంబంధించి పోస్టర్–మేకింగ్ యాక్టివిటీస్ నిర్వహించింది. 'నేహా శివాజీ నైక్వాడ్' గ్రీన్ రికవరీ! మన దేశంలోని కొద్దిమంది పర్యావరణ ఆధారిత డేటా సైంటిస్టులలో నేహా ఒకరు. క్లైమేట్ టెక్నాలజీ ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్ల ద్వారా క్లైమేట్ డేటా ఫోకస్డ్ సొల్యూషన్స్ కోసం చేపట్టే కార్యక్రమాలకు సహకారం అందిస్తోంది నేహా. ‘క్లైమేట్ కలెక్టివ్’ ఫౌండేషన్ ద్వారా యువ ఎంటర్ప్రెన్యూర్లకు వ్యాపార పరిజ్ఞానం, మార్కెట్ కనెక్షన్లు, సాంకేతిక సామర్థ్యం విషయంలో సహాయపడుతోంది. ‘క్లైమేట్ కలెక్టివ్’కు ముందు సాఫ్ట్వేర్, టెక్నాలజీకి సంబంధించిన మల్టీ నేషనల్ కన్సల్టింగ్ ఫర్మ్ ‘జెడ్ఎస్ అసోసియేట్స్’లో పని చేసింది నేహా. తన నైపుణ్యాన్ని ఉపయోగించి 140కి పైగా గ్రీన్ స్టార్టప్లనుప్రారంభించడంలో సహాయపడింది. యూఎన్–ఇండియా ‘వుయ్ ది చేంజెస్’ క్యాంపెయిన్‌కు ఎంపికైన పదిహేడు మంది యంగ్ క్లైమేట్ చేంజ్ లీడర్లలో నేహా ఒకరు. ‘జీరో–వేస్ట్’పై పని చేసే యూత్ సెల్ ‘సెల్ పర్వాహ్’కు కో–ఫౌండర్ అయిన నేహా ‘గ్రీన్ రికవరీని వేగవంతం చేయడానికి నావంతుగా క్షేత్రస్థాయిలో పనిచేయాలనుకుంటున్నాను’ అంటుంది. ఇవి చదవండి: International Womens Day 2024: 'మనల్ని మనం' గౌరవించుకుందాం! -
International Womens Day 2024: 'మనల్ని మనం' గౌరవించుకుందాం!
‘మహిళలను గౌరవిద్దాం’ అనే మాట తరచూ వింటుంటాం. మహిళ గురించి మాట్లాడే ఉన్నతమైన పదాలు మహిళా దినోత్సవం వరకే పరిమితం అవడం కూడా చూస్తుంటాం. ‘సమాజంలో వస్తున్న మార్పులను ఆహ్వానించే క్రమంలో స్త్రీ గౌరవానికి, రక్షణకు వెన్నుదన్నుగా నిలిచేది కూడా మొదట మహిళే అయి ఉండాలి’ అంటూ వివిధ రంగాలలోని మహిళలు తమ మాటల ద్వారా ఇలా వినిపిస్తున్నారు. మహిళా దినోత్సవ స్ఫూర్తితో ఆ మాటలను ఆచరణలోనూ పెట్టి మంచి ఫలితాలను చూద్దాం. ప్రయత్నించడం మానకూడదు.. మగవారితో పోల్చితే ఇంట్లో, ఆఫీసులోనూ స్త్రీల పాత్ర ఎక్కువే. రెండుచోట్లా నిబద్ధతతో పని చేస్తుంటారు. కానీ, రెండు చోట్లా అర్థం చేసుకునేవారుండరు. విసుగు అనిపిస్తుంటుంది. అలాగని, మన ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ముప్పై ఏళ్ల క్రితం నేను పీజీ విద్యార్థిగా ఉన్నప్పుడు క్లాసులో అమ్మాయిలు ఐదు శాతం కన్నా తక్కువే ఉండేవారు. ఇప్పుడు.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్‌లో 60 నుంచి 70 శాతం మంది అమ్మాయిలు ఉంటున్నారు. బాయ్స్ హాస్టల్స్‌లో కొన్నింటిని గర్ల్స్ హాస్టల్‌గా మార్చేద్దామని కూడా చూస్తున్నాం. పీహెచ్‌డి చేసే అమ్మాయిల సంఖ్యా పెరిగింది. పోరాడి సీట్లు, పదవులు దక్కించుకుంటున్నాం. అయితే, ఎంత పెద్ద చదువులు చదివినా, ఏ హోదాలో ఉన్న ముందు ఎవరిని వారు గౌరవించుకోవాలి. చదువులో, హోదాలో సమానత్వం కోసం పాటుపడాలనే కాదు మన ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో ఎదగాలనుకోవాలి. కుటుంబంలో ఏ కష్టం వచ్చినా ఆ కుటుంబాన్ని కాపాడుకోగలమనే ధైర్యం ఉండాలి. రక్షించడానికి ఎవరో ఒక మగవాడైనా ఉండాలి అనే ఆలోచనను దూరం పెట్టాలి. అప్పుడే మన శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. అందుకు తగిన సత్తాను సంపాదించుకోవడం మన లక్ష్యం అవ్వాలి. ఆత్మరక్షణ, కుటుంబ రక్షణ సమాజంలో మనల్ని ఉన్నతంగా చూపుతుంది. –ప్రొఫెసర్ సి.వి. రంజని, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్, ఓయూ వ్యక్తిత్వాన్ని పోస్ట్‌మార్టం చేస్తున్నారు.. స్లోగన్స్ చెబుతున్నారు. కానీ, పాటించడం లేదు. మగవారితో సమానంగా కష్టపడుతున్నారు. కానీ, మగవారు స్త్రీని శారీరకంగా బలహీనులుగానే చూస్తారు. ఆమె శక్తి తెలిస్తే మగవారిలో ఆ ఆలోచనే రాదు. ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురైన మహిళ ఎవరైనా ఉంటే ఆ సంఘటనను, సదరు వ్యక్తులను కాకుండా ముందు ఆమె వ్యక్తిత్వాన్ని పోస్ట్‌మార్టం చేస్తుంటారు. ఇంటి దగ్గర నుంచి పని ప్రదేశంలోకి ఒక మహిళ రావాలంటే ఎన్నో అడ్డంకులను దాటాల్సి ఉంటుంది. అక్కడా వేధింపులు తప్పవు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చిన అమ్మాయిలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెళ్లి చేసుకున్న అబ్బాయి వదిలేసి వెళ్లిపోతే, పుట్టింటి సహకారం అందక ఆ అమ్మాయి బతుకుదెరువులో చాలా వేధింపులను ఎదుర్కొంటున్నది. ఆమె జీవనం గురించి తప్పుగా మాట్లాడే మగవాళ్లు ఉన్నారు. సమస్యను ఎదుర్కోవడంలో గొడవ తప్పక జరుగుతుంది. కానీ, సింగిల్ ఉమెన్ గొడవ పడితే ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తుంటారు. తల్లి తన కూతురుకి ఒంటరిగా ఎలా జీవించాలో చెబుతూనే సమాజాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. సోషల్ మీడియాలో ‘ఆమె’గౌరవానికి సంబంధించిన దారుణమైన వీడియోలు చూస్తున్నాం. ఏదైనా అమ్మాయికి సంబంధించిన సంఘటన జరిగినప్పుడు ‘అమ్మాయి ఎలాంటిది?’ అని ఆమెను నెగిటివ్ంగాప్రొజెక్ట్ చేస్తున్నారు. స్వలాభం కోసం చేసే ఇలాంటి ఎన్నో పనులు ‘ఆమె’ గౌరవాన్ని తీసేస్తూ బతికేస్తున్నారు. – డాక్టర్ జయశ్రీ కిరణ్, కాకతీయ ఫౌండేషన్, హైదరాబాద్ మన మీద మనకు నమ్మకం! మగవారితో పోల్చుకుంటే టైమ్ మేనేజ్ చేయగల శక్తి స్వతహాగా స్త్రీకి ఉంటుంది. ఒక గోల్ రీచ్ అవ్వాలని కష్టపడితే అది ఎంత దూరంలో ఉన్నా మనకు దగ్గర కావల్సిందే. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆరోగ్యం బాగా లేదనో, సరైన చదువు లేదనో, కుటుంబ బాధ్యతలు ఉన్నాయనో.. ఇలా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎంత కష్టమైన పరిస్థితులు ఎదురైనా మన కలలను మనమే డిజైన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి కూడా మనల్ని మనం బాగు చేసుకోవచ్చు. నాకు స్కూల్ వయసులో పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు. అయినా యోగా ట్రైనర్‌గా, బ్యుటీషియన్‌గా మేకప్ అకాడమీ నడుపుతున్నాను. పిల్లలిద్దరూ సెటిల్ అయ్యారు. ఇంటిని చక్కదిద్దుకుంటూనే నా పనులు చేసుకుంటూ వచ్చాను. సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. నా కెందుకు ఈ సమస్య వచ్చింది అని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ పరిష్కారం అవ్వదు. సానుభూతి తప్ప బయటి నుంచి గౌరవం కూడా లభించదు. మనమీద మనకున్న నమ్మకమే మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. – రూప, యోగా టీచర్ అండ్ బ్యూటీషియన్ భయం బిడియంతో శక్తి తగ్గుతుంది.. స్త్రీలను గౌరవించండి అనే మాట చాలా చోట్ల వింటూనే ఉంటాం. ఆ మాట వినటమే మన దౌర్భాగ్యం. ఎందుకంటే స్త్రీని గౌరవించాలి అని చెబితే గాని తెలియని సమాజంలో మనం జీవనం సాగిస్తున్నాం. ఉమ్మడి కుటుంబాలలో ఉన్నప్పుడు స్త్రీకి మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు. ఇంటి పనుల్లో వంట పనుల్లో మునిగిపోయే వాళ్ళు. ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. మారుతున్న టెక్నాలజీతో పాటు మనలో కూడా మార్పు రావాలి. భయం, బిడియం అనే భావాలతో స్త్రీ తన శక్తిని గుర్తించటం లేదు. ఒక తల్లి యవ్వనంలో ఉన్న తన కూతురుతోనో కొడుకుతోనో తన చిన్నప్పటి కబుర్లు, నెరవేరని కలలు, రక్తసంబంధాలు, స్నేహితుల గురించి, జీవితంలో అనుభవించిన కష్టాలు వాటిని ఎదుర్కొనే నేర్పరితనం... చర్చించడం లేదనిపిస్తోంది. నాటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు అనుకుంటారు. కానీ, ఏ కాలమైనా స్త్రీ ఎప్పుడూ మెలకువతో తనను తాను కాపాడుకోవాలనే స్పృహతో ఉండాలి. పాలకులు కూడా స్త్రీని అన్ని రంగాల్లో పైకి తెస్తున్నాం అని చెబుతుంటారు. కానీ, అమ్మాయిలపై అఘాయిత్యాలను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. స్వతంత్ర దేశం కోసం ఎందరో స్త్రీలు తమ ్రపాణాలర్పించారు. వారి ్రపాణత్యాగాన్ని స్మరణ చేసుకున్నా మహిళగా ఈ సమాజంలో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. మనలో మనకు ఐకమత్యం ఉండాలి. ఏ కారణం వల్ల ఒంటరిగా ఉంటున్న స్త్రీని సాటి స్త్రీ అర్థం చేసుకొని, ఆమెకు మద్దతునివ్వగలిగితే చాలు ధైర్యం పెరుగుతుంది. స్త్రీలు ఒకరికి ఒకరుగా నిలవాలి. పనిమనిషి పనిని కూడా గౌరవించడం కుటుంబంలో వారికే అర్ధమయ్యేలా తెలపాలి. పారిశుద్ధ్య కార్మికురాలి, పనిమనిషి, రోజువారీ పనుల్లో తారసపడే ప్రతి స్త్రీని గౌరవించాలని పిల్లలకు చె΄్పాలి. రేపటి తరంలో వచ్చే మార్పు కూడా సమాజానికి మేలు కలుగజేస్తుంది. – వి. ప్రతిభ, బిజినెస్ ఉమెన్ ఇవి చదవండి: International Womens Day 2024: ప్రతి రంగంలో ప్రతిభ -
పర్యావరణంపై యంగ్ టాలెంటెడ్ వుమెన్ వారియర్‌గా.. 'ఈష్న అగర్వాల్'
"పర్యావరణ ప్రేమికురాలైన ఈష్న అగర్వాల్ డాక్యుమెంటరీ 'శాలరీ' దుబాయ్ లో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్(కాప్ 28)లో ప్రదర్శించబడింది. పర్యావరణంపై ఉప్పు పరిశ్రమ చూపుతున్న ప్రభావం, ఉప్పును పండించే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రంగా తీసుకొని ఈష్న అగర్వాల్ రూపొందించిన ఈ డాక్యుమెంటరీకి ప్రపంచ ప్రతి నిధుల నుంచి ప్రశంసలు లభించాయి." 'కాప్ 28లో నా డాక్యుమెంటరీని ప్రదర్శించడం నాకు మాత్రమే కాదు పర్యావరణ సంరక్షణకు సంబంధించిన అంశాలపై పనిచేస్తున్న ఎంతో మంది యువతీ, యువకులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. చర్చను రేకెత్తించే, మార్పును ప్రేరే పించే, అసాధ్యాలను సుసాధ్యం చేసే శక్తి యువతకు ఉంది. వాతావరణ మార్పును కేవలం ఒక సమస్యగా కాకుండా అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణలకు అవకాశంగా భావిస్తాను. విభేదాలకు అతీతంగా అందరికీ ఒకే భూమి పేరిట ఐక్యత రాగం ఆలపించడానికి ఇది మంచి తరుణం' అంటుంది అగర్వాల్. పర్యావరణ కార్యకర్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆగర్వాల్‌కు హిందు స్థానీ సంగీతం, వెస్ట్రన్ మ్యూజిక్ ప్రవేశం ఉంది. మార్షల్ ఆర్ట్స్‌లో కూడా ప్రతిభ చూపుతుంది. తైక్వాండోలో రెడ్‌బెల్ట్ సాధించింది. మోటివేషనల్ స్సీకర్‌గా కూడా రానిస్తోంది. వ్యక్తిత్వ వికాసం నుంచి పర్యావరణ సంక్షోభం వరకు ఎన్నో అంశాలపై ప్రసంగాలు చేసింది. ఇవి చదవండి: ఇదిగో 'కొత్త సంవత్సరం..' ఫ్యూచర్ ప్లాన్‌తో రెడీగా ఉన్నట్లే కదా! -
'2023 – తెలంగాణ మహిళ!' ఈ ఏడాది స్ఫూర్తి వీరే..
"తమను తాము బాగు చేసుకోవడంతోపాటు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా తీర్చిదిద్దితే ఎలా ఉంటుందో ఈ యేడాది తెలుగు మహిళ నిరూపించింది. విభిన్న రంగాలలో విశేషమైన కృషి చేసి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ మహిళను మరోసారి స్ఫురణకు తెచ్చుకుందాం. రాబోయే సంవత్సరానికి ప్రేరణగా వీరితో కలిసి మరెన్నో అడుగులు వేద్దాం.!" ఊరంతా బాగు! మూడేళ్లక్రితం వరకు ఒక మామూలు పల్లె అది. కానీ, నేడు దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచే స్థాయికి ఎదిగింది. దానికి కారణం సర్పంచ్ మీనాక్షి గాడ్గె. ఆమె కృషి, పట్టుదల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మఖరా గ్రామాన్ని అద్భుతమైన గ్రామంగా తీర్చిదిద్దాయి. ఇంటర్మీడియెట్ వరకు చదివిన మీనాక్షి ఏకగ్రీవంగా సర్పంచ్ పదవికి ఎన్నియ్యింది. మరుగుదొడ్లు కట్టించడం, తాగునీరు ప్రతి ఇంటికి అందేలా చేయడమే కాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత ఏర్పాటు చేసి వాన నీరు ఆ గుంటలో పోయేలా చేసిందామె. వాగుపైన వంతెన కట్టించింది. పక్కా రోడ్ల నిర్మాణం, సైడు కాలవల శుభ్రత, స్కూల్‌కు కొత్త భవనం, ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనను ఏర్పాటు చేయించింది. ఊళ్లో సంపూర్ణ మద్య నిషేధం అమలుతో΄ాటు హరిత హారంలో భాగంగా పదివేల మొక్కలు నాటించి, వాటి బాధ్యతను గ్రామస్తులే తీసుకునేలా చేసింది. తడి చెత్త నుంచి ఎరువు తయారు చేసి, పంచాయితీకి లాభం చేస్తోంది. సోలార్ గ్రిడ్లు ఏర్పాటు చేసింది. ఊళ్లోనే నర్సరీ ఉంది. ఊళ్లో జరిగే అంగడిలో నగదు రహిత లావాదేవీలు జరుపుతున్నారు, తడిచెత్త– ΄÷డి చెత్త విభజనను ఇప్పుడు ప్రతి ఒక్కరూ ΄ాటిస్తున్నారు. ఇన్ని మార్పులు తీసుకు వచ్చిన మీనాక్షిని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఈ యేడాది స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ అవార్డ్‌తో సత్కరించింది. - మీనాక్షి గాడ్గె (సర్పంచ్) భారతజట్టులో స్థానం! భద్రాచల వాసి త్రిష అండర్–19 మహిళల వరల్డ్ కప్ –2023 ఫైనల్లో టీమిండియాను జగజ్జేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించింది. ఫిట్నెస్ కోచ్ అయిన తండ్రి రామిరెడ్డి ద్వారా మూడేళ్ల వయసులోనే క్రికెట్లో ఓనమాలు దిద్దిన త్రిష ఎనిమిదేళ్ల వయసులో హైదరాబాద్ అండర్ –16 జట్టులో చేరింది. తర్వాత హైదరాబాద్ స్పోర్ట్స్ అకాడమీలో చేరి, క్రికెటర్‌గా తనను తాను మెరుగుపరుచుకుంటూ భారతజట్టులో స్థానం దక్కించుకుంది. చదువు, ఆటలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లడమే తన ముందున్న లక్ష్యాలు అని చెప్పే త్రిష నవతరపు అమ్మాయిలకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది. - గొంగడి త్రిష (యువ క్రికెటర్) సాహసమే ఊపిరి.. రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల అన్వితారెడ్డి పర్వతారోహణలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఎవరెస్టు శిఖరాన్ని ఐదురోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసి వార్తల్లో నిలిచింది. పడమటి అన్వితారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లావాసి. ప్రస్తుతం భువనగరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షకురాలిగా పనిచేస్తోంది. ఎంతోమంది ఔత్సాహిక యువతీయువకులకు మెలకువలు నేర్పిస్తూనే అడ్వాన్స్డ్ కోర్సులను పూర్తి చేసింది. పర్వతారోహణలో మొదటి ప్రొఫెషనల్ కోచ్‌గానూ గుర్తింపు పొందింది. గతంలో సిక్కింలోని రీనాక్, బీసీరాయ్, కిలిమంజారో, లదాక్‌లోని కడే, ఎబ్బ్రూస్ పర్వతాలు అధిరోహించింది. పర్వతారోహణలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, సవాళ్లను అధిగమించే స్థాయికి చేరుకోవడానికి ఎంతో కృషి, సాధన అవసరం. అన్విత ఏర్పరుచుకున్న ఆశయాలు ప్రతి ఆడపిల్లకు ఆదర్శం. అన్విత సాహసాలు ఎందరికో మార్గ నిర్దేశం చేస్తున్నాయి. - అన్వితారెడ్డి (పర్వతారోహకురాలు) అవగాహనే ప్రధానం జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలం, ఖాసింపేట గ్రామం నుంచి రేగట్టె వెంకటరమణ ఎంపికయ్యింది. విధుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు ఈ అవార్డును అందుకొని వార్తల్లో నిలిచింది వెంకటరమణ. ఇంటింటికీ వెళ్లి మహిళలు, పిల్లల ఆరోగ్యం గురించి కనుక్కోవడం, జాగ్రత్తలు సూచించడం, కౌన్సెలింగ్స్ ఇవ్వడం దినచర్యగా చెబుతుంది. గర్భిణులకు సీమంతాలు, స్కూల్ డే, చిల్డ్రన్ డే వంటి కార్యక్రమాలను పురస్కరించుకొని అందరికీ ఆరోగ్యం కోసం అవగాహన కల్పించడంలో ముందుండే వెంకట రమణ చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించింది. -రేగట్టె వెంకటరమణ (అంగన్వాడీ టీచర్) ప్రైవేటుకు దీటుగా మంచిర్యాల జిల్లా రెబ్బెనపల్లి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నూగూరి అర్చన ఈ యేడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అర్చన తీర్చిదిద్దారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో΄ాటు ఆమె సొంత ఖర్చులతో పిల్లలకు నాణ్యమైన విద్యాబోధన చేస్తూ రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల అంటే అందరూ మెచ్చుకునేలా తీర్చిదిద్దారు. గిరిజన చిన్నారులకు ప్రత్యేకంగా స్కూల్‌కి ఆటోలు ఏర్పాటు చేసి, మరీ చదువుకు ఊతమిస్తున్నారు. అర్చన విద్యాసేవకు ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ పురస్కారం అందుకున్న అర్చన ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. - నూగూరి అర్చన (ప్రధానోపాధ్యాయురాలు) ఇవి చదవండి: మనీమంత్ర కవితాగానం -
రిక్షానే ఆసరాగా.. 'చినాబ్ లోయలోనే' తొలి ఈ–రిక్షా మహిళా డ్రైవర్‌గా..
'జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరిలా, పరిమళాలు వెదజల్లే పూలపాన్పులా ఉండదు. తమకున్న వనరులను ఉపయోగించుకుని పైగి ఎదగడానికి ప్రయత్నించి పెద్దవాళ్లు అయిన వాళ్లే ఎక్కువ. వీరు ఎంతోమందికి ప్రేరణగా కూడా నిలుస్తుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే మీనాక్షి దేవి. జీవితాన్ని కష్టాల సుడిగుండంలో కొట్టుకుపోనివ్వకుండా.. ఈ–రిక్షా లాగుతూ కుటుంబానికి జీవనాధారంగా మారింది. ఇలా తనకెదురైన కష్టాలకు ఎదురీదుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది మీనాక్షి దేవి.' జమ్ము కశ్మీర్‌లోని దోడా జిల్లా భదర్వా టౌన్‌కు చెందిన 39 ఏళ్ల మీనాక్షి జీవితం ఏడాది క్రితం వరకు ఆనందంగా సాగింది. భర్త పమ్మి శర్మ, ఇద్దరు పిల్లలతో ఎంతో చక్కగా సాగిపోతున్న వీరి సంసారంలో అనుకోని ఉపద్రవం ఏర్పడింది. మీనాక్షి భర్తకు కిడ్నీలు పాడయ్యాయి. చికిత్సకోసం అనేక ఆసుపత్రులు తిరిగారు. మెడికల్ బిల్లులు పెరిగాయి కానీ సమస్య తీరలేదు. ఈ క్రమంలో వారు దాచుకున్న డబ్బులు మొత్తం ఆవిరైపోయాయి. ఉన్న కారు అమ్మేసి, వ్యాపారాన్ని మూసేసి అప్పులు తీర్చినా ఇంకా కొన్ని అప్పుల భారం అలానే ఉండిపోయింది. ఏ దారీ దొరక్క.. భర్త సంపాదించే స్థితిలో లేకపోవడంతో మీనాక్షి దేవి కుటుంబ పోషణ కోసం పని వెతుక్కోవాల్సి వచ్చింది. కానీ తను చేయగలిగింది దొరకలేదు. ఈఎమ్ఐ ద్వారా కొన్న ఆటో ఒకటి ఇంట్లో ఉండడంతో అప్పుడప్పుడు పమ్మిశర్మ మీనాక్షికి సరదాగా ఆటో నేర్పించేవాడు. అప్పటి డ్రైవింగ్ స్కిల్స్‌ను మరింత మెరుగు పరుచుకుని ఆటో నడపాలనుకుంది మీనాక్షి. ఆమె కోరిక మేరకు ఆటో నడపడాన్ని పూర్తిస్థాయిలో నేర్పించాడు ఆమె భర్త. ఆ తరువాత సబ్సిడీలో ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోని, దాన్ని నడపడం ప్రారంభించింది మీనాక్షి. దానిమీద వచ్చిన డబ్బులతో భర్త మెడికల్ బిల్స్ కట్టడంతోపాటు, కొడుకులిద్దరి బాగోగులను చూసుకుంటోంది. ఇలా ప్రతికూల పరిస్థితుల్లో ఆటో డ్రైవర్‌గా మారిన మీనాక్షి దేవి చినాబ్ లోయలోనే తొలి ఈ–రిక్షా మహిళా డ్రైవర్‌గా నిలవడం విశేషం. మరో ఆప్షన్ లేక.. "ప్రారంభంలో ఆటో నడుపుతానన్న నమ్మకం మీనాక్షికి లేదు. రద్దీగా ఉండే భదర్వా టౌన్లో ఆటో నడపడానికి చాలా భయపడేది. కుటుంబం గడవడానికి మరో గత్యంతరం లేదు. అందుకే ఎంతో కష్టపడి, ధైర్యంగా ఆటో నడపడం నేర్చుకుని అండగా నిలుస్తోంది. మీనాక్షిని చూస్తే నాకు తృప్తిగానే గాక, గర్వంగానూ ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న మెడికల్ బిల్స్ నన్ను తీవ్రంగా కుంగతీసేవి. ఒక దశలో తీవ్ర నిరాశకు లోనై.. పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన పడేవాడిని. నా రెండు కిడ్నీలు పనిచేయడం లేదు. ఎంతకాలం ఉంటానో కూడా తెలియని పరిస్థితుల్లో నా భార్య ఆటో నడుపుతూ నాకు మానసిక ప్రశాంతతను కల్పిస్తోంది" అని మీనాక్షి భర్త ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ‘‘నాలుగు నెలల క్రితం తొలిసారి ఆటోతో ఆటోస్టాండ్‌లో అడుగు పెట్టాను. అక్కడ ఉన్న మిగతా డ్రైవర్లంతా నన్ను ఒక ఏలియన్లా చూశారు. కొంతమంది అయితే ఈమె కస్టమర్లను భద్రంగా ఇంటికి తీసుకెళుతుందో లేదో అంటూ చెవులు కొరుక్కునేవారు. లేదు. ఇరుగు పొరుగు, బంధువులు ఆటో నడపవద్దు అని నిరుత్సాహ పరిచారు. కానీ ఇది నా కుటుంబ జీవనాధారం. అందుకే నేను ఎవరి మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగాను. రోజురోజుకీ నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేలరూపాయల వరకు సంపాదిస్తున్నాను’’ అని మీనాక్షి సగర్వంగా చెబుతోంది మీనాక్షి దేవి. ఇవి చదవండి: Invest the Change: ఆ అ అలా మొదలైంది ఆర్థిక అక్షరాస్యత -
మొదటి ఎంబీయే మహిళా సర్పంచ్,లక్షల ప్యాకేజిని వదిలి..
ఛావీ రాజావత్ రాజస్థాన్‌లోని సోడా గ్రామంలో పుట్టి పెరిగింది. పట్నంలో ఉన్నత చదువులు చదివి, కళ్లు చెదిరే ప్యాకేజీతో కార్పొరేట్ ఉద్యోగంలో చేరింది. కానీ, చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి గ్రామానికి వెళ్లింది. సర్పంచ్‌గా ఎన్నికల్లో నిలబడి గెలిచింది. పదేళ్లపాటు సర్పంచ్‌గా పనిచేసింది. మొదటి ఎంబీయే మహిళా సర్పంచ్‌గా వార్తల్లో నిలిచి, యుఎన్లో ప్రసంగం చేసింది. గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు గ్రామాభివృద్ధికి కృషి చేస్తూనే, హోటల్ వ్యాపారం చేస్తోంది. ఆసక్తి గలవారికి గుర్రపు స్వారీలో శిక్షణ ఇస్తోంది. ‘‘2010లో తొలిసారి సర్పంచ్ అయినప్పుడు గ్రామ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. గ్రామం తీవ్ర కరువుతో అల్లాడిపొంయింది. సాగునీరు లేదు. 13–14 సంవత్సరాలుగా రుతుపవనాలు లేవు. భూగర్భ జలాలను వాడుకోలేకపొంయేవారు. 3–4 గంటలకు మించి విద్యుత్ సరఫరా లేదు. రోడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది. ఈ సవాళ్లతో సోడా పంచాయితీ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టాను. మొదటి టర్మ్‌లో కొన్ని పనులు పూర్తయ్యాయి. మా ఊరు తనవైపు లాగింది.. మా తాత బ్రిగేడియర్ రఘుబీర్‌సింగ్ 1990 వరకు సర్పంచ్‌గా చేశారు. నాకు మా ఊరు అంటే ఎప్పుడూ ఇష్టమే. బెంగుళూరులోని రిషి వ్యాలీ స్కూల్, జైపూర్‌లోని మాయో కాలేజీ గర్ల్స్ స్కూల్లో చదువుకున్నాను. వేసవి సెలవులు వచ్చినప్పుడల్లా మా ఊరిలోనే ఉండేదాన్ని. ఢిల్లీలోని మహిళా శ్రీరామ్ కాలేజీ నుండి డిగ్రీ తీసుకున్నాక, పూణెలోని బాలాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోడ్రన్ మేనేజ్మెంట్ నుండి ఎంబీయే పూర్తి చేశాను. ఏడేళ్లపాటు కార్పొరేట్ సెక్టార్లో వర్క్ చేశాను. లక్షల రూపాయల జీతం. కానీ, మా ఊరు వైపు నన్ను తన వైపు లాగింది. మహిళకు రిజర్వ్ అని.. 2010లో మా గ్రామ పంచాయితీ మహిళలకు రిజర్వ్ చేయబడింది. అప్పుడు మా ఊరి పెద్దలు నన్ను ఎన్నికల్లో నిలబడమని అడిగారు. ఆ సమయంలో సర్పంచ్‌ని అవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. గ్రామస్తులు మా అమ్మనాన్నలను అడిగారు. ‘ఏం చేయాలనుకున్నా తన ఇష్టం, మా బలవంతం ఉండదు’ అని చెప్పారు. నాకు అప్పటి వరకు గ్రామ సభలు ఎలా జరుగుతాయి, పంచాయితీలకు నిధులు ఎలా వస్తాయో తెలియదు. ఆ విషయాలను గ్రామస్తులే చెప్పారు. ఆ విధంగా పంచాయితీ ఎన్నికల్లో నిలబడి, గెలిచాను. మా ఇంట్లో మా తాత తర్వాత నేను సర్పంచ్‌ని అయ్యాను. వర్షపు నీటి సంరక్షణ ముందుగా ఊరి భవితవ్యాన్ని ఒంటరిగా మార్చలేమని, ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని అందరికీ స్పష్టంగా చెప్పాను. నేను వ్యూహంతో పనిచేయడం ప్రారంభించాను. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, గ్రామాలను అనుసంధానించడం, కరువును ఎదుర్కోవడం నేను ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లు. గ్రామంలోని నీటివనరులన్నీ పూడికతో నిండిపొంయాయి. సుమారు 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న నీటి వనరుల్లో పూడిక మట్టిని తొలగించేందుకు లక్షల రూపాయలు సేకరించి, ఖర్చు చేశాం. మహిళలు ముందు గ్రామపంచాయితీ నా కుటుంబం లాంటిది. నేను మీటింగులు పెట్టడం మొదలుపెట్టగానే ఏయేప్రాజెక్టుల్లో ఎలా పనిచేస్తున్నానో చెప్పేదాన్ని. ఈప్రాజెక్టుల గురించి వారు ఏమనుకుంటున్నారో అందరి అభిప్రాయాలు తెలుసుకునేదాన్ని. అలాగే, ఎంత డబ్బు ఖర్చు అవుతుందో కూడా వివరించేదాన్ని. పనులు సజావుగా అయ్యేలా అధికారులను కలిసి ఆరా తీయమని గ్రామస్తులకు చెప్పేదాన్ని. మహిళల బృందం డిజైనర్ ల్యాంప్‌లు, కొవ్వొత్తులు, మసాలా దినుసులు వంటి ఉత్పత్తులు తయారు చేయడం మొదలుపెట్టారు. ఇవి మంచి ధరకు అమ్ముడు పొంవడం మొదలయ్యింది. దీంతో మహిళల జీవితం మెరుగుపడింది. రెండేళ్లలో 950 ఇళ్లకు గాను 800 మరుగుదొడ్లు నిర్మించాం. 24 గంటలూ కరెంట్ అందుబాటులోకి వచ్చింది. రోడ్లప్రాధాన్యత నా ఎజెండాలో రోడ్లప్రాధాన్యత స్పష్టంగా ఉంచాను. ముందు ప్రైవేట్ బస్సుల సహాయం తీసుకున్నాను. బాలికల కోసం పాఠశాల, మహిళల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశాను. మూతపడిన బి.ఎడ్ కాలేజీని స్వాధీనం చేసుకొని దానిని బాలికల చదువుకోసం కేటాయించాను. ఓ ప్రైవేట్ కంపెనీ 200 టేబుళ్లు, బెంచీలను అందజేసి మా వెన్ను తట్టింది. అందరికీ బ్యాంకు ఖాతా.. సర్పంచ్ అయిన ఐదేళ్లలోనే రోడ్లు, డ్రైన్లు, అందరికీ బ్యాంకు ఖాతా తెరిపించాను. ఎప్పుడూ ఫీల్డ్ వర్క్‌లోనే ఉండేదాన్ని. బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల, చదువుప్రాముఖ్యతను వివరించేదాన్ని.. నా స్వభావం అందరినీ కలుపుకొని ఉంటుంది. ఐక్యరాజ్యసమితి 11వ ఇన్ఫో పావర్టీ వరల్డ్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించినప్పుడు మొదటిసారి భారతదేశం నుండి ఒక మహిళా సర్పంచ్‌గా దేశం తరపునప్రాతినిధ్యం వహించాను. ఇది నాకు గర్వంగా అనిపించింది. అక్కడ వారందరి మదిలో సర్పంచ్ అంటే తలపై ముసుగు వేసుకుని ఉన్న గ్రామస్థురాలు అనుకున్నారు. కానీ, నన్ను కార్పొరేట్ లుక్‌లో చూసి అందరూ ఆశ్చర్యపొంయారు. సోడా విలేజ్ అభివృద్ధికి డబ్బు కంటే వ్యక్తులు, అందరి సమష్టి కృషి అవసరం అని ఫోరమ్‌లో చెప్పాను. రెండుసార్లు సర్పంచ్‌గా నా విధులను నిర్వర్తించాను. తర్వాతి వారికి అవకాశాలు ఇవ్వాలని నేను మళ్లీ పొంటీ చేయలేదు. ఇప్పుడు హోటల్ని నిర్వహిస్తున్నాను. గుర్రపు స్వారీ వచ్చు కాబట్టి, ఆసక్తి గలవారికి శిక్షణ ఇస్తున్నాను’ అని వివరిస్తుంది ఈ యంగ్ లీడర్. -
బదల్తా కశ్మీర్
ఆర్టికల్ 370 ఎత్తివేతను సుప్రింకోర్ట్ సమర్థించింది. జమ్ము–కశ్మీర్లకు రాష్ట్రహోదా ఇచ్చి ఎన్నికలు నిర్వహించమంది. మరోవైపు అక్కడ యువగళాలు మారుతున్న కశ్మీర్‌ను గానం చేస్తున్నాయి. 14 ఏళ్ల ర్యాపర్ హుమైరా జా విడుదల చేసిన పాట ‘బదల్తా కశ్మీర్’ మార్పును ఆహ్వానిస్తూ కొత్త ఆశను రేపుతోంది. హుమైరా జా పాటను భారత ప్రభుత్వం ఇన్‌స్టాలో షేర్ చేసింది.‘నేను ఇలాగే ముందుకెళ్తాను’ అంటున్న హుమైరా పరిచయం. ‘బద్లా జొ కశ్మీర్... బద్లా హై సారా దౌర్’ అని పాడుతోంది హుమైరా జా. ‘కశ్మీర్ మారుతోంది... కశ్మీర్ ధోరణి మారుతోంది... అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది’ అంటూ ఆమె పాడిన పాట ఇప్పుడు కశ్మీర్వాసులనే కాదు, దేశాభిమానులను కూడా ఆకర్షిస్తోంది. హుమైరా ఈ పాటను ఎం.సి.రా అనే మరో ర్యాపర్ కలిసి పాడింది. కశ్మీర్లో తాజా అభివృద్ధి పరిణామాలను పాటలో మిళితం చేస్తూ వీరు విడుదల చేసిన ‘బదల్తా కశ్మీర్’ పాట కశ్మీర్ భవిష్యత్తు మీద ఆశను కలిగిస్తోంది. ‘మా నానమ్మ, తాతయ్యల కాలంలో కశ్మీర్ ఎలా ఉండేది... (ఆర్టికల్ 370 ఎత్తేశాక) ఇప్పుడు ఎలా ఉందనేది నేను వారి మాటల్లో విన్నాను. నా కళ్లారా చూశాను. ఇక్కడ జరిగిన జి 20 సమ్మిట్, శ్రీనగర్‌ను స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దడం, కొత్త టన్నెల్స్ ఏర్పాటు... ఇంతకుముందు చూడలేదు. మా ఊరు కంగన్ నుంచి శ్రీనగర్‌కు వెళ్లాలంటే గతంలో గంటన్నర పట్టేది. ఇప్పుడు గండర్బల్ దగ్గర బ్రిడ్జి కట్టాక ముప్పై నిమిషాల్లో వెళ్లిపొంతున్నాము. ఇదంతా మారుతున్న కశ్మీరే’ అంటుంది హుమైరా జా.తొమ్మిదో తరగతి చదువుతున్న హుమైరా అలవోకగా ర్యాప్ సాంగ్స్ రాసి పాడుతుంది. హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ పదాలను టక్కున పట్టేట్టుగా వాడుతూ పాటలు రాసి పాడటం వల్ల గతంలోనే గుర్తింపు పొందినా ‘బదల్తా కశ్మీర్’ పాటతో ప్రపంచానికి తెలిసింది. ‘నేను రెండో క్లాస్‌లో ఉండగా యోయో హనీసింగ్ రాప్ ఆల్బమ్ విన్నాను. అది నాకు చాలా నచ్చింది. ఆ వయసులోనే అలా ర్యాప్ పాటలు ట్రై చేసేదాన్ని. అప్పుడే బజ్రంగి భాయ్‌జాన్ (2015) సినిమా షూటింగ్ మా ఏరియాలో జరిగితే అందులోని బాల నటి హర్షాలికి నేను బాడీ డబుల్ (డూప్)గా నటించాను. అలా నేను కూడా సినిమాల్లో నటించాలనుకున్నానుగానీ మా కశ్మీర్లో సినిమా పరిశ్రమ లేదు. అందుకని ర్యాపర్‌గా రాణించాలని నిశ్చయించుకున్నాను’ అంటుంది హుమైరా. కశ్మీర్లో ప్రతి ఏటా జరిగే ‘ర్యాప్ బ్యాటిల్’ పొంటీల్లో పాల్గొని 2022, 2023 సంవత్సరాల్లో టైటిల్ గెలిచింది హుమైరా. ‘2022లో 15 మంది అబ్బాయిలు నాకు పొంటీగా వచ్చారు. నేను ఒక్కదాన్నే ఆడపిల్లను. నేనే గెలిచాను’ అంటుంది హుమైరా. ‘కశ్మీర్లో అమ్మాయిలు స్పోర్ట్స్‌లో, కళల్లో, చదువులో, ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఆ విషయాన్ని నా పాటలో చెప్పాను’ అందామె. ఈ పాటలోనే మేల్ వాయిస్ ఇచ్చిన ఎం.సి.రా ‘ఇక్కడ ఇప్పుడు జీన్స్ ప్యాంట్ అమ్మాయిలు తొడుక్కుంటున్నారు. బట్టల్ని బట్టి వారిని జడ్జ్ చేసే రోజులు పొంయాయి’ అనే లైన్లు పాడాడు. హుమైరా, ఎం.సి.రా కలిసి ‘మై కశ్మీరి... మేరా దేశ్ హై హిందూస్తాన్’ అని పాటను ముగిస్తారు. ఈ పాటలో హుమైరా ‘టెర్రరిస్టులకు ఇక్కడ చోటు లేదు. అనవసరంగా ఎవరి రక్తం పారడానికి వీల్లేదు’ అనే లైన్లు పాడింది. ‘నువ్వు చూపుతున్న అభివృద్ధి ఉత్తుత్తదే. అసలు వాస్తవం వేరే ఉంది అని కొందరంటున్నారుగా’ అని విలేకరులు ప్రశ్నిస్తే ‘అది వారి దృష్టికోణం. ఇది నా దృష్టికోణం’ అంటుంది హుమైరా.‘కొంతమంది నన్ను ట్రోల్ చేస్తున్నారు. నేను పట్టించుకోను. నేను ఇలాగే ముందుకెళతాను. నా వెనుక ఒక్కరు నిలబడినా చాలు’ అందామె.కశ్మీర్ వెనుక హుమైరా వెనుక ఇప్పుడు చాలామంది ఉన్నారు. కశ్మీర్ అభివృద్ధికి అందరూ ప్రయత్నిస్తే ‘నయా కశ్మీర్’ దగ్గరిలోనే సాధ్యమవుతుంది. -
స్త్రీ శక్తి: బ్యాక్ ఆన్ ది బైక్ పడి లేచిన కెరటం
ఫిమేల్ మోటర్ స్పోర్ట్స్ అథ్లెట్‌గా ప్రయాణం సులువేమీ కాదు. మద్దతు ఇచ్చే వాళ్ల కంటే వద్దనే వాళ్లే ఎక్కువ... దీనికి ఐశ్వర్య మినహాయింపు కాదు. మొన్న...‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు?’ అని ఆశ్చర్యంగా అడిగారు. నిన్న... ‘స్లోయెస్ట్ బైకర్’ అని ముఖం మీదే అన్నారు. ఇప్పుడు మాత్రం... ఐశ్వర్య గురించి ‘ఆశాకిరణం లాంటి ప్రొఫెషనల్ బైకర్’ అంటున్నారు... బెంగళూరుకు చెందిన ఐశ్వర్యకు చిన్నప్పటి నుంచి బైక్‌లు అంటే చాలా ఇష్టం. ఇంట్లో నాన్న బైక్ ఉండేది. ప్రతి ఆదివారం ఆ బైక్‌పై తనను ఏదో ఒక కొత్త ప్రదేశానికి తీసుకెళుతుండేవాడు. ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన తరువాత ఐశ్వర్యకు బైకే లోకం అయింది. ఫ్రెండ్స్‌ను తీసుకొని రోజూ బైక్‌పై చక్కర్లు కొట్టేది. ఇలా తిరుగుతున్న రోజుల్లో ఒకసారి టీవిలో మోటోజీపి రేస్ చూసి ‘వావ్’ అనుకుంది. అలాంటి రేస్‌లో ఒకరోజు తాను భాగం అవుతానని అనుకోలేదు ఐశ్వర్య. ఇక అది మొదలు... మోటర్‌స్పోర్ట్స్, మోటర్‌స్పోర్ట్స్ అథ్లెట్ల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. నిజంగా చెప్పాలంటే అదొక ప్రపంచం! నిన్నటివరకు బైకింగ్ అనేది తనకు సరదా మాత్రమే. క్రికెట్, ఫుట్‌బాల్‌లాగే అది కూడా ఒక ఆట అని, దానిలో నిరూపించుకుంటే అంతర్జాతీయస్థాయికి వెళ్లవచ్చు అని తెలిశాక ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ట్రైనింగ్, రేసింగ్తోనే రోజులు గడిచేవి. అయితే ఐశ్వర్య అమ్మానాన్నలకు, వారి అమ్మా, నాన్నలకు ఆమెను పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్‌గా చూడాలనేది కల. అయితే వారొకటి తలిస్తే ఐశ్వర్య కల ఒకటి తలిచింది. తండ్రి ససేమిరా అన్నాడు. తల్లి మాత్రం పట్టువిడుపు ధోరణి ప్రదర్శిస్తూ మద్దతు ఇచ్చేది. 2018లో కొద్దిమందితో కలిసి జోర్డీ అనే కోచ్ దగ్గర శిక్షణ తీసుకుంది. జోర్డీ సలహా మేరకు బజా అరగాన్, స్పెయిన్‌లో పాల్గొని ఫస్ట్ ఫిమేల్ ఇండియన్‌గా చరిత్ర సృష్టించింది ఐశ్వర్య. (స్పానిష్ బజా...స్పెయిన్‌లోని అరగన్ ప్రాంతంలో జరిగే ర్యాలీ రైడ్ లేదా క్రాస్–కంట్రీ ర్యాలీ. ఆఫ్రికన్ ఎడ్వెంచరస్ ర్యాలీలను స్ఫూర్తిగా తీసుకొని 1983లో దీనిని దేశంలో మొదలుపెట్టారు) ఆరుసార్లు నేషనల్ రోడ్రేసింగ్ ర్యాలీ ఛాంపియన్‌గా నిలిచింది. 2019లో మోటర్ స్పోర్ట్స్‌లో వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. తన సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. మోటర్‌స్పోర్ట్స్ లో మన దేశానికి సంబంధించి గట్టిగా వినిపిస్తున్న పేర్లలో ఐశ్వర్య పేరు ఒకటి. ‘నిజానికి మా కుటుంబంలో మోటర్‌స్పోర్ట్స్ గురించి తెలిసిన వారు లేరు. వరల్డ్ ఛాంపియన్షిప్ గురించి గైడ్ చేసేవారు కూడా లేరు. నాకు నేనే తెలుసుకుంటూ వెళ్లాను. రేస్‌లలో పాల్గొనడం ద్వారా ఎంతోమందితో మాట్లాడి, వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది’ అంటుంది ఐశ్వర్య. ‘ప్లాన్ బీ’ లేదా సెకండ్ కెరీర్ అనేవి ఉండాలి అంటారు. అయితే ఒక రంగంలోకి, ఒక లక్ష్యం కోసం దిగిన వారు ‘ప్లాన్ బీ’ గురించి ఆలోచించవద్దు అంటుంది ఐశ్వర్య. ‘ఈ రంగంలో రాణించకపోతే నెక్స్›్టఏమిటి? అని ఎప్పుడూ ఆనుకోలేదు. కచ్చితంగా సాధించాల్సిందే అనుకున్నాను’ అంటుంది ఐశ్వర్య. స్పెయిన్‌లో మహిళలు మోటర్‌స్పోర్ట్స్‌లో రాణించడానికి అనువైన వాతావరణం, మౌలిక వసతులు ఉన్నాయి. కుటుంబ మద్దతు కూడా బలంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి మన దేశంలో కూడా రావాలని కోరుకుంటుంది ఐశ్వర్య. మోటర్ స్పోర్ట్స్ అంటే పరాజయాలు, విజయాలు మాత్రమే కాదు... గట్టి గాయాలు కూడా. ఒక ప్రమాదంలో చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది ఐశ్వర్య. ఇక ఆమె నడవడం కూడా కష్టమే అనుకున్నారంతా. అయితే ‘బ్యాక్ ఆన్ ది బైక్’ అంటూ మళ్లీ విజయపథంలో దూసుకుపోవడానికి ఎంతోకాలం పట్టలేదు! -
‘మహిళల తలరాతలు మార్చేలా సీఎం జగన్ పాలన అందిస్తున్నారు’
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని ఏపీ డిప్యూటి సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో సీఎం జగన్ మహిళలకు పెద్ద పీట వేశారని కొనియాడారు. ఇప్పటి వరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మహిళలకు 50 శాతం పదవులను కేటాయించలేదని గుర్తుచేశారు. అదేవిధంగా, రాష్ట్రంలో మహిళల తలరాతలు మార్చేలా సీఎం జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని.. మహిళలంతా ఆయనకు అండగా నిలవాలని పుష్పశ్రీవాణి ఆకాంక్షించారు. -
పేరు చాలు
ఆడవాళ్లు చేలోకి రాకుండా, ఆడవాళ్ల చేతుల్లోకి పొలాలు రాకుండా మున్ముందు ఈ భూమి బతికి బట్టకట్టడం కష్టమేనని ‘ఎకనమిక్ సర్వే’ తేల్చి చెప్పాక కూడా మన ప్రభుత్వాలింకా మహిళల్ని సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులకు, మైక్రో క్రెడిట్ స్కీములకు మాత్రమే పరిమితం చేస్తున్నాయి! రెండు జల్లులు పడితేనే నాలుగ్గింజలు పండుతాయి. ఆ రెండు జల్లులైనా సమయానికి పడాలి. సమయానికి ఆగిపోవాలి. వాన అవసరమైనప్పుడే వచ్చి, అవసరమైనంత వరకే ఉండి వెళ్లిపోవడం రైతుకి దేవుడు చేసే పెద్ద సాయం. అంత సాయం చేశాక కూడా జీవుడు ఆ నాలుగ్గింజలే పండిస్తే ఏం లాభం?! నాలుగు.. గుప్పెడవ్వాలి. గుప్పెడు.. గాదెలవ్వాలి. గాదెలు.. అందరి కడుపులు నింపాలి. కానీ అలా అవ్వట్లేదు. ‘ఇంత ముద్ద ఉంటే పెట్టు తల్లీ’ అని జనాభాలో ఒక్కరైనా భిక్షపాత్ర పట్టకుండా లేరు! ఎలా మరి ఈ దేశాన్ని అక్షయపాత్రగా మార్చి, అందరికీ వడ్డించడం? నీటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. మంచి విత్తనాలు వేసుకుంటున్నాం. ఎరువుల్ని సాత్వికంగా మార్చుకుంటున్నాం. ప్రభుత్వాలు కూడా ‘ఫార్మర్–ఫ్రెండ్లీ’ అవుతున్నాయి. రుణాలిస్తున్నాయి. తీర్చలేని రైతుల రుణం తీర్చుకుంటున్నాయి. అయినా అవే నాలుగ్గింజలు. కడుపులో అవే ఆకలి మొలకలు. దేవుడు వర్షాలిచ్చినా, ప్రభుత్వాలు వరాలిచ్చినా, భూమి సారాన్నిచ్చినా, రైతు స్వేదాన్నిచ్చినా.. పండుతున్నది ఆ నాలుగే. ఇప్పుడెవరివైపు చూడాలి? దేవుడు చేయాల్సింది చేస్తున్నాడు. ప్రభుత్వాలు ఇవ్వాల్సింది ఇస్తున్నాయి. పరిశోధనలు జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. టెక్నాలజీ ఎదిగేది ఎదుగుతూనే ఉంది. రైతుకి ఇంకా ఎవరి సాయం కావాలి? ఎప్పుడతడు ధీమాగా కనిపిస్తాడు? ఎప్పుడతడు తలగుడ్డను విదిలించి భరోసాగా భుజంపై వేసుకుంటాడు? ఎప్పుడతడు ‘రుతుపవనమా.. టేక్ యువర్ టైమ్’ అని చుట్ట వెలిగించుకుంటాడు? ఎప్పుడతడు పెదరాయుడిలా.. ‘లోపలికెళ్లి.. అమ్మనడికి.. ఎన్నికావాలో బియ్యం తెచ్చుకోపో’ అని పనివాళ్లతో అంటాడు? ‘మీవాడు సాఫ్ట్‌వేరా? మావాడు ఫార్మర్’ అని ఎప్పుడతడు బంధువులకు చెప్పుకోగలుగుతాడు? ‘పొలం దున్నే కుర్రాడుంటే చెప్పండి. ఫారిన్ సంబంధం వద్దు’ అని ఎప్పుడతడు ఘనంగా రిజెక్ట్ చెయ్యగలుగుతాడు? ‘ఎప్పుడు?’ అంటే.. ఒక చెయ్యి అతడికి తోడుగా ఉన్నప్పుడు! అదేం అభయహస్తమూ, అదృశ్య హస్తమూ కాదు. చక్కగా పని చేసే చెయ్యి. సొంత పొలం ఉండి, సంతకానికి విలువ ఉన్న చెయ్యి. సాగునీటికి సమృద్ధిగా దోసిలి పట్టగల చెయ్యి. బ్యాంకుకెళ్లి అప్పు పుట్టించుకోగల చెయ్యి, టెక్నాలజీని వెనకాముందూ తిప్పి చూడగల చెయ్యి. శిక్షణతో పదును తిరిగే చెయ్యి. బడ్జెట్‌కి ముందొచ్చే ‘ఎకనమిక్ సర్వే’ మొన్న కుండబద్దలు కొట్టేసింది. ఆడవాళ్లు చేలోకి రాకుండా, ఆడవాళ్ల చేతుల్లోకి పొలాలు రాకుండా మున్ముందు భూమి బతికి బట్టకట్టడం కష్టమేనని చెప్పేసింది. పండే దగ్గర్నుంచి, పంటను అమ్మే దశ వరకు.. వాళ్లక్కూడా ఒక మాట చెప్పందే, వాళ్ల సలహా తీసుకోందే దిగుబడులు ఇలాగే ఏడుస్తాయని కూడా చెప్పింది. చెప్పడం వరకు చెప్పింది. వినేవాళ్లకు వినిపించాలి. మహిళలకు సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులున్నాయి, మైక్రో క్రెడిట్ స్కీములున్నాయి కదా అంటే.. పైన ఆకాశం ఉంది. కింద భూమి ఉంది. ఇక బతకడానికి ఏమొచ్చింది? అన్నట్లే ఉంటుంది. బతకడం కాదిప్పుడు సమస్య. బతికించడం. తిండిగింజల్ని పెంచడం. సాగుబడిలో మహిళలు ఎంతెక్కువ మంది ఉంటే అంతెక్కువగా ఆకలి మంటలు చల్లారతాయని ఎఫ్.ఎ.ఒ. అంచనా వేసింది. ఎఫ్.ఏ.ఓ.నే చెబుతున్నట్లు మహిళల వల్ల ఇరవై నుంచి ముప్పై శాతం దిగుబడి పెరిగే అవకాశాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు మహిళలకు ప్రాముఖ్యాన్నిచ్చి, భూమినిచ్చి, పరిజ్ఞానాన్నిచ్చి, పరికరాలనిచ్చి వారి చేయూతను కోరవచ్చు. ఇవేవీ ఇవ్వకుండా ఒక్క ‘అక్టోబర్ 15’ను మాత్రం వాళ్లకిచ్చాయి. అంతర్జాతీయ మహిళారైతు దినోత్సవం అది. మంచిదే. ఆ ఉదారతతోనే కాస్త భూమిని కూడా వాళ్ల సొంతానికి వచ్చేటట్లు చెయ్యగలితే మిగతావి వాళ్లే చూసుకుంటారు. భూమి అంటే పంట. మహిళారైతుకు అది నిర్ణయాధికారం కూడా. నిర్ణయం మహిళల చేతుల్లో ఉంటే.. బియ్యపు గింజపై తన పేరు లేని మనిషే ఉండడు. - మాధవ్ శింగరాజు -
మహిళాశక్తి రబ్బరు స్టాంపు కారాదు..
ఐకాస మహిళ విభాగ ప్రతినిధి సరోజినీ గంజుఠాకూరే బాపట్ల టౌన్: మహిళా ప్రతినిధులు రబ్బరు స్టాంపులుగా మారరాదని ఐక్యరాజ్యసమితి మహిళా విభాగ ప్రతినిధి సరోజిని గంజుఠాకూరే అన్నారు. స్థానిక మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆదివారం మహిళా రాజకీయ ప్రతినిధులతో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సరోజని గంజుఠాకూరే మాట్లాడుతూ పురుషులు స్త్రీలకు షాడో ప్రతినిధులుగా వ్యవహరించడం తగదన్నారు. మహిళలే నిర్ణయాత్మక శక్తులుగా ఎదగాలని ఆకాక్షించారు. కార్యాలయాలు, విద్యా సంస్థల వంటి ప్రదేశాల్లో మహిళా ఉద్యోగుల వేధింపులు నిరోధక అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఐక్యరాజ్యసమితి మహిళా విభాగ మరో ప్రతినిధి నవనీత సిన్హా మాట్లాడుతూ మహిళల వేధింపులకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ చక్రపాణి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నాగలక్ష్మి, భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం మాజీ డైరెక్టర్ కృష్ణకుమారి, విజయవాడ వాసవ్య మహిళా మండలి నాయకురాలు రష్మి పాల్గొన్నారు. -
ఉమెన్ ఇండియా c/o ఐశ్వర్య
ఐశ్వర్య డెరైక్టర్.. డాన్సర్.. ప్లేబ్యాక్ సింగర్.. పాత సంగతే. ఐశ్వర్య రజనీకాంత్ కూతురు.. ధనుష్ భార్య.. తెలిసిన సంగతే. ఐశ్వర్య ఇప్పుడు అంబాసిడర్!! కొత్తేముంది? బ్రాండుకో అంబాసిడర్. కానీ ఐశ్వర్య బ్రాండ్ అంబాసిడర్ కాదు. ఉమన్ పవర్‌కి ఇండియాను ఒక గ్రాండ్ నేమ్‌గా మార్చబోతున్న అంబాసిడర్. ఎలా తెలుసు మార్చబోతోందని! ఇంటర్వ్యూ చదవండి. మీకో కొత్త ఐశ్వర్య కనిపిస్తుంది. మీలోకి కొత్త శక్తి ప్రవహిస్తుంది. ⇒ మహిళా సంరక్షణ, సాధికారిత కోసం ఐరాస దూతగా ఎంపిక కావడం అంటే బరువైన బాధ్యత. మీరు న్యాయం చేస్తారన్నది చాలామంది నమ్మకం... ఐశ్వర్య: అవును. నమ్మకం లేకపోతే ఈ బాధ్యత నాకివ్వరు. అది నాకు బాగా తెలుసు. ఈ బాధ్యతను నాకెందుకు ఇచ్చారు? ఏ ప్రాతిపదికన నన్ను తీసుకున్నారు? అని నేను ఆలోచించలేదు. ఎంత బాగా చేయగలమనే ఆలోచనలో పడ్డాను. ఇలాంటివి పండగ చేసుకునే బాధ్యతలు కాదు. వెంటనే పనిలో పడాల్సినవి. చదువు విలువ తెలియని వాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లల్లో ఓ పది మంది పిల్లలు స్కూల్‌కి వెళ్లేలా చేసినా నేను సక్సెస్ అయినట్లే. అలాగే, ఇంటికే పరిమితమైన స్త్రీలలో ఓ పది మంది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉద్యోగం చేయాలనే భావన కలిగించినా నా పదవికి నేను న్యాయం చేసినట్లే. ⇒ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 69 ఏళ్లయిన ఈ సందర్భంలోనూ ఇంకా స్త్రీ-పురుష సమానత్వం, స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాడాల్సి రావడం బాధాకరమైన విషయమే అనాలి... ఐశ్వర్య:బాధాకరమే. కానీ, సంతోషించదగ్గ విషయం ఏంటంటే.. గడచిన పదేళ్లతో పోల్చితే ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయి. తమకు ఎదురైన సమస్యలను బహిరంగంగా చెప్పుకోవడానికి పదేళ్ల క్రితం ఆడవాళ్లు వెనకాడేవాళ్లు. సమస్యలన్నింటినీ మనసులోనే దాచుకునేవాళ్లు. ఇప్పుడు బయటికొస్తున్నారు. ఇది శుభ పరిణామం. భవిష్యత్తులో ఇంకా మంచి మార్పొలొస్తాయి. ⇒ అసలు మహిళలు ఎదగడానికి మగవాళ్లు సపోర్ట్ చేయాలని ఎదురుచూడడం ఎందుకు? అక్కడే మహిళ బలహీనురాలని తేలిపోతోంది కదా? ఐశ్వర్య : కరెక్టే. ఎవరో ఎంకరేజ్ చేయాలని ఎదురు చూడకూడదు. స్వశక్తితో ఎదగాలి. అయితే ఇక్కడో విషయం చెప్పాలి. ఇంట్లో ఉన్న మగవాడి సపోర్ట్‌ని ఆడవాళ్లు ఆశించడం తప్పు కాదు. అలాగే, మగవాడు కూడా ఆడవాళ్ల సపోర్ట్‌ని ఆశించడం తప్పు కాదు. ‘ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది’ అనే సామెత మనకు తెలిసిందే. అలాగే, ప్రతి మహిళ విజయం వెనక ఒక మగాడు ఉండటం తప్పు కాదు. అయితే, ఆ మగాడు ‘నా వల్లే నీకీ జీవితం’ అంటే అది తప్పు అవుతుంది. ఇక్కడ ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు. ఒకరి మీద మరికొరికి గౌరవం ఉన్నప్పుడు ఇద్దరూ సమానమే అనిపిస్తుంది. ఒక కుటుంబం బాగుండాలంటే ఇంట్లో ఉండే ఆడా, మగా కృషి చేయాలి. ఒక్కరి వల్ల ఏదీ సాధ్యం కాదు. ⇒ మనది పురుషాధిక్య సమాజం. స్త్రీ ఎదుగుదలను చూసి తట్టుకోలేని మగవాళ్లే ఎక్కువ.. ఐశ్వర్య : అఫ్కోర్స్ అది నిజమే. రాను రాను ఈ ధోరణిలో కూడా మార్పు కనిపిస్తోంది. ఎవరో తట్టుకోలేరని మనం ఆగిపోకూడదు. ఆనందించదగ్గ విషయం ఏంటంటే.. రీసెంట్గా జరిగిన రియో ఒలింపిక్స్‌లో మహిళలు పతకాలు గెల్చుకు వచ్చారు. వాళ్లు దేశానికి గర్వకారణం. చాలామంది ఆడవాళ్లకు వీళ్లు ఓ ఇన్స్పిరేషన్. ⇒ మీ ఇంటి వాతావరణం గురించి చెబుతారా? ఐశ్వర్య : నా జీవితంలో ఇద్దరు పురుషులు కీలకం. పెళ్లి కాక ముందు నాన్న (రజనీకాంత్), పెళ్లైన తర్వాత ధనుష్ (భర్త). మా నాన్న మాకు మా కాళ్ల మీద నిలబడటం నేర్పించారు. ఆత్మనూన్యతా భావంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో బతికేలా పెంచారు. నా భర్త ధనుష్ ఆడవాళ్లను గౌరవించే వ్యక్తి. పెళ్లై, ఇద్దరు బిడ్డలకు తల్లయాక కూడా దర్శకురాలిగా కొనసాగుతున్నానంటే దానికి కారణం మా ఇంట్లో మంచి వాతావరణం ఉండటమే. ‘నాన్న సూపర్ స్టార్. భర్త కూడా అంతే. అలాంటప్పుడు ఈవిడ పని చేయాల్సిన అవసరం ఏంటి?’ అని చాలామంది అనుకుంటారు. కానీ, నాకూ ఒక లక్ష్యం ఉండాలి కదా. ఆర్థికంగా బాగున్న మహిళలు పని చేయకూడదనీ, లేని మహిళలు ఉద్యోగాలు చేసుకుని బతకాలనీ కాదు. ఎవరికైనా ఒక టార్గెట్ ఉండాలి. సంపాదన ముఖ్యం. ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సొంత డబ్బుతో పిల్లలకు కావాల్సినవి కొన్నప్పుడు, చీరలు, నగలు కొనుక్కున్నప్పుడు, ఇంటి అవసరాలకు ఖర్చు పెట్టినప్పుడు లభించే తృప్తే వేరు. ⇒ మీరన్నది కరెక్టే. కానీ, ప్రపంచం ఇంత వేగంగా ఎదుగుతున్నా.. కొంతమంది మహిళలు ఇంకా ఇంటికే పరిమితం కావాలనుకుంటున్నారు. అలాంటివాళ్లకు ఏం చెబుతారు? ఐశ్వర్య : అవగాహన కలిగించాలి. ఇంట్లో ఉండేవాళ్లను నేను తక్కువ చేయడం లేదు. గృహిణులు చాలా పవర్ఫుల్. ‘ఇవాళ నేను ఇంటి బాధ్యతలకు సెలవు చెబుతున్నా’ అని ఒక్క రోజు అనమనండి. ఇంటిల్లిపాదీ షాకైపోతారు. ఇల్లు మొత్తం తలకిందులవుతుంది. ఒకవేళ ఇంటి బాధ్యతలు నిర్వర్తించడంలో ఆనందం ఉందనుకుంటే ఓకే. కానీ, బయటికొచ్చి ఉద్యోగం చేయాలంటే భయపడే ఆడవాళ్లు మాత్రం ఆత్మవిశ్వాసం పెంచుకోవాల్సిందే. తాము సంపాదించడం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందనుకున్నప్పుడు ఉద్యోగం చేయాలి. బయట ఎదురయ్యే పరిస్థితులను తట్టుకోవడానికి కావల్సిన ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? ⇒ ఆత్మకథతో ‘స్టాండింగ్ ఆన్ యాన్ యాపిల్ బాక్స్’ ఐశ్వర్య : ఓ సెలబ్రిటీ కూతురిగా, స్టార్ భార్యగా, ఫిల్మ్ మేకర్‌గా, తల్లిగా.. ఇప్పటివరకూ తాను ఎదుర్కొన్న అనుభవాల సమాహారంతో ‘స్టాండింగ్ ఆన్ యాన్ యాపిల్ బాక్స్’ పేరుతో ఐశ్వర్యా ధనుష్ ఆత్మకథ రాస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పలు అంశాలను ఐశ్వర్య ఈ పుస్తకంలో ప్రస్తావిస్తున్నారు. ఎత్తు-పల్లాలు, ఆగ్రహావేదనలు.. ఇలా పలు భావాలను ఈ స్వీయచరిత్రలో వ్యక్తపరుస్తున్నారు. ‘‘ఈ ఏడాది చివర్లో ఈ పుస్తకం బయటికొస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు. ⇒ స్టార్ హీరో కూతురు, స్టార్ హీరో భార్య కాబట్టి లైంగిక వేధింపులు ఎదురయ్యే అవకాశం మీకు లేదేమో. స్వీయానుభవాలు లేనప్పుడు ఇతరుల సమస్యలోని గాఢత మీకు తెలిసే అవకాశం ఉందా? ఐశ్వర్య : ఒక స్త్రీ సమస్య ఇంకో స్త్రీ అర్థం చేసుకోవడానికి స్వీయానుభవాలు అవసరం లేదని నా ఫీలింగ్. మనలాంటి అమ్మాయే కదా అనే ఫీలింగ్ ఉంటే చాలు. ఉదాహరణకు మన కళ్లెదుట నిప్పు ఉందనుకోండి. అది టచ్ చేసి దాని తాలూకు బాధ తెలుసుకోవాలనుకోం కదా. తాకితే బాధ ఖాయం అని తెలుసు. ఇది కూడా అంతే. మనం అనుభవించకుండానే గాయం తాలూకు బాధ ఎలా ఉంటుందో అనుభవించగలుగుతాం. సెలబ్రిటీ ఉమన్ అయినా.. మామూలు మహిళ అయినా.. ఆడవాళ్లకు సాటి స్త్రీ బాధ తెలుసుకునే అద్భుతమైన వరం ఆ దేవుడు మనకు ఇచ్చాడు. ⇒ కొన్ని సందర్భాల్లో ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు అవుతారు. రోడ్డు మీదకొచ్చి సమస్యలు చెప్పుకునే మహిళలను వాళ్లే విమర్శిస్తారు... ఐశ్వర్య : అలాంటి వాళ్లను దృష్టిలో పెట్టుకుని కూడా కొంతమంది ఆడవాళ్లు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెనకాడతారు. అందుకే సమస్యలు చెప్పుకోవాలనుకున్నప్పుడు ఇతరుల గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే, ఎవరూ మన జీవితాల్ని ఉద్ధరించరు. విమర్శించేవాళ్లు మనం మాట్లాడినా ఎద్దేవా చేస్తారు.. మాట్లాడకపోయినా చేస్తారు. అందుకే అంటున్నా.. ‘మీ ఇంట్లో మగవాళ్ల కారణంగా సమస్య వస్తే.. బయటికి వచ్చి చెప్పండి. సమస్యను పరిష్కరించు కోండి. జీవితాన్ని మాత్రం త్యాగం చేయొద్దు’. ⇒ ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించే మగవాళ్లల్లో ఆ విపరీత ధోరణికి కారణం ఏమనుకుంటున్నారు. పెంపకం లోపం అనుకోవచ్చా? ఐశ్వర్య : పెంపకం ఓ కారణం మాత్రమే. పరిసరాల ప్రభావం ఓ కారణం అవుతుంది. అలాగే, చిన్నప్పట్నుంచీ మైండ్ సెట్ ఎలా ఉంది? అనేది ఇంకో కారణం. పెంపకం గురించి చెప్పాలంటే... ఇంట్లో ఆడపిల్లలను పెంచేటప్పుడు సేఫ్టీ పేరుతో ప్రతిదానికీ ఆంక్షలు పెడతారు. ‘ఆడపిల్లవి...’ అంటూ చాలా విషయాలకు ‘నో’ చెప్పేస్తారు. దాంతో ఆడపిల్ల తన ఇష్టాలను బలవంతంగా అణిచేసుకుంటుంది. ‘నో’ అనే పదానికి అలవాటు పడిపోతుంది. కానీ, మగపిల్లలు ఏం చేసినా ‘నో’ అనరు. దాంతో ఎవరైనా వాళ్లకి ‘నో’ చెబితే, అహం అడ్డొస్తుంది. పంతం నెగ్గించుకోవాలనుకుంటారు. దానికోసం ఎంతదాకా అయినా వెళ్లడానికి వెనుకాడరు. అందుకే ఆడపిల్లలకు పెట్టినట్లుగా మగపిల్లలకు కూడా కొన్ని ఆంక్షలు పెట్టాలి. అలా పెంచితే ఏది పడితే అది చేసినప్పుడు ‘నో’ అనే ఆంక్ష ఎదురైనా... భవిష్యత్తులో ఎక్కడైనా తిరస్కరణకు గురైనా, పెద్ద బాధ అనిపించదు. ⇒ అందుకే నాన్న చాలా ఆనందపడ్డారు! ఐశ్వర్య : డెరైక్టర్‌గా ‘3’తో నా తొలి అడుగు సునాయాసంగా పడింది. దానికి కారణం నా బ్యాగ్రౌండ్. ప్రతిభ నిరూపించుకోవడానికి మార్గం దొరికింది. సో.. నా అంతట నేనుగా అవకాశం సంపాదించినట్లు కాదు. కానీ, యూఎన్‌కు ఉమెన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపిక కావడం అనేది నేను సొంతంగా సాధించుకున్నది. ఇండిపెండెంట్‌గా అచీవ్ చేశాను కాబట్టి నాన్న చాలా ఆనందపడ్డారు. ‘ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యు’ అన్నారు. మా అమ్మ (లతా రజనీకాంత్) వండర్ఫుల్. క్లుప్తంగా చెప్పాలంటే అమ్మా నాన్న ఇద్దరూ నాకు ఆదర్శం. ⇒ ఇద్దరు కొడుకులకు తల్లిగా మీ బిడ్డలను మీరెలా పెంచుతున్నారు. మిమ్మల్ని మీ అమ్మా నాన్న ఎలా పెంచారు? ఐశ్వర్య : మా అమ్మా నాన్న ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తులు. వాళ్ల పెంపకం ఎంత మంచిదో నాకు చిన్నప్పుడు తెలియలేదు. నేను తల్లయ్యాక అర్థమవుతోంది. మా అమ్మానాన్నల్లా నా పిల్లలను నేను పెంచుతున్నానా? అని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ మాటకొస్తే పెంపకం విషయంలో ఎవరికీ పోలిక పెట్టలేం. ఎందుకంటే, ఆ ఇంటి పరిస్థితులను బట్టి పిల్లల పెంపకం ఉంటుంది. ‘నేను ఇలా పెంచుతున్నాను. మీరు కూడా ఇలా పెంచండి’ అని ఎవరికీ సలహా ఇవ్వకూడదు. ఏ తల్లిదండ్రైనా పిల్లల మంచి గురించే