మీరు ఆర్థిక అక్షరాస్యులేనా?! | Indian women are financially literate | Sakshi
Sakshi News home page

మీరు ఆర్థిక అక్షరాస్యులేనా?!

Published Wed, Apr 3 2024 10:00 AM | Last Updated on Wed, Apr 3 2024 10:00 AM

Indian women are financially literate - Sakshi

‘భారతీయ స్త్రీలు ఆర్థికంగా అక్షరాస్యులు కాకపోవడానికిప్రధాన కారణం పితృస్వామ్యమే’ అంటోంది గ్లోబల్‌ సర్వే స్టాండర్ట్‌ అండ్‌ పూర్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌. ఆర్ధిక భద్రత, ఆర్థిక అక్షరాస్యత స్త్రీకి ఎంత అవసరమో తెలుసుకుంటే ఆమె పురోభివృద్ధిలో మరిన్ని మంచిమార్పులు చోటుచేసుకుంటాయన్నది అక్షర సత్యం.

సం΄ాదనలో నేటితరం మహిళలూ తమ సత్తాను చూపుతున్నారు. వృత్తి, ఉద్యోగాల్లో కీలక ΄ాత్ర ΄ోషిస్తున్నారు. అక్షరాస్యతలోనూ ముందడుగు వేస్తున్నారు. అయితే, ఆర్థిక అక్షరాస్యతలో మాత్రం మహిళ వెనకంజలోనే ఉందని గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ లిటరసీ బారోమీటర్‌ సర్వే స్పష్టం చేస్తోంది. 28 దేశాలలో నిర్వహించిన ఈ సర్వేలో (స్తీ–పురుషులు ఇద్దరినీ కలిపి) భారతదేశం 23వ స్థానంలో ఉంది. కేవలం 35 శాతం మంది మాత్రమే ఆర్థిక అక్షరాస్యులుగా ఉంటే, 65 శాతం మందికి ఆర్థిక అవగాహన తక్కువ. ఇందులోనూ మహిళలు మరింతగా వెనకబడి ఉన్నారు అని తెలియజేసింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ వందకోట్ల కంటే ఎక్కువ మంది మహిళలు సొంత బ్యాంకు ఖాతా కూడా లేనివారున్నారు. 

భావోద్వేగాలతో ఆట
తరచూ భర్తలు తమ భార్యలతో ‘నేను సం΄ాదిస్తున్నాను కాబట్టి నువ్వు సం΄ాదించాల్సిన అవసరం ఏముంది? ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేసినట్టే అవుతుంది’ అనే ఎమోషనల్‌ స్ట్రాటజీలతో మహిళలు ఇరుక్కుంటున్నారు. దీంతో మహిళలు క్రమంగా ఒంటరిగా, నిస్సహాయంగా మారుతుంటారు. దురదృష్టం ఏమిటంటే ‘ప్రేమ’ అనే పేరుతో జరిగే ఆర్థిక దుర్వినియోగాన్ని మహిళలు గుర్తించలేక΄ోతున్నారు. ఆర్థిక భద్రత లేక΄ోవడంతో స్త్రీలు తమకి నప్పని సంబంధాలలోనూ సర్దుబాటు చేసుకుంటూ జీవించాల్సి వస్తుంది. చెడు సంబంధాలలోకి వెళుతుంటారు. డబ్బును ΄÷దుపు చేసి పెట్టుబడులు పెట్టడానికి బదులు, ఆమె కుటుంబం కోసం తనను తాను త్యాగం చేసుకుంటుంది. చివరకు అదే కుటుంబంలోని వ్యక్తులు లేదా పిల్లలు స్త్రీల మీద ఆర్థిక ఒత్తిడిని తీసుకువస్తున్నారు. మహిళల ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా గృహహింసను తగ్గించవచ్చని ‘రైట్స్‌ ఆఫ్‌ ఈక్వాలిటీ’ అనే సంస్థ ‘ది ఎకనామిక్‌ అబ్యూజ్‌ అండ్‌ ది ఇం΄ార్టెన్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ లిటరీ ఆఫ్‌ ఉమెన్‌’ నివేదికలో పేర్కొంది. 

నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలి
కుటుంబం ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో సాధారణంగా మహిళలు ఉండరు. లక్ష్మి ఒక సాధారణ గృహిణి. ఇప్పటికీ బ్యాంకు ఖాతా తెరవడానికి, కేవైసీ చేయడానికి భర్తతో కలిసే బ్యాంకుకు వెళుతుంది. ఆర్థికవిషయాలు అంటే ఆమెకు ఒక విధమైన భయం. సొంతంగా ఎప్పుడూ ప్రయత్నం కూడా చేయదు. ఇలాంటి గృహలక్ష్ములు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. ఉమ ఉద్యోగం చేస్తుంది. కానీ, ఆమె ఏటీఎం కార్డ్‌ భర్త వద్ద ఉంటుంది. ΄ాస్‌వర్డ్‌ లాంటివి ఆమె స్వయంగా రూ΄÷ందించదు. అవన్నీ ఆమె భర్త చేస్తాడు. ఉద్యోగం చేస్తున్నా కూడా ఆర్థిక అక్షరాస్యత, ఆర్థికస్వేచ్ఛ లేని ఇలాంటి మహిళలు కోట్లాదిమంది ఉన్నారు. 

