PR Kandriga
-
పీఆర్ కండ్రిగలో కేంద్ర బృందం పర్యటన
గూడూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలంలో క్రికెటర్ సచిన్ దత్తత గ్రామమైన పుట్టంరాజువారి కండ్రిగలో ఆదివారం కేంద్రబృందం పర్యటించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖకు చెందిన నితీష్ అహుజ్, ఆకాష్ అహుజ్, జితేంద్ర భార్గవ్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ గ్రామంలో పర్యటించారు. గ్రామసభ నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. దేశంలో ఎంపీలు దత్తత తీసుకున్న 640 గ్రామాల్లో కేంద్రం పుట్టంరాజుకండ్రిగతో సహా ఐదు గ్రామాలను ఎంపికచేసింది. వాటిలో కేంద్రబృందాలు రెండురోజులు పర్యటించి అభివృద్ధి పనుల్ని చిత్రీకరిస్తున్నట్లు జేసీ చెప్పారు. గ్రామానికి చెందిన సుమారు 40 మందికి శ్రీసిటీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామంలోని గిరిజనులకు త్వరలోనే ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు పెంచల్రావు, సర్పంచ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాను అరికట్టండి
నెల్లూరు(రెవెన్యూ): జిల్లాలో గుర్తించిన రీచ్‌ల నుంచి ఇసుక అక్రమ రవాణా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం. జానకి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మీ-సేవ కేంద్రాల ద్వారా ఈ నెల 5 నుంచి ఇసుక విక్రయాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేబిల్లులు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి సమయాల్లో రీచ్‌లలో ఇసుక రవాణా చేస్తే సంబంధిత వ్యక్తులపై చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. రీచ్‌ల వద్ద ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నిత్యం ఇసుక రీచ్‌లను పరిశీలించేలా సంబంధిత తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతక ముందు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మణం, పుట్టంరాజువారికండ్రిగ అభివృద్ధి తదితర కార్యక్రమాలపై వివిధ మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జేసీ జి.రేఖారాణి, డీఆర్డీఏ పీడీ చంద్రమౌళి, డ్వామా పీడీ ఎం.గౌతమి, హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. పీఆర్‌కండ్రిగను ఆదర్శంగా తీర్చిదిద్దండి క్రికెట్ దేవుడు, రాజ్యసభ సభ్యుడు సచిన్టెండూల్కర్ దత్తత తీసుకున్న పుట్టంరాజు వారి కండ్రిగను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జానకి సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రీవెన్స్ డేకు 9.30కే హాజరు కావాలి కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్‌డేకు అధికారులందరూ ఉదయం 9.30 గంటలకే హాజరుకావాలని కలెక్టర్ ఎం.జానకి సూచించారు. సోమవారం గ్రీవెన్స్ డే హాల్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఉదయం 9.30 గంటలకు వస్తే గత వారం గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు ఎన్ని పరిష్కరించారో అవి ఏ స్థితిలో ఉన్నాయే తదితర వివరాలు ప్రతి వారం అందజేయాలన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయల చుట్టూ ప్రజలను తిప్పించుకోకుండా వారి సమస్య పరిష్కారం అవుతుందా కాదా.. తదితర వివరాలు వారికి తెలియజేయలన్నారు. -
పల్లెకు పోదాం..పనులే చేద్దాం..
సచిన్ టెండూల్కర్.. స్టేడియంలో పరుగుల హీరో.. డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్ హీరో.. క్రికెట్ హిస్టరీలో ఎవర్గ్రీన్ హీరో..! కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ భారతరత్నం.. నెల్లూరు జిల్లాలోని పీఆర్ కండ్రిగ గ్రామవాసులకు మాత్రం రియల్ హీరో. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్ అందరికీ ఆదర్శం అంటున్నారు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు. టెండూల్కర్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి పల్లెకు వెళ్లి సేవ చేయాలంటున్నారు. వాసంతి: సచిన్ టెండూల్కర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. తన ఊరు, రాష్ట్రం వదిలిపెట్టి తెలుగు రాష్ట్రానికి వచ్చి అదీ ఓ మారుమూల గ్రామాన్ని అడాప్ట్ చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఐ రియల్ థ్యాంక్ టు సచిన్. నిఖిల్: ముందుగా మన పీఎమ్ మోదీకి థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి ఒక్క ఎంపీ ఒక విలేజ్‌ను దత్తత తీసుకుని పని చేయాలనే నిర్ణయం గొప్పది. విలేజ్ డెవలప్మెంట్ మీదే ఇండియా ఫ్యూచర్ ఆధారపడి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే కదా..! వర్గేష్: కరెంట్ అంటే ఏంటో తెలియని గ్రామాలు మన దేశంలో చాలా ఉన్నాయి. సచిన్ దత్తత తీసుకున్న పీఆర్ కండ్రిగ గ్రామం నెల్లూరు సిటీకి పాతిక కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయినా అక్కడ కనీసం శానిటేషన్ లేదు. సరైన రోడ్లు కూడా లేవు. వాసంతి: ఇందులో వింతేముంది. అలాంటి గ్రామాలు వేలల్లో ఉన్నాయి. మా బంధువుల ఊళ్లకు వెళ్లినపుడు.. ఇవి ఎప్పటికీ ఇలాగే ఉంటాయా అనిఅనిపిస్తుంటుంది. దుర్గాప్రసాద్: అవును.. గ్రామాల్లో ఒక్క రోడ్డు రావాలంటే పదేళ్లుపడుతుంది. శానిటేషన్ అక్కడ ఒక పెద్ద సమస్య. సచిన్ ఇలాంటి నిర్ణయం తీసుకుని తోటి ఎంపీలకే కాదు.. ప్రతి ఇండియన్‌కు ఆదర్శంగా నిలిచారు. దీప: గ్రామాలను బాగు చేయాలంటే సచిన్‌లా గొప్పవాళ్లం కానక్కర్లేదు. ఎంపీలు అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి స్థాయిలో వారు రెస్పాండ్ అయితే చాలు. అఖిల్: ఎగ్జాట్లీ.. దీప. నా ఒపీనియన్ కూడా అదే. ఎవరి వంతు సాయం వారు చేయొచ్చు. దీప: నీకేదైనా ఐడియా వస్తే చెప్పు... అఖిల్: సపోజ్.. ఒక్కో కాలేజీ వాళ్లు ఒక విలేజ్‌ని అడాప్ట్ చేసుకోవాలి. మనకున్న తీరిక సమయాన్ని, పాకెట్ మనీని ఆ విలేజ్ డెవలప్మెంట్కు ఉపయోగిస్తే మంచిది. దీని వల్ల మనకూ మంచి ఎక్స్పీరియన్స అవుతుంది. హేగల్: ఎక్సలెంట్ ఐడియా. పొలిటికల్ లీడర్స్, సెలబ్రిటీలు విలేజెస్ అడాప్ట్ చేసుకుంటే.. కేవలం ఆర్థిక సాయం మాత్రమే చేయగలరు. అదే మనమైతే అన్నీ దగ్గరుండి చూసుకోవచ్చు. వాసంతి: దీన్ని ఒక రూల్‌గా మార్చాలి. చదువుతో పాటు విలేజ్ డెవలప్‌మెంట్‌ని ఒక సబ్జెక్టుగా మార్చితే బాగుంటుంది. నిఖిల్: (నవ్వుతూ..) అప్పుడు ఎంచక్కా.. బుక్స్ పడేసి విలేజ్ వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. శ్రుతి: వాట్... నిఖిల్: నో.. నో సరదాగా అంటున్నాను. ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తే మన గ్రామాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయన్న విషయం మనకు తెలుస్తుంది. అక్కడున్న మనుషుల ఆలోచన తీరును మార్చే ప్రయత్నం చేయొచ్చు. కల్యాణ్: ఫర్ ఎగ్జాంపుల్.. మన గ్రామాల్లో రైతుల ఆత్మహత్యల గురించి న్యూస్ వింటున్నాం. అగ్రికల్చర్ స్టూడెంట్స్ గ్రామాలకు వెళ్లి రైతులకు విత్తనాలు, ఎరువులు వంటి విషయాల్లో అవగాహన కల్పించడం కూడా విలేజ్ డెవలప్మెంట్ కిందకే వస్తుంది. నవ్య: సిటీజనాలకు గ్రామాలతో అనుబంధం పెంచే విధంగా చదువులు ఉండాలి. అప్పుడే గ్యాప్ తగ్గుతుంది. లేదంటే మన దేశంలో ప్రజలు రెండు జాతులుగా మిగిలిపోతారు. ఒకటి సిటీ పీపుల్, రెండోది విలేజ్ పీపుల్. నతాలియన్: సచిన్ చేసిన ఈ గొప్పపని అందరికీ ఆదర్శమే. దీన్ని మాలాంటి స్టూడెంట్స్ మాత్రం సీరియస్‌గా తీసుకోవాలి. మనం కూడా అప్పుడప్పుడు పల్లెలకు వెళ్లి తోచిన సాయం చేయాలి. దాని వల్ల కలిగే ఆత్మతృప్తి మరెక్కడా దొరకదు. వన్స్ అగైన్ వీ ఆర్ ఆల్ థ్యాంక్ టు సచిన్. -
పీఆర్ కండ్రీగ తల్లులకు నా భారతరత్న అంకితం
నెల్లూరు: తన కన్నతల్లితోపాటు పీఆర్ కండ్రీగ గ్రామంలోని తల్లులందరికీ తాను అందుకున్న అత్యున్నత పురస్కారం భారతరత్నను అంకితమిస్తున్నట్లు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రకటించారు. ఆదివారం నెల్లూరు జిల్లా పుట్టంరాజుగారి కండ్రీగ గ్రామంలోని గ్రామస్తులతో సచిన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.... భార్తల కోసం, పిల్లల కోసం దేశంలోని మహిళలంతా ఎన్నో త్యాగాలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి దిశగా ఈ గ్రామానికి తొలి ఇన్నింగ్స్ ఇప్పుడే మొదలైందని తెలిపారు. కానీ గ్రామంలోని అభివృద్ధి నిర్వహణలో రెండో ఇన్సింగ్స్ మాత్రం మీ చేతుల్లోనే ఉందని గ్రామస్తులకు గుర్తు చేశారు. చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల చాలా వ్యాధులు వస్తున్నాయని... ఈ నేపథ్యంలో చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని మీ పిల్లలకు చెప్పాలని గ్రామంలోని తల్లిదండ్రులకు సచిన్ సూచించారు. గ్రామంలో టాయిలెట్స్ నిర్మిస్తామని... వాటిని ఎలా పరిశ్రుభంగా ఉంచుకోవాలో మీ పిల్లలకు తెలియజేయాలని అన్నారు. గ్రామాలను దత్తత తీసుకుని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారని... ఆ సమయంలోనే ఇదే అంశంపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతున్నానని నాటి జ్ఞపకాలను సచిన్ ఈ సందర్బంగా పిఆర్ కండ్రీగ గ్రామస్తులకు వివరించారు. -
'పీఆర్ కండ్రీగను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా'
నెల్లూరు : దేశంలో ఆదర్శ గ్రామంగా పుట్టంరాజువారికండ్రీగను తీర్చిదిద్దుతానని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లా పీఆర్ కండ్రిగ గ్రామంలోని గ్రామస్తులతో సచిన్ మాట్లాడారు. పొగాకు ఉత్పత్తులు, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన గ్రామస్తులకు హితవు పలికారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకే ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు సచిన్ వివరించారు. అనంతరం గ్రామస్తులతో కలసి స్వచ్ఛ భారత్ సచిన్ ప్రమాణం చేశారు.