ఆలోచిస్తారు. పిల్లలు చెడిపోవాలని ఆనుకోరు. నేను నా పిల్లలిద్దరికీ ఆడవాళ్లను గౌరవించాలనే విషయాన్ని పర్టిక్యులర్‌గా చెబుతాను. చిన్నప్పట్నుంచీ చెప్పి, పెంచితే పెద్దయ్యాక మహిళలను గౌరవించడం అలవాటవుతుంది. ఆడ-మగ సమానం అనే ఫీలింగ్ వాళ్లల్లో నాటుకుపోయేలా పెంచుతాను. ⇒ మా ఇంట్లో ఆ తేడా లేదు ఐశ్వర్య : మా ఇంట్లో ఆడ-మగ అని అడుగడుగునా తేడా చూపించే పరిస్థితులు ఉండవ్. నేను నా పనితో బిజీగా ఉన్నప్పుడు మా ఆయన పిల్లలను చూసుకుంటారు. ఆయన బిజీగా ఉన్నప్పుడు నేను చూసుకుంటాను. భార్యాభర్తలకు ఒకరి పని మీద ఇంకొకరికి గౌరవం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నేనీ రోజున డెరైక్టర్‌గా చేయగలుగుతున్నానంటే దానికి కారణం మా ఇంట్లో ఉండే మగవాళ్లే (తండ్రి, భర్తని ఉద్దేశించి). ⇒ అంతరిక్షయానం చేయడానికి ఆడవాళ్లు వెనకాడని ఈ రోజుల్లో ఇంటి గడప దాటని ఆడవాళ్లూ ఉన్నారు. అలాంటి వాళ్లను చైతన్యపరచడానికి మీ వంతుగా ఏం చేయాలనుకుంటున్నారు? ఐశ్వర్య : లక్కీగా నేను ఉన్నది చాలా పవర్ఫుల్ మీడియా. సినీ దర్శకురాలిగా నేను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సినిమాలు చేస్తాను. యూఎన్‌కు ఉమన్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా మహిళలను మోటివేట్ చేసేలా డాక్యుమెంటరీలు తీయాలనుకుంటున్నాను. అలాగే, ఇవాళ సామాజిక మాధమ్యం ఓ వరం. సోషల్ మీడియా కారణంగా ప్రపంచం చిన్నదైపోయింది. ఐదారేళ్ల క్రితం ఎక్కడైనా జరగరానిది జరిగితే అది వెలుగులోకొచ్చేది కాదు. ఇప్పుడలా కాదు. మారుమూల గ్రామాల్లో జరిగే లైంగిక దాడుల గురించి మొత్తం ప్రపంచానికి తెలుస్తోంది. అందుకే ఈ మీడియాని మంచి వేదికగా వాడుకోవాలనుకుంటున్నాను. ⇒ దర్శకురాలిగా మీ ఫ్యూచర్ ఫ్లాన్స్? ఐశ్వర్య : ఇప్పటివరకూ చేసిన ‘3’, ‘వై రాజా వై’ చిత్రాలకు భిన్నంగా ఉండే సినిమాలు చేయబోతున్నాను. రెండు కథలు రెడీ చేశాను. ఈ ఏడాది చివర్లో ఒక సినిమా ఆరంభమయ్యే అవకాశం ఉంది. - డి.జి. భవాని -
ఉమెన్ పవర్
ఎంపీపీ, తహసీల్దార్, ఎంపీడీఓ, ఏఓ, ఏపీఎం, వైద్యాధికారి.. వీరందరూ ఆత్మకూర్(ఎం) మండలానికి సంబంధించిన మహిళా అధికారులు. సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను పక్కాగా అమలు చేస్తూ తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. పాలనలో పరస్పరం సహకరించుకుంటూ, సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న మహిళా‘మణు’లపై సాక్షి ప్రత్యేక కథనం. జిల్లాలో ఆత్మకూరు(ఎం) మండలానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రభుత్వ శాఖల్లో కీలక పదవుల్లో ఉన్న వారందరూ మహిళలే కావడం విశేషం. సమర్థంగా విధులు నిర్వర్తించడంలో వారికి వారే సాటి. మహిళలే అయినప్పటికీ పాలనాపరంగా చక్కగా రాణిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. ఒకరి నొకరు సహకరించుకుంటూ మండలాభివృద్ధికి దోహదపడుతున్నారు మండల పరిషత్ అధ్యక్షురాలు కాంబోజు భాగ్యశ్రీతో పాటు, తహసీల్దార్ లక్క అలివేలు, ఎంపీడీఓ గోరింతల అంబబాయి, ఏఓ ఎస్. లావణ్య, ఏపీఎం టి.శోభారాణి, వైధ్యాధికారి బి.సుకృతారెడ్డి వరకు అంతా మహిళా అధికారులే. చాలా గర్వంగా ఉంది ఆత్మకూరు(ఎం) మండలంలో తహసీల్దార్‌గా పని చేయడం చాలా గర్వంగా ఉంది. తోటి మహిళా అధికారుల సహకారం మరువలేనిది. తాను ఇంటర్ తర్వాత టీటీసీ ద్వారా టీచర్‌ను అయ్యాను. తర్వాత గ్రూప్స్ రాసి తహసీల్దార్‌గా సెలక్టయ్యూను. మొదటి పోస్టింగ్ 2005 పెన్‌పహాడ్ మండలం. -లక్క అలివేలు. తహసీల్దార్ మొదటి పోస్టింగ్ ఆత్మకూరు(ఎం)లోనే.. 2012లో ఏఓగా అపాయింట్మెంట్ అయ్యాను. మొదటి పోస్టిం గ్లో ఆత్మకూరు(ఎం) వచ్చాను. ఇక్కడ నాలుగేళ్ల నుంచి పని చేస్తున్న. రైతులందరితో మం చి పరిచయాలు ఉన్నాయి. విధు లు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నా. - ఎస్.లావణ్య, ఏఓ గృహిణి నుంచి ఎంపీపీ అయ్యూను గృహిణి నుంచి ఎంపీపీ స్థాయికి వచ్చాను. ఎంపీపీగా 2014లో భాద్యతలు స్వీకరించాను. ప్రతి రోజూ మండల పరిషత్ కార్యాలయానికి వస్తాను. రోజుకు రెండు మూడు గ్రామాలు తిరుగుతాను. మండల అభివృద్ధికి కృ షి చేస్తున్నా. ఒకప్పుడు సాధార ణ గృహిణిగా ఉన్న నేను ఎంపీపీగా ఎంపికవడం మరువలేను. - కాంబోజు భాగ్యశ్రీ, ఎంపీపీ రోగులకు చిత్తశుద్ధితో సేవలందిస్తున్నాం చిత్తశుద్ధితో పని చేస్తూ రోగులకు చక్కటి సేవలందిస్తున్నాం. సి బ్బంది కూడా మంచిగా సహకరి స్తున్నారు. నేను 2014లో వైద్యాధికారిగా అపాయింట్మెంట్ అయ్యాను. ఆత్మకూరు(ఎం)లో మొదటి పోస్టింగ్. - బి. సుకృతారెడ్డి, వైధ్యాదికారి -
ఆడా? మగా? ఎవరు మంచి పైలెట్లు?
అంతరిక్షాన్ని అధిరోహించిన కల్పనాచావ్లా లాంటి వనితల ధైర్యసాహసాల గురించి తెలిసినా... మహిళల శక్తి సామర్థ్యాల పట్ల మనలో కొంతమంది ఆలోచన ఇంకా అథఃపాతాళంలోనే ఉంది. ఈ విషయాన్ని నిరూపించింది తాజాగా నిర్వహించిన ఓ సర్వే. పైలట్లుగా స్త్రీ పురుషుల్లో ఎవరిని విమాన ప్రయాణికులు ఎక్కువగా విశ్వసిస్తున్నారు అనే అంశంపై నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది పురుష పైలట్లపైనే ఎక్కువ నమ్మకాన్ని ఉంచారు. ట్రావెల్ ఏజెంట్ అయిన సన్‌షైన్ డాట్ కో యుకె ఈ సర్వే ఫలితాలను వెల్లడించింది. పైలట్లు ఆడవారా, మగవారా అనేది విషయమే కాదని ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 26శాతం మంది చెప్పగా, కేవలం 14శాతం మంది మాత్రమే పురుష పైలట్లను విశ్వసించం అని స్పష్టం చేశారు. ఆడవాళ్ల కన్నా పురుష పెలైట్లు మరింత ఎక్కువ నైపుణ్యం కలిగి ఉంటారని 38 శాతం మంది అభిప్రాయపడగా, అదే సమయంలో ఒత్తిడిని తట్టుకోవడంలో స్త్రీ పెలైట్ల సామర్థ్యంపై 28 శాతం మంది సందేహాలను వ్యక్తం చేశారు. ఇక సర్వేలో పాల్గొన్నవారిలో 10 శాతం మంది ఏం చెప్పారంటే...‘‘గతంలో మేం ప్రయాణించిన విమానాల్లో పైలట్ నుంచి కాక్‌పిట్ సిబ్బంది అంతా మగవాళ్లే ఉన్నారు. కాబట్టి మేం ఏం ఆశించాలో తెలీడం లేదు’’ అని. ఈ సర్వే ఫలితాలను వెల్లడిచేస్తున్న నేపథ్యంలో నిర్వాహక సంస్థ డెరైక్టర్ క్రిస్ క్లార్క్సన్ మాట్లాడుతూ...‘‘సగానికి పైగా విమాన ప్రయాణికులు మహిళా పైలట్లను విశ్వసించడం లేదని చెప్పడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఇలాంటి దుర భిప్రాయాలను తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి పైలట్లు పూర్తిగా అర్హతలుండి, లెసైన్స్ పొందినవారైతే... ఓ విమానాన్ని నడపడానికి వారు పూర్తి సామర్థ్యం కలవారే అని, క్షేమంగా మిమ్మల్ని గమ్యానికి చేర్చగలరు అనీ అర్థం. ఇందులో స్త్రీలు, పురుషులు అనే తేడా లేదు’’ అన్నారాయన. ఈ సర్వే కోసం మొత్తం తీసుకున్న 2,367 మందిలో 1,195 మంది పురుషులు కాగా 1,172 మంది స్త్రీలు. వీరంతా గత 12 నెలలుగా హాలిడే ట్రిప్ విదేశాల్లో గడుపుతున్నవారు.