'పీఆర్ కండ్రీగను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా'
నెల్లూరు : దేశంలో ఆదర్శ గ్రామంగా పుట్టంరాజువారికండ్రీగను తీర్చిదిద్దుతానని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లా పీఆర్ కండ్రిగ గ్రామంలోని గ్రామస్తులతో సచిన్ మాట్లాడారు.
పొగాకు ఉత్పత్తులు, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన గ్రామస్తులకు హితవు పలికారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకే ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు సచిన్ వివరించారు. అనంతరం గ్రామస్తులతో కలసి స్వచ్ఛ భారత్ సచిన్ ప్రమాణం చేశారు.