న్యూఢిల్లీ: లంచాల కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపులు లేవంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ‘స్వాగతం.. సుప్రీంకోర్టు గొప్ప తీర్పు ఇచ్చింది.’ అని కొనియాడారు. ఇకపై దేశంలో స్వచ్ఛమైన రాజకీయాలు కొనసాగుతాయని, సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొన్నారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ పోస్టుకు సుప్రీం తీర్పునకు సంబంధించిన కథనాన్ని కూడా జత చేశారు. కాగా లంచాల కేసులో ప్రజా ప్రతినిధులకు ఎలాంటి మినహాయింపులు ఉండవని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే, ఎంపీలు లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది.
1998లో పీవీ నరసింహారావు కేసులో అయిదుగురు జడ్జీల తీర్పును ధర్మాసనం కొట్టివేసింది. పార్లమెంట్, శాసనసభలో లంచాలు తీసుకొనిలో ప్రసంగాలు చేయడం. ఓటు వేసే ఎంపీలు, ఎమ్మెల్యేలు విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. లంచం కేసుల్లో ప్రజా ప్రతినిధులకు రాజ్యాంగ రక్షణ కల్పించలేమని తేల్చిచెప్పింది.
చదవండి: సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులో ముఖ్యాంశాలు
Comments
Please login to add a commentAdd a comment