ఎంపీపీ, తహసీల్దార్, ఎంపీడీఓ, ఏఓ, ఏపీఎం, వైద్యాధికారి.. వీరందరూ ఆత్మకూర్(ఎం) మండలానికి సంబంధించిన మహిళా అధికారులు. సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను పక్కాగా అమలు చేస్తూ తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. పాలనలో పరస్పరం సహకరించుకుంటూ, సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న మహిళా‘మణు’లపై సాక్షి ప్రత్యేక కథనం.
జిల్లాలో ఆత్మకూరు(ఎం) మండలానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రభుత్వ శాఖల్లో కీలక పదవుల్లో ఉన్న వారందరూ మహిళలే కావడం విశేషం. సమర్థంగా విధులు నిర్వర్తించడంలో వారికి వారే సాటి. మహిళలే అయినప్పటికీ పాలనాపరంగా చక్కగా రాణిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. ఒకరి నొకరు సహకరించుకుంటూ మండలాభివృద్ధికి దోహదపడుతున్నారు మండల పరిషత్ అధ్యక్షురాలు కాంబోజు భాగ్యశ్రీతో పాటు, తహసీల్దార్ లక్క అలివేలు, ఎంపీడీఓ గోరింతల అంబబాయి, ఏఓ ఎస్. లావణ్య, ఏపీఎం టి.శోభారాణి, వైధ్యాధికారి బి.సుకృతారెడ్డి వరకు అంతా మహిళా అధికారులే.
చాలా గర్వంగా ఉంది
ఆత్మకూరు(ఎం) మండలంలో తహసీల్దార్‌గా పని చేయడం చాలా గర్వంగా ఉంది. తోటి మహిళా అధికారుల సహకారం మరువలేనిది. తాను ఇంటర్ తర్వాత టీటీసీ ద్వారా టీచర్‌ను అయ్యాను. తర్వాత గ్రూప్స్ రాసి తహసీల్దార్‌గా సెలక్టయ్యూను. మొదటి పోస్టింగ్ 2005 పెన్‌పహాడ్ మండలం.
-లక్క అలివేలు. తహసీల్దార్
మొదటి పోస్టింగ్ ఆత్మకూరు(ఎం)లోనే..
2012లో ఏఓగా అపాయింట్‌మెంట్ అయ్యాను. మొదటి పోస్టిం గ్‌లో ఆత్మకూరు(ఎం) వచ్చాను. ఇక్కడ నాలుగేళ్ల నుంచి పని చేస్తున్న. రైతులందరితో మం చి పరిచయాలు ఉన్నాయి. విధు లు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నా.
- ఎస్.లావణ్య, ఏఓ
గృహిణి నుంచి ఎంపీపీ అయ్యూను
గృహిణి నుంచి ఎంపీపీ స్థాయికి వచ్చాను. ఎంపీపీగా 2014లో భాద్యతలు స్వీకరించాను. ప్రతి రోజూ మండల పరిషత్ కార్యాలయానికి వస్తాను. రోజుకు రెండు మూడు గ్రామాలు తిరుగుతాను. మండల అభివృద్ధికి కృ షి చేస్తున్నా. ఒకప్పుడు సాధార ణ గృహిణిగా ఉన్న నేను ఎంపీపీగా ఎంపికవడం మరువలేను.
- కాంబోజు భాగ్యశ్రీ, ఎంపీపీ
రోగులకు చిత్తశుద్ధితో సేవలందిస్తున్నాం
చిత్తశుద్ధితో పని చేస్తూ రోగులకు చక్కటి సేవలందిస్తున్నాం. సి బ్బంది కూడా మంచిగా సహకరి స్తున్నారు. నేను 2014లో వైద్యాధికారిగా అపాయింట్‌మెంట్ అయ్యాను. ఆత్మకూరు(ఎం)లో మొదటి పోస్టింగ్.
- బి. సుకృతారెడ్డి, వైధ్యాదికారి
ఉమెన్ పవర్
Published Sun, May 15 2016 4:38 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM
Advertisement