ఆదర్శ గ్రామాలను ఎంచుకోని ఎంపీలు...
2014లో ప్రధాని మోదీ ప్రకటించిన ఆదర్శ గ్రామ యోజన తన ప్రాభవాన్ని కోల్పోతోంది. మొత్తం 796 మంది పార్లమెంటు సభ్యులు ఒకొక్కరు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాలన్నది ఈ పథకం లక్ష్యం. అయితే ఇప్పటివరకూ కేవలం 164 ఎంపీలు మాత్రమే గ్రామాలను ఎంచుకున్నారు. మిగిలిన 80% మంది దీనిపై దృష్టి పెట్టలేదు.
త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌కు 111 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తూంటే అందులో కేవలం 38 మంది మాత్రమే తమ తమ ఆదర్శ గ్రామాలను ఎంపిక చేసుకున్నారు.