model village
-
మొదటి ఎంబీయే మహిళా సర్పంచ్,లక్షల ప్యాకేజిని వదిలి..
ఛావీ రాజావత్ రాజస్థాన్‌లోని సోడా గ్రామంలో పుట్టి పెరిగింది. పట్నంలో ఉన్నత చదువులు చదివి, కళ్లు చెదిరే ప్యాకేజీతో కార్పొరేట్ ఉద్యోగంలో చేరింది. కానీ, చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి గ్రామానికి వెళ్లింది. సర్పంచ్‌గా ఎన్నికల్లో నిలబడి గెలిచింది. పదేళ్లపాటు సర్పంచ్‌గా పనిచేసింది. మొదటి ఎంబీయే మహిళా సర్పంచ్‌గా వార్తల్లో నిలిచి, యుఎన్లో ప్రసంగం చేసింది. గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు గ్రామాభివృద్ధికి కృషి చేస్తూనే, హోటల్ వ్యాపారం చేస్తోంది. ఆసక్తి గలవారికి గుర్రపు స్వారీలో శిక్షణ ఇస్తోంది. ‘‘2010లో తొలిసారి సర్పంచ్ అయినప్పుడు గ్రామ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. గ్రామం తీవ్ర కరువుతో అల్లాడిపొంయింది. సాగునీరు లేదు. 13–14 సంవత్సరాలుగా రుతుపవనాలు లేవు. భూగర్భ జలాలను వాడుకోలేకపొంయేవారు. 3–4 గంటలకు మించి విద్యుత్ సరఫరా లేదు. రోడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది. ఈ సవాళ్లతో సోడా పంచాయితీ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టాను. మొదటి టర్మ్‌లో కొన్ని పనులు పూర్తయ్యాయి. మా ఊరు తనవైపు లాగింది.. మా తాత బ్రిగేడియర్ రఘుబీర్‌సింగ్ 1990 వరకు సర్పంచ్‌గా చేశారు. నాకు మా ఊరు అంటే ఎప్పుడూ ఇష్టమే. బెంగుళూరులోని రిషి వ్యాలీ స్కూల్, జైపూర్‌లోని మాయో కాలేజీ గర్ల్స్ స్కూల్లో చదువుకున్నాను. వేసవి సెలవులు వచ్చినప్పుడల్లా మా ఊరిలోనే ఉండేదాన్ని. ఢిల్లీలోని మహిళా శ్రీరామ్ కాలేజీ నుండి డిగ్రీ తీసుకున్నాక, పూణెలోని బాలాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోడ్రన్ మేనేజ్మెంట్ నుండి ఎంబీయే పూర్తి చేశాను. ఏడేళ్లపాటు కార్పొరేట్ సెక్టార్లో వర్క్ చేశాను. లక్షల రూపాయల జీతం. కానీ, మా ఊరు వైపు నన్ను తన వైపు లాగింది. మహిళకు రిజర్వ్ అని.. 2010లో మా గ్రామ పంచాయితీ మహిళలకు రిజర్వ్ చేయబడింది. అప్పుడు మా ఊరి పెద్దలు నన్ను ఎన్నికల్లో నిలబడమని అడిగారు. ఆ సమయంలో సర్పంచ్‌ని అవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. గ్రామస్తులు మా అమ్మనాన్నలను అడిగారు. ‘ఏం చేయాలనుకున్నా తన ఇష్టం, మా బలవంతం ఉండదు’ అని చెప్పారు. నాకు అప్పటి వరకు గ్రామ సభలు ఎలా జరుగుతాయి, పంచాయితీలకు నిధులు ఎలా వస్తాయో తెలియదు. ఆ విషయాలను గ్రామస్తులే చెప్పారు. ఆ విధంగా పంచాయితీ ఎన్నికల్లో నిలబడి, గెలిచాను. మా ఇంట్లో మా తాత తర్వాత నేను సర్పంచ్‌ని అయ్యాను. వర్షపు నీటి సంరక్షణ ముందుగా ఊరి భవితవ్యాన్ని ఒంటరిగా మార్చలేమని, ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని అందరికీ స్పష్టంగా చెప్పాను. నేను వ్యూహంతో పనిచేయడం ప్రారంభించాను. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, గ్రామాలను అనుసంధానించడం, కరువును ఎదుర్కోవడం నేను ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లు. గ్రామంలోని నీటివనరులన్నీ పూడికతో నిండిపొంయాయి. సుమారు 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న నీటి వనరుల్లో పూడిక మట్టిని తొలగించేందుకు లక్షల రూపాయలు సేకరించి, ఖర్చు చేశాం. మహిళలు ముందు గ్రామపంచాయితీ నా కుటుంబం లాంటిది. నేను మీటింగులు పెట్టడం మొదలుపెట్టగానే ఏయేప్రాజెక్టుల్లో ఎలా పనిచేస్తున్నానో చెప్పేదాన్ని. ఈప్రాజెక్టుల గురించి వారు ఏమనుకుంటున్నారో అందరి అభిప్రాయాలు తెలుసుకునేదాన్ని. అలాగే, ఎంత డబ్బు ఖర్చు అవుతుందో కూడా వివరించేదాన్ని. పనులు సజావుగా అయ్యేలా అధికారులను కలిసి ఆరా తీయమని గ్రామస్తులకు చెప్పేదాన్ని. మహిళల బృందం డిజైనర్ ల్యాంప్‌లు, కొవ్వొత్తులు, మసాలా దినుసులు వంటి ఉత్పత్తులు తయారు చేయడం మొదలుపెట్టారు. ఇవి మంచి ధరకు అమ్ముడు పొంవడం మొదలయ్యింది. దీంతో మహిళల జీవితం మెరుగుపడింది. రెండేళ్లలో 950 ఇళ్లకు గాను 800 మరుగుదొడ్లు నిర్మించాం. 24 గంటలూ కరెంట్ అందుబాటులోకి వచ్చింది. రోడ్లప్రాధాన్యత నా ఎజెండాలో రోడ్లప్రాధాన్యత స్పష్టంగా ఉంచాను. ముందు ప్రైవేట్ బస్సుల సహాయం తీసుకున్నాను. బాలికల కోసం పాఠశాల, మహిళల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశాను. మూతపడిన బి.ఎడ్ కాలేజీని స్వాధీనం చేసుకొని దానిని బాలికల చదువుకోసం కేటాయించాను. ఓ ప్రైవేట్ కంపెనీ 200 టేబుళ్లు, బెంచీలను అందజేసి మా వెన్ను తట్టింది. అందరికీ బ్యాంకు ఖాతా.. సర్పంచ్ అయిన ఐదేళ్లలోనే రోడ్లు, డ్రైన్లు, అందరికీ బ్యాంకు ఖాతా తెరిపించాను. ఎప్పుడూ ఫీల్డ్ వర్క్‌లోనే ఉండేదాన్ని. బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల, చదువుప్రాముఖ్యతను వివరించేదాన్ని.. నా స్వభావం అందరినీ కలుపుకొని ఉంటుంది. ఐక్యరాజ్యసమితి 11వ ఇన్ఫో పావర్టీ వరల్డ్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించినప్పుడు మొదటిసారి భారతదేశం నుండి ఒక మహిళా సర్పంచ్‌గా దేశం తరపునప్రాతినిధ్యం వహించాను. ఇది నాకు గర్వంగా అనిపించింది. అక్కడ వారందరి మదిలో సర్పంచ్ అంటే తలపై ముసుగు వేసుకుని ఉన్న గ్రామస్థురాలు అనుకున్నారు. కానీ, నన్ను కార్పొరేట్ లుక్‌లో చూసి అందరూ ఆశ్చర్యపొంయారు. సోడా విలేజ్ అభివృద్ధికి డబ్బు కంటే వ్యక్తులు, అందరి సమష్టి కృషి అవసరం అని ఫోరమ్‌లో చెప్పాను. రెండుసార్లు సర్పంచ్‌గా నా విధులను నిర్వర్తించాను. తర్వాతి వారికి అవకాశాలు ఇవ్వాలని నేను మళ్లీ పొంటీ చేయలేదు. ఇప్పుడు హోటల్ని నిర్వహిస్తున్నాను. గుర్రపు స్వారీ వచ్చు కాబట్టి, ఆసక్తి గలవారికి శిక్షణ ఇస్తున్నాను’ అని వివరిస్తుంది ఈ యంగ్ లీడర్. -
ఆదిలాబాద్: మారుమూల గ్రామ సర్పంచ్‌కి ఢిల్లీ నుంచి ఆహ్వానం
సాక్షి, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె) స ర్పంచ్ గాడ్గే మీనాక్షికి ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 26 న హోటల్ హయత్‌లో జలశక్తి, స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ వర్కషాప్లో పాల్గొనా లని భారత జలశక్తి మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రెటరీ రాజీవ్జహరి లేఖ పంపారు. గ్రామంలో సేకరించిన తడిచెత్తతో తయారు చేసిన సేంద్రియ ఎరువుల ద్వారా పంచాయతీకి వచ్చిన ఆదాయం, తయారు చేయడానికి చేసి న కృషిపై తమ అనుభవాలను వర్క్‌షాప్‌లో వెల్లడించాలని కేంద్రం కోరింది. ఈమేరకు మీనాక్షి గాడ్గే శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వర్క్‌షాప్‌కు తెలంగాణ రాష్ట్రం తరఫున తన కు ఆహ్వానం రావడం గర్వంగా ఉందని మీనాక్షి తెలిపారు. ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, దయకర్రావులతో పాటు ముఖరా(కె) గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. -
అన్నదాతకు అండగా..
సాక్షి, నాగిరెడ్డిపేట (కామారెడ్డి): జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1,46,770 హెక్టార్లు ఉంది. ప్రధాన పంట వరి కాగా తర్వాత మొక్కజొన్న, పత్తి తదితర పంట లు సాగు చేస్తున్నారు. కాగా జిల్లాలో రైతులు ఎడాపెడా ఎరువులను వినియోగించడం వల్ల పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ (ఎన్ఎంఎస్ఏ)ను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాలకు వ్యవసాయ అధికారులు వెళ్లి, మట్టి నమూనాలు సేకరించి, భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. జిల్లాలో అధికారులు రైతుల భూముల్లోనుంచి మట్టిని సేకరించి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మండలానికో మోడల్ విలేజ్ జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ కింద అధి కారులు 2019–20 సంవత్సరానికి జిల్లాలో మండలానికో మోడల్ విలేజ్ ఎంపిక చేశారు. జిల్లాలో 22 మండలాలు ఉండగా.. 22 గ్రామాలను ఎంపిక చేశారు. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలను సాగు చేయడం, ఎరువులు వినియోగించడం వల్ల ఆశించిన దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాల్లో భూసారం తెలుసుకోవడానికి వ్యవసాయ అధికారులు మట్టి పరీక్షలు నిర్వహిస్తారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ఆధునిక పద్ధతులను అమలు చేస్తారు. వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగులో పాటించాల్సిన మెలకువలను రైతులకు వివరిస్తారు. మోడల్ విలేజ్‌లుగా ఎంపిక చేసిన గ్రామాల్లోని ప్రతిరైతుకు సంబంధించిన భూముల్లో మట్టిని సేకరించి పరీక్షలకు పంపించారు. వీటి ఫలితాలను వచ్చేనెలలో రైతులకు అందించేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. కాగా జిల్లాలో ఎంపిక చేసిన 22 గ్రామాల్లో 3,485 మంది రైతులకు సంబంధించి 3,520 మట్టి నమూనాలను సేకరించారు. గతంలో పలుమార్లు భూసార పరీక్షల నిమిత్తం రైతుల భూముల్లో మట్టిని సేకరించినప్పటికీ వాటి ఫలితాలను రైతులకు అందించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఈసారైనా రైతుల భూముల్లో నుంచి సేకరించిన మట్టినమూనాలకు సంబంధించి ఫలితాలను రైతులకు అందిస్తారా అని రైతులు అనుమానిస్తున్నారు. వచ్చేనెలలో ఫలితాలు అందిస్తాం ఎన్ఎంఎస్ఏ పథకం కింద జిల్లాలో 22 గ్రామాలను ఎంపిక చేశాం. ఈ గ్రామాల్లో రైతుల భూములకు సంబంధించి మట్టినమూనాలను సేకరించి భూసార పరీక్షలకు పంపించాం. వీటి ఫలితాలను వచ్చేనెలలో రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దీంతోపాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ఈ గ్రామాల్లో అమలు చేస్తాం. – నాగేంద్రయ్య, డీఏవో, కామారెడ్డి -
ఆదర్శ గ్రామాలను ఎంచుకోని ఎంపీలు...
2014లో ప్రధాని మోదీ ప్రకటించిన ఆదర్శ గ్రామ యోజన తన ప్రాభవాన్ని కోల్పోతోంది. మొత్తం 796 మంది పార్లమెంటు సభ్యులు ఒకొక్కరు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాలన్నది ఈ పథకం లక్ష్యం. అయితే ఇప్పటివరకూ కేవలం 164 ఎంపీలు మాత్రమే గ్రామాలను ఎంచుకున్నారు. మిగిలిన 80% మంది దీనిపై దృష్టి పెట్టలేదు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌కు 111 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తూంటే అందులో కేవలం 38 మంది మాత్రమే తమ తమ ఆదర్శ గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. -
కుప్పకూలనున్న మినీ ప్యాంగ్యాంగ్
ప్యాంగ్ యాంగ్: ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరానికి నకలుగా 500 ఎకరాల్లో కోట్లాది డాలర్లను వెచ్చించి నిర్మించిన మినీ ప్యాంగ్యాంగ్ మోడల్ విలేజ్‌ని నామరూపాలు లేకుండా ధ్వంసం చేయాల్సిందిగా దేశ నియంత కిమ్ జాంగ్ ఉన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ మినీ మోడల్ విలేజ్‌ని చూస్తే తనకు దేశ ద్రోహం కేసు కింద ఉరి శిక్షకు గురైన తన అంకుల్ జాంగ్ సంగ్ థేక్ గుర్తొస్తాడని, అందుకనే ఈ మోడల్ గ్రామాన్ని నామరూపాలు లేకుండా సర్వనాశనం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. దేశ రాజధాని ప్యాంగ్ యాంగ్ నగరాన్ని పోలిన నమూనా విలేజ్‌ను మినీయేచర్లతో నిర్మించాలన్నది కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ ఆలోచన. ఆయన మానస పుత్రికైన ఈ మోడల్ విలేజ్ ను కిమ్ జాంగ్ ఉన్ అంకుల్ జాంగ్ సంగ్ పర్యవేక్షణలో 2012లో పూర్తి చేశారు. దేశ ద్రోహం నేరం కింద జాంగ్ సంగ్‌ను 2013, డిసెంబర్ నెలలో ఉరి తీశారు. ఆయన కుక్కకన్నా అధ్వాన్నమని, ద్వేషించాల్సిన మానవ మలినం అని ఆయన్ని కిమ్ జాంగ్ ఉన్ ఈసడించేవారు. అలాంటి వ్యక్తి పర్యవేక్షణలో పూర్తయిన ఈ మోడల్ విలేజ్ ఆయన్ని ఏ మాత్రం గుర్తుకు తీసుకురాకూడదనే ఉద్దేశంతోనే నిర్మూలనకు ఉన్ ఆదేశించారన్నది దక్షిణ కొరియా మీడియా కథనం. మినీ విలేజ్‌కి పర్యాటకుల ఆదరణ కూడా పెద్దగా లేదని, వారిని ఆకర్షించేందుకు వీలుగా దాన్ని పునరుద్ధరించడం కోసమే తాత్కాలికంగా మోడల్ విలేజ్‌ని మూసేశారని స్థానిక ట్రావెల్ ఏజెన్సీలు తెలియజేస్తున్నాయి. -
మిషన్ కాకతీయ నుంచి మోడల్ విలేజ్
సందర్భం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ అనేది మొదటి దశ మాత్రమే. తర్వాత చెరువును కేంద్ర బిందువుగా చేసి, గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి వాటిని మోడల్ గ్రామాలుగా మార్చాలి. ఈ మధ్యకాలంలో దేశం మొత్తంమీద ఆయా ప్రభుత్వా లు చేపట్టిన పథకాలలో తెలం గాణ ప్రభుత్వం ప్రకటించిన ‘మిషన్ కాకతీయ’ ప్రథమ స్థా నంలో నిలుస్తుంది. సేద్యమే జీవనాధారమైన తెలంగాణలో పూర్వకాలం నుంచి వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనడానికి నీటి నిల్వలపై ఎంతో శ్రద్ధ కనపరిచారు. గ్రామ గ్రామాన చిన్న కుంటల నుంచి పెద్ద చెరువుల వరకు అలాగే భౌగోళిక పరిస్థితులను బట్టి ఒక దాని కింది భాగాన ఇంకొకటి చొప్పున గొలు సుకట్టు చెరువుల నిర్మాణం జరిపారు. గత 50, 60 సంవత్సరాలలో ఈ చెరువులు నిరాద రణకు గురయ్యాయి. చెరువులోకి నీరు పారే కాలువలు పూడిపోవడం, చెరువులలో పూడిక నిండటం, కబ్జాలు వంటి పలు కారణాలతో వందల ఎకరాలకు నీరు అం దించే చెరువులు పదుల ఎకరాలకే పరిమితమయ్యాయి. చెరువులలో నీటి నిల్వ తగ్గడంతో భూగర్భ జలాలు అడుగంటి దిగుబడులు తగ్గిపోయాయి. ఇక బోరు బావులలో కూడా వందల అడుగుల మేరకు తవ్వినా నీరు లేని పరిస్థితి ఏర్పడింది. చిన్న నీటిపారుదలపై శ్రద్ధ లేకపోవడంతో చెరువులు మరమ్మతులకు నోచుకోక పూడికతో, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. చెరువు నీటిపై ఆధారపడ్డ వ్యవసాయ రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయ ప్రణాళికను స్వాగతించాలి. చెరువుల పునరుద్ధరణతో గ్రామాల్లో వ్య వసాయం, మంచినీటి లభ్యత మెరుగుపరచవచ్చు. పైగా చెరువును కేంద్రబిందువుగా చేసి గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా కార్యక్రమం చేపట్టాలి. దానితో ఒక మోడల్ గ్రామం రూపొందాలంటే మిషన్ కాకతీయను, స్వచ్ఛభారత్ లాంటి కార్యక్రమాలతో అనుసంధానం చేయాలి. స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద గ్రామంలో చేయవలసిన పనులలో ముఖ్యమైనవి. 1) మిషన్ కాకతీయ కింద ఎంపికైన గ్రామంలో 100% మరుగుదొడ్ల నిర్మాణం జరగాలి. 2) ఇప్పటికీ గ్రామాలలో 50% జనాభా కట్టెలతోనే వంట చేస్తారు. దానితో ఇల్లంతా పొగచూరడం, పిల్లలకు శ్వాసకోశ జ బ్బులు రావడం జరుగుతుంది. దీనిని నివారించడానికి పొగరాని పొయ్యిల నిర్మాణం జరగాలి. 3) ఇంటిలో వీలును బట్టి పొట్టి రకాలైన బొప్పాయి, జామ, మునగ, కరివేపాకు వంటి చెట్లు నాటాలి. వీటిలో పోషక విలు వలు అధికంగా ఉండి పిల్లలకు పోషకాహార లభ్యత మెరుగుపడుతుంది. 4) చెరువులో పూడిక తీసిన తరు వాత పెద్ద ఎత్తున తుమ్మచెట్లు నాటాలి. ఇవి నీటి పైభా గంలో ఒక గొడుగు మాదిరిగా విస్తరించి నీరు ఆవిరి కాకుండా ఆపుతాయి. 5) ప్రస్తుతం 5 హెచ్.పి. సౌరశక్తి మోటారు మొత్తం ఖర్చు సుమారు 5 లక్షలపైబడి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ పోను రైతుకు సుమారు రూ.2 లక్షల వరకు వస్తుంది. దీనిపై మోడల్ గ్రామాల రైతులకు లక్ష కు ఒక సౌరశక్తి మోటారు అందజేస్తే4, 5 ఏళ్లలో సౌరశక్తితో నడిచే బోరుబావులు వాడకంలోనికి వస్తాయి. 6) మిషన్ కాకతీయ కింద ఎంపికైన గ్రామంలోని అన్ని వ్యవసాయ భూములలో భూసార పరీక్ష జరిపి, ప్రతి సర్వే నంబర్‌కు భూసార పరీక్ష కార్డు అందజేయాలి. 7) చెరువులో పూడిక తీసిన మట్టిని పొలాలలోనికి తరలిం చిన రైతులను ఆదర్శ రైతులుగా గుర్తించాలి. 8) రసాయ న ఎరువులు వాడని వారికి తాలూకా/ జిల్లా స్థాయిలో ప్రశంసాపత్రాలు ఇవ్వాలి. 9) గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వంటి కార్యక్రమాలు వీలును బట్టి చేప ట్టాలి. 10) ప్రతి బడిలో మరుగుదొడ్లు నిర్మించి, వాటిని ప్రతిదినం శుభ్రపరిచే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. 11) శాసనసభ్యుల, పార్లమెంట్ సభ్యుల ఫండ్ నుంచి మిషన్ కాకతీయ గ్రామాలలో మాత్రమే ఖర్చు చేయాలి. 12) గ్రామాల్లో మహిళా మండళ్లు, యూత్ క్లబ్‌లు, డ్వాక్రా గ్రూపులు, అంగన్వాడీ కేంద్రాలు వంటివి బాగా పని చేయడానికి సంబంధిత శాఖల సిబ్బంది మిషన్ కాకతీయ గ్రామాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 13) వ్యవసాయరంగంలో నీటి పొదుపు కొరకు బిందు, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 14) చెరువు బాగు కాగానే రెండు పంటలు వరి వేయ కుండా, రెండవ పంట ఆరుతడి పంటలు వేసే విధంగా చర్యలు చేప ట్టాలి. 15) చెరువులో నీళ్లుంటే చేపల పెంపకం ఒక లాభ సాటి వృత్తి. దీనికి జిల్లా మత్స్యశాఖ మిషన్ కాకతీయ గ్రామాలలో దృష్టి కేంద్రీకరించాలి. 16) చెరువుగట్టుపై వెదురు మొక్కలు నాటాలి. గ్రామ స్థాయిలో వెదురు కుటీర పరిశ్రమకు ముడిసరుకు. 17) విద్యాశాఖ, గ్రామ పంచాయతీ మిషన్ కాకతీయ గ్రామంలో 100% పిల్లలు బడిలోనికి వెళ్లేలా చూడాలి. ఇలా జిల్లాస్థాయిలో, గ్రామాభివృద్ధికి సంబంధిం చిన అన్ని ప్రభుత్వ శాఖలు మిషన్ కాకతీయ గ్రామంలో పనిచేసి అట్టి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా అభి వృద్ధి చేయడానికి ప్రణాళిక ఏర్పాటు కావాలి. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాలు కొత్త కాదు కాని ఒక సరైన ప్రణాళికతో మిషన్ కాకతీయలో ఎంపికైన గ్రామాలలో కేంద్రీకరించిన ఫలితాలు వస్తాయి. గ్రామాల్లో వ్యవసా యం చాలామటుకు యాంత్రీకరణకు గురైంది. ఈ నేప థ్యంలో గ్రామం మొత్తం ఒక ఆదర్శ గ్రామంగా అభి వృద్ధి చెందాలంటే స్వచ్ఛభారత్ కార్యక్రమంతో అను సంధానం చేస్తూ, ఒకటి లేక రెండేళ్ల గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. (వ్యాసకర్త కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్) -
'పీఆర్ కండ్రీగను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా'
నెల్లూరు : దేశంలో ఆదర్శ గ్రామంగా పుట్టంరాజువారికండ్రీగను తీర్చిదిద్దుతానని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లా పీఆర్ కండ్రిగ గ్రామంలోని గ్రామస్తులతో సచిన్ మాట్లాడారు. పొగాకు ఉత్పత్తులు, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన గ్రామస్తులకు హితవు పలికారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకే ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు సచిన్ వివరించారు. అనంతరం గ్రామస్తులతో కలసి స్వచ్ఛ భారత్ సచిన్ ప్రమాణం చేశారు. -
మరింత ఉదారంగా ఆదుకోండి
సాక్షి, కాకినాడ :‘నగరం ఘటన చాలా తీవ్రమైనది. బాధితులతో పాటు గ్రామాన్ని ఆదుకునేందుకు ఉదారంగా ముందుకు రావాలి. ఏ సాయం చేసినా ఉదారంగా ఆలోచించి, సాధ్యమైనంత ఎక్కువగా చేయాలి. బాధితులకు సాంత్వన చేకూర్చేలా జిల్లా యంత్రాంగంతో పాటు ప్రభుత్వాలు ప్రతిపాదించే ప్రతీ ప్రాజెక్టుకు సహకారం అందించాలి’ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు హెచ్‌సీ సిన్హా గెయిల్ యాజమాన్యానికి సూచించారు. నగరం ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘనపై విచారణ జరిపేందుకు జిల్లాకు వచ్చిన ఆయన మంగళవారం కాకినాడ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. దేశంలోనే భారీ ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమైన ఈ ఘటన దురదృష్టకరమని సిన్హా వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సత్వరమే స్పందించే యంత్రాంగం భారీ పరిశ్రమల్లో ఉండాలన్నారు. మోడల్ విలేజ్‌గా నగరం : కలెక్టర్ ఈ ఘటనలో ప్రాణనష్టం, పెద్దఎత్తున ఆస్తి, పంట నష్టాలు వాటిల్లాయని కలెక్టర్ నీతూప్రసాద్ గణాంకాలతో వివరించారు. గెయిల్ యాజమాన్యంతో కలిసి సహాయ, పునరావాస చర్యలు చేపట్టినట్టు చెప్పారు. మృతుల కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.5.5 లక్షల నుంచి లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అందజేశామన్నారు. దెబ్బతిన్న గృహాలకు రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకూ, మరమ్మతులు, పునర్నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.1.25 లక్షల మేరకు అందజేసినట్టు తెలిపారు. 15 ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్న 1196 కొబ్బరి చెట్లకు ఒక్కొక్క దానికి రూ.6 వేల చొప్పున అందజేశామన్నారు. నగరం గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేసేందుకు గెయిల్ ముందుకొచ్చిందన్నారు. ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా వారికి రుణసాయం చేసి, స్వయం ఉపాధి కల్పనకు చర్యలు తీసుకున్నామన్నారు. కోనసీమలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు 12 ఎకరాల భూములను గుర్తించామన్నారు. జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ మాట్లాడుతూ ఘటనపై నమోదు చేసిన కేసుల దర్యాప్తు 75 శాతం పూర్తయిందన్నారు. గెయిల్ జీఎం ఎంవీ అయ్యర్ మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు గెయిల్ ఈడీ రంగనాథన్ నేతృత్వంలో విచారణకు సంస్థ ఆదేశిందన్నారు. సుమారు 40 ఏళ్ల క్రితం వేసిన పైపులైన్లను మార్చేందుకు రూ.800 కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా వేశామని ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ మేనేజర్ డీజీ సన్యాల్ వివరించారు. 800 కిలోమీటర్ల మేర ఉన్న పైపులైన్ వ్యవస్థను తనిఖీ చేస్తున్నామన్నారు. ఈ సమీక్షలో హౌసింగ్ డీఎం సెల్వరాజ్, డీఎంహెచ్ఓ పవన్‌కుమార్, అమలాపురం ఆర్డీఓ గణేష్‌కుమార్, గెయిల్, ఓఎన్జీసీ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.