గూడూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలంలో క్రికెటర్ సచిన్ దత్తత గ్రామమైన పుట్టంరాజువారి కండ్రిగలో ఆదివారం కేంద్రబృందం పర్యటించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖకు చెందిన నితీష్ అహుజ్, ఆకాష్ అహుజ్, జితేంద్ర భార్గవ్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ గ్రామంలో పర్యటించారు. గ్రామసభ నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. దేశంలో ఎంపీలు దత్తత తీసుకున్న 640 గ్రామాల్లో కేంద్రం పుట్టంరాజుకండ్రిగతో సహా ఐదు గ్రామాలను ఎంపికచేసింది.
వాటిలో కేంద్రబృందాలు రెండురోజులు పర్యటించి అభివృద్ధి పనుల్ని చిత్రీకరిస్తున్నట్లు జేసీ చెప్పారు. గ్రామానికి చెందిన సుమారు 40 మందికి శ్రీసిటీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామంలోని గిరిజనులకు త్వరలోనే ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు పెంచల్‌రావు, సర్పంచ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
పీఆర్ కండ్రిగలో కేంద్ర బృందం పర్యటన
Published Sun, Aug 30 2015 10:12 PM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM
Advertisement
Advertisement