షాపింగ్‌లో సమస్య లేదు
‘ఆర్థిక అక్షరాస్యత అంటే బ్యాంకుకు వెళ్లడం, అకౌంట్‌ ఓపెన్‌ చేయడం, చిన్న చిన్న లావాదేవీలు చేయడం అనుకోవాలా?!’ అనే ప్రశ్న ఉదయించకమానదు. అయితే, ‘ఇండియన్‌ ఉమెన్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ ఫిట్‌నెస్‌’ రచయిత సునీల్‌ గాంధీ మాట్లాడుతూ ‘చాలామంది మహిళలకు మొబైల్‌ యాప్‌లో షాపింగ్‌ చేయడం, క్యాబ్‌ బుక్‌ చేసుకోవడంలో ఎటువంటి సమస్య ఉండటం లేదు. అయితే, తమ సొంత బ్యాంకు ఖాతాను నిర్వహించడంలో లేదా ఆన్‌లైన్‌ లావాదేవీలు, పెట్టుబడుల పట్ల మాత్రం చాలా అసౌకర్యంగా ఉంటున్నారని చెబుతున్నారు. ‘ఆమె బ్యాంకింగ్‌ వ్యవస్థకు దూరంగా ఉండాలి. ఎందుకంటే, డబ్బు లావాదేవీలు, వడ్డీలు, చక్రవడ్డీల ఉచ్చులో చిక్కుకోకూడదు అని పురుషులు భావిస్తారు. ఆమె కూడా ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టడానికి, ఈఎమ్‌ఐ కట్టడానికి, ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపదు. వ్యక్తిగత ఫైనాన్స్, జ్ఞానం, నైపుణ్యాలు, వంటి ఆర్థిక సమాచారం ఉన్నవారు తమ డబ్బుకు సంబంధించి సొంతంగా నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఉన్నవారు ఆర్థికంగా అక్షరాస్యులు’ అని సునీల్‌ గాంధీ వివరిస్తున్నారు. 

మహిళలను నియంత్రించే ఆయుధం
ఉద్దేశపూర్వకంగానే మహిళలకు ‘ఆర్థిక స్వేచ్ఛ’ ఇవ్వడం లేదు. కుటుంబంలోని మగవారే దీనిని అడ్డు
కుంటున్నారు. భారతీయ స్త్రీలు ఇంటిని చూసుకుంటారు. పురుషులు సం΄ాదిస్తారు. దీంతో ‘తమకు ఏం అవసరమో పురుషులే చూసుకుంటారు’ అనే ఆలోచన స్త్రీలను ఆర్థిక స్వేచ్ఛకు దూరం చేస్తుంది. చేతిలో డబ్బు, దానిని ఖర్చు చేసే హక్కు పురుషులకు ఉండటం మహిళలను నియంత్రించే ఆయుధంగా మారింది.
– గీతికా చంద్ర,‘ఫైనాన్స్‌ బేసిక్స్‌ ఫర్‌ ఉమెన్‌’ రచయిత్రి 

కొట్టకుండా వేధింపులు
‘నేను సం΄ాదిస్తున్నాను, నా సం΄ాదనతో ఇల్లు నడుస్తోంది. నేను సం΄ాదించక΄ోతే కుటుంబం దిక్కు
లేనిది అవుతుంది. నేను సం΄ాదిస్తున్నాను కాబట్టి నా ఇష్టం మేరకు అన్నీ నడవాలి’ ఈ తరహా ఆలోచన పురుషుల్లో పెరిగి మహిళలపై వేధింపులకు కారణమవుతోంది. 95 శాతం 
గృహహింస కేసుల్లో డబ్బు ప్రధాన΄పాత్ర పోషిస్తోంది. చాలామంది మహిళలు ఈ విధమైన ఆర్థిక వేధింపులకు గురవుతున్నారు. 
– సీమీ వినాయక్, సైకాలజిస్ట్‌  

అవగాహనకు మార్గాలు..
 ఆర్థికంగా అక్షరాస్యత ఉన్న మహిళలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, వేటికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత దుర్వినియోగం అవుతుంది అనే విషయాల పట్ల అవగాహన ఉండాలి. అంతేకాదు, ఏ పథకాల్లో డబ్బు ఉంచడం ప్రయోజనకరం... వంటి అంశాలపై దృష్టి పెట్టడం వల్ల మార్కెట్‌లో ఆర్థిక కదలిక ఏమిటో తెలుస్తుంది. 

 ఫిక్స్‌డ్‌ డి΄ాజిట్స్, స్కీమ్‌లు, నాన్‌–డీమ్యాట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్‌ 
ఫండ్స్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ΄ాలసీ గురించి అవగాహన పెంచుకోవాలి.
 
మహిళలు తమ భర్త ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారో తప్పక తెలుసుకోవాలి. 
ఏయే రుణాలు తీసుకుంటున్నారు, వాటి కాలపరిమితి ఎంత, వడ్డీ ఎంత అనేది తెలుసుకోవాలి. 
ప్రస్తుతం చాలా లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలు ఆన్‌లైన్‌ లావాదేవీల మొత్తం ప్రక్రియను తెలుసుకోవాలి. 

 మ్యూచువల్‌ ఫండ్స్, షేర్లు, బ్యాంకులు, ఫిక్స్‌డ్‌ డి΄ాజిట్లు, ΄ోస్టాఫీస్, జీవిత బీమాలో పెట్టుబడి పెట్టినట్లయితే ఎప్పుడూ కంబైన్డ్‌గా చేయడం మంచిది. నామినీలో మీ పేరు ఉందో లేదో చెక్‌ చేయాలి. మీ సొంత బ్యాంకు ఖాతా వివరాలను ఎల్లప్పుడూ అప్‌డేట్‌లో ఉంచండి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement