
సాక్షి, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె) స ర్పంచ్ గాడ్గే మీనాక్షికి ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 26 న హోటల్ హయత్‌లో జలశక్తి, స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ వర్కషాప్‌లో పాల్గొనా లని భారత జలశక్తి మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రెటరీ రాజీవ్‌జహరి లేఖ పంపారు. గ్రామంలో సేకరించిన తడిచెత్తతో తయారు చేసిన సేంద్రియ ఎరువుల ద్వారా పంచాయతీకి వచ్చిన ఆదాయం, తయారు చేయడానికి చేసి న కృషిపై తమ అనుభవాలను వర్క్‌షాప్‌లో వెల్లడించాలని కేంద్రం కోరింది.
ఈమేరకు మీనాక్షి గాడ్గే శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వర్క్‌షాప్‌కు తెలంగాణ రాష్ట్రం తరఫున తన కు ఆహ్వానం రావడం గర్వంగా ఉందని మీనాక్షి తెలిపారు. ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, దయకర్‌రావులతో పాటు ముఖరా(కె) గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment