ఫ్యూచర్ రెడీయువతులకు సంబంధించి ‘ఏఐ’ని ఉ΄ాధి కోణంలో మాత్రమే చూడనక్కర్లేదు. ఆత్మవిశ్వాసం నుంచి ఆర్థిక స్వావలంబన వరకు ఎన్నో అంశాలలో ‘ఏఐ’ యువతరం నేస్తం అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(జెన్‌ఏఐ) ద్వారా గ్లాస్ సీలింగ్‌ను ఛేదించే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ కోర్సులలో చేరడానికి మహిళలు ఆసక్తి చూపుతున్నారు’ అంటున్నారు ఆన్‌లైన్ లెర్నింగ్ పాట్‌ఫామ్ ‘కోర్సెరా’స్ట్రాటజిక్ అడ్వైజర్ శ్రావణ్ గోలి.
యువతులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడానికి సవిట్ (సౌత్ ఏషియా ఉమెన్ ఇన్ టెక్) జెనరేటివ్ ఏఐ లెర్నింగ్ ఛాలెంజ్‌ను ప్రకటించింది. సుమారు అయిదు లక్షల మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో శిక్షణ ఇవ్వాలనేది ‘సవిట్’ లక్ష్యంగా పెట్టుకొంది.‘కెరీర్ పరంగా సరికొత్త అవకాశాలకు, ఆర్థిక స్వావలంబనకు, ఉద్యోగాలలో లింగ అంతరాన్ని పూడ్చడానికి, ఏఐ రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది’ అంటుంది సవిట్.
టెక్నాలజీ సెక్టార్‌లో కెరీర్ కోసం కలలు కంటున్న యువతులకు అవసరమైన సదు΄ాయాలు ఏర్పాటు చేయడంతో ΄ాటు సాంకేతిక శిక్షణ ఇవ్వనుంది సవిట్. నెట్‌వర్కింగ్, మెంటార్‌షిప్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్కిల్ గ్రోత్, రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి మహిళలకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించబోతుంది. టెక్ మహీంద్రాలో ఏఐ ్ర΄ాజెక్ట్‌లకు సంబంధించి మహిళలు గణనీయమైన సంఖ్యలో నాయకత్వ స్థానంలో ఉన్నారు. టార్గెట్ రిక్రూట్‌మెంట్, మెంటార్‌షిప్ ప్రోగ్రామ్స్, కెరీర్ రిక్రూట్‌మెంట్ కార్యక్రమాల ద్వారా భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలలో మహిళల సంఖ్యను గణనీయంగా పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రామీణ భారతంలో కూడా యువతులను ఆర్థిక స్వావలంబన దిశగా నడిపిస్తోంది ఏఐ. దీనికి ఉదాహరణ... బిహార్‌లోని ‘ఐ–సాక్ష్యం’ అనే సంస్థ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి రూపోందించిన ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ల ద్వారా గ్రామీణ ప్రాంతం యువతులను ఛేంజ్‌మేకర్స్‌గా మారుస్తోంది ఐ–సాక్ష్యం. లైఫ్ స్కిల్స్, డిజిటల్, ఫైనాల్సియల్ లిటరసీ... మొదలైన వాటికి సంబంధించి ‘ఐ–సాక్ష్యం’ శిక్షణ ఇస్తోంది.
‘కోడ్ విత్ ఔట్ బ్యారియర్స్’ ప్రోగ్రామ్ క్రింద 75,000 మహిళలకు ఏఐలో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది మైక్రోసాఫ్ట్. టెక్‌సాక్ష్యం, సైబర్‌శిక్షణ, మైక్రోసాఫ్ట్ డైవర్శిటీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ (ఎండీఎస్‌పీ)... మొదలైన కార్యక్రమాల ద్వారా నిరుపేద యువతులకు సాంకేతికరంగంలో ఉద్యోగావకాశాలు కల్పించడానికి అవసరమైన శిక్షణ ఇస్తోంది మైక్రోసాఫ్ట్.
Comments
Please login to add a commentAdd a comment